ఆమెకు ప్రాణం పోసిన పోలీస్.. | Traffic cop rescues girl who fell from train | Sakshi
Sakshi News home page

ఆమెకు ప్రాణం పోసిన పోలీస్..

Published Sun, Mar 22 2015 7:50 PM | Last Updated on Sat, Sep 2 2017 11:14 PM

Traffic cop rescues girl who fell from train

థానే: కదులుతున్న రైల్లోంచి దిగేందుకు ప్రయత్నించి రైలుకు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయిన యువతి ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన థానేలో చోటుచేసుకుంది. రేష్మీ కరాందికర్ అనే యువతి (21) హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తోంది. ఆ రైలు థానే స్టేషన్లో ఆగదు. కానీ అక్కడికి రాగానే కొంచె నెమ్మదిగా వెళుతుంది. సరిగ్గా ఫ్లాట్ ఫామ్ నంబర్ 5 మీదుగా వెళుతున్న రైల్లోంచి దిగేందుకు ప్రయత్నించిన రేష్మి మధ్యలో ఇరుక్కుపోయింది. అక్కడ ఉన్న వారు కేకలు వేయడంతో రైలు చైన్ లాగారు.

అప్పటికే ఆ అమ్మాయికి తీవ్రంగా గాయాలయ్యాయి. కానీ, చోద్యం ఏంటంటే అక్కడికి వచ్చినవారంతా తమ సెల్ ఫోన్లలో ఫొటోలు వీడియోలు తీసుకునేందుకు ప్రయత్నించారే తప్ప రైలు కింద ఇరుక్కుపోయి పట్టాలపై రక్తమోడుతున్న ఆమెకు ఎవరూ చేయందించలేదు. అదే సమయంలో ఆ రోజు సెలవుల కారణంగా విధులకు హాజరు కానీ రఘునాథ్ బాజిరావ్ కావ్లే (50) అనే కానిస్టేబుల్ ఈ విషయం తెలుసుకుని వేగంగా వచ్చాడు. వెంటనే అందరిని పక్కకు నెట్టేసి ఆమెను అతికష్టం మీద బయటకు తీసి స్వయంగా ఆస్పత్రికి తరలించి వైద్యం ఇప్పించాడు. దీంతో ఆ యువతి ప్రాణాలతో బయటపడింది. రెండు రోజుల కిందటే రఘునాథ్ ఓ చైన్ స్నాచర్ను బంధీగా పట్టుకున్నాడు. ఇలా అతడు ఎన్నో మంచి పనులు చేస్తూ వస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement