ముంబై : గ్లోబల్ మార్కెట్ల డౌన్‌ట్రెండ్‌తో సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. కార్పొరేట్ ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. జమ్ము కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులతో మదుపుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 600 పాయింట్ల పైగా నష్టంతో 36,456 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 184 పాయింట్ల నష్టంతో 10,813 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment