
ఇంటర్నెట్ వాడకం పెరగడంతో సోషల్ మీడియా వచ్చే కొన్ని వీడియోలోని వారు రాత్రికి రాత్రే సెలబ్రిటీలు కావడం ఇటీవల షరా మామూలుగా మారింది. ఈ క్రమంలో ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులోని కొన్ని నెటిజన్లుకు వినోదాన్ని పంచుతూ వైరల్‌గా మారుతున్నాయి కూడా. సరిగ్గా అలాంటి ఓ ఫన్నీ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఓ అంకుల్ రోడ్డుపై ట్రాఫిక్ పోలీస్‌తో కలసి స్టెప్పులు ఇరగదేశాడు. ఈ వీడియోను చూసి నెటిజన్లు చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
అందులో.. ఓ అంకుల్ రోడ్డు పైకి వచ్చి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పాపులర్ సాంగ్ అయిన ‘జాను మేరీ జాన్’పై అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నాడు. అంతలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు సదరు వ్యక్తితో కాలు కదిపాడు. దీంతో అటుగా వెళ్తున్న జనం వారిద్దరి డ్యాన్స్‌ని చూస్తూ అక్కడే ఉండిపోయారు. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోకి క్యాప్షన్‌గా.. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అద్భుతమైన ఉదాహరణ ఇదేనంటూ రాశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు డ్యాన్స్ షోలకి పంపిస్తే ఫైనల్స్ గ్యారెంటీ అని ఒకరు కామెంట్ చేయగా, సూపర్ డ్యాన్స్ అంకుల్ అంటూ మరోకరు కామెంట్ పెట్టారు.
ऐसे पल #PublicPoliceFriendship के खूबसूरत उदहारण हैं! #DancingCop #DancingWithCop. pic.twitter.com/8Y11Nf5sOO
— Dipanshu Kabra (@ipskabra) April 25, 2022
చదవండి: ఛీ ఛీ! 30 ఏళ్లుగా టాయిలెట్‌లో సమోసా, వాష్‌రూమ్‌లో భోజనాల తయారీ
Comments
Please login to add a commentAdd a comment