రికార్డు గరిష్టంలోకి నిఫ్టీ అప్
Published Mon, Sep 18 2017 9:45 AM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM
సాక్షి, ముంబై : నిఫ్టీ, మిడ్‌క్యాప్స్ తాజా గరిష్ట స్థాయిల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా వస్తున్న బలమైన సంకేతాలతో మార్కెట్లు భారీగా జంప్ చేశాయి. ప్రారంభంలో 200 పాయింట్లకు పైగా జంప్ చేసిన సెన్సెక్స్, 195.18 పాయింట్ల లాభంలో 32,467 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 72 పాయింట్ల లాభంలో 10,150 మార్కుకు పైన 10,157 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ బ్యాంకు సైతం 25వేల మార్కును అధిగమించింది. ఎల్ అండ్ టీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, టాటా మోటార్స్ నిఫ్టీలో మేజర్ గెయినర్స్‌గా లాభాలు పండిస్తున్నాయి. సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఓఎన్‌జీసీలు మాత్రమే నిఫ్టీలు నష్టాలు గడిస్తున్నాయి.
నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.8శాతం పైకి ఎగిసింది. మిడ్‌క్యాప్స్‌లో గోవా కార్బన్, బొంబై డైయింగ్, గ్రాఫైట్ ఇండియా, స్పెషాలిటీ రెస్టారెంట్స్, జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్, క్యాడిలా హెల్త్‌కేర్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ 10 శాతం పైగా లాభపడుతున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు బలపడి 64 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధరలు 156 రూపాయల నష్టంలో 29,854 రూపాయలుగా ఉన్నాయి.
Advertisement
Advertisement