
సాక్షి, ముంబై: అంతర్జాతీయ సానుకూల సందేశాలతో దేశీయ స్టాక్ సూచీలు భారీ లాభాలతో ముగిసాయి. దాదాపు అన్ని రంగాల షేర్ల లాభాలతో రికార్డుల వెల్లువ కురింది. సెన్సెక్స్ 62252 వద్ద రికార్డు గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా 52 వారావల హైని నమోదు చేసింది. అలాగే బ్యాంకింగ్ షేర్లు లాభాలతో బ్యాంక్ నిఫ్టీ రికార్డ్ హైకి చేరింది. ఆఖరి నిమిషాల్లో రిలయన్స్, టీసీఎస్ ఐటీసీలో కొనుగోళ్లు మార్కెట్లకు మరింత ఊతమిచ్చాయి. చివరకు సెన్సెక్స్ 762 పాయింట్లు ఎగిసి 62272 వద్ద, నిఫ్టీ 247 పాయింట్ల లాభంతో18514 వద్ద ముగిసింది.
ముఖ్యంగా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్ల లాభాలతో సెన్సెక్స్ 62 వేల పాయింట్లు సునాయాసంగా అధిగమించింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, బీపీసీఎల్, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఐటీసీ, టీసీఎస్ టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. బిస్లరీ కొనుగోలు వార్తలతో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ దాదాపు 4 శాతం షేరు ధర ఆల్‌ట టైం హైకిచేరింది. సిప్లా, కోల్ ఇండియా, కోటక్ మహీంద్ర, టాదటా మోటార్స్, బజాజ్ ఫిన్ సర్వ్ టాప్ లూజర్స్‌గా స్థిరపడ్డాయి.
అటు డాలరు మారకంలో రూపాయి కూడా లాభాల్లోనే ముగిసింది. 26 పైసలు ఎగిసిన రూపాయి 81.63 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment