ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఒక దశలో సుమారు 200 పాయింట్లకు పైగా ర్యాలీ అయ్యాయి. సెన్సెక్స్ 149 పాయింట్ల లాభంతో 28,125 వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 8,641వద్ద కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టీ 15 నెలల గరిష్టాన్ని తాకింది. మంగళవారం వంద పాయింట్లకుపైగా నష్టంతో ముగిసిన మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. అనంతరం పుంజుకున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో,క్యాపిటల్ గూడ్స్ రంగంలో లాభాలను మార్కెట్ల ను లీడ్ చేస్తున్నాయి. అలాగే నికర లాభాల్లో 22 శాతం వృద్ధిని నమోదు చేసిన జీ ఎంటర్ టైన్ మెంట్ షేరు 3శాతానికిపైగా లాభపడింది. మరోవైపు కుదేలైన డా.రెడ్డీస్ షేర్లు దాదాపు 10 శాతానికి పైగా నఫ్టపోయాయి. బ్యాకింగ్ రంగం షేర్లలో భారీ కొనుగోళ్ల ఒ త్తిడి నెలకొనడంతో బ్యాంక్ నిఫ్టీ 214 పాయింట్లకు పైగా పుంజుకుంది. ఐసీఐసీఐ టాప్ గెయినర్ గా నిలవగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్,ఎస్ బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా , కెనరా బ్యాంకు, కోటక్ మహీంద్ర, ఇందస్ ఇండ్ తదితర బ్యాకింగ్ షేర్లు లాభాలను ఆర్జిస్తున్నాయి. కాగా నిఫ్టీ 50 స్టాక్ లలో 46 లాభాల్లో ఉండగా... అయిదు నష్టాల్లో ఉన్నాయి.
15 నెలల గరిష్టానికి నిఫ్టీ
Published Wed, Jul 27 2016 11:05 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
Advertisement
Advertisement