ప్రధాన వార్తలు

పోలీసు రాజ్యమా?.. బాబు నియంతృత్వ రాజ్యమా?
ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వ యంత్రాంగంతో అణిచివేస్తున్న చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారుసాక్షి, గుంటూరు: ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వ యంత్రాంగంతో అణిచివేస్తున్న చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో శనివారం ఆయన సుదీర్ఘమైన ఓ పోస్ట్ ఉంచారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే హక్కుతో పాటు, నిరసన వ్యక్తం చేయడం అనేవి ఒక పునాది వంటివి. ప్రజలు తమ సమస్యలు ప్రస్తావించి, వాటి పరిష్కారం కోరడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ, దురదృష్టశాత్తూ మన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన ప్రాథమిక హక్కులను, చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తోంది. పోలీసు యంత్రాంగాన్ని, వారి అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే గొంతుకలను నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తున్నారు. అది ఏ స్థాయికి చేరిందంటే, అసలు మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నియంతృత్వంలోనా? అనే సందేహం కలుగుతోంది’.‘ప్రజలు తమ సమస్యలు లేవనెత్తినా, వారికి మద్దతుగా విపక్షం గళం విప్పినా ప్రభుత్వం సహించడం లేదు. దారుణంగా వేధిస్తున్నారు. లేని కేసులు సృష్టిస్తూ వారి గళాన్ని నొక్కడంతో పాటు, అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారే ఉండకూడదన్న విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రక్రియలో రాష్ట్రంలో ఏ ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం విడిచిపెట్టడం లేదు. అలా ప్రజాస్వామ్య స్ఫూర్తి, పౌర హక్కులకు తీవ్ర భంగం కలిగిస్తున్నారు’.‘దీని వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం ఒక్కటే. ఒక పద్దతి ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించడంతో పాటు, ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలి. అలాగే ప్రశ్నించే ఏ గొంతుకా ఉండొద్దు’. అదే ఈ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.ఆ దిశలో ఈ ప్రభుత్వం చేసిన, చేస్తున్న చర్యలు. పద్దతి ప్రకారం ప్రజాస్వామ్యాన్నే అణిచి వేసేలా వ్యవహరిస్తున్న తీరు.. వివరాలు చూస్తే..👉 ఫిబ్రవరి 19, 2025. గుంటూరు మిర్చియార్డు.దారుణంగా ధరలు పతనం కావడంతో, మిర్చి రైతులు పడుతున్న కష్టాలు తెలుసుకుని, వారిని పరామర్శించేందుకు గుంటూరు మిర్చియార్డును సందర్శించాను. మిర్చి ధరలు రూ.27 వేల నుంచి ఏకంగా రూ.8 వేలకు పడిపోయాయి. ఆ పరిస్థితుల్లో నేను గుంటూరు మిర్చియార్డు సందర్శించి, ఆ రైతులను పరామర్శిస్తే కేసు నమోదు చేశారు.👉ఏప్రిల్ 8, 2025. శ్రీ సత్యసాయి జిల్లా. రామగిరి.‘టీడీపీ మూకల చేతిలో దారుణహత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో పర్యటించాను. దానిపైనా కేసు నమోదు చేశారు. వైయస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గం కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపైనా కేసు పెట్టారు.👉జూన్ 11. 2025. ప్రకాశం జిల్లా పొదిలి.‘ఏ మాత్రం గిట్టుబాటు ధర లేక నానా ఇక్కట్లు పడుతున్న పొగాకు రైతులను పరామర్శకు వెళ్తే ఏకంగా మూడు కేసులు నమోదు చేశారు. పొగాకు బోర్డు సూచన మేరకు రైతులు 20 శాతం పొగాకు ఎక్కువ సాగు చేశారు. కానీ, ధరలు మాత్రం దారుణంగా పతనమయ్యాయి. ఈ పరిస్థితుల్లో నేను పొగాకు రైతుల పరామర్శకు వెళ్తే 3 కేసులు పెట్టారు. 15 మంది రైతులను జైళ్లకు పంపడంతో పాటు, నలుగురిని అరెస్టు చేశారు. చివరకు న్యాయస్థానం కూడా ఈ చర్యను తప్పు బట్టింది.👉జూన్ 18, 2025. పల్నాడు జిల్లా సత్తెనపల్లి.‘గత ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పోలీసుల దారుణ వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మా పార్టీ నాయకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్తే, అక్కడా కేసులు నమోదు చేశారు. 5 కేసులు నమోదు చేయడంతో పాటు, ఏకంగా 131 మందికి నోటీసులు జారీ చేశారు. ఇంకా సినిమా పోస్టర్లు ప్రదర్శించిన ఇద్దరిని అరెస్టు చేశారు.👉జూలై 9, 2025. బంగారుపాళ్యం. చిత్తూరు జిల్లా.‘ఏ మాత్రం కొనుగోళ్లు లేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన తోతాపురి మామిడి రైతులను పరామర్శించేందుకు చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యంలోని మార్కెట్‌యార్డును సందర్శిస్తే.. అక్కడా ఏకంగా 5 కేసులు నమోదు చేశారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులు గడిచినా, వారి అరెస్టు చూపలేదు. కోర్టులో ప్రవేశపెట్టలేదు. వారంతా ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు.‘ప్రతి కేసుకు సంబంధించి ఒక ముగ్గురు, నలుగురి పేర్లు పెట్టి.. ఇంకా ఇతరులు అని రాస్తున్నారు. ఆ విధంగా తాము టార్గెట్ పెట్టుకున్న వారిని ఆ తర్వాత ఆ కేసులో జోడిస్తున్నారు. నా ప్రతి పర్యటనలో కూడా ప్రజలెవ్వరూ రాకుండా, తీవ్ర నిర్భంధం విధిస్తున్నారు. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేయడమే కాకుండా, వారిని ముందస్తుగా హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. చివరకు రైతులను కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. వారు రాకుండా నియంత్రించే కుట్ర చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ చెక్‌పోస్టులు పెట్టి, అడ్డుకుంటున్నారు’.రాష్ట్రంలో ఉన్నది ఒకే ఒక విపక్షం. ప్రజా సమస్యలపై పోరాడేది కూడా విపక్షమే. కానీ మా పార్టీని కూడా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. అణిచివేసే ప్రయత్నాన్ని సీఎం చంద్రబాబుగారు నిరంతరం కొనసాగిస్తున్నారు. లేని కేసులు బనాయించడం, అరెస్టులు చేయడం, ఆ విధంగా దారుణంగా వేధించడం పరిపాటిగా మారింది. ఆ విధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం కలిగించడమే కాకుండా, వాయిస్‌లెస్ పీపుల్ వాయిస్‌ను నొక్కేస్తున్నారు’. విధంగా అడ్డగోలు హామీలిచ్చి, ఏవీ అమలు చేయకుండా ఉన్న తమను ఎవరూ ప్రశ్నించకూడదు. వాటిపై ఎవరూ మాట్లాడకూడదు అనే విధంగా ఈ ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోంది’.CM @ncbn suppressing dissent with state machineryThe right to question, protest, and assemble forms the bedrock of democracy, empowering citizens to freely express their grievances and demand accountability. In Andhra Pradesh, however, this fundamental democratic process is…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 12, 2025

ట్రంప్‌కు మరో షాక్.. రాజీనామా యోచనలో కాష్ పటేల్!
ట్రంప్ వీరవిధేయుడు, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు విషయంలో విభేదాలతో ఎలాన్ మస్క్ డోజ్‌ను వీడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాష్ పటేల్ కూడా ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో అదే బాటలో పయనించే అవకాశం కనిపిస్తోంది.వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కాష్ పటేల్(కశ్యప్ ప్రమోద్ పటేల్) ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు. ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో రాజీనామా చేస్తారనే ఊహాగానాల నడుమ.. కాష్ ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డాన్ రాజీనామా చేసిన వెంటనే తన పదవి నుంచి వైదొలగాలని కాష్ భావిస్తున్నారని స్థానిక మీడియా కథనాలు ఇస్తోంది. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినోఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారాన్ని అమెరికా న్యాయ విభాగం.. ఎఫ్‌బీఐ కలిపి విచారిస్తోంది. అయితే ఈ కేసును అటార్నీ జనరల్ పామ్ బాండీకు అప్పగించినప్పటి నుంచి ఎఫ్‌బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన సెలవులపై వెళ్లారు. అయితే ఆమె ఉండగా తాను తిరిగి విధుల్లోకి రాలేనని బోంగినో ఎఫ్‌ఐబీకి స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ తరుణంలోనే కాష్ పటేల్ ఈ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బోంగినో గనుక రాజీనామా చేస్తే.. కాష్ తాను పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారని అక్కడి మీడియా కథనాలు ఇచ్చింది. పామ్ బాండీ‘‘ఈ దర్యాప్తులో పామ్ బాండీ ఉండాలని కాష్ పటేల్ కూడా కోరుకోవడం లేదు. బాండీ మరికొన్ని పత్రాలను విడుదల చేయకపోవడంపైనా ఎఫ్‌బీఐ వర్గాల్లో తీవ్ర అసహనం నెలకొంది. అందుకే బోంగినో గనుక వీడితే ఆయన కూడా ఎఫ్‌బీఐని వీడే అవకాశం ఉంది’’ అని ఓ ప్రముఖ జర్నలిస్టు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎఫ్‌బీఐకి, డీవోజే(డిపార్ట్మెంట ఆఫ్ జస్టిస్)కు నడుమ పొసగట్లేదన్న విషయాన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ట్రంప్ అనుచరురాలు లారా లూమర్ సైతం ధృవీకరించడం గమనార్హం. పారదర్శకత లోపించిందనేది ప్రధాన ఆరోపణతో ఎఫ్‌బీఐ వర్గాలు బాండీ తీరుపట్ల అసంతృప్తిగా ఉన్నాయంటూ లూమర్ తెలిపారు. ఈ క్రమంలో బాండీని.. బ్లోండీ అంటూ ఆమె ఎద్దేవా చేయడం గమనార్హం. ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫైల్స్ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అయితే.. ఎప్స్టీన్ ఫైల్స్‌లో.. ప్రముఖుల పేర్లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బయటపెడతామని ఫిబ్రవరిలో ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పామ్ బాండీ ప్రకటించారు. అయితే తాజాగా డీవోజే-ఎఫ్‌బీఐ సంయుక్తంగా విడుదల చేసిన మెమోలో.. ఎలాంటి ఆధారాల్లేవని, కేసును ముగించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాండీ మాటమార్చి.. తన గత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒకవైపు ఎలాన్ మస్క్ సైతం ఈ వ్యవహారంపై ట్రంప్ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు. మరోవైపు ట్రంప్ ఈ వ్యవహారంపై తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటిదాకా ఎఫ్‌బీఐ వర్సెస్ జ్యూడీషియల్ డిపార్టెమెంట్ వ్యవహారంపై వైట్‌హౌజ్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంకోవైపు మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్(MAGA) ఉద్యమకారులు సైతం ఈ పరిణామాలపై అసంతృప్తితో రగిలిపోతున్నారు.కశ్యప్ పూర్వీకులు భారత్‌లోని గుజరాత్ నుంచి వలస వెళ్లారు. అతడి తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. ఉగాండా నుంచి అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్‌లో కశ్యప్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ లండన్‌లో న్యాయవిద్యను పూర్తి చేశారు.అనంతరం మియామీ కోర్టుల్లో లాయర్‌గా వివిధ హోదాల్లో సేవలందించారు. ఆ సమయంలోనే ట్రంప్‌కు ఆయన దగ్గరయ్యారు. ఫిబ్రవరి 22వ తేదీన ఎఫ్‌బీఐ 9వ డైరెక్టర్‌గా కాష్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో పామ్ బాండీ కాష్‌తో ప్రమాణం చేయించగా.. భగవద్గీత మీద చేయి ఉంచి ఆయన బాధ్యతలు చేపట్టారు.

తిరుమలపై ఇంత పెద్ద నింద వేస్తారా?
టీటీడీలో అన్యమతస్తుల అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను భూమన కరుణాకర్‌రెడ్డి ఖండించారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో తిరుపతి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని.. ఇది శ్రీవారి ఆలయంపై జరిగిన దాడిగానే పరిగణిస్తున్నామని అన్నారాయన. టీటీడీ సభ్యుడి సమక్షంలోనే బండి సంజయ్ అలా ఎలా ప్రకటించారని.. దీనిపై స్పందించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి కచ్చితంగా ఉందని భూమన డిమాండ్ చేస్తున్నారు. సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులైన ఉద్యోగుల వ్యవహారం తెలంగాణ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. ఇంత పెద్ద నింద వేసినా.. కూటమి ప్రభుత్వం, టీటీడీ ఇప్పటిదాకా స్పందించకపోవడం దారుణమని అన్నారాయన. టీటీడీలో 1,000 మంది అన్య మతస్తులు ఉన్నారని, వాళ్లను వెంటనే తొలగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ టీటీడీని హెచ్చరించారు. కేంద్ర మంత్రిగా ఉండి ఇలా ప్రకటన చేశారంటే ఆయన వద్ద ఏమైనా నివేదిక ఉందా?. ఆయన అలా ప్రకటన చేసిన టైంలో పక్కనే టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాశ్ కూడా ఉన్నారు. అలాంటప్పుడు దీనిపై వివరణ ఇవ్వాల్సిన భాద్యత కూటమి ప్రభుత్వం, టీటీడీపైన కచ్చితంగా ఉందిటీటీడీ బోర్డులో 22 మంది అన్యమతస్తులైన ఉద్యోగులు ఉన్నారని, వారిని బదిలీ చేస్తున్నట్లు గతంలో ఈవో, చైర్మన్లు ప్రకటించారు. అలాంటప్పుడు బండి సంజయ్ 1,000 మంది అని ఎలా అంటారు?. రెండింటిలో ఏది నిజం? ఆయన(బండి సంజయ్) లెక్క ప్రకారం.. 20 శాతం మంది అన్యమతస్తులే ఉన్నట్లా?. అసలు తిరుమలపై ఇంత పెద్ద నింద ఎలా వేస్తారు?. ఇది భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమే. కచ్చితంగా టీటీడీని, ఉద్యోగస్తులను అవమానించడమే.అధికారంలోకి రాగానే.. తిరుమలను ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాంటప్పుడు తిరుపతి ప్రజలను నొప్పించిన బండి సంజయ్ ప్రకటన పట్ల ఎందుకు స్పందించరు. బండి సంజయ్ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా పవన్ కల్యాణ్ సహా కూటమి నేతలు, టీటీడీలు కనీసం స్పందించలేదు.. ఖండించలేదు అని భూమన అన్నారు.

‘అతడొక ఫెయిల్యూర్.. అయినా సరే నాలుగో టెస్టులోనూ ఆడించాలి’
ఇంగ్లండ్ సిరీస్‌తో సందర్భంగా టెస్టుల్లో పునరాగమనం చేసిన.. టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (Karun Nair) వరుసగా విఫలమవుతున్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక చతికిలపడుతున్నాడు. లీడ్స్ వేదికగా తొలి టెస్టు తుదిజట్టులో భాగమైనకరుణ్.. రీఎంట్రీలో డకౌట్ అయ్యాడు.ఇక రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఇరవై పరుగులు చేయగలిగాడు. అయితే, ఆ తర్వాత కూడా కరుణ్ నాయర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో అతడు చేసిన పరుగులు వరుసగా 31, 26. అయితే, ప్రఖ్యాత లార్డ్స్ మైదానం (Lord's Test)లో జరుగుతున్న మూడో టెస్టులో మాత్రం ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కాస్త ఫర్వాలేదనిపించాడు.ఎట్టకేలకు కనీసం 40 పరుగుల మార్కులార్డ్స్లో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా కరుణ్ నాయర్.. 62 బంతులు ఎదుర్కొని 40 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. అయితే, ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో జో రూట్‌కు క్యాచ్ ఇవ్వడంతో కనీసం అర్ధ శతకమైనా చేయకుండానే కరుణ్ వెనుదిరగాల్సి వచ్చింది. ఏదేమైనా ఇంగ్లండ్‌లో ఇప్పటికి ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో కరుణ్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.తుదిజట్టు నుంచి తప్పించండి!అయితే, యువ ఆటగాడు సాయి సుదర్శన్‌పై వేటు వేసి.. సీనియర్ అయిన కరుణ్‌కు వరుస అవకాశాలు ఇస్తున్నా.. అతడి ఆట మెరుగుపడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. నాలుగో టెస్టు నుంచి అతడిని తప్పించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాత్రం భిన్నంగా స్పందించాడు.ఫెయిల్యూరే.. కానీ.. నాలుగో టెస్టులోనూ ఆడించండికరుణ్ నాయర్ విఫలమవుతున్న మాట వాస్తవమేనని.. అయితే, నాలుగో టెస్టులో కూడా అతడిని ఆడిస్తేనే బాగుంటుందని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘అతడు అంత గొప్పగా ఆడటం లేదు. అలా అని అతడి ప్రదర్శన మరీ తీసికట్టుగానూ లేదు.నిజానికి అతడి అదృష్టం అస్సలు బాలేదు. కరుణ్ ఇచ్చిన క్యాచ్‌లు సులువైనవి కాకపోయినా ప్రత్యర్థి జట్టు ఫీల్డర్లు అద్బుత రీతిలో వాటిని ఒడిసిపడుతున్నారు. గత మ్యాచ్‌లో ఓలీ పోప్.. ఇప్పుడు రూట్.కరుణ్ మరీ ఎక్కువగా పరుగులు చేయలేకపోతున్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి అతడిని నాలుగో టెస్టు నుంచి తప్పించాలని అంటున్నారు.అయితే, నా అభిప్రాయం ప్రకారం అతడిని తదుపరి మ్యాచ్‌లో తప్పక ఆడించాలి. లార్డ్స్‌లో రెండో ఇన్నింగ్స్‌లో గనుక కనీసం 30- 40 పరుగులు చేసినా అతడు నాలుగో టెస్టు ఆడేందుకు అర్హుడే అవుతాడు’’ అని ఆకాశ్ చోప్రా యూట్యూబ్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఏదేమైనా కరుణ్ నాయర్ మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలంటే తన థర్టీస్, ఫార్టీస్‌ను ఎనభై, తొంభై, సెంచరీలుగా మలచాల్సి ఉంటుందన్నాడు ఆకాశ్. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య జూలై 23- 27 మధ్య మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.ఇదిలా ఉంటే.. లార్డ్స్ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి టీమిండియా 43 ఓవర్లలో మూడు వికెట్ల నష్టపోయి 145 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్‌తో పోలిస్తే తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: MLC 2025: పొలార్డ్ విధ్వంసం... సూపర్ కింగ్స్ అవుట్... ఫైనల్లో ఎంఐ న్యూయార్క్

హీరోను తిట్టా, కొట్టా.. సారీ మాత్రం చెప్పను: దర్శకురాలు
ప్రవీణ పరుచూరి (Praveena Paruchuri).. అమెరికాలో సెటిలైన ఈ తెలుగమ్మాయి అక్కడ కార్డియాలజిస్ట్‌గా పని చేసింది. కానీ సినిమాలపై పిచ్చితో తన వృత్తిని వదిలేసి స్వదేశానికి తిరిగొచ్చింది. టాలీవుడ్లో అడుగుపెట్టి కేరాఫ్ కంచరపాలెం సినిమాతో నిర్మాతగా హిట్టు కొట్టింది. సినిమాను నిర్మించడంతోపాటు అందులో సలీమా అనే వేశ్య పాత్రలోనూ నటించింది. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాకు సైతం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది.డైరెక్షన్ కష్టంతాజాగా ప్రవీణ దర్శకురాలిగా మారింది. కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమా చేస్తోంది. ఈ చిత్రం జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ప్రవీణ.. నటీనటులతో మంచి పర్ఫామెన్స్ రాబట్టేందుకు వారిపై చేయి చేసుకున్నానని వెల్లడించింది. ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ.. డైరెక్షన్ చాలా కష్టమైనది. డైరెక్షన్ చేసేటప్పుడు చాలా డౌట్స్ వస్తాయి. ఈ పర్ఫామెన్స్ ఓకేనా? ఈ బీజీఎం వర్కవుట్ అవుతుందా? ఈ ఎడిట్ ఓకేనా? ఇలా ఎన్నో ప్రశ్నలు వెంటాడాయి. షూటింగ్ మాత్రం 33 రోజుల్లో త్వరగా అయిపోయింది.హీరోను కొట్టా, తిట్టా..హీరో మనోజ్ చంద్ర సిటీ అబ్బాయి. ఇతడిని పల్లెటూరి కుర్రాడిలా తయారుచేయడమే అసలైన కష్టం. అలాగే కొత్త హీరోయిన్ను పరిచయం చేస్తున్నాం. వీరిద్దరి మధ్య సీన్లు పండకపోతే సినిమా పండదు. కాబట్టి ఈ ఇద్దరిపైనే ఎక్కువ దృష్టి పెట్టాను. నిజం చెప్పాలంటే వీళ్లను తిట్టాను, కొట్టాను, రాళ్లు విసిరాను. ఎందుకంటే నా దృష్టిలో నటించడం అంటే జీవించడం. అందుకే నేను చేసిన పనికి వీళ్లకు సారీ చెప్పను. నేను డాక్టర్‌ను కాబట్టి ఏదైనా అయితే బాగానే చూసుకున్నాను అని ప్రవీణ చెప్పుకొచ్చింది.చదవండి: రేణు దేశాయ్‌కు సర్జరీ.. అసలేమైంది?

సెల్పీ దిగుదాం రా బావా..!
భార్యభర్తల బంధాలకు ఈ మధ్యకాలంలో అనూహ్య ముగింపు లభిస్తోంది. వివాహేతర సంబంధాలతోనో, పాత పరిచయాల కోసమే ఒకరినొకరు కడతేర్చుతున్న ఘటనలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.సెల్ఫీ కోసం ఓ బ్రిడ్జి మీద ఆగిన కొత్తజంట.. వీడియోతో నెట్టింట రచ్చ చేస్తోంది. తన బావ(భర్త) ప్రమాదవశాత్తు నీళ్లలో పడిపోయాడని ఆ నవవధువు, లేదు తన భార్యే తనను తోసేసి చంపాలని చూసిందని ఆ భర్త హల్ చల్ చేశారు. కర్ణాటక రాయ్‌చూర్‌లో తాజాగా జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..కాడ్లూరు సమీపంలో కృష్ణా నది వంతెన మీదుగా బైక్ మీద వెళ్తున్న ఓ జంట ఆగింది. కాసేపటికే ఆ వ్యక్తి చేతులు ఊపుతూ సాయం కోసం అరవసాగాడు. ఈలోపు వంతెన మీద ఉన్న అతని భార్య దారినపోయే వాళ్లను రక్షించమని సాయం కోరుతూ కనిపించింది. ఇది గమనించిన మత్స్యకారులు కొందరు తాడు సాయంతో ఆ వ్యక్తిని వంతెన పైకి తీసుకొచ్చారు. తమకు ఈ మధ్యే వివాహం అయ్యిందని, సెల్ఫీ దిగుదామని తన భార్య కోరిందని.. ఆ సమయంలో ఆమె తనను నీళ్లలోకి తోసేసిందని, ఎలాగోలా వచ్చిన కాస్త ఈతతో ఈదుకుంటూ బండరాళ్ల మీదకు చేరానని, తనను చంపేందుకు కుట్ర పన్నిందని సదరు వ్యక్తి వాపోయాడు. అయితే కాలు జారి తన భర్త నదిలో పడిపోయాడని, తనకు ఎలాంటి పాపం తెలియదని ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది. దీంతో అక్కడ ఉన్నవాళ్లు ఆ జంటను స్థానికంగా ఉన్న పీఎస్‌కు తీసుకెళ్లగా.. వాళ్లు పెద్దల సమక్షంలో ఆ జంటకు కౌన్సెలింగ్ ఇప్పించి పంపించినట్లు తెలుస్తోంది.A newlywed man in #Raichur was allegedly pushed into the River by his wife during a photoshoot near Gurjapur Bridge.He clung to rocks & was rescued by fishermen.The wife claimed it was accidental but husband accused her of a deliberate act.Police are investigating the viral video pic.twitter.com/4Da9x8ShXx— Yasir Mushtaq (@path2shah) July 12, 2025

అప్పుడే తుది నిర్ణయానికి రావొద్దు: రామ్మోహన్ నాయుడు
ఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ‘ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో’ (AAIB) ఇచ్చిన ప్రాథమిక నివేదికపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అప్పుడే తుది నిర్ణయానికి రావొద్దు అంటూ వ్యాఖ్యలు చేశారు. తుది నివేదిక వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు. అలాగే, బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. విమాన ప్రమాదంపై ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే. మంత్రిత్వ శాఖలో దీనిపై మేం విశ్లేషిస్తున్నాం. విమాన ప్రమాదంపై అప్పుడే తుది నిర్ణయానికి రావొద్దు. నివేదికపై మేము వారితో సమన్వయం చేసుకుంటున్నాం. తుది నివేదికలు త్వరలో వస్తాయని మేము ఆశిస్తున్నా. అనంతరం, ఒక నిర్ణయానికి వచ్చే వీలు ఉంటుంది. పైలట్లు, సిబ్బంది పరంగా ప్రపంచంలో మనకు అత్యంత అద్భుతమైన శ్రామిక శక్తి ఉంది. ఇది నేను నిజంగా నమ్ముతున్నాను. పైలట్లు, సిబ్బందే విమానయాన పరిశ్రమకు వెన్నెముక’ అని చెప్పుకొచ్చారు.#WATCH | Vizag | On AAIB's preliminary report on AI 171 crash, Union Civil Aviation Minister Ram Mohan Naidu Kinjarapu says, "This is a preliminary report, at the ministry we are analysing it...We are coordinating with AIBB for any support they need. We are hoping that the final… pic.twitter.com/UsJB7yD1Xj— ANI (@ANI) July 12, 2025ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ఏఏఐబీ మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నివేదికలో.. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్‌ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది. కాక్‌పిట్‌లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ వెల్లడించింది. తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్టు తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఏఐబీ.. ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది.క్షణాల్లో రెండు ఇంజిన్లకు ఫ్యూయెల్ సరఫరా నిలిచిపోయింది. గాల్లోనే రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే క్రాష్‌ల్యాండ్ అయినట్టు తెలిపింది. ఈ మేరకు కాక్‌పిట్ వాయిస్‌లో పైలట్ సంభాషణ రికార్డు అయినట్టు చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు చెప్పింది. విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లను వెలికితీసినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్‌ను గుర్తించామని పేర్కొంది. ఇంజిన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే, ప్రమాదానికి ముందు విమానాన్ని ఎలాంటి పక్షి సైతం ఢీకొట్టలేదని వెల్లడించింది.

Vinutha Kotaa: రాయుడి హత్య కేసులో కొత్త విషయాలు
సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాయుడిని చిత్రహింసలకు గురి చేసి చంపి.. ఆపై మృతదేహాన్ని తమ కారులోనే వినూత కోటా దంపతులు నదిలో పడేసినట్లు విచారణలో వెల్లడైంది. తన మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడిని హత్య చేసిన కేసులో జనసేన పార్టీ తాజా మాజీ ఇంచార్జి వినూత కోటా (Vinutha Kotaa) అరెస్ట్ అయ్యారు. వినూత, ఆమె భర్త చంద్రబాబు (Chandrababu Kotaa) తోపాటు మరో ముగ్గురినీ చెన్నై సెవెన్ హిల్స్ పోలీసులు ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటిదాకా సాధించిన పురోగతి వివరాలను చెన్నై కమిషనర్ ఏ అరుణ్ శనివారం మీడియాకు వెల్లడించారు. శ్రీనివాసులు(రాయుడు)ను ఆంధ్రాలో హత్య చేసి చెన్నైలో పడేశాడు. హత్యకు ఉపయోగించిన కారు ఆధారంగా కీలక సమాచారం సేకరించాం. సీసీటీవీ ఫుటేజీ ద్వారానే నిందితులను గుర్తించాం. ప్రస్తుతం వాళ్లు పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది అని అన్నారాయన. కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని సీపీ అరుణ్ తెలిపారు.చెన్నై మింట్ పీఎస్ పరిధిలో కూవం నదిలో మూడు రోజుల క్రితం ఓ గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే పోస్టుమార్టంలో చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్లు తేలింది. దీంతో హత్య కేసుగా మార్చి దర్యాప్తు ముమ్మరం చేశారు. చేతి మీద జనసేన సింబల్‌తో పాటు వినూత పేరు ఉండడంతో ఆ దిశగా ఆరాలు తీశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ముగ్గురు నిందితులను గోపి, శివకుమార్, దస్తసాహెచ్లను అరెస్ట్ చేశారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో ఈ ఉదయం వినూత కోటా, ఆమె భర్త చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై అది ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసుల(రాయుడు)దిగా నిర్ధారించారు. బొక్కసంపాలెం గ్రామానికి చెందిన యువకుడు సీహెచ్ శ్రీనివాసులు(రాయుడు) గత 15 ఏళ్లుగా వినూత కోటా దగ్గర నమ్మిన బంటుగా ఉన్నాడు. డ్రైవర్‌గా, ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగానూ పని చేశాడు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ.. జూన్ 21వ తేదీన ఆమె ఓ బహిరంగ ప్రకటన చేశారు. అతను చేసిన ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఇటు పేపర్లో.. అటు సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేశారు. ఇక మీదట శ్రీనివాసులుకి, తమకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. ప్రత్యర్ధుల దగ్గర డబ్బు తీసుకుని తమ సమాచారం వాళ్లకు చేరవేస్తున్నారనే అనుమానంతో రాయుడిని ఆమె విధుల నుంచి తొలగించారని, ఆపై హత్య చేయించారని తాజాగా విచారణలో వెల్లడైంది. ఈ నెల 8వ తేదీన రాయుడిని శ్రీకాళహస్తిలోని ఓ గోడౌన్లో చిత్రహింసలకు గురి చేసి హత్య చేసి.. ఆపై కూవం నదిలో పడేసినట్లు తెలుస్తోంది. వినూత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు మిగతా నిందితులను కాళహస్తి తీసుకొచ్చి పోలీసులు అన్నీ కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. హత్య కేసు తెర మీదకు రావడంతో వినూత కోటాను పార్టీ నుంచి తొలగించినట్లు జనసేన ప్రకటించింది.చదవండి: పవన్ @ పెద్దమ్మ భాషా పితామహ..

ప్రభుత్వమే కామందుగా మారితే ఎలా?
‘రైతన్నలారా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని పేరుతో మళ్లీ భూ సేకరణకు దిగుతోంది. మీకు నష్టం ఖాయం. అందువల్ల ఎవరూ ప్రభుత్వానికి భూములివ్వొద్దు’ పెదపరిమి గ్రామంలో ఒక వ్యక్తి సైకిల్‌పై తిరుగుతూ మైక్ పెట్టుకుని మరీ చేస్తున్న ప్రకటన. రెడ్‌బుక్ పాలన కాబట్టి ఇలాంటి వారిపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగి ఉండాల్సింది. కానీ.. అలాంటిదేమీ జరగలేదు. పైగా అందరూ ఆసక్తిగా వింటున్నారు. తొలివిడత భూసేకరణలో భాగమైన రైతులకు ఇచ్చిన హామీలేవీ నెరవేరకపోవడం వారి మెదళ్లల్లో కదులుతోందేమో!.రాజధాని అమరావతి పేరుతో ఇప్పటికే 33 వేల ఎకరాల భూమి సేకరించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఇంకో 36 వేల ఎకరాలు కావాలంటూ రంగంలోకి దిగింది. ఇది కాస్తా చాలా గ్రామాల్లో తీవ్ర అలజడికి కారణమైంది. తొలి విడతలో సేకరించిన భూమిలో 20 వేల ఎకరాల్లో ఎలాంటి కార్యకలాపాలూ చేపట్టకపోవడం మళ్లీ భూమి కావాలని అనడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వం కూడా రైతుల ఆందోళనలు, అనుమానాలను తీర్చే ప్రయత్నమేదీ చేయడం లేదు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు వంటి వారు కూడా భూములిస్తే రైతులకు నష్టమేనని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నలభై వేల ఎకరాలు తీసుకున్నా ప్రభుత్వానికి మిగిలేది పదివేల ఎకరాలేనని, ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ల వంటి వాటికి సరిపోగా కొంత భూమిని మాత్రమే అమ్ముకోగలమని చెబుతోంది. విజయవాడ సమీపంలో ఇప్పటికే ఒక విమానాశ్రయం ఉండగా కొత్తగా ఇంకోదాని అవసరమేంటి? కొత్తగా సేకరించే భూముల్లో 2500 ఎకరాలు అదానీ సంస్థకు కట్టబెట్టేందుకూ ప్రయత్నాలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.నాడా దొరికిందని గుర్రాన్ని కొంటారా?ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. భూములివ్వమని రైతులు సైకిళ్లపై ప్రచారం చేస్తూంటే ప్రభుత్వం మాత్రం అబ్బే అలాంటిదేమీ లేదు.. అందరూ ఒప్పుకున్నట్టుగా ప్రచారం చేస్తోంది. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. కామాంధులకు భూదాహం ఎక్కువంటారు. కానీ, ప్రభుత్వమే భూదాహంతో వ్యవహరిస్తే, కామాంధులాగా మారితే ఏం చేయాలి!. ప్రజావసరాల కోసం ప్రభుత్వం భూమి తీసుకోవడం తప్పుకాదు. కానీ, ఆ అవసరాలు ఎంత అన్నదానిపై స్పష్టత ఉండాలి. అలా కాకుండా ప్రభుత్వాధినేతల ఇష్టాలకు తగ్గట్టుగా భూములు సమీకరించి భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు అయిపోతుందని, కోట్ల రూపాయల లాభం వస్తుందని మభ్యపెడితేనే ప్రమాదం. నిజానికి ప్రభుత్వం తనకు అవసరమైన భూములను మంచి ధరకు రైతుల నుంచి ఖరీదు చేసి భవనాలు నిర్మించుకున్నా లక్షల కోట్ల వ్యయం కాదు.హైదరాబాద్ ఆయా రాజధానులకు ప్రభుత్వాలు ఎంత భూమి సేకరించారన్నది పరిశీలిస్తే ఏపీ ప్రభుత్వం భూదాహం ఎంతన్నది స్పష్టమవుతుంది. వేల ఎకరాల భూమి సేకరించి ఏకమొత్తంగా లక్షల కోట్లు వ్యయం చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల ప్రభుత్వానికి కలిసొచ్చేదేమీ ఉండదు. రాజధానిగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందే క్రమంలో ప్రైవేటు సంస్థలే ఈ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటాయి. హైదరాబాద్ వంటి మహా నగరాల్లో ఎనెన్నో గేటెడ్ కమ్యూనిటీలు సొంతంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం లేదు? అలా కాకుండా అన్నీ తామే చేస్తామంటే ఎలా? ఎప్పటికి కావాలి?.ప్రపంచ బ్యాంక్ షరతు..అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు ఎప్పుడిస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు. వేల కోట్ల వ్యయమయ్యే మౌలిక సదుపాయాల వృద్ధి ఎప్పటికయ్యేనో తెలియదు. గిరాకీ వస్తే మంచిదేకానీ.. ప్రభుత్వమిచ్చే ప్లాట్లతో రైతులకు పెద్దగా ప్రయోజనం కలగకపోతే? అప్పుడు వారు ఎంత నష్టపోతారో తలచుకుంటేనే బాధ కలుగుతుంది!. ఈ నేపధ్యంలోనే ఒక సాధారణ రైతు.. మైక్ పట్టుకుని భూములు ఇవ్వవద్దని ప్రచారం చేస్తున్నారు. రెడ్‌బుక్ అరాచకం ఈ రైతుపైనా జరుగుతుందేమో తెలియదు. ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.15వేల కోట్ల రుణానికి సంబంధించి పెట్టిన షరతులలో భూముల అమ్మకం కూడా ఒకటి ఉందట. దాని ప్రకారం భూములు ఎప్పటి నుంచి అమ్ముతారని ఆ బ్యాంకు అడుగుతోందని కథనాలు వచ్చాయి. సుమారు వెయ్యి ఎకరాల భూమి ఎకరాకు రూ.25 నుంచి రూ.30 కోట్ల లెక్కన అమ్ముకోవచ్చునని అధికారులు ప్రపంచబ్యాంకుకు తెలిపారట. ఇదసలు సాధ్యమయ్యేదేనా?. ఈ ధరకు కొనగలిగే సంస్థలెన్ని? ఇదే వాస్తవమైతే ఈపాటికి వందల ఎకరాలు అమ్మి ఉండాలి కదా!. ప్రజలను మభ్య పెట్టినట్లు ప్రపంచ బ్యాంకును కూడా మాయ చేయాలని అనుకుంటున్నారా?.మరో విషయం ఏమిటంటే ప్రభుత్వం ఇచ్చే కౌలు రూ.30వేలు మాత్రమే ఉండడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. కొత్తగా భూములు సమీకరించే చోట గ్రామస్తులు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పినట్టుగా ‘అన్నదాత సుఖీభవ’ కింద రైతులకు రూ.20 వేలు చెల్లిస్తే, ప్రధానమంత్రి కిసన్ యోజన కింద ఇంకో రూ.ఆరు వేలు వస్తాయని వీరంటున్నారు. అంటే.. భూములు తమ వద్దే ఉన్నా రూ.26 వేలు వస్తూండగా.. ప్రభుత్వానికి ఇస్తే వచ్చేది రూ.30 వేలు మాత్రమేనని వివరిస్తున్నారు. కేవలం రూ.4 వేల అదనపు ప్రయోజనం కోసం భూమిపై తమ హక్కులను ఎందుకు కోల్పోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులు, కొనుగోలుదారులు.. బాగా నష్టపోయారు. అందువల్లే ఆయా గ్రామసభలలో రైతులు టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌ను, అధికారులను నిలదీస్తున్నారట. కొన్ని చోట్ల వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. అయినా రైతుల ఆమోదం దొరికినట్లు అధికారులు రాసేసుకుంటున్నారట. భూములు లాక్కుని తమకు బిచ్చగాళ్లగా చేయవద్దని కొందరు మొర పెట్టుకుంటున్నారు.గతంలో సంప్రదాయేతర ఇంధన వనరుల కోసం అదానీకి భూములు కేటాయిస్తే.. ఏపీని రాసిచ్చేస్తున్నారని నోరు పారేసుకున్న టీడీపీ మీడియా ఇప్పుడు అదానీ స్పోర్ట్స్ సిటీ గురించి మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. పైగా ఆయా సంస్థలకు ఎంత మొత్తానికి భూములు కేటాయిస్తున్నది కూడా గోప్యంగా ఉంచుతున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలు ఎకరాకు రూ.20 కోట్లకుపైగా వెచ్చించడానికి సిద్దపడకపోతే ఏం చేస్తారో తెలియదు. అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు నాలుగింటికి రెండున్నర ఎకరాల చొప్పున ఇస్తారట.అంతర్జాతీయ స్థాయిలో నిజంగా ఆ సెంటర్లు ఏర్పాటైతే ఈ స్థలం సరిపోతుందా? ప్రస్తుతం భూదాహంతో తహతహలాడిపోతున్న ప్రభుత్వ పెద్దలు లేచింది లేడికి ప్రయాణం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రాజధాని ప్రాంతమంటే తమ సొంత జాగీరన్నట్లుగా భావిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వేల కోట్ల అప్పులు సమీకరించిన ప్రభుత్వ నేతలకు ఇప్పుడు సలహాలు ఇచ్చినా వినే పరిస్థితిలో లేరన్న అభిప్రాయం ఉంది. అమరావతి ప్రజలకు, ముఖ్యంగా రైతులకు న్యాయం జరగాలని కోరుకోవడం తప్ప ఏమి చేయగలం! కొసమెరుపు ఏమిటంటే ఈ అదనపు భూమి సమీకరణపై మంత్రివర్గంలో తర్జనభర్జనపడి నిర్ణయం వాయిదా వేయడం!.-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

భవిష్యత్తులో కొదవలేని బిజినెస్ ఇదే..
భారతదేశం కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచుతోంది. ఈవీలో ప్రధానపాత్ర పోషించేది బ్యాటరీలే. వీటిలో లిథియం బ్యాటరీలను ఎక్కువగా వాడుతున్నారు. భవిష్యత్తులో వీటి సామర్థ్యం తగ్గాక తిరిగి రీసైక్లింగ్ చేసే వ్యవస్థను రూపొందించాలి. ప్రస్తుత రీసైక్లింగ్ మౌలిక సదుపాయాలు భవిష్యత్ డిమాండ్లను తీర్చలేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా స్థిరమైన వ్యవస్థను ఏర్పరచాలని సూచిస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వం మరిన్ని స్టార్టప్‌లను ప్రోత్సహించాలని చెబుతున్నారు.కార్లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు సగటున 7-8 సంవత్సరాలు పనిచేస్తాయి. కస్టమర్ల వినియోగాన్ని బట్టి ఒక దశాబ్దం వరకు మన్నిక రావొచ్చు. అన్ని రకాల లిథియం అయాన్ బ్యాటరీల్లో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్, నికెల్ మాంగనీస్ కోబాల్ట్ ఆక్సైడ్ (ఎన్ఎంసీ), లిథియం నికెల్ కోబాల్ట్ అల్యూమినియం ఆక్సైడ్(ఎన్సీఏ)లను విరివిగా వాడుతారు. భారత్‌లో ఈవీలు వేగంగా విస్తరిస్తున్నాయి. దాంతో ఈ దాతువుల వినియోగం సైతం పెరుగుతోంది.ప్రధాన సమస్యలివే..ఈ బ్యాటరీల తయారీలో రెండు ప్రధాన సమస్యలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకటి.. బ్యాటరీల్లో వాడే రసాయన దాతువులను సంగ్రహించడం. రెండు.. ఈ బ్యాటరీలను వాడిన తర్వాత ఆయా దాతువులను భూమిలో వేస్తే కలిగే ప్రమాదాలను నివారించడం. ఈ సమస్యలకు ‘రిసైక్లింగ్’ పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రీసైక్లింగ్ పద్ధతుల్లో హైడ్రోమెటలర్జీ, పైరోమెటలర్జీ, డైరెక్ట్ రీసైక్లింగ్, ఇంటిగ్రేటెడ్ కార్బోథర్మల్ రిడక్షన్ వంటి మెకానికల్ ప్రక్రియలు అనుసరిస్తున్నారు. ఈ పద్ధతుల్లో బ్యాటరీలను కంప్రెస్ చేయడం, ముక్కలు చేయడం, ప్రత్యేక ద్రావకాలు లేదా వేడితో కరిగించి విలువైన పదార్థాలను వెలికితీస్తారు. ఈ ప్రక్రియనంతటిని ‘బ్లాక్ మాస్’ అని పిలుస్తారు. భారత్‌లో పైరోమెటలర్జీ(అధిక ఉష్ణోగ్రతల వద్ద బ్యాటరీలను కరిగించడం)తో పోలిస్తే తక్కువ ఉద్గారాలతో కూడిన హైడ్రోమెటలర్జికల్(ప్రత్యేక ద్రావణాలతో కరిగించడం) ప్రక్రియను ఎక్కువగా వాడుతున్నారు. ఇందులో దాదాపు 95 శాతం యానోడ్, కేథోడ్లను సంగ్రహిస్తున్నారు. దేశీయంగా 80% హైడ్రోమెటలర్జీ ప్రక్రియనే వాడుతున్నారు.స్టార్టప్‌లు అందిపుచ్చుకోవాల్సిందే..అభివృద్ధి చెందుతున్న ఈవీ రంగంలో రి మరిన్ని స్టార్టప్‌లకు అవకాశం ఉంది. ఈవీ తయారీ వైపే కాకుండా బ్యాటరీ రీసైక్లింగ్ విభాగంలోనూ కంపెనీలు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో రాబోయే ఈ ట్రెండ్‌ను స్టార్టప్‌లు అందిపుచ్చుకోవాలని చెబుతున్నారు. ఈవీ రంగంలో పెట్టుబడి పెట్టే వెంచర్ కాపిటలిస్ట్‌లు ఈ విభాగాన్ని కూడా గమనించాలని సూచిస్తున్నారు.
కేఎల్ రాహుల్ వల్లే నష్టం జరిగింది: ఇర్ఫాన్ పఠాన్ ఫైర్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏం చేసింది.. ఆర్బీఐ చర్యలెందుకు?
‘డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల్లో నిండా ముంచేస్తోంది’
హీరోను తిట్టా, కొట్టా.. సారీ మాత్రం చెప్పను: దర్శకురాలు
బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?
సిద్ధిపేటలో దారుణం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను చంపి..
పట్టి పీడించే ‘డార్క్ ప్యాటర్న్స్’
సెల్పీ దిగుదాం రా బావా..!
లైఫ్‌స్టైల్ ఇన్‌ప్లేషన్ : దీన్ని ఎదుర్కోవడం ఎలా?
మోహన్ లాల్ దే మెగా విజయం, మళయాళ చిత్రసీమ 2025 తేల్చిందిదే..
డబ్బులొద్దు.. నా కోరిక తీర్చు ప్లీజ్!
కన్నప్ప సినిమా.. చీటింగ్ చేసిన అక్షయ్ కుమార్?!
టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలాభం
49వేల కోట్ల కుంభకోణం.. వెలుగులోకి దేశంలో అతిపెద్ద స్కాం
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఫిష్ వెంకట్‌కు సాయం చేసిన మరో హీరో..
‘ది 100’ మూవీ రివ్యూ
పెట్రోబాదుడులో ఇండియా టాప్
లార్డ్స్ టెస్టులో టీమిండియాకు భారీ షాక్
రెండు బైపాస్ రోడ్ల నిర్మాణం చకచకా
సార్! ఇప్పుడిక్కడున్నది మన ప్రభుత్వమే! కేజ్రీవాల్‌ది కాదు!!
టీడీపీకి బిగ్ షాక్.. కీలక నేతల రాజీనామా
రూ.వెయ్యి కోట్లతో శంకర్ కొత్త సినిమా!
..మనం ఇక ముందుకు పోలేం సార్! మీరు ప్రారంభించాల్సిన రోడ్డు ఇదే!
కన్నప్ప సినిమాలో మసాలా.. అది లేకుంటే రెండోసారి చూసేవాళ్లం!
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
ఎంత గొప్ప జీవితం.. క్షణంలో తలకిందులు!
టీమిండియా కొంపముంచిన కేఎల్ రాహుల్..
కేఎల్ రాహుల్ వల్లే నష్టం జరిగింది: ఇర్ఫాన్ పఠాన్ ఫైర్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏం చేసింది.. ఆర్బీఐ చర్యలెందుకు?
‘డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల్లో నిండా ముంచేస్తోంది’
హీరోను తిట్టా, కొట్టా.. సారీ మాత్రం చెప్పను: దర్శకురాలు
బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?
సిద్ధిపేటలో దారుణం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను చంపి..
పట్టి పీడించే ‘డార్క్ ప్యాటర్న్స్’
సెల్పీ దిగుదాం రా బావా..!
లైఫ్‌స్టైల్ ఇన్‌ప్లేషన్ : దీన్ని ఎదుర్కోవడం ఎలా?
మోహన్ లాల్ దే మెగా విజయం, మళయాళ చిత్రసీమ 2025 తేల్చిందిదే..
డబ్బులొద్దు.. నా కోరిక తీర్చు ప్లీజ్!
కన్నప్ప సినిమా.. చీటింగ్ చేసిన అక్షయ్ కుమార్?!
టీమిండియా చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి.. సంఘంలో ఎనలేని గౌరవం
ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలాభం
49వేల కోట్ల కుంభకోణం.. వెలుగులోకి దేశంలో అతిపెద్ద స్కాం
చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
ఫిష్ వెంకట్‌కు సాయం చేసిన మరో హీరో..
‘ది 100’ మూవీ రివ్యూ
పెట్రోబాదుడులో ఇండియా టాప్
లార్డ్స్ టెస్టులో టీమిండియాకు భారీ షాక్
రెండు బైపాస్ రోడ్ల నిర్మాణం చకచకా
సార్! ఇప్పుడిక్కడున్నది మన ప్రభుత్వమే! కేజ్రీవాల్‌ది కాదు!!
టీడీపీకి బిగ్ షాక్.. కీలక నేతల రాజీనామా
రూ.వెయ్యి కోట్లతో శంకర్ కొత్త సినిమా!
..మనం ఇక ముందుకు పోలేం సార్! మీరు ప్రారంభించాల్సిన రోడ్డు ఇదే!
కన్నప్ప సినిమాలో మసాలా.. అది లేకుంటే రెండోసారి చూసేవాళ్లం!
ఎంత గొప్ప జీవితం.. క్షణంలో తలకిందులు!
చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
టీమిండియా కొంపముంచిన కేఎల్ రాహుల్..
సినిమా

మూడు రోజుల్లో బిగ్‌బాస్ బ్యూటీ బర్త్‌డే.. లక్ష రూపాయలతో..
ప్రేమ పుట్టడానికి క్షణం చాలు అంటుంటారు. కానీ, బిగ్‌బాస్ బ్యూటీ శుభశ్రీ రాయగురు విషయంలో ప్రేమలో పడేందుకు ఒక పాట చాలు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. గతేడాది మేజస్టీ ఇన్ లవ్ అనే ప్రైవేట్ సాంగ్‌లో నటించింది. నటుడు, నిర్మాత అజయ్ మైసూర్‌తో కలిసి యాక్ట్ చేసింది. సాంగ్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అప్పుడే శుభశ్రీ మనసులోనూ పెళ్లంటే ఇతడినే చేసుకోవాలని నిర్ణయించుకుంది.ప్రేమ జంటపై ట్రోలింగ్అజయ్ అయితే ఆమె చేయి ఇస్తే చాలు జీవితాంతం వదలకుండా పట్టుకుంటానని మనసులోనే కోటి కలలు కనేశాడు. అతడు ధైర్యం చేసి ప్రపోజ్ చేయగా సుబ్బు ఓకే చెప్పడం.. వీరి ఎంగేజ్మెంట్ జరగడం కూడా అయిపోయింది. అయితే డబ్బు కోసమే శుభశ్రీ.. అజయ్‌ను పెళ్లి చేసుకుంటుందని, అతడి లుక్ బాలేకపోయినా జీవితాంతం కలిసుండేందుకు ఒప్పుకుందంటూ విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దీనిపై సుబ్బు ఘాటుగానే స్పందించింది. మనిషి లుక్స్ కన్నా మంచి మనసే తనకు ముఖ్యమని, ఎవరేమనుకున్నా తనకు అనవసరం అని పేర్కొంది.శుభశ్రీ బర్త్‌డేకు..తాజాగా ఈ ప్రేమజంట ఓ మంచి పనికి పూనుకున్నారు. శుభశ్రీ బర్త్‌డే రోజు (జూలై 15)న లక్ష రూపాయలను పది భాగాలుగా చేసి దానం చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. మీ కష్టాన్ని మాతో చెప్పుకోండి, మీకు సాయం చేస్తామంటూ వీడియో రిలీజ్ చేశారు. మంగళవారం నాడు పదిమందిని సెలక్ట్ చేసి వారికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని పేర్కొన్నారు. ఇది చూసిన అభిమానులు.. కాబోయే జంట మంచి మనసును మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) చదవండి: ఓటీటీలోకి ప్రియాంక చోప్రా యాక్షన్ కామెడీ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’

పిరియడ్స్లోనూ ‘హాఫ్ ఐరన్‌మ్యాన్’.. రికార్డు సృష్టించిన నటి
కొంతమంది తారలు నటనతో ఆకట్టకుంటూనే అప్పుడప్పుడు తమలోని అసాధరణమైన నైపుణ్యాన్ని బయటిప్రపంచానికి చూపించి.. ఆశ్చర్యపరుస్తుంటారు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా..ఇతర రంగాలలోనూ తన టాలెంట్‌ని నిరూపించుకొని ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నటి సయామీ ఖేర్(Saiyami Kher ) ఒకరు. తనదైన నటనతో అటు బాలీవుడ్, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ.. క్రీడల్లోనూ రాణిస్తోంది. ఇటీవల ‘ఐరన్‌మ్యాన్ 70.3’ అనే ట్రయాథ్లాన్‌ను పూర్తిచేసి..ఒకే ఏడాదిలో రెండు సార్లు ఈ రేసుని పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా రికార్డు సృష్టించింది. అయితే ఈ సారి ఆమె పిరియడ్స్‌లో ఉన్నప్పుడు ఈ ఘనత సాధించడం గమనార్హం.ఏమిటీ ‘ఐరన్ మ్యాన్70.3’ ‘ఐరన్‌మ్యాన్ 70.3’ అనేది ఒక ప్రముఖ ట్రయాథ్లాన్ రేసు, ఇది ఐరన్‌మ్యాన్ సిరీస్‌లో భాగం. దీనిని "హాఫ్ ఐరన్‌మ్యాన్" అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది పూర్తి ఐరన్‌మ్యాన్ రేస్ దూరంలో సగం ఉంటుంది. ఈ రేస్ మూడు ఈవెంట్లను కలిగి ఉంటుంది. తొలుత 1.9 కిలోమీటర్లు (1.2 మైళ్లు) ఈత కొట్టాలి. తర్వాత 90 కిలో మీటర్లు(56 మైళ్లు) సైక్లింగ్ చేయాలి. ఆ తర్వాత 21.1(13.1 మైళ్లు) కిలోమీటర్లు పరుగెత్తాలి. మొత్తం దూరం 113 కిలోమీటర్లు(70.3 మైళ్లు). అందుకే దీన్నీ ఐరన్ మ్యాన్ 70.3 అని పిలుస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో నిర్వహించబడుతుంది. జులై 6న స్వీడన్‌లోని జోంకోపింగ్లో నిర్వహించిన ఈ రేస్‌లో సయామీ ఖేర్ పాల్గొని పతాకాన్ని సాధించిది. గతేడాది సెప్టెంబర్‌లో తొలిసారిగా మెడల్ అందుకున్న సయామీ.. ఇప్పుడు స్వీడన్లో నిర్వహించిన రేస్‌లో సత్తా చాటి మరో పతకం అందుకుంది.నెలసరి సమస్యను అధిగమించి.. నాకు పీసీఓఎస్(పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) ఉంది. దీని వల్ల రుతుక్రమం సరిగ్గా కాదు. రేసులో పాల్గొనే వారంలోనే నాకు పిరియడ్స్ మొదలయ్యాయి. అదృష్టవశాత్తు నా పీరియడ్స్ చివరి రోజు రేసులో పాల్గొన్న కాబట్టి నొప్పి అంతగా లేదు. కానీ సాధారణ రోజుల కంటే ఆ సమయంలోనే నాకు కాస్త అసౌకర్యంగానే అనిపించింది. మానసికంగా కొంత కలవరపెట్టింది. చాలా మంది మహిళలు పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా ఉద్యోగానికి, ఇతర పనులకు హాజరవుతుంటారు. అసౌకర్యంలోనూ మనం ఎలా ముందుకు సాగాలో వారి నుంచి నేర్చుకోవచ్చు. నేను కూడా నెలసరి సమస్యను అధిగమించి గత పోటీ కంటే ఈ సారి 32 నిమిషాల ముందే రేసుని పూర్తి చేశాను’ అని సయామీ ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.సయామీ సీనీ నేపథ్యంనాసిక్కి చెందిన సయామీ.. ‘రేయ్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి.. అక్కడ వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. చాలా కాలం తర్వాత ‘వైల్డ్ డాగ్’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘జాబ్’లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం హిందీ, మరాఠీ చిత్రాలతో బీజీగా అయింది.

'తన్వి ది గ్రేట్' సినిమా వీక్షించిన రాష్ట్రపతి
తన్వి ది గ్రేట్ (Tanvi The Great) అనే చిత్రాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu) వీక్షించారు. చిత్ర యూనిట్‌తో కలిసి రాష్ట్రపతి భవన్లో ఈ సినిమాను ఆమె చూశారు. అనంతరం వారిని అభినందించారు. భారత సాయుధ దళాల ధైర్యం, త్యాగాలకు నివాళిగా ‘తన్వి ది గ్రేట్’ చిత్రాన్ని అనుపమ్ ఖేర్ (Anupam Kher) తెరకెక్కించారు. శుభాంగి దత్ టైటిల్ పాత్రలో నటించింది. ట్రైలర్లోనే ఆమె నటనతో అందరినీ మెప్పించింది. జులై 18న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం ఇప్పటికే ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. ఒక ఆర్మీ కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఆటిజం అనే అడ్డంకిని అధిగమించి ఆర్మీలో చేరాలనే కలను ఎలా నెరవేర్చిందన్నదే ఈ కథ ప్రధాన కథాంశం. 2002లో వచ్చిన 'ఓం జై జగదీష్' సినిమా తర్వాత మళ్లీ ‘తన్వి ది గ్రేట్’ చిత్రానికి అనుపమ్ ఖేర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, అరవింద స్వామి, బొమన్ ఇరానీ, పల్లవి జోషి, నాజర్ వంటి స్టార్ నటులు ఉన్నారు. ఈ చిత్రాన్ని ఎన్ఎఫ్డీసీతో కలిసి అనుపమ్ స్టూడియోస్ నిర్మించింది.

అమెరికా, ఇండియా ఏదైనా సరే ఈ సమస్య 'వింటారా సరదాగా' (టీజర్)
అశోక్ గల్లా హీరోగా నటించిన మూడో సినిమా 'వింటారా సరదాగా' (Vintara Saradaga) నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. ఇప్పటికే ఆయన దేవకీనందన వాసుదేవ, హీరో వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు కడుపుబ్బా నవ్వించేందుకు మళ్లీ వస్తున్నాడు. అశోక్ గల్లా హీరోగా, రాహుల్ విజయ్, శివాత్మిక, శ్రీ గౌరీప్రియ ఇతర ప్రధాన పాత్రధారులుగా నటించిన 'వింటారా సరదాగా' చిత్రం రొమాంటిక్ కామెడీ డ్రామా తెరకెక్కనుంది. అమెరికా నేపథ్యంలో ఈ చిత్రాన్ని యువ దర్శకుడు ఉద్భవ్ తెరకెక్కించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హాస్యంతో పాటు హృదయాన్ని హత్తుకునే డ్రామాగా ఈ చిత్రం అలరించనుంది.విదేశాల్లోని విద్యార్థుల జీవితాలను ప్రతిబింబించేలా వినోదాత్మకంగా, సరికొత్తగా సినిమా టీజర్ ఉంది. ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్. సితార సంస్థ నుంచి వస్తున్న మరో విభిన్న చిత్రం 'VISA - వింటారా సరదాగా' అని చెప్పవచ్చు. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్ర టీజర్ అద్భుతంగా ఉంది. ఎన్నో కలలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన తెలుగు విద్యార్థుల ప్రయాణాలను చూపిస్తూ టీజర్ ఎంతో అందంగా సాగింది. స్నేహం, ప్రేమ, గందరగోళం, ఊహించని సవాళ్లు వంటి అంశాలతో టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా నడిచింది. భావోద్వేగాలతో నిండిన ఓ మధుర ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నామనే హామీని టీజర్ ఇచ్చింది.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

చరిత్ర సృష్టించిన గిల్.. కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
టీమిండియా నయా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్ గడ్డ మీద ఓ సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా కెప్టెన్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు.కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar- Anderson Trophy)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. టెస్టు సారథిగా అరంగేట్రంలోనే సెంచరీఇక ఈ సిరీస్ ద్వారానే టీమిండియా టెస్టు కెప్టెన్‌గా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తన ప్రయాణం మొదలుపెట్టాడు. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి భారీ శతకం (147) సాధించాడు.తద్వారా టెస్టు జట్టు సారథిగా తొలి ప్రయత్నంలోనే సెంచరీ చేసి అనేక రికార్డులను గిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో గిల్ కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. అయితే, ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో మాత్రం గిల్ తన విశ్వరూపం చూపించాడు.డబుల్ సెంచరీ, శతకంతో చెలరేగితొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా భారీ డబుల్ సెంచరీ (269)తో దుమ్ములేపిన ప్రిన్స్.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకం (161) సాధించాడు. తద్వారా ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడు, కెప్టెన్‌గా గిల్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు.ఇక తాజాగా లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో గిల్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 44 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ సాబ్.. రెండు ఫోర్ల సాయంతో కేవలం 16 పరుగులే రాబట్టాడు. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరాడు.ఆసియా తొలి కెప్టెన్‌గా..అయితే, మూడో టెస్టులో గిల్ విఫలమైనప్పటికీ.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికి ఐదు ఇన్నింగ్స్ మాత్రమే ఆడిన గిల్ ఏకంగా 601 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ గడ్డ మీద ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా తొలి కెప్టెన్‌గా గిల్ ప్రపంచ రికార్డు సాధించాడు. అంతకుముందు కోహ్లి పేరిట ఈ రికార్డు ఉండేది.ఇంగ్లండ్ గడ్డ మీద ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆసియా కెప్టెన్లు వీరే🏏శుబ్‌మన్ గిల్ (ఇండియా)- 601* రన్స్- 2025లో..🏏విరాట్ కోహ్లి (ఇండియా)- 593 రన్స్- 2018లో..🏏మహ్మద్ అజారుద్దీన్ (ఇండియా)- 426 రన్స్- 1990లో..🏏జావేద్ మియాందాద్ (పాకిస్తాన్)- 364 రన్స్- 1992లో..🏏సౌరవ్ గంగూలీ (ఇండియా)- 351 రన్స్- 2002లో...👉ఇక ఓవరాల్‌గా ఇంగ్లండ్ గడ్డ మీద ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్ల జాబితాలో... గిల్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజం అలెన్ బోర్డర్ (597)ను గిల్ అధిగమించాడు. ఇక ఈ లిస్టులో గ్యారీ సోబర్స్ (722), గ్రేమ్ స్మిత్ (714) గిల్ కంటే ముందు వరుసలో ఉన్నారు. చదవండి: చెత్త బంతులే చేతికి రావొచ్చు.. అయినా నేనేమీ మాట్లాడను.. ఎందుకంటే: బుమ్రా

ICC T20 WC 2026: ఇరవైలో అర్హత సాధించిన 15 జట్లు ఇవే
ఇటలీ క్రికెట్ జట్టు (Italy Cricket Team) చరిత్ర సృష్టించింది. తొలిసారి ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. యూరప్ జోన్ నుంచి నెదర్లాండ్స్‌తో పాటు ఇటలీ మెగా ఈవెంట్లో తమ బెర్తును ఖరారు చేసుకుంది. యూరప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఇటలీ నెదర్లాండ్స్‌తో తలపడింది.భారత్- శ్రీలంక వేదికగా..అయితే, ఈ మ్యాచ్‌లో ఇటలీ ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయినప్పటికీ.. పట్టికలో రెండో స్థానంలో నిలవడం ద్వారా నెదర్లాండ్స్‌తో పాటు టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) టోర్నీలో పోటీపడే అవకాశం దక్కించుకుంది. కాగా భారత్- శ్రీలంక (India- Sri Lanka) వచ్చే ఏడాది సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే.ఆ ఏడు జట్లు కూడా..ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్ల హోదాలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా, శ్రీలంక నేరుగా ప్రపంచకప్-2026కు అర్హత సాధించాయి. ఇక వీటితో పాటు టీ20 ప్రపంచకప్-2024లో టాప్-7లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, యూఎస్ఏ, వెస్టిండీస్ కూడా క్వాలిఫై అయ్యాయి.మరోవైపు.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ కూడా ఈ టోర్నీలో పోటీపడేందుకు బెర్తును ఖరారు చేసుకున్నాయి. ఇక అమెరికా క్వాలిఫయర్స్ నుంచి కెనడా.. తాజాగా యూరప్ క్వాలిఫయర్ నుంచి నెదర్లాండ్, ఇటలీ కూడా వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్ ఆడే అవకాశం దక్కించుకున్నాయి.20 జట్లలో 15 ఖరారుకాగా ఈ మెగా టోర్నీలో మొత్తంగా 20 జట్లు పాల్గొననుండగా.. ఇప్పటికి పదిహేను జట్లు ఈ మేర అర్హత సాధించగా.. ఇంకో ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో రెండు స్థానాల కోసం సౌతాఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా నమీబియా, ఉగాండా, టాంజానియా, కెన్యా, జింబాబ్వే, బోత్స్వానా, నైజీరియా పోటీపడుతున్నాయి.ఇక మిగిలిన మరో మూడు స్థానాల కోసం ఆసియా- ఈఏపీ క్వాలిఫయర్స్ (అక్టోబరు 1-17) నుంచి నేపాల్, ఒమన్, పపువా న్యూగినియా, సమోవా, కువైట్, మలేషియా, జపాన్, కతార్, యూఏఈ అమీతుమీ తేల్చుకోనున్నాయి.ఇదిలా ఉంటే.. 2024లో అమెరికా- వెస్టిండీస్ వేదికగా సాగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. లీగ్ దశలో అజేయంగా నిలిచిన రోహిత్ సేన.. ఫైనల్లో సౌతాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా రెండోసారి పొట్టి ప్రపంచకప్ భారత్ సొంతమైంది. కాగా 2007లో తొలిసారి టీ20 వరల్డ్‌కప్ పోటీ ప్రవేశపెట్టగా ధోని సారథ్యంలో నాడు భారత్ ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే.టీ20 ప్రపంచకప్-2026లో ఇప్పటికి అర్హత సాధించిన జట్లు ఇవే..టీమిండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, యూఎస్ఏ, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, కెనడా, నెదర్లాండ్స్, ఇటలీ.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్

చెత్త బంతులే చేతికి రావొచ్చు.. అయినా నేనేమీ మాట్లాడను: బుమ్రా
ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. స్టోక్స్ బృందానికి తన పేస్ పదును రుచిచూపించి.. ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఈ ఘనత సాధించి ఆనర్స్ బోర్డు (Lord's Hounours Board)పై తన పేరును లిఖించుకున్నాడు.స్పందించిన బుమ్రాఈ నేపథ్యంలో మూడో టెస్టులో శుక్రవారం నాటి రెండో రోజు ఆట అనంతరం బుమ్రా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా డ్యూక్స్ బాల్ (Dukes Ball) నాణ్యత, బంతి మార్పుపై చెలరేగుతున్న వివాదంపై ఈ పేస్ గుర్రం తనదైన శైలిలో స్పందించాడు. ‘‘మ్యాచ్‌లో బంతిని మార్చడం సహజమే.ఆ విషయంలో నేనేమీ చేయలేను. అంతేకాదు.. ఈ వివాదంపై స్పందించి నా డబ్బును పోగొట్టుకునేందుకు నేను సిద్ధంగా లేను. ఎందుకంటే.. నేను మ్యాచ్‌లో చాలా ఓవర్లపాటు బౌలింగ్ చేసేందుకు ఎంతగానో శ్రమిస్తూ ఉంటాను.చెత్త బంతులే చేతికి రావొచ్చు.. అయినా నేనేమీ మాట్లాడనుకాబట్టి వివాదాస్పద వ్యాఖ్యలతో నా మ్యాచ్ ఫీజును తగ్గించుకోవాలని అనుకోవడం లేదు. ఏదేమైనా.. మాకు ఇచ్చిన బంతితోనే మేము బౌలింగ్ చేస్తాము. బంతి మార్పు అంశంలో ఆటగాళ్లుగా మేము చేయగలిగింది ఏమీ లేదు. అందుకోసం మేము పోరాడలేము కూడా!ఒక్కోసారి మనకు అనుకూలంగా ఫలితం రావచ్చు. మరోసారి చెత్త బంతినే మన చేతికి ఇవ్వవచ్చు’’ అని బుమ్రా విలేకరుల ప్రశ్నకు బదులిచ్చాడు. 2018లో తాను ఇంగ్లండ్‌లో ఆడినపుడు డ్యూక్స్ బాల్‌ను ఎక్కువగా మార్చాల్సిన అవసరం రాలేదని స్పష్టం చేశాడు. బంతి అప్పట్లో బాగా స్వింగ్ అయ్యేదని.. తాను అప్పుడు అవుట్స్వింగర్లనే ఎక్కువగా సంధించేవాడినని బుమ్రా గుర్తు చేసుకున్నాడు.1-1తో సమంగా సిరీస్‌కాగా ఆండర్సన్-టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో లీడ్స్‌లో తొలి టెస్టులో ఓడిన భారత జట్టు.. ఎడ్జ్‌బాస్టన్‌లో గెలిచి ప్రస్తుతం 1-1తో సిరీస్ సమం చేసింది. బుమ్రాకు ఐదు వికెట్లు.. ఇంగ్లండ్ 387 ఆలౌట్ఇక లార్డ్స్‌లో గురువారం మూడో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. తమ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు దక్కించుకోగా.. నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు కూల్చారు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్ దక్కింది.టీమిండియా @145ఇదిలా ఉంటే... తొలి టెస్టు నుంచి డ్యూక్స్ బాల్ నాణ్యత విషయంలో టీమిండియా అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. ఎర్ర బంతి త్వరగా రూపు మారడంతో పదే పదే బాల్‌ను మార్చాల్సి వస్తుండగా.. ఇప్పటికే కెప్టెన్ శుబ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ అంపైర్లతో వాదనకు దిగారు. ఈ క్రమంలో తమకు అనుకూల ఫలితం రాకపోవడంతో బంతిని నేలకేసి కొట్టిన పంత్‌ను ఐసీసీ మందలించింది. అతడి ఖాతాలో ఓ డీ మెరిట్ పాయింట్ జమచేసింది.ఇక లార్డ్స్ టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా గిల్, సిరాజ్ బంతి మార్పు అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, బంతిని మార్చినప్పటికీ పాత బంతితో దానికి ఏమాత్రం పోలిక లేదంటూ ఇద్దరూ అసహనానికి గురయ్యారు. ఇదే విషయమై బుమ్రాను ప్రశ్నించగా పైవిధంగా స్పందించాడు. ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 43 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. డ్యూక్స్ బాల్ అంటే..మొదట్లో డ్యూక్స్ కుటుంబం ఎర్ర బంతులను తయారు చేసేది. చేతితో ఆరు వరుసల దారంతో వీటిని కుడతారు. సీమ్‌కు అనుకూలంగా ఉండే ఈ బంతి దీర్ఘకాల మన్నికకు పెట్టిందిపేరు. ఇంగ్లిష్ కండిషన్లకు సరిగ్గా సరిపోతుంది. అయితే, తాజా సిరీస్‌లో త్వరత్వరగా బంతి రూపు మారడం వివాదానికి, బంతి నాణ్యతపై చర్చకు దారి తీసింది. ప్రస్తుతం డ్యూక్స్ బాల్ తయారీ కంపెనీ దిలీప్ జగ్‌జోడియా చేతిలో ఉంది.చదవండి: IND vs ENG 3rd Test: అంపైర్‌పై గిల్, సిరాజ్ అసహనం!.. గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు!DAY 1 ➡ 1 Wicket𝐃𝐚𝐲 𝟐 ➡ 𝐍𝐚𝐦𝐞 𝐨𝐧 𝐋𝐨𝐫𝐝'𝐬 𝐇𝐨𝐧𝐨𝐮𝐫𝐬 𝐁𝐨𝐚𝐫𝐝 🎖@Jaspritbumrah93, yet again, stole the show with a fiery 5/74 on Day 2 & etched his name into Lord’s rich legacy 💪#ENGvIND 👉 3rd TEST, DAY 3 | SAT, 12th JULY, 2:30 PM | Streaming on… pic.twitter.com/X3jqiobSko— Star Sports (@StarSportsIndia) July 11, 2025

పొలార్డ్ విధ్వంసం.. దంచికొట్టిన పూరన్.. ఫైనల్లో ఎంఐ న్యూయార్క్
మేజర్ లీగ్ క్రికెట్-2025 (MLC) టోర్నమెంట్లో ఎంఐ న్యూయార్క్ జట్టు ఫైనల్ చేరింది. టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను ఓడించి రెండోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఈ టీ20 టోర్నీ చాలెంజర్ మ్యాచ్‌లో భాగంగా శనివారం ఎంఐ న్యూయార్క్- టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి.డల్లాస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎంఐ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సూపర్ కింగ్స్ ఆదిలోనే ఓపెనర్ స్మిత్ పాటిల్ (9) వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన సాయితేజ ముక్కామల్ల (1).. ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన శుభమ్ రంజానే (1), మార్కస్ స్టొయినిస్ (6) పెవిలియన్‌కు వరుస కట్టారు.రాణించిన డుప్లెసిస్..బ్యాట్ ఝులిపించిన అకీల్ఇలాంటి తరుణంలో మరో ఓపెనింగ్ బ్యాటర్, కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ (Faf Du Plesis) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 42 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 59 పరుగులతో రాణించాడు. అతడికి తోడుగా స్పిన్నర్ అకీల్ హుసేన్ బ్యాట్ ఝులిపించాడు.కేవలం 32 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 55 పరుగులతో అకీల్ నాటౌట్‌గా నిలవగా.. డొనొవాన్ ఫెరీరా (20 బంతుల్లో 32 నాటౌట్) దంచికొట్టాడు. ఈ ముగ్గురి ఇన్నింగ్స్ కారణంగా సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగలిగింది.ఎంఐ న్యూయార్క్ బౌలర్లలో ట్రిస్టస్ లస్ మూడు వికెట్లు కూల్చగా.. రుషిల్ ఉగార్కర్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. ఇక నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ న్యూయార్క్ ఆరంభంలోనే క్వింటన్ డి కాక్ (6) రూపంలో కీలక వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో వచ్చిన వన్‌డౌన్ బ్యాటర్ మైకేల్ బ్రేస్‌వెల్ (8) కూడా పూర్తిగా విఫలమయ్యాడు.పూరన్ ధనాధన్‌ఈ క్రమంలో మరో ఓపెనర్ మోనాంక్ పటేల్ (49) ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. నికోలస్ పూరన్ (Nicholas Pooran) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 36 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 52 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లతో పాటు మూడు సిక్సర్లు ఉన్నాయి. Pooran goes down the ground. Pooran goes out of the ground. 🙌#OneFamily #MINewYork #MLC #TSKvMINY pic.twitter.com/MWrsE5HOyC— MI New York (@MINYCricket) July 12, 2025పొలార్డ్ విధ్వంసంమరోవైపు.. సీనియర్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ మరోసారి తన బ్యాట్‌కు పనిచెప్పాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సూపర్ కింగ్స్ బౌలింగ్‌ను చితక్కొట్టాడు. సునామీ ఇన్నింగ్స్ (22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు- 47 పరుగులు)తో విరుచుకుపడి.. పూరన్‌తో కలిసి ఎంఐ న్యూయార్క్‌ను విజయతీరాలకు చేర్చాడు. పూరన్, పొలార్డ్ ధనాధన్ దంచికొట్టడంతో 19 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి ఎంఐ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా మేజర్ లీగ్ క్రికెట్లో రెండోసారి ఫైనల్ల్లో అడుగుపెట్టింది.DeathTaxesPollard smashing it 🆚 the Super Kings 💥#OneFamily #MINewYork #MLC #TSKvMINY pic.twitter.com/qdvYfEWnnm— MI New York (@MINYCricket) July 12, 2025 కాగా టెక్సాస్ సూపర్ కింగ్స్- వాషింగ్టన్ ఫ్రీడమ్ మధ్య జరగాల్సిన క్వాలిఫయర్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో టెక్సాస్ జట్టు (14)తో పోలిస్తే పాయింట్ల పరంగా మెరుగ్గా ఉన్న వాషింగ్టన్ (16) నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో చాలెంజర్ రూపంలో సూపర్ కింగ్స్‌కు మరో అవకాశం లభించగా.. ఎంఐ జట్టు చేతిలో భంగపాటే ఎదురైంది.మరోవైపు.. శాన్ ఫ్రాన్సిస్కోతో ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన ఎంఐ న్యూయార్క్ జట్టు.. తాజాగా సూపర్ కింగ్స్‌పై కూడా గెలిచి ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. డల్లాస్‌లో ఆదివారం (జూలై 13) టైటిల్ పోరులో వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. కపిల్ దేవ్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
బిజినెస్

షిప్‌రాకెట్ నుంచి ‘శూన్య.ఏఐ’
చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ), డీ2సీ వ్యాపార సంస్థల కోసం ఈ–కామర్స్ సేవల సంస్థ షిప్‌రాకెట్ కొత్తగా ‘శూన్య.ఏఐ’ పేరిట ఏఐ ఇంజిన్‌ను ఆవిష్కరించింది. అల్ట్రాసేఫ్ సంస్థ భాగస్వామ్యంతో దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. తొమ్మిదికి పైగా భారతీయ భాషల్లో వాయిస్, టెక్ట్స్, ఇమేజ్ ఇంటెలిజెన్స్‌ను ఇది అందిస్తుందని పేర్కొంది. దీన్ని పూర్తిగా భారత్‌లోనే తీర్చిదిద్దినట్లు వివరించింది.ఇదీ చదవండి: ఐపీవోకు ఇన్ఫ్రా పరికరాలు అద్దెకిచ్చే కంపెనీతొలి ఏడాదిలో ఇది 1 లక్ష పైచిలుకు ఎంఎస్ఎంఈలను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు షిప్‌రాకెట్ పేర్కొంది. కేటలాగింగ్, మార్కెటింగ్, ఫుల్ఫిల్మెంట్ తదితర విభాగాలవ్యాప్తంగా సమయాన్ని, డబ్బును ఆదా చేసుకునేందుకు శూన్య.ఏఐ ఉపయోగపడుతుందని కంపెనీ ఎండీ సాహిల్ గోయల్ చెప్పారు. షిప్‌రాకెట్, కేపీఎంజీ విడుదల చేసిన నివేదిక ప్రకారం 11,000 పైచిలుకు బ్రాండ్లు ఉన్న దేశీ డీ2సీ మార్కెట్ ఈ ఏడాది (2025) 100 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. అలాగే 22 కోట్ల ఆన్లైన్ షాపర్లున్న ఈ–రిటైల్ మార్కెట్ 125 బిలియన్ డాలర్లకు చేరనుంది.

ఐపీవోకు ఇన్ఫ్రా పరికరాలు అద్దెకిచ్చే కంపెనీ
ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరికరాలను అద్దెకిచ్చే అగ్కాన్ ఎక్విప్మెంట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 332 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్లు 94 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు.ఇదీ చదవండి: వాణిజ్య బీమాపై జ్యూరిక్ కోటక్ ఫోకస్ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 168 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 84 కోట్లు పరికరాల కొనుగోళ్లకు, మరికొన్ని నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. 2003లో ఏర్పాటైన హర్యానా కంపెనీ ప్రధానంగా మౌలిక రంగ కంపెనీలకు పరిశ్రమ సంబంధిత పరికరాలను అద్దె ప్రాతిపదికన సమకూర్చుతుంది. గతేడాది(2024–25) ఆదాయం 20 శాతం ఎగసి రూ. 164 కోట్లను తాకగా.. నికర లాభం 36 శాతం జంప్‌చేసి రూ. 31 కోట్లకు చేరింది.

వాణిజ్య బీమాపై జ్యూరిక్ కోటక్ ఫోకస్
వాణిజ్య బీమా విభాగంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు ప్రైవేట్ రంగ జ్యూరిక్ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ అలోక్ అగర్వాల్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే దీన్ని సరికొత్తగా ఆవిష్కరించినట్లు చెప్పారు. ప్రస్తుతం తమ సంస్థకు సంబంధించి మొత్తం బీమా వ్యాపారంలో సుమారు 3 శాతంగా ఉన్న ఈ విభాగం వాటాను వచ్చే 2–3 సంవత్సరాల్లో 15–20 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. చిన్న, మధ్య తరహా సంస్థల నుంచి బడా కార్పొరేట్లు, స్పెషలైజ్డ్ పరిశ్రమల వరకు వివిధ రంగాలకు అనువైన పథకాలను అందిస్తున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: టెస్లా కారు వచ్చేస్తోంది.. 15న ముంబైలో మొదటి స్టోర్ ప్రారంభం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌లో ఇప్పటికే ఓ కార్యాలయం ఉండగా త్వరలో వైజాగ్‌లో కూడా ఒకటి ప్రారంభిస్తున్నట్లు అగర్వాల్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీమాను విస్తరించేలా స్వల్ప ప్రీమియం, ఒక మోస్తరు సమ్ ఇన్సూర్డ్ ప్లాన్లను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. వాహన బీమా పాలసీల విక్రయాలు రెండు దశాబ్దాల పాటు సుమారు 13–17 శాతం వరకు వృద్ధి చెందినప్పటికీ, వాహన విక్రయాలు కొంత నెమ్మదించడం వంటి అంశాల కారణంగా గతేడాది ఆరు శాతానికి పరిమితం అయ్యాయని చెప్పారు. ఇవి క్రమంగా మళ్లీ పుంజుకోగలవని చెప్పారు.

హైదరాబాద్‌లో తగ్గిన లగ్జరీ ఇళ్ల విక్రయాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఢీలాపడ్డాయి. మొత్తం రూ.1,025 యూనిట్ల విక్రయాలు (రూ.5 కోట్లు అంతకు మించిన ధర) నమోదయ్యాయి. క్రితం ఏడాది తొలి ఆరు నెలల్లో అమ్మకాలు 1,140 యూనిట్లుగా ఉండడం గమనార్హం. ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో మాత్రం విలాసవంతమైన గృహ విక్రయాలు (రూ.6 కోట్లు, అంతకుమించి) మూడింతలు పెరిగి 3,960 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఢిల్లీ ఎన్సీఆర్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 1,280 యూనిట్లుగా ఉండడం గమనార్హం. సీబీఆర్ఈ, అసోచామ్ సంయుక్త నివేదిక ఈ వివరాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా టాప్–7 నగరాల్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు జనవరి–జూన్ మధ్య కాలంలో అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 85 శాతం పెరిగి 6,950 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది తొలి ఆరు నెలల్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 3,750 యూనిట్లుగా ఉన్నాయి. → బెంగళూరులో లగ్జరీ ఇళ్ల విక్రయాలు 200 యూనిట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 80 యూనిట్లుగానే ఉన్నాయి. → చెన్నైలోనూ మూడు రెట్లు పెరిగి 220 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 65 యూనిట్లుగా ఉన్నాయి. → పుణెలో అమ్మకాలు 120 యూనిట్లకు తగ్గాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో లగ్జరీ ఇళ్ల విక్రయాలు 160 యూనిట్లుగా ఉన్నాయి. → కోల్‌కతాలో అమ్మకాలు రెట్టింపై 190 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 70 యూనిట్లుగానే ఉండడం గమనార్హం. → ముంబైలో 1,240 యూనిట్ల లగ్జరీ ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 950 యూనిట్లుగా ఉన్నాయి. → పుణె, చెన్నై, కోల్‌కతా నగరాల్లో రూ.4కోట్లు అంతకుమించిన విలువైన ఇళ్లను లగ్జరీ ఇళ్ల కింద పరిగణనలోకి తీసుకున్నారు. బెంగళూరులో రూ.5 కోట్లు అంతకుమించిన ధరల శ్రేణిని లగ్జరీ ఇళ్ల కింద ఈ నివేదిక పరిగణించింది. స్థిరమైన డిమాండ్.. ‘‘దేశ ఇళ్ల మార్కెట్ వ్యూహాత్మక స్థిరమైన దశలోకి ప్రవేశించింది. స్థూల ఆర్థిక అంశాలు బలంగా ఉన్నాయి. లగ్జరీ, ప్రీమియం ఇళ్ల మా ర్కెట్లో స్థిరమైన వృద్ధి అన్నది వినియోగదారుల విశ్వాసం పెరుగుదలను జీవనశైలి ఆకాంక్షలను సూచిస్తోంది’’అని సీబీఆర్ఈ ఇండియా ఎండీ (భూమి) గౌరవ్ కుమార్ తెలపారు. డెవలపర్లు నాణ్యత, పారదర్శకత, ఈ రంగం తదుపరి దశకు ఇవి కీలకంగా పనిచేస్తాయన్నారు. హౌసింగ్ బూమ్‌కు అనుగుణంగా సులభతర అనుమతులు, పట్టణాల్లో అందుబాటు ధరల ఇళ్లను ప్రోత్సహించేలా విధానపరమైన సంస్కరణలు అవసరమని అసోచామ్ సెక్రటరీ జనరల్ మనీష్ సింఘాల్ ఈ నివేదిక విడుదల సందర్భంగా సూచించారు.
ఫ్యామిలీ

అప్పుడు బంజరు భూమి... ఇప్పుడు ప్లేగ్రౌండ్
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలోని మారుమూల గ్రామం... చింద్నార్. ఈ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వెనక ఉన్న బంజరు భూమి ఇప్పుడు వాలీబాల్ కోర్టు, రన్నింగ్ ట్రాక్, క్లైంబింగ్ వాల్, లాంగ్ జంప్ పిట్... మొదలైన వాటితో అందమైన ప్లేగ్రౌండ్‌గా మారింది. ఈ గ్రామంలోనే కాదు దంతెవాడ జిల్లాలో ఎన్నో మారుమూల గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలల వెనకాల ఉన్న బంజరు భూములు అందమైన ప్లేగ్రౌండ్స్‌గా మారి ఆహా! అనిపిస్తున్నాయి.ఈ మార్పుకు కారణం... సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్, మన్ దేశీ ఫౌండేషన్. ప్లేగ్రౌండ్స్కే పరిమితం కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు స్పోర్ట్స్ కోచ్‌లుగా శిక్షణ ఇస్తున్నారు. ప్లేగ్రౌండ్ నిర్మాణ ప్రక్రియ అనేది కమ్యూనిటీ ఈవెంట్‌గా మారింది. గ్రామప్రజలు ప్లేగ్రౌండ్ నిర్మాణ పనుల్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.మన దేశంలో 65–70 శాతం స్కూల్స్‌లో సరిౖయెన ప్లేగ్రౌండ్లు లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని రాష్ట్రాలలోనూ తన ప్రాజెక్ట్‌ను అమలు చేయాలని సంకల్పించాయి సచిన్, మన్ దేశీ ఫౌండేషన్లు. (చదవండి: డెలివరీ ప్రాసెస్ ఇలా ఉంటుందా..? బిజేపీ నాయకుడి కుమార్తె...)

మేని సంరక్షణ కోసం..బెల్లంతో ఇలా..!
వంటింట్లో ఉపయోగించే వాటితో ముఖానికి సంబంధించిన సమస్యలను సులభంగా మటు మాయం చేసే టెక్నిక్‌లు, చిట్కాలు చూశాం. కానీ ఆరోగ్యానికి మంచిదని చెప్పే బెల్లం చర్మ సంరక్షణకు తోడ్పడుతుందని విన్నారా..?. ఔను బెల్లంతో తయారు చేసిన ఫేస్‌వాష్ యాంటీ ఏజింగ్‌గా పనిచేసి ముడతలను కనిపించనియ్యదు.చిన్న బెల్లం ముక్క తీసుకుని ఒక గిన్నెలో వేసి, టీస్పూను నీళ్లు పోసి ఉంచాలి. బెల్లం కరిగిన తరువాత టీస్పూను శనగపిండి, టీస్పూను పెరుగు వేసి బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఏడు నిమిషాలపాటు వలయాకారంలో మర్దన చేయాలి. ఇరవై నిమిషాలటు ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేయాలి. ముఖాన్ని పొడిగా తుడుచుకుని మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ రాసుకోవాలి.ఈ ఫేస్‌వాష్‌ను వాడడం వల్ల ముఖం కాంతిమంతంగా కనిపిస్తుంది. వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా వాడడం వల్ల ముఖం మీద ముడతలు తగ్గుముఖం పడతాయి. (చదవండి: అద్దమంటి ఆకృతి..! ర్యాంప్ పై రిఫ్లెక్షన్..)

అద్దమంటి ఆకృతి..!
ముఖాన్ని మాత్రమే కాదు మన ఆత్మవిశ్వాసాన్నీ చూపుతుంది అద్దం.అద్దం లాంటి ఆకృతి కాదు, ఆకృతే అద్దంగా మారుతోంది.అద్దాన్ని ఫ్యాబ్రిక్‌కి జత చేసి, ధరించడం ఎవర్‌గ్రీన్‌గా పేరొందిన స్టైల్. వాటిలో .. అసిమెట్రిక్ మిర్రర్ స్టైల్ నేడు ఫ్యాషన్ ప్రపంచాన్ని అమితంగా ఆకట్టుకుంటోంది. అద్దం కేవలం స్టైల్ కాదు ఒక స్టేట్మెంట్. ర్యాంప్ పై రిఫ్లెక్షన్ప్రముఖ డిజైనర్లు గౌరవ్ గుప్తా, వ్యాన్ హెర్పెన్ వంటి వారు మిర్రర్ వర్క్ డిజైన్స్‌తో తమ హవా కొనసాగించారు. గాలా, కాన్స్ రెడ్ కార్పెట్లలోనూ సెలబ్రిటీలు మిర్రర్ షైనింగ్ గౌన్స్‌లో మెరుస్తున్నారు. స్ట్రీట్ స్టైల్ఈ ట్రెండ్ ఫ్యాషనబుల్‌గా కనిపించడానికే కాదు, జీన్స్ టాప్స్ లో అసిమెట్రిక్ హేమ్ లైన్, మిర్రర్ బెల్ట్స్, శాలువాలు, బ్యాగ్స్, ఇయర్ రింగ్స్, ఫుట్‌వేర్ .. ఇలా అన్ని యాక్సెసరీస్ లో ఈ బిగ్ మిర్రర్ టచ్ కనిపిస్తోంది.అద్దం, డిజైన్‌తో డ్రెస్ స్పెషల్‌గా ఉంటుంది కాబట్టి ఇతర హంగులేవీ అక్కర్లేదు. మదిని మరింత మెరుపుగా సింగారించడానికి అద్దం వర్క్ కొత్తగా రూపుకడుతుంది. పర్ఫెక్ట్ షేప్‌తో డ్రెస్ అందంగా కనిపిస్తుంది అనేది ఒక కోణం మాత్రమే. నిజమైన ఫ్యాషన్ అనేది మిర్రర్ డిజైన్స్‌లోనూ ఉంటుంది. అసిమెట్రికల్ బ్యూటీని అర్థం చేసుకునే వారికి ఇది ఓ వేడుక కూడా. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సంగీత్ వర్మ్ మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్‌లో మేటిగా నిలిచారు. రెడ్ కార్పెట్, వివాహ వేడుకలలో ప్రత్యేకంగా నిలిచే ఈ మిర్రర్ డ్రెస్సులు మరింత అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. (చదవండి: Prajakta Koli : అత్యంత ప్రభావవంతమైన డిజిటల్ వాయిస్‌గా ఆమె..! వన్ అండ్ ఓన్లీ..)

ఆరుబయట ఆట కంటిపాపలకు మేలు
ధరణికి ఎనిమిదేళ్లు. ఈమధ్య బోర్డు మీద రాసింది స్పష్టంగా కనిపించడం లేదని తరచు చెబుతోంది. అమ్మాయి పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది. కళ్లు కూడా మెరుస్తున్నట్టుగా మిలమిలలాడుతూ ఉంటాయి. మొదట్లో తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోలేదు కానీ పదే పదే చెబుతుండటంతో కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. పరీక్షలన్నీ చేసిన డాక్టర్ గారు... ధరణి మయోపియా (షార్ట్‌సైటెడ్‌నెస్)తో బాధపడుతోందనీ, ఈ సమస్య ఉన్నవారిలో కేవలం చాలా దగ్గరివే కనిపిస్తాయనీ, దూరం ఉన్నవి స్పష్టంగా కనిపించవనీ, దాంతో స్కూల్లో బ్లాక్‌బోర్డుపై ఉన్న రాతలు స్పష్టంగా కనిపించడం లేదంటూ చెప్పారు. అంతే... ఆశ్చర్యపోవడం తల్లిదండ్రుల వంతయ్యింది.ఇది కేవలం ఒక్క కేస్ స్టడీ మాత్రమే. ధరణి లాంటి అమ్మాయిలూ, అబ్బాయిలూ దేశవ్యాప్తంగా ఎందరో! స్కూలుకెళ్లే ఆరు నుంచి 12 ఏళ్ల చిన్నారులు ఈ కంప్లైంట్‌తో రావడం... వాళ్లలో ఈ సమస్య బయటపడటం చాలా సాధారణం. ఈ సమస్యకు కారణం మొదటిది వంశపారంపర్యంగా మయోపియా ఉన్న కుటుంబాల్లో ఈ సమస్య రావడం చాలా సాధారణమైతే.... రెండో కారణం పిల్లలు ఎప్పుడూ ఆరుబయట ఆడకుండా ఇన్–డోర్స్‌లోనే ఎక్కువగా గడపడం. ఆరుబయట ఆడుకునే పిల్లల్లో తక్కువే... నిజానికి ధరణినే కాదు... ఆ వయసు చిన్నారులు ఇప్పుడు ఆరుబయట ఆటలాడటం చాలా తక్కువ. గతంలో ఆ వయసు పిల్లలు ఆరుబయట విస్తృతంగా ఆడుతుండేవాళ్లు. ‘‘ఆడింది చాలు. ఇక లోపలికి రండి. కాళ్లూ చేతులు కడుక్కుని ఏదైనా కాస్తంత తిని చదువుకోండి’’ అంటూ అమ్మలో లేదా ఇంట్లోని పెద్దవాళ్లో కోప్పడుతుండటం మామూలే. దాదాపు నాలుగైదు దశాబ్దాల కంటే ముందు పిల్లలు ఇలా మట్టిలో ఆడుకుంటూ ఉండేవారు. కారణమేమిటో ... ఎందుకో కూడా తెలియదు గానీ ఇలా ఆరుబయట బాగా ఆటలాడుకునే పిల్లల్లో దూరపు వస్తువులు స్పష్టంగా కనిపించని ‘షార్ట్‌సైటెడ్‌నెస్’ అని పిలిచే మయోపియా చాలా తక్కువ. బయట ఆటలాడకుండా ఇలా ఎక్కువసేపు ఇన్–డోర్స్‌లోనే ఉండే పిల్లలకూ ఇలా మయోపియా ఎందుకు ఎక్కువగా కనిపిస్తుందో పెద్దగా తెలియదు.సరిదిద్దడమిలా... మయోపియా (షార్ట్‌సైటెడ్‌నెస్) అనేది రిఫ్రాక్టివ్ సమస్య. అంటే కాంతి కిరణాలు రెటీనాపై కాకుండా కనుగుడ్డులో కాస్తంత లోపలే కేంద్రీకృతం కావడంతో ఈ సమస్య వస్తుంది. కంటి అద్దాలతో చాలా సులువుగా ఈ సమస్యను చక్కదిద్దవచ్చు. కంటి అద్దాలను అంతగా ఇష్టపడనివాళ్లు కాంటాక్ట్ లెన్స్ కూడా ధరించవచ్చు... గానీ వాటిని సంరక్షించుకోవడం మళ్లీ ప్లెయిన్ కళ్లజోడు వాడటం మంచిది. ఇక ఒక వయసు వచ్చాక కళ్లజోడు ధరించడం అంతగా ఇష్టపడకపోతే... పద్ధెనిమిదేళ్లు దాటాక ‘లేసిక్’ అనే శస్త్రచికిత్స (రిఫ్రాక్టివ్ సర్జరీ) ద్వారా కూడా ఈ సమస్యను చక్కదిద్దవచ్చు.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... పిల్లలు స్కూల్లో బోర్డుగానీ లేదా తమ స్కూలు బస్సు తాలూకు బోర్డుగానీ లేదంటే దూరపు వస్తువులుగానీ స్పష్టంగా కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేస్తే తల్లిదండ్రులు తప్పక వెంటనే స్పందించాలి. మరీ ఆలస్యం చేసిన పిల్లల్లో తీవ్రమైన తలనొప్పి వస్తుండటంతో పాటు అరుదుగానైనా మరికొన్ని సమస్యలూ వచ్చే అవకాశాలుంటాయి. పిల్లలు స్క్రీన్ చూసే సమయం తగ్గించండి...ఇవాళ టీవీ లేని ఇల్లంటూ లేదు. అంతేకాదు... కంప్యూటరూ, ల్యాప్‌టాప్ వంటివి లేని ఇళ్లు కూడా ఉండవంటే అతిశయోక్తి కాదు. ఇక మొబైల్ అయితే పిల్లలకూ లేకుండా ఉండటం లేదు. టీవీ, కంప్యూటరూ, మొబైల్... ఇలా అది ఏ స్క్రీన్ అయినప్పటికీ దాన్నుంచి వెలువడే కాంతితో చిన్నారుల కళ్లను కాపాడుకోవడం ఎలాగో చూద్దాం. → పిల్లలు టీవీ లేదా కంప్యూటర్ స్క్రీన్‌ను చూసే వ్యవధిని తల్లిదండ్రులు విధిగా తగ్గించాలి. అంటే రోజూ కొద్దిసేపు మాత్రమే వాళ్లను టీవీ, కంప్యూటర్, మొబైల్‌లను చూడనివ్వాలి. → మొబైల్ లేదా కంప్యూటర్ కాంతి అదేపనిగా కంటిని తగులుతూ ఉండకూడదు. కాసేపు స్క్రీన్ చూశాక కనీసం కొద్ది నిమిషాల పాటు కంటికి రెస్ట్ ఇవ్వాలి. → గదిలో చీకటిగా ఉన్నప్పుడు టీవీ వెలుతురులో లేదా కంప్యూటర్ వెలుతురులో పిల్లలు చదవడానికి ప్రయత్నించకూడదు. → టీవీ లేదా కంప్యూటర్ను మసక చీకట్లో చూడటం సరికాదు. అవి ఆన్‌లో ఉన్నప్పుడు గదిలో లైట్ వెలుగుతూ ఉండాలి. చుట్టూ చీకటిగా ఉన్నప్పుడు కంప్యూటర్/మొబైల్ స్క్రీన్ నుంచి లేదా టీవీ నుంచి వెలువడే కాంతి కంటికి హాని చేసే అవకాశం ఎక్కువ. – యాసీన్
ఫొటోలు
అంతర్జాతీయం

యూరప్‌లో వడగాడ్పుల మరణ మృదంగం
లండన్: యూరప్ దేశాల్లో ఎండల తీవ్రతకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రధానమైన 12 యూరప్ నగరాల్లో కేవలం పది రోజుల వ్యవధిలోనే ఏకంగా 2,300 మరణాలు నమోదయ్యాయి. ఇందులో మూడింట రెండొంతుల మరణాలకు వాతావరణ మార్పులే కారణమని ఓ అధ్యయనం తేల్చింది. తాము వేసిన మరణాల అంచనాలు స్వతంత్ర సంస్థల నుంచి సేకరించినవని, ప్రభుత్వాల పరంగా గణాంకాలు అందేందుకు సమయం పట్టొచ్చని పరిశోధకులు తెలిపారు. జూన్ 23 నుంచి జూలై 2వ తేదీల మధ్యలో పశ్చిమ యూరప్‌తో అత్యంత తీవ్ర స్థాయిలో ఎండలు కాశాయి. స్పెయిన్‌లో ఏకంగా 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. వడగాడ్పులు తోడవ్వడంతో ఫ్రాన్స్‌లో కార్చిచ్చు చెలరేగింది. యూరప్‌లోని ప్రధాన నగరాలైన బార్సిలోనా, మాడ్రిడ్, లండన్, మిలాన్ తదితర ప్రధానమైన 12 నగరాల జనాభా 3 కోట్లకు పైమాటే. ఈ నగరాల్లో సాధారణానికి మించి నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధ్యయనం గుర్తించింది. పది రోజుల సమయంలో ఎండలకు సంబంధించిన ఘటనలకు సంబంధించిన 2,300 మరణాల్లో కనీసం 1,500 మరణాలు అత్యంత తీవ్రమైన వడగాడ్పులు వంటి వాతావరణ మార్పుకు సంబంధించినవేనని తెలిపింది. యూకే, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్విట్జర్లాండ్‌లకు చెందిన ఐదు సంస్థలు, 12మందికి పైగా పరిశోధకులు అధ్యయనంలో భాగస్వాములయ్యారు. ‘వాతావరణ మార్పుల వల్లనే సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితి మన్ముందు మరింత ప్రమాదకరంగా మారనుంది’అని లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ పరిశోధకులు బెన్ క్లార్క్ చెప్పారు. అప్పుడిక మనిషి శరీరం ఆ ఉష్ణోగ్రతలను తట్టుకునే పరిస్థితి ఏమాత్రం ఉండదన్నారు. ఈ ప్రభావం వృద్ధులు, చిన్నారులు, బయట పనిచేసే సిబ్బందిపై ఎక్కువగా ఉంటుందన్నారు. మానవ ప్రేరేపిత వాతావరణ మార్పు ప్రభావమే లేకుంటే ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందన్నారు. రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగినా వేలాదిగా జనం ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని మరో పరిశోధకుడు గ్యారీఫల్లోస్ అన్నారు. వడగాడ్పులు సైలెంట్ కిల్లర్స్‌గా ఆయన అభివరి్ణంచారు. మన ఇళ్లు, ఆస్పత్రుల్లో సంభవించే ఎండలకు సంబంధించిన మరణాలను పెద్దగా ఎవరూ పట్టించుకోరని ఆయన పేర్కొన్నారు.

చైనాలో ప్రాణాంతక మైనింగ్
అత్యంత అరుదైన ఖనిజాలు(రేర్ ఎర్త్ మినరల్స్)... రెండు అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదానికి దారితీస్తున్న అంశమిది. తమకు తక్కువ ధరకే ఈ ఖనిజాలు సరఫరా చేయాలని చేయాలని అమెరికా డిమాండ్ చేస్తుండగా, డ్రాగన్ దేశం అందుకు ఒప్పుకోవడం లేదు. ఎంతో అరుదైన, విలువైన ఈ ఖనిజాలు చైనా గడ్డపై ఉండడం, అవి తమకు సులువుగా దక్కకపోవడం సహజంగానే అమెరికాకు రుచించడం లేదు. అందుకే చైనాపై ఒత్తిడి పెంచుతూనే ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా అమెరికాను చైనా బహిరంగంగా ధిక్కరిస్తోంది అంటే అందుకు కారణం ఈ ఖనిజాలే అనే చెప్పొచ్చు. ఆధునిక యుగంలో స్మార్ట్ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు, కంప్యూటర్లు, టీవీ స్క్రీన్లు, ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు సోలార్ ప్యానెళ్లు, ఎంఆర్ఐ మిషన్లు, జెట్ ఇంజన్లు, విదుŠయ్త్ పరికరాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ వాడకం తప్పనిసరిగా మారింది. ఇదే ఇప్పుడు చైనా పంట పండిస్తోంది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ఈ ఖనిజాల్లో సగానికిపైగా చైనా నుంచే వస్తున్నాయి. అరుదైన ఖనిజాల మైనింగ్, శుద్ధి, ఎగుమతుల విషయంలో చైనా మొదటి స్థానంలో నిలుస్తోంది. ఇదంతా నాణేనికి ఒకవైపే. మరోవైపు ఏముందో చూస్తే... నీరు, భూమి కలుషితం చైనాలో ఉత్తరాన ఉన్న ఇన్నర్ మంగోలియా ప్రాంతంలోని బయాన్ ఓబో, దక్షిణాన జియాంగ్జీ ప్రావిన్స్‌లోని గాంగ్ఝౌలో రేర్ ఎర్త్ ఖనిజాల గనులున్నాయి. ఆయా ప్రాంతాల్లో దశాబ్దాలుగా తవ్వకాలు సాగుతున్నాయి. భారీ యంత్రాలు, వాహనాల రొదతో అవి నిత్యం దద్దరిల్లుతుంటాయి. పొరలు పొరలుగా భూమిని పెకిలించి వేస్తున్నారు. బడా కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలతోపాటు ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపిస్తున్న గనులు స్థానికులకు మాత్రం నరకానికి నకలుగా మారిపోయాయి. పచ్చని మైదానాలు మసిబారిపోయాయి. గడ్డి భూములు ప్రమాదకరమైన దుమ్ము ధూళితో నిండిపోయాయి. లోతైన గనుల నుంచి దట్టమైన దుమ్ము మేఘాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. భూమాతకు గాయాలవుతూనే ఉన్నాయి. గాలి, నీరు, భూమి దారుణంగా కలుషితం అవుతున్నాయి. చట్టవిరుద్ధంగా తవ్వకాలు గనుల నుంచి వెలువడే రేడియోయాక్టివ్ బురదను నిల్వ చేయడానికే సమీపంలో కృత్రిమంగా సరస్సులు నిర్మించారు. కాలుష్యం కారణంగా స్థానికులు రోగాల బారినపడుతున్నారు. పెద్దలకు క్యాన్సర్లతోపాటు శిశువులకు పుట్టుకతో లోపాలు పరిపాటిగా మారాయి. ఇదంతా బాహ్య ప్రపంచానికి తెలియకుండా చైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అపరిచితులను గనుల వైపు అనుమతించడం లేదు. మైనింగ్ ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తున్నామని అధికారులు చెబుతున్నా అందులో వాస్తవం లేదని నిపుణులు అంటున్నారు. గనుల తవ్వకంతో వెలువడే మట్టి, బురదలో ప్రాణాంతకమైన భార లోహాలు, రేడియోయాక్టివ్ అవశేషాలు ఉంటున్నాయి. టన్నుల కొద్దీ అమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం క్లోరైడ్తోపాటు ఇతర రసాయనాలు భూ ఉపరితలంపై పేరుకుపోతున్నాయి. చైనాలో వేలాది మైనింగ్ సైట్లు ఉన్నాయి. వీటిలో చట్టవిరుద్ధమైనవే ఎక్కువ. ఒక చోట తవ్వకానికి అనుమతులు తీసుకొని మరికొన్ని చోట్ల అక్రమంగా మైనింగ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. గనుల నియంత్రణకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. మైనింగ్ లైసెన్స్‌ల సంఖ్య తగ్గించింది. అయినప్పటికీ అక్రమ గనులు సంఖ్య పెరిగిపోతోంది తప్ప తగ్గడం లేదు. కేవలం ఒక టన్ను ఖనిజాలు కావాలంటే ఏకంగా 2,000 టన్నుల మట్టిని తవ్వాల్సి ఉంటుంది. గ్రామాలకు గ్రామాలే ఖాళీ గనుల వల్ల జరగాల్సిన నష్టం చాలావరకు ఇప్పటికే జరిగిపోయింది. మైనింగ్ ప్రాంతాల్లో అడవులు అంతరించిపోయాయి. భూముల్లో గోతులే మిగిలాయి. నదులు, పంట పొలాలు పనికిరాకుండా పోయాయి. భూగర్భ జలాలు సైతం విషతుల్యంగా మారుతున్నాయి. ఒక విధానం అంటూ లేకుండా తవ్వకాలు సాగిస్తుండడంతో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. మైనింగ్ కంపెనీలు రైతుల పొలాలను కూడా వదలిపెట్టడం లేదు. వారు ఎంత మొర పెట్టుకున్నా ఫలితం శూన్యం. బడా కంపెనీలపై చట్టపరంగా కోర్టుల్లో పోరాడే శక్తి లేక మిన్నకుండిపోతున్నారు. కొన్నిచోట్ల గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయి. మరోవైపు గనుల తవ్వకం ఆపాల్సిందేనని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నాయి.– సాక్షి, నేషనల్ డెస్క్

2 వారాలు 230 ప్రదక్షిణలు
వాషింగ్టన్: నూటా నలభై కోట్ల మంది కలలను మోస్తూ నింగిలోకి దూసుకెళ్లి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరి పలు రకాల పరిశోధనలతో బిజీగా మారిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అక్కడ 14 రోజులను పూర్తిచేసుకున్నారు. ఐఎస్ఎస్లో ఉంటూ ఇప్పటికే పుడమిని 230 సార్లు చుట్టేశారు. ఈయనతోపాటు ఐఎస్ఎస్కు విచ్చేసిన వ్యోమగాములు పెగ్గీ వాట్సన్ (అమెరికా), ఉజ్నాన్స్కీ విస్నేవ్‌స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ)ల యాగ్జియం–4 బృందం ఇప్పటిదాకా ఐఎస్ఎస్లో ఉంటూ అంతరిక్షంలో 96 లక్షల కిలోమీటర్లు ప్రయాణించింది. ఐఎస్ఎస్కు చేరుకున్నాక శుభాంశు బృందం శాస్త్రసాంకేతిక రంగాలకు చెందిన పలు రకాల ప్రయోగాలు చేసింది. భూమి మీద ఆచరణలో ఉన్న ఎన్నో సిద్ధాంతాలను శూన్యస్థితిలో అక్కడ పరిశీలించింది. జీవవైద్య శాస్త్రం, రేడియోధారి్మకత, న్యూరోసైన్స్, వ్యవసాయం, అంతరిక్ష సాంకేతికత ఇలా విభిన్న రంగాలకు సంబంధించి ప్రయోగాలు చేసింది. యాగ్జియం–4 మిషన్ వంటి ఒక ప్రైవేట్ వ్యోమగాముల బృందం ఇంతటి విస్తృతస్థాయిలో పరిశోధనలు చేయడం ఇదే తొలిసారి. అరవైకి పైగా ప్రయోగాలు ఈ బృంద సభ్యులు విజయవంతంగా పూర్తిచేశారు. చక్కెరవ్యాధిగ్రస్తులకు మెరుగైన చికిత్స విధానాలు, కేన్సర్ ట్రీమ్‌మెంట్‌లో కొత్తతరహా టెక్నాలజీ వాడకం, సుదీర్ఘకాలం ఖగోళయానం చేస్తే వ్యోమగామిపై రేడియేషన్ చూపే దుష్ప్రభావం, శూన్యస్థితిలో విత్తనాలు, సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా మనుగడ.. ఇలా భిన్న అంశాలపై శుభాంశు బృందం ప్రయోగాలు చేసి ఫలితాలను విశ్లేíÙంచింది. భూమి నుంచి 250 మైళ్ల ఎత్తులో 230 సార్లు భూమిని చుట్టేసిన ఈ బృందం త్వరలోనే తిరిగి రానుంది. వారి తిరుగు ప్రయాణం ఈ నెల 14న ఉండొచ్చని నాసా పేర్కొంది.

చందమామను గ్రహశకలం ఢీకొట్టిన వేళ
చిన్నతనంలో చేసే అతి అల్లరికి అమ్మ ఎప్పుడో ఒకసారి గట్టిగానే కొట్టి ఉంటుంది. అలాగే చల్లని వెన్నెలను మనకు అందించే చందమామ కూడా ఒకప్పుడు భారీ దెబ్బతిన్నాడు. అంతరిక్షంనుంచి విరుచుకుపడిన ఒక ఖగోళ వస్తువు సృష్టించిన పెను ఉత్పాతమది. సౌర కుటుంబ చరిత్రలోనే కనీవినీ ఎరుగని భారీ తాడనంగా నమోదైంది. గ్రహశకలం లేదంటే తోకచుక్క అనూహ్యంగా దిశ మార్చుకుని వచ్చి చంద్రుడి ఉపరితలంపై అత్యంత వినాశనం సృష్టించింది. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబులతో విరుచుకుపడి మారణహోమానికి పాల్పడింది. అమెరికా ప్రయోగించిన అణుబాంబుల కంటే ఏకంగా లక్ష కోట్ల అణుబాంబులకు సమానమైన శక్తితో ఆ గ్రహశకలం/తోకచుక్క చంద్రమామను ఢీకొట్టింది. దీంతో మనం లెక్కించడానికి, ఊహించడానికి కూడా సాధ్యంకానంతటి స్థాయిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ధాటికి చంద్రుని ఉపరితలంపై 2,500 కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ గొయ్యి ఏర్పడింది. అంటే టెక్సాస్ రాష్ట్రంలోని వాకో సిటీ నుంచి వాషింగ్టన్ డీసీ నగరానికి ఉన్నంత దూరం స్థాయిలో ఈ గొయ్యి ఏర్పడింది. దీని లోతు ఏకంగా 13 కిలోమీటర్లు. ఇంతటి పెనువినాశనం ఇప్పుడు జరగలేదు. 380 కోట్ల సంవత్సరాల క్రితం ఈ అరుదైన ఖగోళ ఘటన జరిగింది. మరి ఇప్పుడెందుకీ బిలం గోల?చంద్రుడు ఏర్పడిన తొలినాళ్లలో ఏర్పడిన బిలం కావడంతో ఆనాటి ఘటన తాలూకు అవశేషాలు సజీవ సాక్ష్యాలుగా అక్కడే ఉంటాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆనాటి ఘటన తాలూకు ఆధారాలు అలాగే ఉంటాయనడానికి బలమైన కారణం ఉంది. చందమామపై ఎలాంటి వాతావరణం లేదు. గాలులు, వరదలు, కాలుష్యం వంటి కారణంగా అక్కడి ఉపరితలంపై ఎలాంటి మార్పులు సంభవించబోవు. ఆ లెక్కన ఆనాటి ఖగోళ రహస్యాలు అలాగే భద్రంగా ఉంటాయని భావిస్తున్నారు. భూమి ఏర్పడిన కొన్ని కోట్ల సంవత్సరాలకే చంద్రుడు ఆవిర్భవించాడు. ఈ లెక్కన అవని ఆవిర్భావ రహస్యాలు చందమామపై ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రహస్యాలను ఛేదించేందుకు చైనా రంగంలోకి దిగింది. ఈ బిలం ఉన్న ప్రాంతానికి ‘సౌత్ పోల్ ఐట్కెన్ బేసిన్’గా పిలుస్తారు. ఇది భూమి మీద నుంచి చూస్తే కనిపించదు. చంద్రుని ఆవలి వైపు ఎప్పుడూ చిమ్మచీకట్లో ఉంటుంది. దీంతో ఇక్కడి శాంపిళ్లను తీసుకురావడం సవాల్‌తో కూడిన పని. ఇంతటి అసాధ్యమైన పనిని చైనా సుసాధ్యంచేస్తూ ఛాంగ్–6 వ్యోమనౌక ద్వారా గత ఏడాది జూన్ 25వ తేదీన అక్కడి నుంచి 1,935 గ్రాముల నమూనాలను తీసుకొచ్చింది. ఈ శాంపిళ్లపై ఏడాదికాలంగా చేసిన పరిశోధన తాలూకు తాజా వివరాలు ‘‘నేచర్’’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.– సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సంచలన నివేదిక.. అసలు కారణం అదే
ఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. విమాన ప్రమాద ఘటనపై ‘ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో’ (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. ఈ కారణంగానే ప్రమాదం జరిగినట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు.. ఈ నివేదికపై బోయింగ్ సంస్థ స్పందిస్తూ.. విచారణకు సహకరిస్తామని చెప్పుకొచ్చింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ఏఏఐబీ మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో.. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్‌లు సెకన్ పాటు ఆగిపోయినట్లు వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్‌ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది. కాక్‌పిట్‌లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబీ వెల్లడించింది. తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్టు తెలిపింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఏఐబీ.. ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది.క్షణాల్లో రెండు ఇంజిన్లకు ఫ్యూయెల్ సరఫరా నిలిచిపోయింది. గాల్లోనే రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే క్రాష్‌ల్యాండ్ అయినట్టు తెలిపింది. ఈ మేరకు కాక్‌పిట్ వాయిస్‌లో పైలట్ సంభాషణ రికార్డు అయినట్టు చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు చెప్పింది. విమానానికి సంబంధించి రెండు ఇంజిన్లను వెలికితీసినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్‌ను గుర్తించామని పేర్కొంది. ఇంజిన్లను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులు ఏమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. అలాగే, ప్రమాదానికి ముందు విమానాన్ని ఎలాంటి పక్షి సైతం ఢీకొట్టలేదని వెల్లడించింది. విచారణకు సహకరిస్తాం: బోయింగ్‌అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ‘ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో’ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. దీనిపై బోయింగ్ స్పందించింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో చనిపోయిన వారి చుట్టూ తమ ఆలోచనలు తిరుగుతున్నాయని ఆ సంస్థ విచారం వ్యక్తం చేసింది.🚨🇮🇳#BREAKING | NEWS ⚠️ apparently the fuel cut off switches were flipped “from run to cutoff “just after takeoff starving the engines of fuel causing the Air India plane to crash 1 pilot can be heard asking the other” why he shut off the fuel” WSJ report pic.twitter.com/XZp5DHzRnb— Todd Paron🇺🇸🇬🇷🎧👽 (@tparon) July 11, 2025ఇదిలా ఉండగా.. జూన్ 12న ఎయిర్ ఇండియా ఏఐ 171 విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఘటనలో ఫ్లైట్‌లో ఉన్న 240 మంది ప్యాసింజర్లతో సహా ఇతరులు మరో 30 మందికిపైగా మృతి చెందారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఈ విమానం టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఓ మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలింది. దీంతో, హస్టల్లో ఉన్న విద్యార్థులు మృతి చెందారు. Preliminary reports suggests that the Air India crash last month was caused by one of the pilots flipping a switch that cut off the fuel supply to the engines Not really sure how I feel about this….@AirNavRadar pic.twitter.com/AkW6tPMiaR— Flight Emergency (@FlightEmergency) July 11, 2025

1.6 లక్షల మంది నిరాశ్రయులు
న్యూఢిల్లీ: దేశంలో ప్రకృతి విపత్తులు పంజా విసురుతూనే ఉన్నాయి. భారీ వర్షాలు, భీకరమైన వరదల కారణంగా పెద్ద సంఖ్యలో జనం నష్టపోతున్నారు. శాశ్వత లేదా తాత్కాలిక ఇళ్లు, ఆవాసాలు కోల్పోయి నిరాశ్రయులుగా మారుతున్నారు. 2024లో దేశంలో 400కుపైగా ప్రకృతి విపత్తులు చోటుచేసుకున్నాయి. గత రెండు దశాబ్దాల కాలంలో చూస్తే ఇదే అత్యధిక కావడం గమనార్హం. గత ఏడాది విపత్తుల వల్ల 1.18 లక్షల మందికిపైగా జనం నిరాశ్రయులయ్యారని ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ వెల్లడించింది. 2023 కంటే 2024లో నిరాశ్రయుల సంఖ్య 30 శాతం అధికం అని తెలియజేసింది. 2021లో 22,000 మంది, 2022లో 32,000 మంది ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డారని పేర్కొంది. ప్రకృతి విపత్తులు ప్రతిఏటా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2019 నుంచి 2023 మధ్య 281 విపత్తుల ఘటనలు చోటుచేసుకున్నాయి. 2024లో మాత్రం ఏకంగా 400కు పైగా విపత్తులు సంభవించాయి. గత ఆరేళ్లలో జనం నిరాశ్రయులు కావడానికి వరదలు 55 శాతం, తుఫాన్లు 44 శాతం కారణమని తేలింది. కొండ చరియలు విరిగిపడడం, భూకంపాలు, కరువుల వల్ల కూడా జనం ఆశ్రయం కోల్పోతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోనే అధికం 2024లో 1.18 లక్షల మంది నిరాశ్రయులు కాగా, 2025లో మొదటి ఆరు నెలల్లోనే ఏకంగా 1.6 లక్షల మంది బాధితులుగా మారిపోయినట్లు ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. పశ్చిమ బెంగాల్‌తోపాలు ఈశాన్య రాష్ట్రాల ప్రజలే అధికంగా ప్రకృతి విపత్తుల బారినపడుతున్నారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 80,000 మంది నిరాశ్రయులయ్యారు.

జార్ఖండ్ కాంగ్రెస్‌లో విభేదాలు
సాక్షి, న్యూఢిల్లీ: జార్ఖండ్ రాష్ట్ర కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలు, అంతర్గత కుమ్ములా టలు, పరస్పర ఆరోపణల పర్వం మరోసారి తెరపైకి వచ్చాయి.కాంగ్రెస్ నేతల విభేదాలు ఢిల్లీ దాకా చేరడంతో, అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొప్పుల రాజుకు అప్పగించింది. రాష్ట్ర నేతలందరినీ ఆయన ఢిల్లీకి పిలిపించి సుదీర్ఘ మంతనాలు జరిపారు. కాంకే ఎమ్మెల్యే సురేష్ బైతా, కార్యనిర్వాహక అధ్యక్షుడు బంధు తిర్కీ, ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ, ఆర్థిక మంత్రి రాధాకృష్ణ కిషోర్లతో ఆయన భేటీ అయ్యారు. జాగ్రత్తగా మసలు కోవాలని, విభేదాలపై రచ్చకెక్కరాదని, సమన్వయంతో కూటమి బలోపేతానికి కృషి చేయాలని వారికి గట్టిగా చెప్పారు. మూల కారణమిదే..!రాంచీలోని రిమ్స్ (రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) డైరెక్టర్ తొలగింపు అంశం వివాదానికి తెరతీసింది. రిమ్స్ డైరెక్టర్ తొలగింపునకు సంబంధించిన లేఖపై తాను సంతకం చేయనని కాంకే ఎమ్మెల్యే సురేష్ బైతా బహిరంగంగా ప్రకటించారు. ఈ అంశం పార్టీలో ఉద్రిక్తతను సృష్టించింది. పార్టీని, కూటమి ప్రతిష్టను దెబ్బతీసేలా బహిరంగ వేదికపై అలాంటివి వెల్లడించరాదని ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఆయనకు సూచించారు. అయితే, బైతా వెనక్కి తగ్గలేదు. మరోవైపు, రిమ్స్–2 ప్రతిపాదనపై జార్ఖండ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బంధు తిర్కీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రిమ్స్–2 కోసం తన ప్రాంతంలోని రైతుల భూమిని సేకరించడాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రస్తుతమున్న రిమ్స్‌పై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడానికే రిమ్స్–2ను తెరపైకి తెచ్చినట్లు సీఎం హేమంత్ సోరెన్ అంటున్నారు. ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ కూడా ఈ ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో సంకీర్ణంలో ఉద్రిక్తతలకు దారితీసింది.

మనపై చైనా వాటర్ బాంబ్
బ్రహ్మపుత్రా నది పై చైనా తలపెట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట ‘మెడోగ్’భారత్ పాలిట ‘నీటి బాంబు’గా మారనుందని అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఆందోళన వెలిబుచ్చారు. ఈశాన్యంలోని సరిహద్దు రాష్ట్ర ప్రజలకు, వారి జీవనోపాధికి ఈ ప్రాజెక్టు పెను ముప్పు అవుతుందన్నారు. ‘‘ఏ అంతర్జాతీయ జల ఒప్పందాలపైనా సంతకం చేయని చైనా ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఆ డ్యామ్‌ను మనపైకి నీటి బాంబుగా కూడా ఉపయోగించొచ్చు’’అని హెచ్చరించారు. దాంతో మెడోగ్ డ్యామ్ మరోసారి చర్చల్లో నిలిచింది. గోప్యతపై అనుమానాలు... టిబెట్‌లోని యార్లుంగ్ సాంగ్సో (బ్రహ్మ పుత్ర) నదిపై ప్రపంచంలోనే అతి పెద్ద ఆనకట్టను చైనా నిర్మిస్తోంది. ఈ నది అరుణాచల్‌లో సియాంగ్‌గా, అస్సాంలో బ్రహ్మపుత్రగా మారి, బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది. అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది. మెడోగ్ డ్యామ్ ద్వారా ఏకంగా 60 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారత సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే దీన్ని ‘టిక్‌టిక్ అంటున్న వాటర్ బాంబ్’గా ఖండు అభివరి్ణంచారు. మెడోగ్ కేవలం నదీప్రవాహ ప్రాజెక్టు అని చైనా అంటున్నా ఆ ముసుగులో అతి భారీ జలాశయాన్ని నిర్మిస్తోందని చెబుతున్నారు. ఇది భారీగా నీటిని నిల్వ చేస్తుందని, దిగువ ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుందని అంటున్నారు. ఆనకట్ట నిర్మాణానికి ఆమోదం లభించినట్లు 2024లో వార్తలొచ్చాయి. ఈ ప్రాజెక్టుపై చైనా ఆద్యంతం గోప్యత పాటిస్తుడటం, అంతర్జాతీయ జల ఒప్పందాలపై సంతకం చేయడానికి నిరాకరించడం పర్యావరణంగా, భౌగోళికంగా, రాజకీయపరంగా భారత్‌కు పెను ఆందోళన కలిగిస్తోంది. అంతేగాక ప్రాంతీయ ఉద్రిక్తతలను కూడా రాజేస్తోంది. ఈ ఆనకట్టను అరుణాచల్ అస్తిత్వానికే ముప్పుగా నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.‘గ్రేట్ బెండ్’ వద్దే నిర్మాణం అరుణాచల్‌కు సమీపంలో సాంగ్సో నది ఉన్నట్టుండి వలయాకారంగా వంపు తిరుగుతుంది. సరిగ్గా ఈ ‘గ్రేట్ బెండ్’వద్దే చైనా ఆనకట్ట కడుతోంది. అక్కడి నుంచి నేరుగా అరుణాచల్‌కు చేరుతుంది. ఈ నేపథ్యంలో నదీ ప్రవాహంలో ఎలాంటి అసాధారణ మార్పులు జరిగినా భారీ వరదలు తప్పవు. అదే జరిగితే సియాంగ్ బెల్ట్ మొత్తం నాశనమవుతుంది. అక్కడి ఆదిమ తెగలు, ఇతర వర్గాలతో పాటు విస్తారమైన అటవీ ప్రాంత అస్తిత్వం కూడా ముప్పులో పడుతుంది. ఎగువ దేశంగా నదీ ప్రవాహంపై చైనాకు అతి కీలకమైన వ్యూహాత్మక నియంత్రణ ఉండటమే ఇందుకు కారణం. నీటిని అది ఏకపక్షంగా మళ్లిస్తే భారత్‌తోపాటు బంగ్లాదేశ్‌కు కూడా తీవ్ర నష్టం తప్పదు. నీటి ప్రవాహాన్ని తగ్గితే ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగ్లాలో సాగు, మత్స్యకార కార్యకలాపాలు, జీవనోపాధికి నష్టం వాటిల్లుతుంది. అందుకే ఈ డ్యామ్ నిర్మాణంపై భారత్ గట్టిగా అభ్యంతరాలు వ్యక్తం చేయాలని చైనాలోని భారత మాజీ రాయబారి అశోక్ కాంత సూచించారు. ‘మెడోగ్ కేవలం ప్రాజెక్టు కాదు. చాలా క్లిష్టమైన ప్రాంతంలో వ్యూహాత్మకంగా నిర్మిస్తున్న అతి భారీ జలాశయం. ఇది చాలా ప్రమాదకర పరిణామం. అత్యంత బాధ్యతారహితమైన ప్రాజెక్టు’’అని హెచ్చరించారు. మరికొందరు నిపుణులు మాత్రం భయాందోళనలు అవసరం లేదంటున్నారు. ఈ ఆనకట్ట ద్వారా బ్రహ్మపుత్రా జలాలను మనపైకి ఆయుధంగా వాడటం చైనా ఉద్దేశం కాబోదని చెబుతున్నారు. నదిలోని భారీ ప్రవాహాన్ని చైనా ఆపజాలదని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
ఎన్ఆర్ఐ

డాలస్‌లో అత్తలూరి విజయలక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం : "నేనెవరిని" నవలావిష్కరణ
డాలస్, టెక్సస్: ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి యాభై ఏళ్ల సాహితీ ప్రస్థానాన్ని పురస్కరించు కుని తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వహించిన "అత్తలూరి సాహితీ స్వర్ణోత్సవం" సాహిత్యసభ పెద్ద సంఖ్యలో హాజరయిన సాహితీప్రియులు సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరించిన తానా పూర్వాధ్యక్షులు, ప్రస్తుత తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహాకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “అత్తలూరి కలంనుండి వివిధ అంశాలమీద ఇప్పటివరకు వెలువడ్డ 300 కథలు, 25 నవలలు, 100 రేడియో నాటికలు, 30 రంగస్థల నాటకాలు గత ఐదు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేశాయన్నారు. ఆమె రచనలు సమాజంలోని వాస్తవపరిస్థితులకు అద్దం పడతాయని, పాఠకులను ఆలోచింపజేస్తాయని అన్నారు”.ముఖ్యఅతిథిగా విచ్చేసిన డా. సత్యం ఉపద్రష్ట మాట్లాడుతూ “విజయలక్ష్మి జీవనప్రస్థానాన్ని సాహిత్యవిజయాలతో మేళవించి, కుటుంబ విలువలను ప్రతిబింబిస్తూ ఆమె రచనలు ఎలా సాగుతాయో, తన తల్లిదండ్రుల ప్రతిభ ఎలా తనను తీర్దిదిద్దినదో, తన విజయంతోబాటు తన కుమార్తె రాజేశ్వరి విజయానికి కూడా ఎలా దారితీసిందో సోదాహరణంగా వివరించారు.”విశిష్టఅతిథులుగా హాజరైన ప్రముఖ రచయిత కన్నెగంటి చంద్ర తన ప్రసంగంలో విజయలక్ష్మి రచించిన "నేనెవరిని" నవలలోని ముఖ్యఅంశాలను విశ్లేషిస్తూ ఈ నవల కేవలం ఒక పుస్తకం కాదని, ఇది సమాజపు అంతరాత్మను ప్రశ్నించే ఒక శక్తివంతమైన ఆయుధమని అభివర్ణించారు. ఒక స్త్రీ తన అస్తిత్వం కోసం చేసే పోరాటాన్ని ఇంత హృద్యంగా చిత్రించడం రచయిత ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించారు.విజయలక్ష్మి వ్రాసిన 300 కథలనుండి కొన్ని కధలను ప్రస్తావిస్తూ రచయిత్రి ఎంచుకున్న కథా వస్తువును, శిల్పాన్ని, కథా గమనాన్ని ప్రముఖ రచయిత్రి సుజన పాలూరి వివరించగా, మొత్తం 130 నాటికలలో కొన్ని నాటికల ఇతివృత్తాలను, అవి సాగిన తీరును నాటకరంగ ప్రముఖులు డా. కందిమళ్ళ సాంబశివరావు విశ్లేషణ చేయగా, సాహితీవేత్త విజయ భాస్కర్ రాయవరం మరికొన్ని నాటకాలను, ముఖ్యంగా “ద్రౌపది” నాటకంలో ఆ పాత్రను మలచిన తీరు, రచనలోని లోతును, సామాజిక స్పృహను స్ప్రుశించారు.ముఖ్యఅతిథి డా. సత్యం ఉపద్రష్ట రచయిత్రి విజయలక్ష్మి వ్రాసిన “నేనెవరిని” నవలను ఆవిష్కరించి తొలి ప్రతిని సభాధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూరకు అందజేశారు. సుప్రసిద్ధ రచయిత్రి సాహితీ స్వర్ణోత్సవం అమెరికాలో జరుపుకోవడం విశేషమంటూ డా. ప్రసాద్ తోటకూర హాజరైన సాహితీప్రియులందరితో కలసి అత్తలూరి విజయలక్ష్మికి “సాహితీ స్వర్ణోత్సవ విద్వన్మణి” అనే బిరుదు ప్రదానంచేసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ “తన సాహితీ ప్రయాణంలో తన పాఠకులే తన బలమని, వారి అభిమానమే తనను ముందుకు నడిపిస్తుందని, ఈ 50 ఏళ్ళ సాహిత్య ప్రస్థానంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. "నేనెవరిని" నవల వ్రాయడానికి ప్రేరేపించిన సామాజిక పరిస్థితులను వివరిస్తూ, తన రచనల ద్వారా సమాజంలో కొంతైనా మార్పు తీసుకురావాలన్నదే తన ఆశయమని పేర్కొన్నారు”.ఈ సాహిత్యసభకు కావలసిన అన్ని ఏర్పాట్లును, విందుభోజనంతో సహా, మరియు సమర్దవంతంగా సభానిర్వహణలో ముఖ్యపాత్ర వహించిన “రేడియో సురభి” బృందానికి, హాజరైన అతిథులకు, సాహితీప్రియులకు డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలియజేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

వియత్నాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు వియత్నాం రాజధాని హనోయి నగరంలో మంగళవారం ఓసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గత వారం రోజులుగా వియత్నాంలో పర్యటిస్తున్న కరుణాకర రెడ్డి.. దివంగత రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో ఏ ప్రాంతంలో ఉన్నా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అభిమానులున్నారని సంక్షేమం అంటేనే మొదట గుర్తుకు వచ్చేది రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీతో పాటు పేదరిక నిర్మూలనకు కృషి చేసి ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడిగా వైఎస్ నిలిచి పోవడం జరిగిందని, అనేక రాష్ట్రాలలో ప్రస్తుత ముఖ్యమంతులు వైఎస్ అడుగుజాడల్లో నడుస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నితిన్ రెడ్డి, చరణ్ రెడ్డి, జివి లక్ష్మీ, వాణి రెడ్డి, నీహారిక, డేనియల్, ప్రశాంత్, పీటర్సన్, డాంగ్ జాన్, తదితరులు పాల్గొన్నారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!

నృత్యంతో అలరించిన నేహారెడ్డి
నేహా రెడ్డి ఆళ్ల .. అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి.. తల్లిదండ్రులు శివరామి రెడ్డి, నాగ మల్లేశ్వరి. తన తల్లి నాగ మల్లేశ్వరికి ఉన్న కళాపేక్ష వల్ల చిన్నప్పుడే వర్జీనియాలోని కళామండపం నృత్య పాఠశాలలో గురు మృణాళిని సదానంద గారి దగ్గర చేరి, కూచిపూడిలో మెలకువలు నేర్చుకుంది. గురువు మృణాళిని సదానంద గారి శిష్యరికంలో యెన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చింది.. అంతేకాకుండా నేహా చదువులో కూడా అత్యంత ప్రతిభను కనపరుస్తూ ఎన్నో బహుమతులను తెచ్చుకుంది. మన ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేహ నృత్యప్రదర్శన ఇచ్చింది. అంతేకాకుండా అమెరికాలో జరిగే పండుగ కార్యక్రమాలలో తన నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకుని ప్రసంశలు పొందింది. నృత్యంలోనే కాదు చదువులోనూ రాణిస్తున్న నేహాకు డాక్టర్ కావాలనేది లక్ష్యం. శనివారం, జూలై 5న తన గురువు గారు కళారత్న శ్రీమతి మృణాళిని సదానంద గారి అధ్వర్యం లో నృత్య సంభావన (అరంగేట్రం)చేసింది నేహా రెడ్డి ఆళ్ల.. గురు మృణాళిని సదానంద గారు అన్ని నృత్యములకు కొరియోగ్రఫీ చేయగా నేహ తన నృత్యప్రదర్శనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి గురు సత్యప్రియ రమణ చీఫ్ గెస్ట్‌గా ఇండియా నుండి వచ్చారు.. కవిత చీడల ప్రవక్తగా వ్యవహారించారు. నట్టువంగం శ్రీ కమల్ కిరణ్ గారు, వాయిలిన్ విద్వాన్ శ్రీ వింజమూరి సుభాష్ గారు, గాత్రం శ్రీమతి కృపా లక్ష్మి మరియు శ్రీ శశాంక గారు, శ్రీ విజయ్ గణేష్ గారి మృదంగం, శ్రీ సౌమ్య నారాయణన్ గారు ఘటం, వాయిలిన్ సపోర్టింగ్ ఎంఎస్ పద్మిని గారు, స్పెషల్ ఎపెక్ట్స్ శ్రీ రామకృష్ణ గోపినాథ్ తదితరులు సంగీతాన్ని అందించారు. కార్యక్రమానంతరం అందరినీ నేహా రెడ్డి ఆళ్ల తల్లితండ్రులు శ్రీ శివరామి రెడ్డి మరియు శ్రీమతి నాగ మల్లేశ్వరి దంపతులు మరియు సోదరుడు చేతన్ రెడ్డి ఆళ్ల సత్కరించారు..అమెరికాలో అందెల సవ్వడి, డాక్టర్ కావాలనేది కల

న్యూజిలాండ్‌లో వైఎస్ఆర్ జయంతి ఉత్సవాలు
న్యూజిలాండ్‌లోని ప్రధాన నగరాల్లో కూడా ఆదివారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి జయంతి వేడుకలను ప్రవాస భారతీయులు ఘనంగా నిర్వహించారు. ఆక్లాండ్‌లోని పిక్లింగ్ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ కమిటీ కన్వీనర్ బుజ్జిబాబు నెల్లూరి, కో–కన్వీనర్లు ఆనంద్ ఎద్దుల, డేగపూడి సమంత్, సభ్యులు బాలశౌర్య, రాజారెడ్డి, పిళ్లా పార్థ, జిమ్మి, గీతారెడ్డి, ఆళ్ల విజయ్, రమేష్ పనటి, సంకీర్త్ రెడ్డి ఘనంగా నిర్వహించారు.భారతదేశం నుండి గౌరవ అతిథులుగా అలూరు సంబ శివ రెడ్డి , ఆరే శ్యామల రెడ్డి, జి. శాంత మూర్తి , నందమూరి లక్ష్మీ పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యూజిలాండ్ మాజీ మంత్రి మైకేల్ ఉడ్ హాజయ్యారు. ఎన్నారైలు బీరం బాల, కళ్యాణ్‌రావు, కోడూరి చంద్రశేఖర్, అర్జున్‌రెడ్డి, మల్లెల గోవర్ధన్, జగదీష్ రెడ్డి, ఇందిర సిరిగిరి తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

భర్త వేధింపులు తాళలేక..
హైదరాబాద్: భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్లాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సామల వెంకటరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అల్లాపూర్‌లో నివాసం ఉంటున్న సాదిక్ ఆలి, సమీనా బేగం దంపతులకు ముగ్గురు సంతానం. గత కొన్నేళ్లుగా సాదిక్ ఆలి భార్య సమీనాను వేధిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను ప్రతి రోజూ తాగి వచ్చి భార్యను మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. గురువారం రాత్రి కూడా అతను భార్యతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపానికి లోనైన సమీనా బేగం శుక్రవారం ఉదయం సీలింగ్ రాడ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అల్లాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
శ్రీకాకుళం క్రైమ్, ఎచ్చెర్ల: రోడ్డు పనులు పరిశీలించి వస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. మూకుమ్మడిగా దాడిచేసిన అధికార టీడీపీ కార్యకర్తలు.. ఆయనను అంతమొందించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు.. ఫరీదుపేటకు చెందిన సత్తారు గోపి వైఎస్సార్సీపీ కార్యకర్త. ఊరి కూడలి ఎన్‌హెచ్–16 సమీపంలోని కొయిరాలమెట్ట వద్ద అప్రోచ్ రోడ్డు నిర్మాణంలో ఉంది. శుక్రవారం మధ్యాహ్నం చిన్నాన్న సత్తారు కోటేశ్వరరావుతో కలిసి గోపి ఆ రహదారి పనులను పరిశీలించి ఇంటికి భోజనానికి బైక్ (ఏపీ30పి6845)పై బయల్దేరారు. ఇంతలో కొయిరాలమెట్ట వద్ద దారికాచిన ఎనిమిది మంది కర్రలతో దాడికి దిగారు. గోపి వారికి చిక్కగా... బైక్‌పై వెనుక కూర్చున్న కోటేశ్వరరావు పరిస్థితి గ్రహించి పారిపోయాడు. అప్పటికే కర్రలతో గోపి తలపై బాదిన దుండగులు ఆయనను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేశారు. ఈ దాడిలో మారణాయుధాలు కూడా వాడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోపి ఎంపీపీ మొదలవలస చిరంజీవికి ప్రధాన అనుచరుడు. భర్త హత్య విషయం తెలిసి గోపి భార్య పుణ్యవతి కుప్పకూలారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. గోపికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. టీడీపీ వారే చంపారు...ఫరీదుపేట గ్రామ టీడీపీ నాయకులే గోపి హత్యకు ఒడిగట్టారని ప్రత్యక్ష సాక్షులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పోలీసులకు సైతం ఇదే విషయం తెలిపారు. రాజకీయంగా కక్ష కట్టిన టీడీపీ నేతలు... కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామంలో రెండో హత్యకు పాల్పడ్డారు. ఏడాది కిందట వైఎస్సార్సీపీ కార్యకర్త కూన ప్రసాద్‌ను టీడీపీ మద్దతుదారులు హత్య చేశారు.హత్యను తప్పుదారి పట్టించే కుట్ర..హత్య విషయం తెలిసి పోలీసులు, గోపి కుటుంబసభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్రోచ్ రోడ్డు వద్ద ఒక కర్ర, వెనుక నిర్మానుష్య ప్రదేశంలో రక్తపు మడుగులో గోపి మృతదేహం పక్కన లావుపాటి కర్ర ఉండటం గమనార్హం. నిరుడు కూన ప్రసాద్‌నూ ఇదే తరహాలో టీడీపీ వర్గీయులు హతమార్చారు. ఆ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయకుండా వదిలేశారని.. వారివల్లే గోపి హత్య జరిగిందని వైఎస్సార్సీపీ మద్దతుదారులు, కుటుంబసభ్యులు పోలీసుల వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. దాదాపు అరగంట పాటు హైవేను దిగ్బంధించారు. పూర్తిగా రాజకీయ కారణాలు ఉండగా.. భార్యాభర్తల తగాదా కేసులో భాగంగా అంటూ కేసు తీవ్రత తగ్గిస్తూ, టీడీపీవారిని తప్పించేలా పోలీసులు వ్యవహరించారని గోపి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. డీఎస్పీ వివేకానంద సైతం ఇలానే మాట్లాడుతున్నారని తెలిపారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ఎచ్చెర్ల ఎస్ఐ వి.సందీప్ ఘటనా స్థలి నుంచి వెళ్లిపోయారు. డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీఐ అవతారం, సబ్ డివిజన్ పోలీసులంతా వచ్చినా ఆందోళనకారుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయారు. దీంతో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి రావాల్సి వచ్చింది. గోపి హత్య నిందితులైన టీడీపీ నాయకులను తక్షణమే అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. కిందకు లాగేసి.. దుర్భాషలాడుతూ..తొమ్మిదిమంది టీడీపీ వాళ్లు వచ్చి బైక్‌పై వెళ్తున్న గోపిని, నన్ను లాగేశారు. తీవ్రంగా తిడుతూ నా ఫోన్‌ను తీసేసుకున్నారు. చంపేస్తారనే భయంతో పారిపోయా. గ్రామస్థులకు సమాచారం ఇవ్వడానికి వెళ్లా. మారణాయుధాలతో గోపిని చంపేశారు. – గోపి చిన్నాన్న కోటేశ్వరరావు

Ongole: పాపం పసివాడు
చిన్నారి లక్షిత్ మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అడవిలో తప్పిపోయి రెండు రోజులపాటు తిండి, నీళ్లు లేక చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే తమ బిడ్డది సహజ మరణం కాదని.. ఎవరో ఉద్దేశపూర్వకంగానే చంపారంటూ కంభం పోలీస్ స్టేషన్ వద్ద లక్షిత్ కుటుంబ సభ్యులు శుక్రవారం ధర్నాకు దిగారు. బాధిత కుటుంబం చెబుతున్న వివరాల ప్రకారం.. సాక్షి, ప్రకాశం జిల్లా: కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో పొదిలి లక్షిత్ అనే మూడున్నరేళ్ల వయసున్న బాలుడు మంగళవారం ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. లక్షిత్‌ను తాను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. చెయ్యి కొరికి పరిగెత్తాడని ఓ పిల్లాడు చెప్పాడు. అయితే చుట్టుపక్కల ఎంత వెతికినా చిన్నారి కనిపించలేదు. దీంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో గాలింపు చేపట్టారు. ఓ జాగిలానికి బాలుడి చెప్పు లభించడంతో డ్రోన్ల సాయంతో ఊరంతా గాలించారు. వంద మందికి పైగా గ్రామస్తులు గుంపులుగా విడిపోయి గాలించినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో.. గురువారం ఉదయం సూరేపల్లి వెనుక ఉన్న ఓ పొలంలో కంది కొయ్యలు ఏరేందుకు వెళ్లిన మహిళలకు ఓ చిన్నారి శవం కనిపించింది. గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించగా.. అది లక్షిత్దేనని నిర్ధారణ అయ్యింది. దీంతో మిస్సింగ్ కేసును కాస్త.. అనుమానాస్పద మృతిగా మార్చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే..కేసు గ్రావిటీ తగ్గించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని, దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. అడవిలో తప్పిపోయి.. తిండి, నీరు లేక మరణించారంటూ పోలీసులు చెబుతున్న స్టేట్మెంట్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. లక్షిత్ సహజ మరణం చెందాడంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన రాతలు కేసును పక్కదారి పట్టించేలా ఉన్నాయంటూ పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతామని పోలీసులు అంటున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సైతం ఆరా తీశారు.అయ్యో లక్షిత్లక్షిత్ కోసం ఓవైపు పోలీసులు, మరోవైపు వందల మంది గ్రామస్తులు లింగోజిపల్లి, సూరేపల్లి గ్రామాల చుట్టూ వెతికారు. అయితే.. బాలుడి మృతదేహం దొరికిన పంటపొలం, ఆ చుట్టుపక్కల కూడా గాలించారు. అదే చోట.. గురువారం ఉదయం బాలుడు విగతజీవిగా బోర్లాపడి ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని తిప్పి చూడగా మర్మాంగాల వద్ద కొద్దిగా రక్తం కనిపించినట్లు తెలిసింది. మృతదేహాన్ని బట్టి గురువారం తెల్లవారుజామున బాలుడు చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంగోలు నుంచి వచ్చిన వైద్య బృందం సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. అనంతరం కుటుంబ సభ్యులకు బాలుడి మృతదేహాన్ని పోలీసులు అప్పగించగా, స్వగ్రామమైన గొట్లగట్టు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపించారు. అయితే.. ఎవరి పని?బాలుడు అదృశ్యమైన నేపథ్యంలో చిత్తుకాగితాలు ఏరుకునే వారు ఎత్తుకెళ్లి ఉంటారని తొలుత పోలీసులు, గ్రామస్తులు భావించారు. ఆ కోణంలోనే ప్రాథమికంగా దర్యాప్తు చేశారు. తీరా.. బాలుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెంది పడి ఉండటంతో కొత్తకొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. లక్షిత్‌ను ఎవరు ఎత్తుకెళ్లారు? ఎందుకోసం ఎత్తుకెళ్లారు?.. ఎత్తుకెళ్లిన వారు రెండు రోజులు ఎందుకు దాచిపెట్టారో అర్థం కావడం లేదు. ఇది బంధువుల పనా.. లేకుంటే బయటివారి పనా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక వేళ డబ్బు కోసం బాలుడిని కిడ్నాప్ చేసి.. దొరికిపోతామనే భయంతో చంపేసి పారిపోయారా..? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రకటనలనూ కుటుంబ సభ్యులు తోసిపుచ్చుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంగన్వాడీ టీచర్లపైనే లక్షిత్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.విషాదంలో రెండు ఊర్లుకంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన చెన్నకేశవులుకు ఇద్దరు కుమార్తెలు కాగా, మృతిచెందిన బాలుడి తల్లి చిన్న కుమార్తె సురేఖ. చెన్నకేశవులు పెద్ద కుమార్తెను 7 సంవత్సరాల క్రితం కొనకొనమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన పొదిలి రంజిత్‌కు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. రెండో కూతురు సురేఖ (మృతిచెందిన బాలుడి తల్లి)ను పెద్ద అల్లుడు బంధువు (వరుసకు సోదరుడు) అయిన పొదిలి శ్రీనుకు ఇచ్చి 5 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. లక్షిత్ శ్రీను-సురేఖల పెద్ద కొడుకు. సురేఖ 45 రోజుల క్రితం రెండో కాన్పునకు పుట్టినిల్లు లింగోజిపల్లి గ్రామానికి వచ్చింది. నెల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఈ నేపథ్యంలో లక్షిత్ చనిపోవడంతో ఆ తల్లి, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. లక్షిత్ స్వగ్రామమైన కొనకనమిట్ల మండలం గొట్లగట్టులో అశ్రునయనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మొన్నటి వరకు గ్రామంలో అల్లారుముద్దుగా తిరుగతూ కనిపించిన లక్షిత్‌ను విగతజీవిగా చూడలేక స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇటు లింగోజిపల్లి నుంచి అధిక సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

భార్య దారుణ హత్య
కై కలూరు: ఆస్తిని పెద్ద కొడుక్కి రాసివ్వమని అడిగిన భార్యను అంతమొందించాడో భర్త. ఈ ఘటన ఏలూరు జిల్లా కలిదిండి మండలం ఎస్ఆర్పీ అగ్రహారంలో చోటుచేసుకుంది. వివరాలివి.. గ్రామానికి చెందిన కట్టా పెద్దిరాజు (50), జయలక్ష్మి (47) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు మగ సంతానం. పెద్ద కుమారుడికి ఇటీవల పెళ్లయింది. ఇద్దరు కుమారులు వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పెద్దిరాజుకు గ్రామంలో 40 సెంట్ల భూమి ఉంది. దీనిని అమ్మకానికి సిద్ధం చేస్తున్నాడు. పెద్ద కుమారుడికి వివాహం జరగడంతో దంపతులు ఇల్లు కట్టుకుంటారని, స్థలం అతడికి రాయాలని జయలక్ష్మి భర్తను కోరింది. ఈ విషయంలో తరచూ భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. తన కంటే బిడ్డలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని పెద్దిరాజు భార్యపై ద్వేషం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి నిద్రపోతున్న జయలక్ష్మిపై కత్తితో విచక్షణారహితంగా దాడిచేశాడు. దీంతో ఆమె ఘటనాస్థలిలోనే ప్రాణం విడిచింది. అనంతరం పెద్దిరాజు భయపడి పురుగు మందు తాగి, చాకుతో పీక కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. ప్రాణాలతో ఉన్న పెద్దిరాజును ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.