ఎండిన ఏరు.. పారని నీరు
– ఎత్తిపోతలను ప్రారంభించిన టీజీ
– ఏం సాధించారంటూ రైతుల్లో గుసగుసలు
ఎమ్మిగనూరు: అధికార పార్టీ నేతల ఆర్భాటం.. హంగామాతో నాగలదిన్నె గ్రామస్తులు నివ్వెరపోయారు. ఒక్క పక్క తుంగభద్రనది ఎండిపోయి పంటలన్నీ వాడిపోయాయి. రైతులు సాగునీటి కోసం పరితపిస్తుంటే అధికార పార్టీ నేతలు సోమవారం హడావుడి చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ..చుక్కనీరు కూడా పారని నాగలదిన్నె ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి తమ ప్రభుత్వం గొప్పగా ఉందని వర్ణించారు. అయితే వాస్తవానికి టీడీపీ అధికారంలోకి రాకమునుపే నాగలదిన్నె ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరయ్యాయి. రూ. 6 కోట్లలలో 6400 ఎకరాలకు