![Police Protection Continues At The Sriramsagar project - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/12/der.jpg.webp?itok=JMzehhXq)
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద వర్షంలోనూ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. ప్రాజెక్టు వద్ద పోలీసు బలగాలు గత రెండు వారాల నుంచి పహారా కాస్తున్నాయి. పోచంపాడు గ్రామం, అలాగే ప్రాజెక్టు వైపు వెళ్లే వారిని పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు గ్రామాల రైతులు సాగునీటి కోసం కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెల్సిందే. శ్రీరాంసాగర్‌కు వరద పెరగడంతో ఆయకట్టు రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి.
ఇటీవల వర్షాలు లేకపోవడంతో ఆయకట్టు ప్రాంత పరిధిలోని పొలాలు ఎండిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో వెంటనే కాకతీయ కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున ఆయా గ్రామాల ప్రజలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగిన సంగతి తెల్సిందే. రైతులు బలవంతంగా గేట్లు ఎత్తే అవకాశం ఉండటంతో అధికారులు ప్రాజెక్టు వద్ద భద్రతను పెంచారు. అయితే వర్షాలు పడుతుండటంతో రైతులకు కాసింత ఉపశమనం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment