గోదావరిఖని, న్యూస్‌లైన్ : దక్షిణ భారతదేశంలో విద్యుత్ రంగంలో అతిపెద్దదైన రామగుండం ఎన్టీపీసీలో గుర్తింపు ఉద్యోగ సంఘం ఎన్నికల సందడి నెలకొంది. సె ప్టెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. ప్లాంట్‌లో ని ఆపరేషన్స్, మెయింటనెన్స్, హెచ్‌ఆర్, ఫైనా న్స్, టె క్నికల్, బిజినెస్, సివిల్ తదితర 12 విభాగాలకు చెందిన 834 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మంగళవారంతో పూర్తికాగా గెలుపు కోసం ఉద్యోగ సంఘాలు ఉవ్విళ్లూరుతున్నాయి.
1980లో మొదలు
ఎన్టీపీసీలో 1980 నుంచి గుర్తింపు సంఘం ఎన్నిక లు జరుగుతున్నాయి. 1979 నవంబర్ 14న అప్ప టి ప్రధాని మొరార్జీ దేశాయ్ రామగుండం ఎన్టీపీసీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంట్ నిర్మాణ సమయంలో పనిచేసే వంద మందితో 1980లో ఎన్టీపీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏ ర్పాటైంది. ఈ ఎన్నికల్లో యూనియన్ ఒక్కటే ఉం డగా అందులో ఉండే 10 కీలక పదవులకు పోటీ ఉండేది. 1988లో తొలిసారిగా భారతీయ మజ్దూ ర్ సంఘ్(బీఎంఎస్)కు అనుబంధంగా మరో సం ఘాన్ని నెలకొల్పారు. అప్పటినుంచి పదవులకు కాకుండా యూనియన్ల మధ్య పోటీ ప్రారంభమైంది. 1990లో జరిగిన ఎన్నికల్లో 1233 మంది ఉద్యోగులుండగా బీఎంఎస్ విజయం సాధించి రెండే ళ్ల కాలపరిమితితో గుర్తింపు సంఘంగా పని చేసింది. 1993లో తిరిగి ఎంప్లాయీస్ యూనియ న్ విజయం సాధించింది. ఈ యూనియన్‌లో ఉన్న కొంతమంది నాయకులు ఎవరికివారు వేరైపోయి జాతీయ కార్మిక సంఘాలకు అనుగుణంగా కార్మిక సంఘాలను ఎన్టీపీసీలో నెలకొల్పారు. అలా ఐఎన్టీయూసీకి అనుబంధంగా ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్, టీఎన్టీయూసీకి అనుబంధంగా ఎన్టీపీసీ తెలుగునాడు ఎంప్లాయీస్ యూనియన్, సీఐటీయూకు అనుబంధంగా ఎన్టీపీసీ యునెటైడ్ ఎంప్లాయీస్ యూనియన్, హెచ్‌ఎంఎస్‌కు అనుబంధంగా ఎన్టీపీసీ డెమొక్రటిక్ ఎంప్లాయీస్ యూనియన్ నెలకొల్పారు.
ఎప్పుడు పోటాపోటీనే...
1995 నుంచి ఎన్టీపీసీలో అన్ని ఉద్యోగ సంఘాలు పోటీ చేయడం మొదలైంది. 1998లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీని ఓడించేందుకు టీఎన్టీయూసీ బ్యానర్‌పై మిగతా సంఘాలు ఏకమై విజయం సాధించాయి. 2000లో ఐఎన్టీయూసీ, 2003లో సీఐటీయూ, 2005, 2007లో తిరిగి ఐఎన్టీయూసీ, 2010లో సీఐటీయూ (కార్మిక సంఘాల ఐక్య కూటమి) గెలుపొందాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఉద్యోగ సంఘాల మధ్య గట్టి పోటీ ఏర్పడేది.
కేంద్రం ఆధ్వర్యంలో
ఎన్నికల నిర్వహణ
రామగుండం ఎన్టీపీసీలో ఉద్యోగ సంఘం ఎన్నికలు 2010 నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగాయి. ఆ తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ పరిధిలోకి ఎన్నికల నిర్వహణ వెళ్లింది.
ఎన్టీపీసీలో హోరాహోరీ
Published Wed, Aug 28 2013 3:44 AM | Last Updated on Mon, Oct 8 2018 8:34 PM
Advertisement
Advertisement