
సమావేశంలో మాట్లాడుతున్న వీరప్ప మొయిలీ
సాక్షి, నిజామాబాద్ అర్బన్: దివంగ త ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిజామాబాద్ జిల్లాకు లిఫ్ట్ ఇరిగేషన్ లు ఏర్పాటు చేశామని కేంద్ర మాజీ మంత్రి వీరప్పమొయిలీ అన్నారు. సోమవా రం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ మోసపురితమైన పాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే అవినీతి, రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అర్బన్ అభ్యర్థి తాహెర్‌బిన్‌హుందాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మహేశ్‌కుమార్‌గౌడ్, నగర అధ్యక్షుడు కేశవేణు, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment