గ్లోబల్ దెబ్బ: మార్కెట్లు ఢమాల్
Published Thu, May 18 2017 9:42 AM | Last Updated on Tue, Sep 5 2017 11:27 AM
బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలతో స్టాక్ మార్కెట్ల హ్యాట్రిక్ రికార్డుల పరుగుకు బ్రేక్ పడింది. గురువారం ట్రేడింగ్ లో మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 108.05 పాయింట్ల మేర నష్టపోతూ 30,550 వద్ద, నిఫ్టీ 38.50 పాయింట్ల నష్టంలో 9487 వద్ద ట్రేడవుతున్నాయి. హీరో మోటార్ కార్ప్, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో, అదానీ పోర్ట్స్ టాప్ లూజర్లుగా నష్టాలు పాలవుతుండగా.. విప్రో, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ లాభాలార్జిస్తున్నాయి. నిఫ్టీలో అతిపెద్ద సూచీలన్నీ నష్టాల బాట పట్టాయి. మిడ్ క్యాప్స్, ఐటీ, ఫార్మా, ఆటో, ఎనర్జీ, ఇతర సూచీలు దిగువ స్థాయిలో ట్రేడవుతున్నాయి.
అటు డాలర్ తో రూపాయి విలువ 19 పైసలు బలహీనపడి 64.34 వద్ద ప్రారంభమైంది. గ్లోబల్ సంకేతాలతో మరోవైపు ఆసియన్ స్టాక్స్ నష్టాల్లోనే ఉన్నాయి. జపాన్ నిక్కీ 1.2 శాతం, ఆస్ట్రేలియన్ షేర్లు 1.1 శాతం నష్టపోయాయి.బలహీనమైన గ్లోబల్ సంకేతాలు బంగారానికి భారీగా సహకరించాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 537 రూపాయల మేర పైకి ఎగిసి 28,631 వద్ద ట్రేడవుతున్నాయి. కాగ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్లో తలదూర్చడానికి ప్రయత్నించారంటూ రిపోర్టులు రావడంతో గ్లోబల్ గా అనిశ్చితి ఏర్పడింది.
Advertisement
Advertisement