పీవీఆర్ పై కన్నేసిన వాండా?
ప్రముఖ థియేటర్ల నిర్వహణ సంస్థ పీవీఆర్ లిమిటెడ్ లో అతిపెద్దవాటాను చైనాకు చెందిన ఒక ప్రముఖ కంపెనీ కొనుగోలు చేయనుందన్న వార్తలు వెలు వడ్డాయి.. మల్టీఫ్లెక్స్ రంగంలో దూసుకుపోతున్న పీవీఆర్ లో మేజర్ షేర్ కొనుగోలుకు చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు హల్ చల్ చేశాయి. చైనా రియల్టీ దిగ్గజం దలియాన్ వాండా గ్రూప్ పీవీఆర్ ను కొనుగోలు చేయనుందన్న అంచనాలతో మార్కెట్ల్ ఈ షేర్ భారీ లాభాలను ఆర్జించింది. సుమారు 8 శాతం ఎగిసి 52 వారాల గరిష్టాన్ని తాకింది.
చైనాలోని సుప్రసిద్ధ బహుళజాతి సంస్థ, ఆసియాలో అతిపెద్ద సినిమా గ్రూప్, థియేటర్ ఆపరేటర్ వాండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భారతదేశం యొక్క మల్టీప్లెక్స్ ఆపరేటర్ పీవీఆర్లో వాటాల కొనుగోలు చర్చలు జరుపుతోందట. మరోవైపు ఈ వార్తల నేపథ్యలో బీఎస్ఈ పీవీఆర్ ను వివరణ యివ్వాల్సిందిగా కోరింది.
కాగా పీవీఆర్ ప్రస్తుతం దేశంలోని 48 నగరాల్లో 557 స్ర్కీన్లతో విజయవంతంగా తన వ్యాపారాన్ని సాగిస్తోంది. ఇటీవల ముంబైలోని ఆరు స్ర్కీన్ల మల్టీప్లెక్స్ ఎక్స్ పీరియాను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.