న్యాల్‌కల్,న్యూస్‌లైన్: కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారు. పథకం పనులు పూర్తయి 15 సంవత్సరాలు దాటింది. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా వినియోగంలోకి రావడం లేదని రైతలు ఆరోపిస్తున్నారు.పథకంలో వినియోగించిన సామగ్రి తుప్పుపడుతోంది. మరికొంత సామగ్రి దొంగల పాలవుతోంది.రైతులు ఈ పథకం కోసం ఎదురుచూసి దానిని మరచిపోయారు. పథకం పూర్తయి వినియోగంలోకి వస్తుందనే ఆశ వారిలో నశించిపోయింది.
పథకం పనులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని మాజీ మంత్రి గీతారెడ్డి ఆదేశించినా అధికారుల్లో చలనం రాలేదంటే వారి పని తీరుకు అద్దం పడుతోంది. ఏళ్ల తరబడి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ సొమ్ము ఖర్చయినా ఆశయం మాత్రం నెరవేరడం లేదు. బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు న్యాల్‌కల్ మండలం అమీరాబాద్ గ్రామ శివారులో మంజీరా నది తీరంలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.అందులో భాగంగా 1993లో అప్పటి నారాయణఖేడ్ శాసన సభ్యుడు కిష్టారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించారు.పథకం నిర్మాణం కోసం నాబార్డు కింద రూ. 1.30కోట్లు మంజూరు చే యించారు.
పథకం పనులు ప్రారంభించే సమయంలో శాసన సభకు ఎన్నిలు రావడం, రాష్ట్రంలో ప్రభుత్వ మారడంతో పనులు ప్రారంభం కా లేదు. మళ్లీ ఐదేళ్ల తర్వాత జరిన ఎన్నికల్లో తిరిగి కిష్టారెడ్డి శాసన సభ్యుడుగా ఎన్నికయ్యారు.1999లో ఎమ్మె ల్యే ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. నిధులు సరి పోక పోవడంతో పనులు నిలిచిపోయాయి. నాబార్డు ఆర్‌ఐడీఎఫ్ పేజ్-3లో రూ.88.80లక్షలు మంజూరు చేయించి మిగిలిపోయిన పనులు పూర్తి చేయించారు.ఈపథకం ద్వారా 21మంది ఎస్సీలకు సంబంధించిన 49.36హెక్టార్లు,31మంది బీసీలకు చెందిన 114.03హెక్టార్లు,ఇతర వర్గాలకు చెందిన 331.01హెక్టార్ల భూమిని సాగులోకి తేవాలనేది పథకం ఉద్దేశం.
పంపుహౌస్ ఏర్పాటు
ఈపథకం ద్వారా పొలాలకు నీరందించేందుకు మం జీర నది తీరంలో పంపుహౌస్‌ను ఏర్పాటు చేశారు.అం దుకు అవసరమయ్యే విద్యుత్ కోసం ట్రాన్స్‌ఫార్మర్లును కూడా ఏర్పాటు చేశారు.పంపుహౌస్ నుంచి పొలాలకు పైపులైన్ వేశారు. ఇవన్నీ ఏర్పాటు చేసిన అధికారులు దానిని ప్రారంభించడం మరిచారు.అప్పట్లో పనులు కూడా నాసిరకంగా జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.ఎత్తి పోతల పథకానికి విద్యుత్ సరఫరా చాలా రోజులుగా నిలిచిపోయిందని రైతులు తెలిపారు.పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు వంగిపోవడం వలన ఈసమస్య ఉత్పన్నమయిందన్నారు.
15ఏళ్లు దాటినా ప్రారంభం కాని పథకం
ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి 15ఏళ్లు దాటినా ఇప్పటికి ప్రారంభం కాలేదు.దీంతో పథకం నిరూపయోగం గా మారింది. పథకం వినియోగంలోకి వస్తే బీడు భూములు సాగవుతాయని రైతులు ఎదురుచూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఎప్పుడు ఫలి స్తాయో? పంపుహౌస్ నుంచి పంట పొలాలకు నీరందించేందు గ్రామ సమీపంలో పైప్‌లైన్ ఏర్పాటు చేశారు.అక్కడ నుంచి కాల్వల ద్వారా నీరందించాలని అధికారులు నిర్ణయించారు.
దీని వల్ల అధిక శాతం నీరు భూమిలోకి ఇంకిపోవడం వల్ల పంట పొలాలకు నీరు సక్రమంగా అందించాడానికి అవకాశం లేకపోవడంతో పంట పొలాలల వరకు పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.అందుకోసం అవసరమయ్యే నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.నాలుగేళ్ల క్రితం పైప్‌లైన్ కోసం రూ:42లక్షలు మంజూరయ్యాయి.పైప్‌లైన్ పనులు ఇటీవలే పూర్తయ్యాయి.సంబంధిత కాంట్రాక్టర్ పనులను పూర్తి చేసినప్పటికి సంప్‌హోస్ నుంచి వచ్చే మెయిన్ పైప్‌లైన్ పలు ప్రాంతాల్లో లీకేజీవుతుంది. దీంతో నీరు పంట పోలాలకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకొని పనులు త్వరిగతిన పూర్తి చేయించి పథకాన్ని వినియోగంలోకి తేవాలని గ్రామ రైతులు కోరుతున్నారు.
అధికారులు పట్టించుకోవడం లేదు
అధికారులు పథకం గురించి పట్టించుకోవడం లేదు.పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయి.మెయిన్‌లైన్ నుంచి పొలాలకు నీటిని సరఫరా చేసే పైప్‌లైన్ లీకేజీ పలు ప్రాంతాల్లో లీకేజీ అవుతోంది. ప్రతి ఏడాది పొలం పనులు ప్రారంభమయ్యే ముందు వచ్చి పనులు చేస్తామంటారు.అప్పుడు రైతులు ఒప్పుకోరు. ఇప్పుడేమోరారు. పనులు పూర్తి చేయరు. ప్రతి ఏడాది ఈదే విధంగా జరుగుతోంది. కలెక్టర్ ఈసారైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు పూర్తి చేయించాలి. -మేత్రి శరణప్ప, రైతు,అమీరాబాద్ గ్రామం
త్వరలో పథకం వినియోగంలోకి..
పనులలు పూర్తయ్యాయి.టెస్టింగ్ చేయాల్సిఉంది.అది పూర్తి కాగానే పథకం వినియోగంలోకి వస్తుంది. -సౌరాజ్,ఏపీఎస్‌ఐడీసీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
ఎత్తిపోతల ప్రారంభమెన్నడో?
Published Sat, May 3 2014 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM
Advertisement
Advertisement