ముంబై: ఒకవైపు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతోంటే ఆభరణాల షేర్లు మాత్రం బుధవారం నాటిమార్కెట్లో మెరుపులు మెరిపించాయి. ప్రధానంగా మంగళవారం ఫలితాలను ప్రకటించిన గీతాంజలి జెమ్స్ షేరు భారీ లాభాలను ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం భారీ నికర లాభాలను ప్రకటించడంతో ఈ షేర్ 20 శాతం లాభాలతో అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఈ జోరుతో తాజా జ్యువెలర్స్, పీసీ జ్యువెలర్స్, త్రిభువన్‌దాస్(టీబీజెడ్) టైటన్, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌తదితర షేర్లు దూసుకెళ్లాయి. . పెళ్లిళ్లు, పండుగల సీజన్ పుత్తడి ధరలకు పాజిటివ్ సంకేతతమని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి.
రుణాల ఖర్చు గణనీయంగా తగ్గిందని సంస్థ సలహాదారు అభిషేక్ గుప్త తెలిపారు. , భవిష్యత్తులో మరింత సంస్థ వడ్డీ ఖర్చు తదుపరి త్రైమాసికాల్లో మరింత దిగి వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఫలితాల జోరుతో గీతాంజలి
Published Wed, Sep 14 2016 4:06 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
Advertisement