మండలంలోని కంఠాత్మకూరులో నిర్మించనున్న ఎత్తిపోతల పథకం, విద్యుత్ సబ్ స్టేషన్‌లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎత్తిపోతల నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు విడుదల చేయడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్
Aug 13 2016 12:25 AM | Updated on Sep 4 2017 9:00 AM
పరకాల : మండలంలోని కంఠాత్మకూరులో నిర్మించనున్న ఎత్తిపోతల పథకం, విద్యుత్ సబ్ స్టేషన్‌లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎత్తిపోతల నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు విడుదల చేయడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ పథకానికి నిధులు మంజూరు కావడంతో శుక్రవారం జడ్పీటీసీ పాడి కల్పనాదేవి– ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో నర్సక్కపల్లిలో ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్, స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ కంఠాత్మకూరు మాటుపై ఎత్తిపోతల పథకం నిర్మాణంతో దమ్మయ్యకుంట, రెడ్డి చెరువు, పచ్చర్లకుంట, రాయపర్తిలోని ఊర చెరువు, మల్లక్కపేట చెరువులు నింపే అవకాశం ఉంటుందన్నారు. సబ్ స్టేషన్ నిర్మాణంతో రైతులకు కరెంటు కష్టాలు తీరుతాయన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వంగ కొమురమ్మ, టీఆర్‌ఎస్ నాయకులు వరికెల దేవరావు, తిప్పార్తి సాంబశివరెడ్డి, బైరెడ్డి రాజిరెడ్డి, బాషబోయిన కొమురయ్య, పాడి వివేక్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement