ఒక్కసారి ఇటు చూడు చంద్రబాబూ.. | Punganur Resident Post On Chandrababu Behavior Gone Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఒక్కసారి ఇటు చూడు చంద్రబాబూ..

Published Sun, Aug 6 2023 8:22 AM | Last Updated on Sun, Aug 6 2023 11:47 AM

Punganur Resident Post On Chandrababu Behavior Gone Viral On Social Media - Sakshi

చంద్రబాబు హయాంలో జరగని అభివృద్ధి.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరుగుతోంది. దీంతో మనుగడ కొల్పోతామన్న భయంతో టీడీపీ హింస రాజకీయాలకు తెరతీస్తోంది. ‘ఒళ్లు దగ్గర పెట్టుకోండి. నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. తమాషాలు చేస్తున్నారా, చూసుకుందాం రండి రా.. నా కొడకల్లారా.. వాళ్లను తరమండిరా..’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు.. పోలీసులపైకి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి.. రాయలసీమలో రక్తపాతమే లక్ష్యంగా అగ్గి రాజే­సిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాక్షస మనస్తత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పని చేసిన చంద్రబాబు.. రాయలసీమ జిల్లాలకు తీరని ద్రోహం చేశారు. పుంగనూరులో ప్రాజెక్టులపై స్టే ఎందుకు వేశారో సమాధానం లేదు. ఇదిలా ఉండగా, పుంగనూరు అభివృద్ధిపై ఆ ప్రాంత వాసి పేరుతో ఓ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పుంగనూరుకి వస్తున్నట్టు ఉన్నావ్.. వచ్చేటప్పుడు అలా నువ్వు నీ బంధువులు, తెలుగుదేశం కార్యకర్తలతో కేసులు వేసి నిలిపివేసిన నేతి గుట్లపల్లి ప్రాజెక్ట్ కనిపిస్తుంది. చూస్తే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది కావాలంటే కొంత సేవు ఈతకొట్టు..

పుంగనూరు శాశ్వత తాగు, సాగునీటి అవసరాల కోసం 95 శాతం పూర్తయిన ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని చూస్తున్న నీ వక్రబుద్ది తెలుస్తుంది

అలాగే ముందుకు వస్తే రూ.40 కోట్ల రూపాయలతో పుంగనూరు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమైంది ఒక్కసారి చూడు

ఇంకొంచెం ముందుకు వస్తే పెద్దిరెడ్డి గారి సహకారంతో నిర్మించిన డయాలసిస్ సెంటర్ ఉంటుంది తలపైకి ఎత్తి చూడు 

ఇంకొంచెం ముందుకొస్తే ఒక్క కారు బస్సు వెళ్లాలంటే ఇబ్బంది పడే మినీ బైపాస్ ఇప్పుడు ఎంత విశాలంగా సర్వాంగా సుందరంగా ఉందో చూడు 

ఇంకొంచెం ముందుకొస్తే నువ్వు అధికారంలో ఉండగా అడ్డుకున్నా ఆర్టీసీ డిపో.. నేడు రాష్ట్రంలోనే అతిపెద్ద గ్యారేజ్‌తో మా పెద్దాయన నిర్మించిన ఆర్టీసీ డిపో కనిపిస్తుంది చూడు.

ఇంకొంచెం ముందుకు పోతే ప్రభుత్వ ఆసుపత్రి కనబడుతోంది.. దాని వెనకాల కడుతున్న భవనాలను చూడు.. ఇటీవల 100 పడకల ఆసుపత్రిగా మారి ప్రజల అన్ని సౌకర్యాలు తీర్చడనికి రూపుదిద్దుకున్న తీరును చూడు.. 

ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు సొంత నిధులతో నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్‌ని చూడు

ఇంకొంచెం ముందుకు  వెళ్తే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కనబడుతుంది.. కావాలంటే కొంతసేవు గట్టుపై సేదదీరు

ఈ మధ్య సమ్మర్ స్టోరేజ్‌లో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి పుంగనూరుకి విద్యుత్ అందించనున్నారు ఆ ప్రాజెక్ట్ గురించి తెలుసుకో

ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎంపీ మిథున్ రెడ్డి గారి డ్రీమ్ బైపాస్ రోడ్డు కనబడుతోంది చాలా బాగుంటుంది

అలా  బోయకొండ వెళ్తే కోట్ల రూపాయలతో బోయకొండను బంగారు కొండగా మార్చిన తీరును చూస్తే ఆశ్యర్యం కలగక మానదు..

ఇదంతా పుంగనూరు అభివృద్ధిలో కొంత భాగం మాత్రమే  కేవలం 4సంవత్సరాల లొనే పెద్దాయన ఇంత చేస్తుంటే.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు కుప్పానికి ఏమి చేశావు అని మాత్రం ఆలోచించకు చంద్రబాబూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement