
సాక్షి, ముంబై: అక్షయ తృతీయ మెరుపులు పసిడిని అపుడే భారీగానే తాకాయి. కొనుగోలు దారుల ఉత్సాహంతో బంగారం ధర మళ్లీ చుక్కలను తాకింది. అటు గ్లోబల్ సంకేతాలు, ఇటు దేశీయంగా నగల వ్యాపారస్థుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో పది గ్రాముల బంగారం ధర రూ.32వేల మార్కును టచ్ చేసింది. గురువారం నాటి బులియన్ ట్రేడింగ్‌లో పది గ్రాముల పసిడి ధర రూ.300 పెరిగి రూ.32,150కి చేరింది. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి భారీగా కూడా కొనుగోళ్లు పెరిగాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. సావరిన్ ఎనిమిది గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి రూ .24,900 వద్ద ఉంది. అయితే ఫ్యూచర్స్ మార్కెట్‌లో మాత్రం స్వల్ప వెనుకంజలో ఉంది.
ఇక మరో విలువైన మెటల వెండికూడా ఇదే బాటలో ధర కూడా తిరిగి రూ.40వేల మార్కుకు చేరుకుంది. కిలో వెండి ధర రూ.240 పెరిగి రూ.40వేలకు చేరింది. అంతర్జాతీయంగానూ పసిడి ధర పెరిగింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.02శాతం పెరిగి 132.80డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 0.60శాతం పెరిగి 16.65డాలర్లుగా ఉంది. మరోవైపు ఫ్యూచర్స్‌మార్కెట్ లో మాత్రం పసిడి స్వల్ప వెనుకంజలో ఉంది. కాగా ఏప్రిల్ 18న అక్షయ తృతీయ నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు స్థానిక ఆభరణాల తయారీదారులు భారీ ఆఫర్ల వెల్లువ కురుస్తున్న సంగతి తెలిసిందే. వివిధ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment