క్యూ2లో 44% వృద్ధితో రూ. 1,327 కోట్లకు అప్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 44 శాతం ఎగసి రూ. 1,327 కోట్లను తాకింది. వడ్డీ ఆదాయం మెరుగుపడటం ఇందుకు సహకరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో సంస్థ లాభం కేవలం రూ. 920 కోట్లు. మొత్తం ఆదాయం సైతం రూ. 5,736 కోట్ల నుంచి రూ. 6,809 కోట్లకు జంప్ చేసింది.
నికర వడ్డీ ఆదాయం 15 శాతంపైగా పుంజుకుని రూ.2,807 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.88 శాతం నుంచి 3.98 శాతానికి బలపడ్డాయి. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులలో బీవోఎం గరిష్ట మార్జిన్లు ఆర్జించినట్లు బ్యాంక్ ఎండీ నిధు సక్సేనా పేర్కొన్నారు. పూర్తి ఏడాదికి రూ. 5,000 కోట్ల నికర లాభం ఆర్జించే వీలున్నట్లు అంచనా వేశారు. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.19% నుంచి 1.84 శాతానికి, నికర ఎన్‌పీఏలు 0.23 % నుంచి 0.2 శాతానికి దిగివచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment