TDP Chief Chandrababu Naidu Extreme Behavior During Kurnool Visit - Sakshi
Sakshi News home page

ఊరేగుతున్న ఉన్మాదం

Published Sun, Nov 20 2022 12:25 AM | Last Updated on Sun, Nov 20 2022 11:53 AM

TDP Chief Chandrababu Naidu Extreme Behavior During Kurnool Visit - Sakshi

‘కామాతురాణాం న భయం న లజ్జ’ అన్నారు పెద్దలు. కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి సిగ్గు గానీ, భయం గానీ ఉండవని అర్థం. క్రోధంతో కళ్లు మూసుకుపోయిన వారి సంగతి కూడా అంతే! కక్షతోనూ, అసూయతోనూ, నిస్పృహ తోనూ కళ్లు మూసుకుపోయిన వారి పరిస్థితీ అంతే! అటువంటి దశలో ఉన్నవారు మాట్లాడే భాష సభ్యతా సంస్కారాల ఛందస్సును ధిక్కరిస్తుంది. ‘పోగాలము దాపురించినవారు దీప నిర్వాణ గంధమును ఆఘ్రాణించలేరు. అరుంధతీ నక్షత్రాన్ని కనలేరు. మిత్రవాక్యాన్ని వినలేరు’ అనే సూక్తి మనకు ఉండనే ఉన్నది. దిగజారిన రాజకీయాలతో విసుగెత్తి ఒకాయన ‘పాలిటిక్స్‌ ఈజ్‌ ది లాస్ట్‌ రిసార్ట్‌ ఆఫ్‌ ఎ స్కౌండ్రల్‌’ అని వ్యాఖ్యానించారు. అట్లాగే పొలిటీషియన్లకు చిట్టచివరి అస్త్రం – సానుభూతి. అది కూడా విఫలమైనప్పుడు ఏం చేస్తారు? సంస్కారం అటకెక్కుతుంది. క్రోధం కళ్లను కప్పేస్తుంది. అసూయ, ద్వేషాలు వివేకాన్ని నిద్రపుచ్చుతాయి. కంఠస్వరం నుంచి కాలకేయుల భాష దూసుకొస్తుంది. ఉన్మాద స్థితి ఊరేగింపు తీస్తుంది.

కర్నూలు జిల్లా పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విపరీత ప్రవర్తన చూసి జనం విస్తుపోతున్నారు. ఈ పర్యటనను తెలుగుదేశం పార్టీ వారు ఒక వ్యూహం ప్రకారం చాలా శ్రద్ధగా డిజైన్‌ చేశారు. కర్నూలు జిల్లా ప్రజలు అధికార వికేంద్రీకరణను కోరుకోవడం లేదని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు కూడా వారికి ఇష్టం లేదని ఈ పర్యటన ద్వారా లోకాన్ని భ్రమింపజేయాలని తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా కలిసి ఈ పథకాన్ని రచించాయి. ఆయన సభలు జన సందోహంతో కిక్కిరిసినట్టు కనిపించేలా కొన్ని వీధి కూడళ్లను ఎంపిక చేశాయి. ఆ కూడళ్లలోకి నాలుగైదు వేల మందిని సమీకరిస్తే పెద్దఎత్తున జనం పాల్గొ న్నట్టు కనిపిస్తుంది. ఆమాత్రం సమీకరణకు కూడా పార్టీ బలం చాలకపోవడంతో దిన వేతనంపై ఎక్కువమంది సాధారణ ప్రజలను సమీకరించారు. వారిలో కొందరిని మిద్దెలపైకి ఎక్కించారు.

ఈమధ్యకాలంలో జనసందోహానికి మొహంవాచి ఉన్న అధినేత డూప్‌ జనాన్ని చూసి పరవశించిపోయారు. ఆ పరవశం కారణంగా రాజకీయాల్లో చిట్టచివరిగా వాడవలసిన సానుభూతి ఆయుధాన్ని యథాలాపంగా వాడిపారేశారు. ‘మీరు ఓట్లు వేసి గెలిపించకపోతే ఇవే నాకు చివరి ఎన్నికలవుతాయ’ని బేలగా వాపోయారు. ఈ చివరి ఆయుధానికి స్పందనగా ‘నో... నో’ అని జనం హోరెత్తుతారని బహుశా ఆయన ఆశించి ఉండవచ్చు. ‘మీకు ఇవి చివరి ఎన్నికలు కావు, మళ్లీ మళ్లీ మీరే గెలుస్తారు’ అనే సమాధానాలు వారి నుంచి ఊహించి ఉండవచ్చు. జాతీయస్థాయి నినాదాల టైప్‌లో ‘జబ్‌ తక్‌ సూరజ్, చాంద్‌ రహేగా తబ్‌ తక్‌ ఆంధ్రామే బాబు రహేగా’ అంటారని కూడా స్వప్నించి ఉండవచ్చు. లాలూ యాదవ్‌ బిహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్జేడీ కార్యకర్తలు ఈ జాతీయ నినాదాన్ని లోకలైజ్‌ చేశారు. ‘జబ్‌ తక్‌ రహేగా సమోసామే ఆలూ... తబ్‌ తక్‌ రహేగా బిహార్‌ మే లాలూ’ అనేవారు. అటువంటి సృజనా త్మకతతో మనవాళ్లు కూడా మిరపకాయ బజ్జీలో మిర్చీ దాగినంతకాలం, ఉప్మాలో ఉల్లిపాయ వేగినంతకాలం బాబు రాజకీయాల్లో ఉంటారనే నినాదాలు వినిపిస్తారని ఆశించిన వారికి నిరుత్సాహమే మిగిలింది. సభికుల్లో అధికులు పేటీఎమ్‌ బ్యాచ్‌ కనుక ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయారు.

కొద్దిమంది కార్యకర్తల కేరింతలు క్లైమాక్స్‌ సన్నివేశాన్ని రక్తి కట్టించలేకపోయాయి. ఆ విధంగా ఆఖరి బాణం విఫలమైంది. ఆ తర్వాత? చివరకు మిగిలేది ఉక్రోషమే!
ఆఖరి రోజు కర్నూలు పట్టణంలో బాబులోని ఉక్రోషం బయటకొచ్చింది. పార్టీ కార్యాలయానికి ఎదురుగా ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అక్కడికి కొంచెం దూరంలో నిలబడి విద్యార్థులు, లాయర్లతో కూడిన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సభ్యులు కర్నూలులో న్యాయ రాజధానికి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. వారిని రెచ్చగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నించారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని గట్టిగా చెబుతూ పార్టీ కార్యకర్తలు కూడా అనాలని వారిని బలవంతపెట్టారు. దీంతో మరింత బిగ్గరగా జేఏసీ సభ్యులు బాబుకు నిరసన తెలిపారు. సీనియర్‌ మోస్ట్‌ రాజకీయ వేత్త వెంటనే రెచ్చిపోయారు.

‘కర్నూలు జిల్లా పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విపరీత ప్రవర్తన చూసి జనం విస్తుపోతున్నారు. ఈ పర్యటనను తెలుగుదేశం పార్టీ వారు ఒక వ్యూహం ప్రకారం చాలా శ్రద్ధగా డిజైన్‌ చేశారు. కర్నూలు జిల్లా ప్రజలు అధికార వికేంద్రీకరణను కోరుకోవడం లేదని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు కూడా వారికి ఇష్టం లేదని ఈ పర్యటన ద్వారా లోకాన్ని భ్రమింపజేయాలని తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా కలిసి ఈ పథకాన్ని రచించాయి. ఆయన సభలు జన సందోహంతో కిక్కిరిసినట్టు కనిపించేలా కొన్ని వీధి కూడళ్లను ఎంపిక చేశాయి. ఆ కూడళ్లలోకి నాలుగైదు వేల మందిని సమీకరిస్తే పెద్దఎత్తున జనం పాల్గొన్నట్టు కనిపిస్తుంది. ఆమాత్రం సమీకరణకు కూడా పార్టీ బలం చాలకపోవడంతో దిన వేతనంపై ఎక్కువ మంది సాధారణ ప్రజలను సమీకరించారు. వారిలో కొందరిని మిద్దెలపైకి ఎక్కించారు.

ఈమధ్యకాలంలో జనసందోహానికి మొహంవాచి ఉన్న అధినేత డూప్‌ జనాన్ని చూసి పరవశించిపోయారు. ఆ పరవశం కారణంగా రాజకీయాల్లో చిట్టచివరిగా వాడవలసిన సానుభూతి ఆయుధాన్ని యథాలాపంగా వాడిపారేశారు. ‘మీరు ఓట్లు వేసి గెలిపించకపోతే ఇవే నాకు చివరి ఎన్నికలవుతాయ’ని బేలగా వాపోయారు. ఈ చివరి ఆయుధానికి స్పందనగా ‘నో... నో’ అని జనం హోరెత్తుతారని బహుశా ఆయన ఆశించి ఉండవచ్చు. ‘మీకు ఇవి చివరి ఎన్నికలు కావు, మళ్లీ మళ్లీ మీరే గెలుస్తారు’ అనే సమాధానాలు వారి నుంచి ఊహించి ఉండవచ్చు. జాతీయస్థాయి నినాదాల టైప్‌లో ‘జబ్‌ తక్‌ సూరజ్, చాంద్‌ రహేగా తబ్‌ తక్‌ ఆంధ్రామే బాబు రహేగా’ అంటారని కూడా స్వప్నించి ఉండవచ్చు.’

లాయర్లు, విద్యార్థుల మీద బాబు నోటి వెంట అనర్ఘరత్నాలు రాలడం మొదలైంది. ‘‘పనికిమాలిన వ్యక్తుల్లారా... నేరాలు ఘోరాలు చేసే దరిద్రుల్లారా... రేయ్‌ వాణ్ణి తన్ను.. రేయ్‌ రారా చూపిస్తా... మా ఆఫీసుకే వస్తార్రా మీరు... ఎంత ధైర్యంరా మీకు... ధైర్యముంటే రాండ్రా గాడిద ల్లారా... బోడినాకొడుకులు తామాషాలాడతారా... రౌడీలకే రౌడీనిరా నేను.. తరిమి తరిమి కొట్టిస్తా... గుడ్డలిప్పదీసి కొట్టిస్తా..’’ ఇలా లాఠీ లేకుండా నోటి తుంపర్లతోనే ఆయన ఛార్జ్‌ చేశారు. ఈ వాక్ప్రవాహంలో కొసమెరుపు ఏమిటంటే కక్కాల్సినంత అసభ్యాన్నంతా వెళ్లగక్కుతూనే ఆయన సభ్యతను కూడా అడ్డం పెట్టుకున్నారు. ‘నన్ను రెచ్చగొట్టకండి. రెచ్చగొట్టిన వాళ్లంతా పతనమయ్యారు. నాకు వస్తున్న కోపానికి చెప్పు చూపించాలి. కానీ చూపించలేదు. అదీ నా సభ్యత’ అని చెప్పుకున్నారు. ఈ సభ్యత బాణం పవన్‌ కల్యాణ్‌ మీద కావచ్చని సోషల్‌ మీడియా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈమధ్యనే పవన్‌ కల్యాణ్‌ ఒక సభలో ఆవేశంతో ఊగిపోతూ చెప్పు తీసి చూపించిన సంగతి అందరికీ తెలిసిందే. బాబు తన తాజా వ్యాఖ్యానం ద్వారా పవన్‌కు సభ్యత లేదని చెప్పదలుచు కున్నారా? అదే నిజమైతే ఆయనకు ఎందుకింత కోపం వచ్చింది? లోగుట్టు తెలిసిన పెరుమాళ్లే దీనికి సమాధానం చెప్పాలి.

సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న చంద్రబాబునాయుడులో పెరుగుతున్న అసహనాన్నీ, నిస్పృహనూ అర్థం చేసుకోవచ్చు. అనుభవం కారణంగా క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అంతో ఇంతో అంచనా వేయగలరనే అనుకోవాలి. అలా అంచనా వేయగలిగిన స్థితిలోనే ఉంటే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం సాధ్యం కాదనే విషయం అర్థమయ్యే ఉండాలి. అర్థం కాలేదు, తాము గెలవగలమనే భ్రాంతిలోనే నిజంగా ఉన్నాడంటే ‘కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్‌’ అనే వాక్యాన్ని అక్షరాల నమ్ముతున్న అమాయకుడై ఉండాలి. ఆయన అమాయకుడు కాదు, గుండెలు తీసిన మొనగాడనే విషయం లోకోత్తర వ్యావహారికం. కనుక అసలు విషయం ఆయనకు తెలుసనే అనుకోవాలి.

వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించడం దాదాపు అసాధ్యమన్న భావన ఎందుకు ఏర్పడింది? దానికి కారణా లున్నాయి. గడచిన ఎన్నికల్లో ఆ పార్టీకి 50 శాతం ఓట్లు వచ్చాయి. ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన పేదల అనుకూల విధానాలు, సాధించిన బలహీనవర్గాల సాధికారత, విద్య, వైద్యం, వ్యవసాయరంగాల్లో ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ మద్దతుదార్ల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. తమ గోబెల్స్‌ ప్రచారం ఫలితంగా అధికార పార్టీ ఓట్లలో రెండు మూడు శాతం ఓట్లను తగ్గించ గలమనే నమ్మకంతో ఎల్లో మీడియా – తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. ఒకవేళ అదే నిజమని నమ్మినా, అధికార పార్టీకి పేదవర్గాల నుంచి కొత్తగా జమ కానున్న ఓట్లతో పోల్చితే ఈ సంఖ్య తక్కువే. ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతానికి తగ్గని ఓట్ల బ్యాలెన్స్‌తో ఉన్న అధికార పార్టీని ఓడించేదెట్లా?

రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదనే సామెత కూడా ఒకటున్నది. ఏవైనా అద్భుతాలు జరిగితే?... ఏమో... గుర్రం ఎగరావచ్చు అనే ఆశ ఏదో ఎల్లో కూటమిలో ఎక్కడో మిణుకు మిణుకుమంటూ ఉండేది. సదరు మిణుగురు ఆశను సాకారం చేసుకోవడానికి చాలాకాలం నుంచే ఎల్లో కూటమి ఒక ద్విముఖ వ్యూహాన్ని అమలుచేయడం మొదలుపెట్టింది. ఇందులో మొదటిది – సుడిగాలి మాదిరిగా సాగించే గోబెల్స్‌ ప్రచారంతో వైసీపీ మద్దతు ఓట్లను తగ్గించడం! రెండోది – కుడి నుంచి ఎడమకూ, ఎడమ నుంచి కుడికీ సమస్త పార్టీలనూ, రథ గజ తురగ పదాతి శ్రేణులన్నింటినీ తమకు అనుకూలంగా ఏకం చేసుకోవడం! ఈమధ్య పవన్‌ కల్యాణ్‌ను పరామర్శించినప్పుడు చంద్రబాబు ఉద్ఘాటించిన ‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్యత’ అనే పిలుపులోని పరమార్థం ఇదే!

ఈ ఐక్యతలో ముందుగా జనసేనను కూటమిలో కలుపుకోవాలి. జనసేన గాలంతో బీజేపీ చేపను పట్టేయాలి. ఆ తర్వాత ఎలాగోలా కమ్యూనిస్టులను పట్టేయాలి. బీజేపీ ఉన్న కూటమిలోకి కమ్యూనిస్టులు ఎట్లా వస్తారు? ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ కోసం వస్తారు. సీపీఐ నాయకుల్లో కొందరు చంద్ర బాబు పట్ల తమ వ్యామోహాన్ని బహిరంగంగానే ప్రదర్శించడం తెలిసిందే. వారి ద్వారా సీపీఎంకూ లైన్‌ వేయాలి.

‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్యత’లో ముందుగా జనసేనను కూటమిలో కలుపుకోవాలి. జనసేన గాలంతో బీజేపీ చేపను పట్టేయాలి. ఆ తర్వాత ఎలాగోలా కమ్యూనిస్టులను పట్టేయాలి. బీజేపీ ఉన్న కూటమిలోకి కమ్యూనిస్టులు ఎట్లా వస్తారు? ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ కోసం వస్తారు. సీపీఐ నాయకుల్లో కొందరు చంద్రబాబు పట్ల తమ వ్యామోహాన్ని బహిరంగంగానే ప్రదర్శించడం తెలిసిందే. వారి ద్వారా సీపీఎంకూ లైన్‌ వేయాలి. ఇంకా ఎక్కడన్నా చిన్నా చితకా పార్టీలుంటే వాటికీ వల వేయాలి. ‘నోటా’ ఓట్లు, చెల్లని ఓట్లతో కూటమి కట్టడానికి ఏవైనా ఉపాయాలున్నాయేమో ఆలోచించాలి... ఇట్లా సాగుతున్న ఎల్లో కూటమి ఆలోచనా స్రవంతికి ఎక్కడో బ్రేక్‌ పడ్డట్టుగా కనిపిస్తున్నది.

మోదీతో భేటీ తర్వాత పవన్‌ కల్యాణ్‌ పర్యటన వార్తలను ఎల్లో మీడియా పూర్తిగా తగ్గించివేసిందని సోము వీర్రాజు అధిక్షే పించారు. చంద్రబాబేమో పవన్‌కు సభ్యత లేదన్నట్టు పరోక్షంగా బాంబులు విసురుతున్నారు. ఏం జరుగు తున్నదో? ఎల్లో కూటమి ప్రవచిస్తున్న ‘ప్రజాస్వామ్యం’ కోసం ఐక్యతా కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదు పడిందా? లేక టీడీపీ – జనసేనల మధ్య తాత్కాలిక వియోగమే సంభవించిందా? తేలడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ, మళ్లీ ఆట మొదలుపెట్టాలి. ఈలోగా పుణ్యకాలం గడిచిపోవచ్చు. మరోపక్కన గోబెల్స్‌ ప్రచారం మునుపటి మాదిరిగా ప్రభావం చూపుతున్నట్టు లేదు. ’

ఇంకా ఎక్కడన్నా చిన్నా చితకా పార్టీలుంటే వాటికీ వల వేయాలి. ‘నోటా’ ఓట్లు, చెల్లని ఓట్లతో కూటమి కట్టడానికి ఏవైనా ఉపాయాలున్నాయేమో ఆలో చించాలి... ఇట్లా సాగుతున్న ఎల్లో కూటమి ఆలోచనా స్రవంతికి ఎక్కడో బ్రేక్‌ పడ్డట్టుగా కనిపిస్తున్నది. మోదీతో భేటీ తర్వాత పవన్‌ కల్యాణ్‌ పర్యటన వార్తలను ఎల్లో మీడియా పూర్తిగా తగ్గించివేసిందని సోము వీర్రాజు అధిక్షేపించారు. చంద్రబాబేమో పవన్‌కు సభ్యత లేదన్నట్టు పరోక్షంగా బాంబులు విసురుతున్నారు. ఏం జరుగు తున్నదో? ఎల్లో కూటమి ప్రవచిస్తున్న ‘ప్రజాస్వామ్యం’ కోసం ఐక్యతా కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదు పడిందా? లేక టీడీపీ – జనసేనల మధ్య తాత్కాలిక వియోగమే సంభవిం చిందా? తేలడానికి కొంత సమయం పట్టవచ్చు. ఒకవేళ ఇది తాత్కాలిక వియోగమే అయినా, మళ్లీ ఆట మొదలుపెట్టడానికి ఇంకాస్త టైమ్‌ పడుతుంది. ఈలోగా పుణ్య కాలం గడిచి పోవచ్చు. మరో పక్కన గోబెల్స్‌ ప్రచారం మునుపటి మాదిరిగా ప్రభావం చూపుతున్నట్టు లేదు. ఒక్కో బోగస్‌ కథనాన్ని వంద సార్లు అచ్చొత్తినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ నేప థ్యంలో చంద్రబాబు నిర్వహించిన కర్నూలు తరహా యాత్రలు రాయలసీమ జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో కూడా చేపట్టవచ్చు. ఉరుములు మెరుపులతో కూడిన రెచ్చగొట్టే తుంపర్లు మరిన్ని రాలవచ్చు. ఇది రాజకీయ వాతావరణ హెచ్చరిక. ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్మాదపు మేఘాలు ఆవరించకుండా ఉండుగాక!

వర్ధెల్లి మురళి, vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement