traffic cop
-
కారు ఆపమన్నారని..ట్రాఫిక్ పోలీసును 10 కి.మీ ఈడ్చుకెళ్లి..
ఓ వ్యక్తి డ్రగ్స్ మత్తులో బీభత్సం సృష్టించాడు. ట్రాఫిక్ పోలీసు కారు ఆపమన్న ఆపకపోగా, ఆపాలని యత్నించినందకు పోలీసునే విండోషీల్డ్‌పై ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ట్రాఫిక్ పోలీసులు ఏదో అనుమానంతో అతడి కారుని ఆపారు. ఐతే అతను డ్రగ్స్ మత్తులో కారు ఆపకుండా అలానే పోనిచ్చాడు. దీంతో ట్రాఫిక్ పోలీసు అతన్ని బైక్‌పై వెంబడించి ఆపేందుకు యత్నించాడు. ఆ క్రమంలో పోలీసు కారు విండోషీల్డ్‌పై వేలాడాడు. అయినా కూడా సదరు డ్రైవర్ ఆపకుండా అలానే నిర్లక్ష్యంగా 10 కి.మీ ఈడ్చకెళ్లాడు. చివరకు ఉరాన్ నాకా వద్ద గవాన్ ఫాటా సమీపంలో పోలీసు వాహనంతో ఆ వెళ్తున్న కారుని ఆపి నిందితుడు ఆదిత్య బెంబాడేను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ సిద్ధేశ్వర్ మాలీని కారుపై అలానే దాదాపు 10 కిలోమీటర్లు అంతే వేగంగా ఈడ్చుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ని చంపేందుకు యత్నించినందుకుగానూ అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు పోలీసులు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Watch: High On Drugs, Man Drags Traffic Cop On Car's Windshield For 10 km In Maharashtra Read here: https://t.co/1vEbl6k80l pic.twitter.com/WDtVzq6gc5 — NDTV Videos (@ndtvvideos) April 16, 2023 (చదవండి: యూపీలో మరో వ్యక్తి కొంగ స్నేహం..ఏం జరుగుతుందో చూడాలి..) -
ట్రాఫిక్ ఏసీపీ మార్నింగ్ వాక్! మండిపోయిన జనం ఏం చేశారంటే..
కొచ్చి: అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరించాలనుకుంటే.. సోషల్ మీడియా ఊరుకోవట్లేదు. సామాజిక మాధ్యమాల సాయంతో జనాలు ఆ విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం వెనువెంటనే జరిగిపోతున్నాయి. తాజాగా కేరళలో ఓ ట్రాఫిక్ పోలీస్‌కు అలాంటి అనుభవమే ఎదురైంది. మార్నింగ్ వాక్ కోసం ఏకంగా ఓ రోడ్డునే బ్లాక్ చేయించాడు ట్రాఫిక్ విభాగంలోని ఉన్నతాధికారి. కొచ్చి అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ (వెస్ట్) వినోద్ పిళ్లై.. క్వీన్స్‌వాక్‌వేలోని రోడ్డును మూయించేసి మరీ మార్నింగ్ వాక్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో నిరసనలు మొదలయ్యాయి. వాస్తవానికి ఆ రోడ్డు ఆదివారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య పిల్లల సైక్లింగ్, స్కేటింగ్ కోసం మూసేయాలి. అయితే మిగతా రోజుల్లోనూ ఉదయం పూట ఆ రోడ్డును మూయించి.. మార్నింగ్ వాక్ చేయడం మొదలుపెట్టాడు ట్రాఫిక్ ఏసీపీ వినోద్ పిళ్లై. అంతేకాదు ఆయన వాకింగ్ చేస్తున్నంత సేపు సిబ్బంది ట్రాఫిక్ డైవర్షన్ బాధ్యతలు చూసుకునేవాళ్లు. ఈయన దెబ్బకు పిల్లల్ని స్కూల్ బస్సులు ఎక్కించడానికి.. రోడ్డుకు మరోవైపు దాదాపు అర కిలోమీటర్ దూరం దాకా వెళ్లాల్సి వచ్చింది పేరెంట్స్. మూడు రోజుల పాటు ఈ సమస్యను ఎదుర్కొన్న స్థానికులు.. చిర్రెత్తుకొచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వరుసగా పోస్టులతో నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో విషయం పైఅధికారుల దృష్టికి చేరింది. దీంతో వినోద్ పిళ్లైకి షో కాజ్ నోటీసు జారీ చేసింది పోలీస్ శాఖ. ఇదిలా ఉంటే.. కుక్క ఈవెనింగ్ వాక్ కోసమని కోసమని స్టేడియాన్ని ఖాళీ చేయించిన ఘటనపై.. ఢిల్లీలో ఓ ఐఏఎస్ కపుల్‌ను వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేసింది కేంద్రం. చదవండి: ట్రెండింగ్‌లో ‘కుక్క’! కారణం ఏంటంటే.. -
రోడ్డుపై అంకుల్ స్టెప్పులు.. మధ్యలో ట్రాఫిక్ పోలీస్ వచ్చి..
ఇంటర్నెట్ వాడకం పెరగడంతో సోషల్ మీడియా వచ్చే కొన్ని వీడియోలోని వారు రాత్రికి రాత్రే సెలబ్రిటీలు కావడం ఇటీవల షరా మామూలుగా మారింది. ఈ క్రమంలో ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులోని కొన్ని నెటిజన్లుకు వినోదాన్ని పంచుతూ వైరల్‌గా మారుతున్నాయి కూడా. సరిగ్గా అలాంటి ఓ ఫన్నీ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఓ అంకుల్ రోడ్డుపై ట్రాఫిక్ పోలీస్తో కలసి స్టెప్పులు ఇరగదేశాడు. ఈ వీడియోను చూసి నెటిజన్లు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అందులో.. ఓ అంకుల్ రోడ్డు పైకి వచ్చి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పాపులర్ సాంగ్ అయిన ‘జాను మేరీ జాన్’పై అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నాడు. అంతలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు సదరు వ్యక్తితో కాలు కదిపాడు. దీంతో అటుగా వెళ్తున్న జనం వారిద్దరి డ్యాన్స్‌ని చూస్తూ అక్కడే ఉండిపోయారు. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోకి క్యాప్షన్‌గా.. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అద్భుతమైన ఉదాహరణ ఇదేనంటూ రాశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు డ్యాన్స్ షోలకి పంపిస్తే ఫైనల్స్ గ్యారెంటీ అని ఒకరు కామెంట్ చేయగా, సూపర్ డ్యాన్స్ అంకుల్ అంటూ మరోకరు కామెంట్ పెట్టారు. ऐसे पल #PublicPoliceFriendship के खूबसूरत उदहारण हैं! #DancingCop #DancingWithCop. pic.twitter.com/8Y11Nf5sOO — Dipanshu Kabra (@ipskabra) April 25, 2022 చదవండి: ఛీ ఛీ! 30 ఏళ్లుగా టాయిలెట్లో సమోసా, వాష్‌రూమ్‌లో భోజనాల తయారీ -
తమిళనాడులో రెచ్చిపోయిన పోలీసు
-
ఫేస్బుక్లో ట్రెండవుతున్న ఎస్ఐ.. ఎందుకు?
ఆయన ఢిల్లీ పోలీసుశాఖలో ఎస్ఐగా పనిచేస్తున్నారు. మరో నాలుగేళ్లలో రిటైరయిపోతారు కూడా. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం మొదలుపెట్టారు. ఎందుకో తెలుసా.. దాదాపు రూ. 50 వేల విలువైన నగదు ఉన్న తన వాలెట్ పోగొట్టుకున్న ఓ వ్యాపారవేత్త.. దాన్ని తిరిగిచ్చిన ఎస్ఐ మదన్ సింగ్ గురించి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. అంతే, పోలీసులలో కూడా ఇలాంటి నిజాయితీపరులు ఉంటారా అంటూ ఒక్కసారిగా ఆ పోస్టుకు లైకులు, షేర్లు వెల్లువెత్తాయి. కేవలం ఆ పర్సు తిరిగివ్వడమే కాదు, సదరు వ్యాపారి తనకు బహుమతిగా ఇవ్వబోయిన 5వేల రూపాయలను కూడా మదన్ సింగ్ సున్నితంగా తిరస్కరించారు. ఈనెల ఏడోతేదీ ఉదయం 9.30 గంటల సమయంలో జగ్రీత్ సింగ్ అనే వ్యాపారి సరాయ్ కాలేఖాన్ ప్రాంతంలోని నిజాముద్దీన్ బ్రిడ్జి సమీపంలో తన పర్సు పోగొట్టుకున్నారు. ఆయన డిఫెన్స్ కాలనీ నుంచి ప్రీత్‌విహార్ లోని తన ఇంటికి వెళ్తుండగా కారు ఆగిపోయింది. కారును స్టార్ట్ చేయడానికి తోయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే పర్సు పడిపోయింది. రాత్రి 10.30 గంటలకు ఇంటికి వెళ్లి చూసుకోగా పర్సు లేదు. ఇంతలో రోడ్డుమీద వెళ్తున్న ఓ సైక్లిస్టు ఆ పర్సు తీసుకుని వెళ్తుండటాన్ని మదన్ సింగ్ చూశారు. అతడిని వెంబడించి పట్టుకుని, పర్సు తీసుకున్నారు. అందులో చాలా పెద్దమొత్తంలో విదేశీ కరెన్సీ, ఏటీఎం కార్డులు, డ్రైవింగ్ లైసెన్సు, విజిటింగ్ కార్డులు ఉన్నాయి. అందులో విజిటింగ్ కార్డు మీద నెంబరు చూసి జగ్రీత్ సింగ్‌కు ఫోన్ చేశారు. ఆ ఫోన్ వచ్చే సమయానికి కారు మొత్తం గాలించిన జగ్రీత్.. ఇక పర్సు దొరకదన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇంతలో మదన్ సింగ్ నుంచి ఫోన్ రావడంతో.. పర్సులో కేవలం తన ఐడెంటిటీ కార్డు మాత్రమే ఉండి ఉండొచ్చని, డబ్బులు ఉండకపోవచ్చని అనుకున్నారు. తీరా ఆక్కడకు వెళ్లి చూస్తే.. మొత్తం డబ్బు యథాతథంగా ఉంది. తాను కేవలం డ్రైవింగ్ లైసెన్సు మాత్రమే చూశానని, తర్వాత విజిటింగ్ కార్డు చూసి ఫోన్ చేశానని మదన్ సింగ్ చెప్పారు. అలాంటి నిజాయితీపరుడైన పోలీసును ఇంతవరకు చూడలేదని, చివరకు ఫొటో తీయించుకోడానికి కూడా ఒప్పుకోలేదని అన్నారు. మదన్ సింగ్ తమ శాఖకే గర్వకారణమని ట్రాఫిక్ డీసీపీ డీకే గుప్తా అన్నారు. అతడికి శాఖాపరంగా తగిన రివార్డు ఇప్పిస్తామని, ఇతరులు కూడా ఆయనను చూసి స్ఫూర్తి పొందాలని చెప్పారు. అల్వార్‌కు చెందిన మదన్ సింగ్ తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ఢిల్లీలో ఉంటున్నారు. కొడుకులిద్దరిలో ఒకరు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతుండగా మరొకరు సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. -
పోలీసును కారుతో ఢీ కొట్టి అలానే..
వేగంగా పోతున్న కారు, ముందు భాగంలో ఓ పోలీసు అధికారి. అచ్చం సినిమాల్లో స్టంట్లా కనిపించే వాస్తవ సంఘటనకు చెందిన దృశ్యాలు ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. తప్పించుకునే ప్రయత్నంలో ఓ దుండగుడు కారుతో పోలీసు అధికారిని ఢీ కొట్టాడు. ఉత్తర చైనాలోని టియాజిన్ మున్సిపాలిటీలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి సీసీకెమెరాల్లో రికార్డయిన వీడియో ఫుటేజిని పోలీసులు విడుదల చేశారు. వివరాలు.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన దుండగుడిని ఇద్దరు పోలీసులు వెంబడించారు. గ్యాస్ బంకు దగ్గర ఆగడంతో అతన్ని లైసెన్స్ చూపించాల్సిందిగా ఆదేశించారు. అతని దగ్గర ఉన్నవి నకిలీ ధృవ పత్రాలు అని పోలీసులు నిర్ధారణకు వచ్చేలోపే దుండగుడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కారును ఆపాలని చూసిన ఓ పోలీసు అధికారి, కారు ఢీకొట్టడంతో ముందు భాగం పై పడ్డాడు. అయినా కారును ఆపకుండా అక్కడి నుంచి మెయిన్ రోడ్డు పై అతి వేగంగా పోనిచ్చాడు. ఈ మొత్తం తతంగం అక్కడే ఉన్న ట్రాఫిక్ సీసీ కెమరాల్లో చిక్కాయి. ఈ ఘటనలో ప్రాణాపాయం నుంచి గాయాలతో పోలీసు అధికారి బయటపడ్డాడు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
నీ తెగువ అమోఘం
కానిస్టేబుల్ దాడిలో గాయపడిన మహిళను అభినందించిన కేజ్రీవాల్ రాష్ట్రం నీ లాంటి పౌరులను కోరుకుంటుంది అవినీతిపై పోరాడే వారికి వెన్నంటే ఉంటాం న్యూఢిల్లీ: లంచం ఇవ్వకుండా కౌర్ చూపిన తెగువను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొనియాడారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడిలో గాయపడిన రమన్జీత్ కౌర్‌ను ఆయన మంగళవారం కలిశారు. సెంట్రల్ ఢిల్లీలో సోమవారం ఓ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ లంచం ఇవ్వనందుకు మహిళపై ఇటుకతో దాడి చేసిన సంగతి విదితమే. రాష్ట్రంలోని ప్రజలందరూ కౌర్లాగా ఉండాలన్నారు. అప్పుడే అవినీతిని అంతమొందించగలమని ఆయన అభిప్రాయపడ్డారు. కానిస్టేబుల్ దాడిలో గాయపడిన తనకు సరైన చికిత్స అందించడం లేదని సీఎంకు ఈ సందర్భంగా ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఆమెకు మెరుగైన చికిత్సనందించాలని అధికారులను ఆదేశించారు. ‘నిన్ను చూసి మేము గర్వపడుతున్నాం. మేము నీ వెన్నంటే ఉండి చేయగలిగినంత సాయం చేస్తాం. ఢిల్లీ నీ లాంటి పౌరులను కోరుకుంటుంది. అవినీతిని అంతమొందించేందుకు మనమంతా కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది’ అని కేజ్రీవాల్ అన్నారు. తమకు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని ఇవ్వలేదని, దీంతో సరైన వైద్యం అందించడం లేదని కౌర్ భర్త సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్ఐఆర్ విషయం తాను చూసుకుంటునాని, మెరుగైన చికిత్సనందించేలా ఆదేశాలిస్తానని సీఎం హామీనిచ్చారు. కౌర్‌కు మెరుగైన చికిత్సనందించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ను కేజ్రీవాల్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కౌర్, ఆమె భర్తను జైన్ కలసి వారి సమస్యలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. హెడ్ కానిస్టేబుల్‌కు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ మహిళపై దాడి కేసులో డిస్మిస్ అయిన హెడ్ కానిస్టేబుల్‌కు ప్రత్యేక న్యాయమూర్తి మంగళవారం 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. మే 26 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి నరోత్తమ్ కౌశల్ ఆదేశాలు జారీ చేశారు. -
ఆమెకు ప్రాణం పోసిన పోలీస్..
థానే: కదులుతున్న రైల్లోంచి దిగేందుకు ప్రయత్నించి రైలుకు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయిన యువతి ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన థానేలో చోటుచేసుకుంది. రేష్మీ కరాందికర్ అనే యువతి (21) హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తోంది. ఆ రైలు థానే స్టేషన్లో ఆగదు. కానీ అక్కడికి రాగానే కొంచె నెమ్మదిగా వెళుతుంది. సరిగ్గా ఫ్లాట్ ఫామ్ నంబర్ 5 మీదుగా వెళుతున్న రైల్లోంచి దిగేందుకు ప్రయత్నించిన రేష్మి మధ్యలో ఇరుక్కుపోయింది. అక్కడ ఉన్న వారు కేకలు వేయడంతో రైలు చైన్ లాగారు. అప్పటికే ఆ అమ్మాయికి తీవ్రంగా గాయాలయ్యాయి. కానీ, చోద్యం ఏంటంటే అక్కడికి వచ్చినవారంతా తమ సెల్ ఫోన్లలో ఫొటోలు వీడియోలు తీసుకునేందుకు ప్రయత్నించారే తప్ప రైలు కింద ఇరుక్కుపోయి పట్టాలపై రక్తమోడుతున్న ఆమెకు ఎవరూ చేయందించలేదు. అదే సమయంలో ఆ రోజు సెలవుల కారణంగా విధులకు హాజరు కానీ రఘునాథ్ బాజిరావ్ కావ్లే (50) అనే కానిస్టేబుల్ ఈ విషయం తెలుసుకుని వేగంగా వచ్చాడు. వెంటనే అందరిని పక్కకు నెట్టేసి ఆమెను అతికష్టం మీద బయటకు తీసి స్వయంగా ఆస్పత్రికి తరలించి వైద్యం ఇప్పించాడు. దీంతో ఆ యువతి ప్రాణాలతో బయటపడింది. రెండు రోజుల కిందటే రఘునాథ్ ఓ చైన్ స్నాచర్‌ను బంధీగా పట్టుకున్నాడు. ఇలా అతడు ఎన్నో మంచి పనులు చేస్తూ వస్తున్నాడు.