న్యూఢిల్లీ: భారత్ నుంచి పారిపోయిన వ్యాపారవేత్త మెహుల్ చోక్సీ చెల్లించాల్సిన రూ.5.35 కోట్ల బకాయిల రికవరీ దిశలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. చోక్సీ బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్‌ల జప్తునకు ఆదేశించింది. గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ షేర్లలో మోసపూరిత ట్రేడింగ్‌కు పాల్పడిన కేసులో సెబీ 2022 అక్టోబర్‌లో విధించిన జరిమానాను చెల్లించడంలో చోక్సీ విఫలమైన నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడింది.
గీతాంజలి జెమ్స్ ప్రమోటర్ గ్రూప్‌లో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న చోక్సీ, మరో ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోడీకి మామ కావడం గమనార్హం. ప్రభుత్వ ఆధీనంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ని రూ.14,000 కోట్లకు పైగా మోసగించినట్లు వీరిద్దరూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పీఎన్‌బీ స్కామ్ వెలుగులోనికి వచ్చిన తర్వాత 2018 తొలి నాళ్లలో వీరు దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వా లేదా బార్ముడాలో ఉన్నారని వార్తలు వస్తుండగా, మోడీ బ్రిటిష్ జైలులో ఉన్నారు. తనను అప్పగించాలన్న భారత్ అభ్యర్థనను కోర్టులో ఆయన సవాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment