మార్కెట్లకు అంతర్జాతీయ పరిణామాల దెబ్బ
Published Wed, Mar 22 2017 9:49 AM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM
ముంబై:
అంతర్జాతీయంగా వస్తున్న బలహీనమైన సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్లను భారీగా దెబ్బకొట్టాయి. వరుసగా మూడో సెషన్లోనూ ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు నష్టాల్లో గడిస్తున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 171.51 పాయింట్ల నష్టంలో 29,313 వద్ద, 53.95 పాయింట్ల నష్టంలో 9067 వద్ద నిఫ్టీ ట్రేడవుతున్నాయి. ప్రారంభం ట్రేడింగ్ లో భారతీ ఎయిర్ ఇండియా 5 శాతం మేర నష్టాల గడించి, అతిపెద్ద లూజర్ గా నిలిచింది. దాని తర్వాత మహింద్రా అండ్ మహింద్రా, ఐసీఐసీఐ బ్యాంకు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బీహెచ్ఈఎల్, ఐడియా సెల్యులార్, హిందాల్కోలు నష్టపోతున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా పడిపోయింది.
27 పైసల నష్టంతో 65.56 వద్ద ప్రారంభమైంది. ట్రంప్ పాలసీ విధానాలపై ఆందోళనలు, గతవారం అమెరికా రిజర్వు బ్యాంకు కామెంట్లు డాలర్ ను నిరాశపరుస్తున్నాయి.నాలుగు నెలల కనిష్టంలోకి డాలర్ పడిపోయింది. నార్త్ కొరియా క్షిపణి పరీక్ష, డొనాల్డ్ ట్రంప్ పన్ను వాగ్ధానాలు మార్కెట్లలో ఆందోళనలు నెలకొన్నాయి. ఇదే సమయంలో యూరో ఆరు వారాల గరిష్టంలోకి ఎగిసింది. డాలర్ బలహీనంతో ఇటు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు రూ.357 లాభంతో రూ.28,862 వద్ద ట్రేడవుతున్నాయి.
Advertisement