సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంలో లాభ నష్టాల మధ్య ఊగిసలాడినా వెంటనే పుంజుకుంది. మిడ్ సెషన తరువాత మరింత ఎగిసిన సెన్సెక్స్ ఒక దశలో 400 పాయింట్లు జంప్ చేసింది. చివరికి సెన్సెక్స్ 359 పాయింట్లు ఎగిసి 52300 వద్ద, నిఫ్టీ 102 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15737వద్ద స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, పార్మా జోరు మార్కెట్‌కు ఊతమిచ్చింది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్స్ రికార్డ్ స్థాయిలకు చేరాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, శ్రీ సిమెంట్, పవర్ గ్రిడ్, కార్పొరేషన్, విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, గ్రాసిం , సిప్లా అరబిందో, లుపిన్; దివీస్, గ్లెన్‌మార్క్, బయెకాన్ లాభాల్లో ముగిసాయి. మరోవైపు ఐటీసీ, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, హీరో మోటార్స్, ఐషర్ మోటార్స్ షేర్లు నష్టాల్లో ముగిసాయి.
Comments
Please login to add a commentAdd a comment