surges
-
గుప్పెడు మెతుకుల దొరక్క.. గాజాలో మిన్నంటిన ఆకలి కేకలు (ఫొటోలు)
-
పెరిగిన బ్యాంకు లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 44 శాతం ఎగసి రూ. 1,327 కోట్లను తాకింది. వడ్డీ ఆదాయం మెరుగుపడటం ఇందుకు సహకరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో సంస్థ లాభం కేవలం రూ. 920 కోట్లు. మొత్తం ఆదాయం సైతం రూ. 5,736 కోట్ల నుంచి రూ. 6,809 కోట్లకు జంప్ చేసింది.నికర వడ్డీ ఆదాయం 15 శాతంపైగా పుంజుకుని రూ.2,807 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.88 శాతం నుంచి 3.98 శాతానికి బలపడ్డాయి. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులలో బీవోఎం గరిష్ట మార్జిన్లు ఆర్జించినట్లు బ్యాంక్ ఎండీ నిధు సక్సేనా పేర్కొన్నారు. పూర్తి ఏడాదికి రూ. 5,000 కోట్ల నికర లాభం ఆర్జించే వీలున్నట్లు అంచనా వేశారు. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.19% నుంచి 1.84 శాతానికి, నికర ఎన్పీఏలు 0.23 % నుంచి 0.2 శాతానికి దిగివచ్చాయి. -
గ్లోబల్గాప్రతికూల సంకేతాలున్నా, సెన్సెక్స్ 367 పాయింట్లు జంప్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రతికూల ప్రపంచ సంకేతాలు న్నప్పటికీ దేశీయ సూచీలు హుషారుగా ఉన్నాయి. సెన్సెక్స్ 367పాయింట్లు ఎగిసి 59476 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు 17501 వద్ద కొనసాగుతున్నాయి. ఫైనాన్షియల్ షేర్ల లాభాలు సూచీలకు మద్దతిస్తున్నాయి. మరోవైపు ఐటీ షేర్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. బజాజ్ ట్విన్స్, హెచ్డీఎఫ్సీ, అదానీ పోర్ట్స్ భారీగా లాభపడుతుండగా, ఐషర్ మోటార్స్,హిందాల్కో, ఇండస్ ఇండ్బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్రధాన నష్టాల్లో ఉన్నాయి. మరోవైపు ఎంఎన్సీ రెండు రోజుల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలు రేపు వెలువడనున్నాయి. ఈ సారి 25 బేసిస్ పాయింట్ల వడ్డీరేపు పెంపు ఉంటుందని అంచనాలు భారీగా ఉన్నాయి. -
భారత్ సరికొత్త రికార్డు..! ‘చరిత్రలోనే తొలిసారిగా..! ఎన్నడూ లేని విధంగా..’
డిసెంబర్ 2021 గాను భారత్ ఎగుమతుల్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. గత నెలలో భారత్ అత్యధికంగా 37 బిలియన్ డాలర్ల ఎగుమతులను సాధించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయాల్ ట్విటర్లో తెలిపారు. ఇది 2020 డిసెంబర్‌తో పోల్చుకుంటే 37 శాతం అధిక వృద్ధిని సాధించిందని ఆయన అన్నారు. 400 బిలియన్ డాలర్ల ఎగుమతులే లక్ష్యంగా..! వస్తు, సేవల ఎగుమతుల్లో చారిత్రక గరిష్ట స్థాయిలను సాధించే దిశగా దేశం పురోగమిస్తోందని పీయూష్ గోయాల్ ట్విటర్లో తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 400 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. 2020 డిసెంబర్‌తో పోలిస్తే ఎగుమతుల్లో 80శాతంలోని టాప్ 10 ప్రధాన కమోడిటీ గ్రూప్స్ 41% వృద్ధిని సాధించాయని గోయల్ చెప్పారు. జనవరి 3 న విడుదల చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం...2021 (ఏప్రిల్-డిసెంబర్)లో అవుట్‌బౌండ్ షిప్‌మెంట్స్ గత ఆర్థిక సంవత్సరాన్ని మించాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 300 బిలియన్ల డాలర్ల ఎగుమతులు దాటినట్లు తెలుస్తోంది. జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటామని పీయూష్ గోయల్ అన్నారు. Highest ever goods exports in the history of India in Dec’21! 💰Exports over $37 Billion 📈 37% jump over Dec’20 Govt. led by PM @NarendraModi ji is providing a boost to manufacturing sector for building an #AatmanirbharBharat. pic.twitter.com/Uwxdll63Wz — Piyush Goyal (@PiyushGoyal) January 3, 2022 చదవండి: 2022–23 అంచనా..వ్యవసాయ రంగానికి రుణ లక్ష్యం రూ.18 లక్షల కోట్లు! -
అదృష్టమంటే ఇదేనేమో...! తొమ్మిదేళ్లలో రూ.6 లక్షల నుంచి రూ.216 కోట్లు.!
స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, క్రిప్టోకరెన్సీ.. ఇవ్వన్నీ సామాన్య జనాలకు అర్థం కాని సబ్జెక్ట్. ఒక్కసారి వీటిలో ప్రావీణ్యం సాధిస్తే డబ్బులే..డబ్బులు..! స్టాక్‌మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలో ప్రావీణ్యం ఉంటే రాత్రికి రాత్రే కుబేరుడు అవ్వచు లేదా బికారీ కూడా అవ్వచును. స్టాక్మార్కెట్లో పలు కంపెనీల షేర్లు పడిపోతున్నాయనో లేదా నాకు వచ్చిన లాభాలు సరిపోతాయని చెప్పి వెంటనే వెనక్కి తీసుకుంటారు. అలా చేస్తే నష్టాల నుంచి కాస్త ఉపశమనం కల్గిన..చాలా కాలంపాటు షేర్లను వెనక్కి తీసుకోకుండా కొంత కాలం పాటు వేచిచూస్తే భారీ లాభాలనే ఆర్జించవచ్చును. చదవండి: Bitcoin: బిట్‌కాయిన్ విలువ రెట్టింపుకానుందా ..! బ్లూమ్‌బర్గ్ సంచలన ప్రకటన..! ప్రస్తుతం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్ కంటే క్రిప్టోకరెన్సీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. 2009లో మొదలైన క్రిప్టోకరెన్సీలో ఒకటైన బిట్‌కాయిన్ ప్రస్థానం నేడు గణనీయంగా పెరిగింది. క్రిప్టోకరెన్నీ వచ్చిన తొలినాళ్లలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి జంకేవారు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి 2012లో సుమారు 616 బిట్‌కాయిన్ టోకన్లను కొన్నాడు. 2012లో బిట్‌కాయిన్ విలువ సుమారు 13 డాలర్లు(రూ. 978) గా ఉండేది. 616 బిట్కాయిన్ల మొత్తం 8,195 డాలర్లు (రూ. 6 లక్షలు). ఆ వ్యక్తి సుమారు తొమ్మిది సంవత్సరాలు పాటు తన బిట్‌కాయిన్ వ్యాలెట్‌ను చూసుకొలేదు. బిట్‌కాయిన్ ఒక్కసారిగా గణనీయంగా వృద్ధి చెందడంతో...బిట్‌కాయిన్ వ్యాలెట్ విలువ సుమారు రూ. 6 లక్షల నుంచి రూ. 216 కోట్ల పెరిగింది. బిట్‌కాయిన్ వ్యాలెట్‌ను వేరే వ్యాలెట్లోకి మార్చేప్పడు జరిగిన లావాదేవీలను బ్లాక్‌చైన్. కామ్ నిర్ధారించింది. ఇలాంటి సంఘటన ఈ ఏడాది జూలైలో కూడా జరిగింది. దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టి, ఓపికగా ఉంటే భారీ మొత్తాలు చేతికి వస్తాయనడంలో ఇదొక ఉదాహరణగా చెప్పకోవచ్చునని సోషల్‌మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. చదవండి: క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...! -
Elon Musk : ఫోటో షేర్ చేశాడో లేదో...! ఒక్కసారిగా పెరిగిన కరెన్సీ విలువ...!
వాషింగ్టన్: క్రిప్టోకరెన్సీ విలువ పెంచడంలో లేదా తగ్గించడంలో టెస్లా, స్పేస్ఎక్స్ కంపెనీల అధినేత ఎలన్ మస్క్ పాత్ర ఎంతగానో ఉంది. క్రిప్టోకరెన్సీపై ఎలన్ మస్క్ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. డాగ్‌కాయిన్ క్రిప్టోకరెన్సీ ఇన్వెస్టర్లు ఎలన్ మస్క్‌ను ముద్దుగా డాగీ ఫాదర్ అని పిలుచుకుంటారు. ఎందుకంటే డాగ్‌కాయిన్ క్రిప్టోకరెన్సీ విలువ పెరగడంలో మస్క్ పాత్ర ఎంతగానో ఉంది. చదవండి: Anand Mahindra Responds To Elon Musk: ఎలన్ మస్క్ వాదనతో ఏకీభవించిన ఆనంద్ మహీంద్రా..! తాజాగా ఎలన్ మస్క్ తన ట్విటర్ ఖాతాలో ఫ్లోకీ వచ్చేసింది అంటూ.. షిబా ఇను అనే బ్రీడ్‌ను పెంపుడు జంతువుగా తెచ్చుకున్నట్లు షేర్ చేశాడు. ఎలన్ మస్క్ ట్విటర్లో షేర్ చేశాడో లేదో... డాగ్‌కాయిన్ క్రిప్టోకరెన్సీ విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. కేవలం డాగ్‌కాయిన్ మాత్రమే కాకుండా బేబీ డాగ్ వంటి ఆల్ట్ నాణేలు కూడా గణనీయంగా పెరిగాయి. మస్క్ తన పెంపుడు జంతువును షేర్చేయడం...డాగ్‌కాయిన్ క్రిప్టోకరెన్సీ విలువ పెరగడానికి సంబంధం ఏమిటనీ ఆలోచిస్తున్నారా... దీనికి కారణం డాగ్‌కాయిన్ క్రిప్టోకరెన్సీ సింబల్‌ను షిబా ఇను అనే బ్రీడ్ కుక్కతో చూపిస్తారు. మరికొన్ని క్రిప్టోకరెన్సీలను కూడా ఈ బ్రీడ్తోనే చూపిస్తారు. షిబా ఫ్లోకీ థీమ్‌తో ఉన్న క్రిప్టోకరెన్సీల విలువ సుమారు 24 గంటల్లో రికార్డు స్థాయిలో 958.09 శాతం మేర పెరిగింది. మరో క్రిప్టో, ఫ్లోకి ఇను గత 24 గంటల్లో 59.08 శాతం మేర ఫ్లోకి శిబా 23.46 శాతం మేర పెరిగింది. బేబీ డాగ్ కాయిన్ విలువ 1.80 శాతం జంప్ అయ్యింది. డాగ్ కాయిన్ గడిచిన 24 గంటల్లో +0.36 శాతం మార్పును నమోదు చేసింది. Floki has arrived pic.twitter.com/2MiUKb91FT — Name (@elonmusk) September 12, 2021 చదవండి: VIDEO: టెస్లా సంచలనం.. విండ్‌షీల్డ్ ముందర కనిపించని వైపర్స్! ఆన్ చేయగానే నీళ్లకు బదులు లేజర్ కిరణాలు -
1000 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఇంట్రా డేలో సెన్సెక్స్ 1200 పాయింట్లకుపైగా ఎగిసింది, నిప్టీ కూడా 8600 పాయింట్లను టచ్ చేసినప్పటికీ ఆఖరి గంటలో లాభాల స్వీకరణ కనిపించింది. దీంతో సెన్సెక్స్ 1028 పాయింట్ల లాభంతో 29468 వద్ద, నిఫ్టీ 316 పాయింట్ల లాభంతో 8597 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగులో సెన్సెక్స్ 29500 చేరువలో, నిఫ్టీ 86వేల పాయింట్ల చేరువలో దృఢంగా ముగిసాయి. మెటల్స్, పీఎస్ఈ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లోని షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే చివర్లో బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ధోరణి నెలకొంది. బీపీసీఎల్, గయిల్, బ్రిటానియా, ఓఎన్ జీసీ, హిందాల్కో,రిలయన్స్ , విప్రో, టెక్ మహీంద్ర, యూపీఎల్, ఐటీసీ టాప్ విన్నర్స్ గా ఉన్నాయి. మరోవైపు ఇండస్ ఇండ్, బజాజ్ ఫినాన్స్, టైటన్, మారుతి సుజుకి,కోటక్ మహీంద్ర నష్టపోయాయి. మరోవైపు డాలరు మారకంలో లాభపడిన దేశీయ కరెన్సీ రూపాయి 75.51 వద్ద వుంది. -
దలాల్ స్ట్రీట్‌లో టెలికాం షేర్ల లాభాల రింగింగ్
సాక్షి, ముంబై: భారీ నష్టాలతో కుదేలైన భారత టెలికాం కంపెనీలకు ఏజీఆర్ చార్జీలు వడ్డన లాంటి తాజా పరిణామాల నేపథ్యంలో టారిఫ్‌లను సమీక్షించుకుంటున్నాయి. టెలికాం దిగ్గజ కంపెనీలైనా వొడాఫోన్-ఐడియా, భారతీ ఎయిర్టెల్ డిసెంబర్ 1 నుంచి కాల్‌చార్జీలను పెంచాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయంతో ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా షేర్లు మంగళవారం సెషన్లో 52 వారాలా గరిష్టాన్ని తాకి జోరుగా సాగుతున్నాయి. భారతీ ఎయిర్టెల్ 5 శాతం లాభంతో కొనసాగుతోంది. గత మూడు రోజుల్లో ఎయిర్టెల్ షేరు 20 శాతం ఎగిసింది. వొడాఫోన్-ఐడియా షేర్లు కూడా ఇదే బాటలో మంగళవారం సెషన్లో ర్యాలీ చేస్తున్నాయి. 25 శాతం లాభంతో కొనసాగుతోంది. కాగా మూడు సెషన్లుగా 80 శాతం లాభపడింది. దీంతో బ్రోకరేజ్ సంస్థలు ‘హోల్డ్’కు రేటింగ్‌ను ఇస్తున్నారు. మోర్గాన్ స్టాన్లీ భారతి ఎయిర్టెల్ టార్గెట్ ధరను అంతకుముందు 360 రూపాయల నుండి రూ. 410కు పెంచింది. కాగా క్యూ 2 లో భారతి ఎయిర్టెల్, వొడాఫోన ఐడియా రెండూ అత్యధిక త్రైమాసిక నష్టాన్ని నివేదించాయి. వొడాఫోన్ ఐడియా క్యూ 2లో రూ.50921 కోట్ల నికర నష్టాన్ని, భారతి ఎయిర్టెల్ త్రైమాసిక నష్టం రూ. 28,450 కోట్లు నమోదుచేసిన సంగతి తెలిసిందే. -
క్యూ2లో హెచ్డీఎఫ్సీ అదుర్స్
సాక్షి, ముంబై: హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డిఎఫ్‌సి) బ్యాంక్ మంచి ఫలితాలను కనబరిచింది. 2019 సెప్టెంబర్ 30 తో ముగిసిన రెండవ త్రైమాసికంలో తన నికర లాభంలో రూ .3,961.53 కోట్లకు 60.57 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 2,467.08 కోట్ల రూపాయల నికర లాభాన్నిగడించినట్టు బ్యాంకు స్టాక్ ఎక్స్ఛేంజ్ సమాచారంలో తెలిపింది. క్యూ2లో నిర్వహణ ఆదాయం 10శాతం వృద్ధి చెంది రూ.10,478.33 కోట్లను సాధించింది. గతేడాది క్యూ2లో రూ.9,494.70 కోట్లుగా నమోదైంది. ఈ క్వార్టర్లో నికర వడ్డీ మార్జిన్ 3.3శాతంగా ఉంది. రుణ వృద్ధి 12శాతం జరిగింది. నికర వడ్డీ ఆదాయం గతేడాది క్యూ2లో సాధించిన రూ.2,594 కోట్లతో పోలిస్తే 16.5శాతం పెరిగి రూ.3,021 కోట్లను ఆర్జించింది. ఇక ఇదే కాలంలో మొండి బకాయిలకు రూ.754 కోట్ల ప్రోవిజన్లు కేటాయించింది. కాగా గతేడాది క్యూ2లో రూ.890 కోట్లను కేటాయించింది. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల ఎన్పీఏలు 1.29శాతం నుంచి 1.33శాతానికి పెరిగాయి. జూన్ క్వార్టర్లో రూ.5,315 కోట్లు నమోదు కాగా, ఈ క్వార్టర్ నాటికి రూ.5,655 కోట్లకు పెరిగాయి. ఇదే క్వార్టర్లో పన్ను వ్యయం రూ.568 కోట్లుగా ఉంది. గతేడాది ఇదే క్యూ2లో రూ.1,022 కోట్లుగా నమోదైంది. సగటు రుణ పరిమాణం విలువ తగ్గినట్లు బ్యాంక్ తెలిపింది. రుణాలలో 76 శాతం వాటా వ్యక్తిగతమైనవేనంటూ కంపెనీ తెలియజేసింది. వ్యక్తిగత రుణాలలో 17 శాతం పురోగతిని సాధించినట్లు తెలియజేసింది. ఈ ఫలితాల వెల్లడితో హెచ్డీఎఫ్సీ షేరు 2 శాతానికిపైగా లాభాలతో ముగిసింది. హెచ్‌డిఎఫ్‌సి తన అనుబంధ సంస్థ గ్రుహ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గ్రుహ్) లో దాదాపు 10 శాతం వాటాను విక్రయించింది. ఆర్బిఐ ఆదేశాల మేరకు బంధన్ బ్యాంకులో విలీనం కోసం అనుబంధ సంస్థలో ఉన్న హోల్డింగ్‌ను తగ్గించాలని. ఈ త్రైమాసికంలో, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, అహ్మదాబాద్ , కోల్‌కతా బెంచ్‌లు గ్రుహ్ను బంధన్ బ్యాంక్‌తో కలిపే పథకానికి ఆమోదం తెలిపినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. -
అదరగొట్టిన యాక్సిస్ బ్యాంకు
సాక్షి,ముంబై : ప్రయివేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంకు మూడవ త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. విశ్లేషకులు అంచనా వేసినదానికంటే మెరుగైన ఫలితాలు ప్రకటించింది. నికర లాభాల్లో ఏకంగా 131 శాతం పుంజుకుంది. గత ఏడాది డిసెంబరు 31తో ముగిసిన క్యూ3లో రూ.1681 కోట్ల నికరలాభాలను ఆర్జించింది. ఇది రూ.1197కోట్లుగా ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేశారు. నిరర్థక ఆస్తుల్లో స్వల్పంగా క్షీణత నమోదైంది. బ్యాంకు మాజీ సీఈవో శిఖా శర్మ ఆధ్వర్యంలో నికర లాభం, వడ్డీ లాభం సహా అన్ని విధాలుగా మెరుగైన ప్రదర్శనతో బ్యాంకు ఆకట్టుకుంది. నికర నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 2.54 నుంచి 2.36 (రూ.12233.3 కోట్లు) శాతానికి తగ్గగా, గ్రాస్ ఎన్పీఏ 5.9 నుంచి 5.7 (రూ.30854.70 కోట్లు)శాతానికి తగ్గింది. నికర వడ్డీ ఆదాయం రూ.5603.60 కోట్లు గా నమోదు చేసింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.47 శాతం, ప్రొవిజన్స్ రూ.3054 కోట్లు, రిటైల్ లోన్ బుక్ వృద్ధి 20 శాతంగా ఉన్నాయి. మార్కెట్ సమయం ముగిసిన తర్వాత ఈ ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో రేపటి ట్రేడింగ్‌లో యాక్సిస్ బ్యాంకు కౌటర్లో లాభాలను అంచనావేస్తున్నారు ఎనలిస్టులు. -
రూ.32వేలను దాటేసిన బంగారం
సాక్షి, ముంబై: అక్షయ తృతీయ మెరుపులు పసిడిని అపుడే భారీగానే తాకాయి. కొనుగోలు దారుల ఉత్సాహంతో బంగారం ధర మళ్లీ చుక్కలను తాకింది. అటు గ్లోబల్ సంకేతాలు, ఇటు దేశీయంగా నగల వ్యాపారస్థుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో పది గ్రాముల బంగారం ధర రూ.32వేల మార్కును టచ్ చేసింది. గురువారం నాటి బులియన్ ట్రేడింగ్‌లో పది గ్రాముల పసిడి ధర రూ.300 పెరిగి రూ.32,150కి చేరింది. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి భారీగా కూడా కొనుగోళ్లు పెరిగాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. సావరిన్ ఎనిమిది గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి రూ .24,900 వద్ద ఉంది. అయితే ఫ్యూచర్స్ మార్కెట్లో మాత్రం స్వల్ప వెనుకంజలో ఉంది. ఇక మరో విలువైన మెటల వెండికూడా ఇదే బాటలో ధర కూడా తిరిగి రూ.40వేల మార్కుకు చేరుకుంది. కిలో వెండి ధర రూ.240 పెరిగి రూ.40వేలకు చేరింది. అంతర్జాతీయంగానూ పసిడి ధర పెరిగింది. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.02శాతం పెరిగి 132.80డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 0.60శాతం పెరిగి 16.65డాలర్లుగా ఉంది. మరోవైపు ఫ్యూచర్స్‌మార్కెట్ లో మాత్రం పసిడి స్వల్ప వెనుకంజలో ఉంది. కాగా ఏప్రిల్ 18న అక్షయ తృతీయ నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు స్థానిక ఆభరణాల తయారీదారులు భారీ ఆఫర్ల వెల్లువ కురుస్తున్న సంగతి తెలిసిందే. వివిధ ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
విమానాల రద్దు సెగ: చార్జీల మోత
సాక్షి, న్యూఢిల్లీ: విమానయాన సంస్థల నిర్ణయంతో విమాన టికెట్ చార్జీలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ప్రధాన ఎయిర్‌లైన్స్ ఇండిగో, గో ఎయిర్ తమ సర్వీసులను రద్దు చేయడంతో కొన్ని కీలక మార్గాల్లో చార్జీల మోత మోగుతోంది. ముఖ్యంగా రద్దయిన విమానాలకు చెందిన ప్రయాణీకులు సదరు టికెట్లను కాన్సిల్ చేసుకోవడం, తిరిగి టికెట్లను బుక్ చేసుకోవడం తప్పనిసరి. కొన్ని ప్రధానమైన రూట్లలో 10శాతం చార్జీలు పెరిగాయి. దీంతో వేలాది మంది విమానప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దేశీయ పెద్ద విమానయాన సంస్థలు ఇండిగో దాదాపు 65 విమానాలను, గో ఎయిర్ 11 విమానాలను రద్దు చేయడంతో లాస్ట్ మినిట్ ప్రయాణీకులకు భారీ షాక్ తగిలింది. విమానాలు రద్దు చేయడం కొన్ని కీలక మార్గాల్లో అత్యవసరంగా ప్రయాణించే ప్రయాణీకులపై గణనీయమైన ప్రభావాన్ని చూపిందని ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్ ప్రతినిధి శరత్ దలాల్ తెలిపారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబైల మధ్య వన్‌వే టికెట్లు రూ.12వేల ధర పలికినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది మరింత పుంజుకునే అవకాశం ఉందని అంచనావేశారు. దాదాపు 5-10శాతం పెరుగుదల ఉంటుందన్నారు. టైర్ -2 విమానాల ఛార్జీలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. మంగళవారం ఢిల్లీ, భువనేశ్వర్ మధ్య చివరి నిమిషంలో బుక్ చేసుకున్న టికెట్ చార్జీలు రూ .7వేలు- రూ .29వేలు ఉండగా, బుధవారం నాటి ధరలు రూ.9వేలనుంచి -రూ.27వేలుగా ఉంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై రూట్లో కూడా బుధవారం దాదాపు రూ. 5వేలు-24వేల మధ్య పలుకుతుండటం గమనార్హం. ఇండిగో అధికారిక వెబ్సైట్ అందించిన సమాచారం ఇండిగో బుధవారం 42 విమానాలను రద్దు చేసింది. ముంబయి, కోల్‌కతా పుణె, జైపూర్, శ్రీనగర్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, డెహ్రాడూన్, అమృత్సర్, బెంగళూరు, హైదరాబాద్ రూట్లు ఇందులో ఉన్నాయి. అయితే గో ఎయిర్‌కు సంబంధించిన వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. మరోవైపు ప్రయాణీకుల ఇబ్బందులకు తొలగించేందుకు చర్యలు తీసుకంటామని ఇరు సంస్థలు పేర్కొన్నాయి. కాన్సిలేషన్ చార్జీలు రద్దు, రీషెడ్యూలింగ్ లాంటి చర్యలు చేపట్టుతున్నటు నిన్న ప్రకటించాయి. కాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రాట్ అండ్ విట్నీఇంజిన్ల వైఫల్యాల కారణంగా ఎ320 నియో(న్యూ ఇంజిన్ ఆప్షన్) విమానాలను నిలిపివేస్తోంది. సోమవారం అహ్మదాబాద్ నుంచి లక్నో మీదుగా కోల్‌కతా వెళ్తున్న ఇండిగోకు చెందిన ఎయిర్ బస్ ఏ320 నియో విమానం ఎగిరిన కొన్ని నిమిషాలకే దాంట్లోని పిడబ్ల్యూ 1100 ఇంజన్ మొరాయించిన కొన్ని గంటల్లోనే డీజీసీఏ ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్ల వైఫల్యాలున్న ఎ320 నియో విమానాలు నిలిపివేత ప్రారంభించింది. విమానాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పట్నా, శ్రీనగర్, భువనేశ్వర్, అమృత్సర్, గౌహతి తదితర నగరాల నుంచి వెళ్లాల్సిన కొన్ని విమానాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దేశీయ విమానయాన రంగంలో ఇండిగోకు 40శాతం, గోఎయిర్‌కు 10శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. -
న్యూ ఇయర్లో రూపాయి మెరుపులు
సాక్షి, ముంబై: కొత్త ఏడాది ఆరంభంలో ఈక్విటీ మార్కెట్లు నిరాశ పరిస్తే దేశీయ కరెన్సీ మాత్రం ఉత్తేజాన్ని ఇచ్చింది. డాలర్ మారకంలో రుపీ సుమారు 5 నెలల గరిష్టాన్ని తాకింది. డాలర్‌తో పోలిస్తే 63.65 స్థాయిని నమోదు చేసింది. ఆగస్టు, 2017 తరువాత ఈ స్థాయిని తాకింది. అంతేకాదు 2018 సంవత్సరంలో రూపాయి విలువ మరింత పుంజుకుంటుందని ఎనలిస్టులు పేర్కొనడం విశేషం. డాలర్ మారకంతో రూపాయి మారకం విలువ డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. శుక్రవారం 21 పైసలు పెరిగి 63.87 వద్ద ముగిసింది . కాగా సోమవారం 41 పైసలు ఎగిసి 63.63 స్థాయిని టచ్ చేసింది. అమెరికన్ కరెన్సీ డాలర్లో బ్యాంకర్లు, ఎగుమతిదారులు భారీ అమ్మకాలు తదితర కారణాలు దేశీయ కరెన్సీకి సానుకూలంగా మారాయని నిపుణుల అంచనా. అటు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి రూపాయికి మద్దతు లభించింది. బిఎస్ఇ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ భారీ నష్టాల్లో ముగిసినప్పటికీ మార్కెట్లు స్థిరంగా ఉండడం రూపాయికి లాభించింది. 2017లో రూపాయి 6శాతం ఎగిసింది. అలాగే డాలర్ కూడా ఇతర గ్లోబల్ కరెన్సీలతో పోలిస్తే లాభాలనే గడించింది. మరోవైపు 2018 మొదటి త్రైమాసికంలో రూపాయి 63 స్థాయికి చేరుతుందని ఫారెక్స్ సలహా సంస్థ ఐఎఫ్ఎ గ్లోబల్ పేర్కొంది. 2018 సంవత్సరం రూపాయికి సానుకూలంగా ఉండనుందని ఫారెక్స్ ఎడ్వైజరీ సంస్థ తెలిపింది. -
శర్దా ఎనర్జీ అండ్ మినరల్స్ జోష్..
ముంబై: శర్దా ఎనర్జీ అండ్ మినరల్స్ బుధవారం నాటి మార్కెట్ లో దూసుకుపోతోంది. ఐరన్ వోర్ (ఇనుప ఖనిజం) మైనింగ్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడంతో శర్దా ఎనర్జీ అండ్ మినరల్స్ కౌంటర్లో జోష్ పెరిగింది. మదుపర్ల కొనుగోళ్లతో శర్దా సుమారు 8 శాతం జంప్‌చేసింది. నిలిచి పోయిన ఇనుప ధాతువు వెలికితీత పనులు పునరుద్ధించినట్టు కంపెనీ బీఎస్సీ ఫైలింగ్ తో తెలిపింది. దీంతో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు శర్దా వైపు మళ్లారు నక్సలైట్ల దాడి కారణంగా మార్చి 7న నిలిచిపోయిన మైనింగ్ కార్యకలాపాలు తిరిగి మొదలు పెట్టినట్టు తెలిపింది. అయితే శర్దా లో కార్యకలాపాలు పునఃప్రారంభంతో కౌంటర్లో కొనుగోళ్ల ధోరణి నెలకొందని మార్కెట్ విశ్లేషకుల అంచనా . -
స్టాక్ మార్కెట్ల సర్ప్రైజ్ ర్యాలీ
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకుపోయాయి. ఆరంభంలోనే 200 పాయింట్లకు పైగా ఎగిసిన దలాల్ స్ట్రీట్ చివరివరకు తన హవాను కొనసాగించాయి. అటు డాలర్ తో పెలిస్తే బలపడిన రూపాయి మార్కెట్లకు మరింత ఊతమిచ్చింది. దీనికితోడు,ముడి చమురు ధరలు, ఆరోగ్యకరమైన క్యూ 2 ఆర్థిక ఫలితాలు విడుదల అంచనాలతో కీలక సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు పచ్చ పచ్చగా ముగిసాయి. ప్రధానంగా బ్యాంకింగ్ రంగ జోరు మార్కెట్లను పరుగులు పెట్టించింది. ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలు, జీఎస్టీ కౌన్సిల్ మూడు రోజుల సమావేశాలు , వాల్యూ బైయింగ్ తో సెన్సెక్స్ 521 పాయింట్లు లాభపడి 28,050వద్ద, నిఫ్టీ 158 పాయింట్ల లాభంతో 8677 వద్ద ముగిసాయి. సెన్సెక్స్ సాంకేతికంగా కీలకమైన 28,000 స్థాయిని, నిఫ్టీ 8670 స్థాయిని దాటి 87 వేల వైపు పరుగులు పెడుతోంది. మెటల్స్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఆటో, రియల్టీ రంగాలతో పాటు బ్యాంకింగ్ జోరు కొనసాగింది. అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్ గా నిల్వగా , ఐసీఐసీఐ, భెల్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్ , టాటా స్టీల్, అరబిందో, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బ్యాంక్, ఎల్అండ్టీ, బీవోబీ, ఐటీసీ , జీ ఎంటర్ టైన్ మెంట్, టెక్ మహీంద్రా, ఆర్ ఐ ఎల్ లాభపడగా ఇన్ఫ్రాటెల్, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ, బీపీసీఎల్,భారతి ఎయిర్ టెల్, నష్టపోయాయి. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి బాగాపుంజుకుంది. 18 పైసలు బలపడి 66.71 దగ్గర ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో పది గ్రా. పుత్తడి 67 రూపాయల లాభంతో రూ.29, 772 వద్ద ఉంది. -
ఫలితాల జోరుతో గీతాంజలి
ముంబై: ఒకవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతోంటే ఆభరణాల షేర్లు మాత్రం బుధవారం నాటిమార్కెట్లో మెరుపులు మెరిపించాయి. ప్రధానంగా మంగళవారం ఫలితాలను ప్రకటించిన గీతాంజలి జెమ్స్ షేరు భారీ లాభాలను ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం భారీ నికర లాభాలను ప్రకటించడంతో ఈ షేర్ 20 శాతం లాభాలతో అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఈ జోరుతో తాజా జ్యువెలర్స్, పీసీ జ్యువెలర్స్, త్రిభువన్దాస్(టీబీజెడ్) టైటన్, రాజేష్ ఎక్స్పోర్ట్స్తదితర షేర్లు దూసుకెళ్లాయి. . పెళ్లిళ్లు, పండుగల సీజన్ పుత్తడి ధరలకు పాజిటివ్ సంకేతతమని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. రుణాల ఖర్చు గణనీయంగా తగ్గిందని సంస్థ సలహాదారు అభిషేక్ గుప్త తెలిపారు. , భవిష్యత్తులో మరింత సంస్థ వడ్డీ ఖర్చు తదుపరి త్రైమాసికాల్లో మరింత దిగి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
పీవీఆర్ పై కన్నేసిన వాండా?
ప్రముఖ థియేటర్ల నిర్వహణ సంస్థ పీవీఆర్ లిమిటెడ్ లో అతిపెద్దవాటాను చైనాకు చెందిన ఒక ప్రముఖ కంపెనీ కొనుగోలు చేయనుందన్న వార్తలు వెలు వడ్డాయి.. మల్టీఫ్లెక్స్ రంగంలో దూసుకుపోతున్న పీవీఆర్ లో మేజర్ షేర్ కొనుగోలుకు చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు హల్ చల్ చేశాయి. చైనా రియల్టీ దిగ్గజం దలియాన్ వాండా గ్రూప్ పీవీఆర్ ను కొనుగోలు చేయనుందన్న అంచనాలతో మార్కెట్ల్ ఈ షేర్ భారీ లాభాలను ఆర్జించింది. సుమారు 8 శాతం ఎగిసి 52 వారాల గరిష్టాన్ని తాకింది. చైనాలోని సుప్రసిద్ధ బహుళజాతి సంస్థ, ఆసియాలో అతిపెద్ద సినిమా గ్రూప్, థియేటర్ ఆపరేటర్ వాండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భారతదేశం యొక్క మల్టీప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్‌లో వాటాల కొనుగోలు చర్చలు జరుపుతోందట. మరోవైపు ఈ వార్తల నేపథ్యలో బీఎస్ఈ పీవీఆర్ ను వివరణ యివ్వాల్సిందిగా కోరింది. కాగా పీవీఆర్ ప్రస్తుతం దేశంలోని 48 నగరాల్లో 557 స్ర్కీన్లతో విజయవంతంగా తన వ్యాపారాన్ని సాగిస్తోంది. ఇటీవల ముంబైలోని ఆరు స్ర్కీన్ల మల్టీప్లెక్స్ ఎక్స్ పీరియాను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. -
భారీ లాభాలతో 15 నెలల గరిష్టానికి నిఫ్టీ
ముంబై: ఆసియన్ మార్కెట్ల పాజిటివ్ ట్రేడింగ్‌తో శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు చివరి వరకూ అదే ట్రెండ్ ను కొనసాగించాయి. సెన్సెక్స్ 364 పాయింట్ల లాభంతో28,078, దగ్గర నిఫ్టీ132 పాయింట్ల లాభంతో 8,683 దగ్గర ముగిసాయి. కొనుగోళ్ల మద్దతుతో కొనసాగిన ర్యాలీతో నిఫ్టీ మరోసారి దూసుకెళ్లి 15 నెలల గరిష్టాన్ని తాకింది. వీకెండ్ లోమార్కెట్లు పాజిటివ్ నోట్ ముగియడంతో మదుపర్లలో ఉత్సాహం నెలకొంది. బ్యాంకింగ్ సెక్టార్ ఐసీఐసీబ్యాంక్ భారీ లాభాలతో మెరిపించింది. అలాగే టైర్ల షేర్లు లాభాలను ఆర్జించాయి. జేకే టైర్స్, 10 శాతం, అపోలో టైర్స్ 8శాతం సీయట్ 5 శాతం లాభాలను గడించాయి. క్యూ1 ఫలితాలను ప్రకటించిన భారత్ ఫోర్జ్ కూడా 5 శాతం ర్యాలీ అయింది. పీఎస్‌యూ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ వంటి కౌంటర్లలో అటు ట్రేడర్ల షార్ట్ కవరింగ్ తో సిమెంట్, ఆటో వంటి కౌంటర్లలో తాజా కొనుగోళ్లు చేపట్టడం వంటి అంశాలు ప్రధాన సూచీలకు జోష్‌నిచ్చాయి. దీంతో సెన్సెక్స్ చివరి పావుగంటలో భారీ లాభాలతో హైజంప్ చేసింది. ఆటో ఇండెక్స్ 3.3 శాతం దూసుకెళితే, మెటల్స్, రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్, బ్యాంక్ నిఫ్టీ 2.5-2 శాతం లాభపడ్డాయి. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ బిల్లుకి ఆమోదం లభించనుందనే అంచనాలు, దేశవ్యాప్తంగా విస్తరించిన వర్షపాతం, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ కూడా సహాయక ప్యాకేజీ , వడ్డీ రేట్లలో కోత పెట్టడం వంటి పలు సానుకూల అంశాలు దేశీ స్టాక్స్‌కు బూస్ట్ నిచ్చాయని ఎనలిస్టుల అంచనా. మరోవైపు ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లు నిరవధికంగా ఇన్వెస్ట్ చేస్తుండటంతోపాటు మిగిలిన ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్లు ఆశావహ వృద్ధిని సాధిస్తుండటంతో పెట్టుబడుల అంచనాలు బలపడుతున్నాయని భావిస్తున్నారు. -
15 నెలల గరిష్టానికి నిఫ్టీ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఒక దశలో సుమారు 200 పాయింట్లకు పైగా ర్యాలీ అయ్యాయి. సెన్సెక్స్ 149 పాయింట్ల లాభంతో 28,125 వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 8,641వద్ద కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టీ 15 నెలల గరిష్టాన్ని తాకింది. మంగళవారం వంద పాయింట్లకుపైగా నష్టంతో ముగిసిన మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. అనంతరం పుంజుకున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో,క్యాపిటల్ గూడ్స్ రంగంలో లాభాలను మార్కెట్ల ను లీడ్ చేస్తున్నాయి. అలాగే నికర లాభాల్లో 22 శాతం వృద్ధిని నమోదు చేసిన జీ ఎంటర్ టైన్ మెంట్ షేరు 3శాతానికిపైగా లాభపడింది. మరోవైపు కుదేలైన డా.రెడ్డీస్ షేర్లు దాదాపు 10 శాతానికి పైగా నఫ్టపోయాయి. బ్యాకింగ్ రంగం షేర్లలో భారీ కొనుగోళ్ల ఒ త్తిడి నెలకొనడంతో బ్యాంక్ నిఫ్టీ 214 పాయింట్లకు పైగా పుంజుకుంది. ఐసీఐసీఐ టాప్ గెయినర్ గా నిలవగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్,ఎస్ బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా , కెనరా బ్యాంకు, కోటక్ మహీంద్ర, ఇందస్ ఇండ్ తదితర బ్యాకింగ్ షేర్లు లాభాలను ఆర్జిస్తున్నాయి. కాగా నిఫ్టీ 50 స్టాక్ లలో 46 లాభాల్లో ఉండగా... అయిదు నష్టాల్లో ఉన్నాయి. -
భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు
ముంబై: స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ గురువారం లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 238 పాయింట్ల లాభంతో 27,750 దగ్గర, నిఫ్టీ 71 పాయింట్ల లాభంతో 8,420 దగ్గర ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 84 వేలకు పైన ట్రేడవుతోంది. అటు గతకొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న పసిడి కూడా లాభాల్లో కొనసాగుతోంది. పది గ్రాముల బంగారం ధర 26 వేలకు ఎగువన ట్రేడవుతోంది. మరోవైపు చైనా కరెన్సీ యాన్ మూడో రోజు కూడా మరింత పతనమైంది. భారీగా పడిపోతున్న యాన్ విలువ పతనం, ప్రపంచంలోని మార్కెట్లను, రూపాయి విలువను ప్రభావితం చేస్తోంది. డాలర్ తో పోలిస్లే రూపాయి విలువ 48 పైపల నష్టంతో 64.71 దగ్గర ఉంది. -
త్యాగానికి ప్రతీక బక్రీద్