భారీ లాభాలతో 15 నెలల గరిష్టానికి నిఫ్టీ | Nifty Surges To Fresh 15-Month High Amid Broad-Based Rally | Sakshi
Sakshi News home page

భారీ లాభాలతో 15 నెలల గరిష్టానికి నిఫ్టీ

Published Fri, Aug 5 2016 4:00 PM | Last Updated on Wed, Oct 17 2018 5:19 PM

Nifty Surges To Fresh 15-Month High Amid Broad-Based Rally

ముంబై:  ఆసియన్ మార్కెట్ల పాజిటివ్ ట్రేడింగ్తో  శుక్రవారం  భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్  మార్కెట్లు  చివరి వరకూ అదే ట్రెండ్ ను కొనసాగించాయి.  సెన్సెక్స్ 364 పాయింట్ల లాభంతో28,078, దగ్గర నిఫ్టీ132  పాయింట్ల లాభంతో 8,683 దగ్గర ముగిసాయి. కొనుగోళ్ల మద్దతుతో కొనసాగిన ర్యాలీతో  నిఫ్టీ మరోసారి  దూసుకెళ్లి 15  నెలల గరిష్టాన్ని తాకింది. వీకెండ్ లోమార్కెట్లు పాజిటివ్ నోట్ ముగియడంతో మదుపర్లలో ఉత్సాహం  నెలకొంది. బ్యాంకింగ్ సెక్టార్  ఐసీఐసీబ్యాంక్  భారీ లాభాలతో మెరిపించింది. అలాగే టైర్ల షేర్లు లాభాలను ఆర్జించాయి.  జేకే టైర్స్, 10 శాతం, అపోలో టైర్స్ 8శాతం సీయట్  5 శాతం లాభాలను గడించాయి. క్యూ1  ఫలితాలను ప్రకటించిన భారత్ ఫోర్జ్ కూడా 5 శాతం ర్యాలీ అయింది. 

పీఎస్‌యూ బ్యాంక్‌, ఎఫ్‌ఎంసీజీ వంటి కౌంటర్లలో అటు ట్రేడర్ల షార్ట్‌ కవరింగ్‌ తో సిమెంట్‌, ఆటో వంటి కౌంటర్లలో తాజా కొనుగోళ్లు  చేపట్టడం వంటి అంశాలు ప్రధాన సూచీలకు జోష్‌నిచ్చాయి. దీంతో సెన్సెక్స్‌ చివరి పావుగంటలో భారీ లాభాలతో హైజంప్‌ చేసింది. ఆటో ఇండెక్స్‌ 3.3 శాతం దూసుకెళితే, మెటల్స్‌, రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్‌, బ్యాంక్‌ నిఫ్టీ 2.5-2 శాతం  లాభపడ్డాయి.
 
సుదీర్ఘ కాలంగా  పెండింగ్‌లో ఉన్న జీఎస్‌టీ బిల్లుకి ఆమోదం లభించనుందనే అంచనాలు, దేశవ్యాప్తంగా విస్తరించిన వర్షపాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ కూడా సహాయక ప్యాకేజీ , వడ్డీ రేట్లలో కోత పెట్టడం వంటి పలు సానుకూల అంశాలు దేశీ స్టాక్స్‌కు బూస్ట్‌  నిచ్చాయని  ఎనలిస్టుల అంచనా.  మరోవైపు ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లు నిరవధికంగా ఇన్వెస్ట్‌ చేస్తుండటంతోపాటు మిగిలిన ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే భారత  మార్కెట్లు ఆశావహ వృద్ధిని సాధిస్తుండటంతో పెట్టుబడుల అంచనాలు బలపడుతున్నాయని భావిస్తున్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement