Minister Dharmana Prasada Rao Comments On Pawan Kalyan, Details Inside - Sakshi
Sakshi News home page

అది సినిమాల్లో సాధ్యం.. నిజ జీవితంలో సాధ్యమా: మంత్రి ధర్మాన

Published Tue, Aug 9 2022 11:06 AM | Last Updated on Tue, Aug 9 2022 12:00 PM

Minister Dharmana Prasada Rao Comments on Pawan Kalyan - Sakshi

శ్రీకాకుళం: హీరోలు ఫొటోలకు ఫోజులు ఇస్తే చాలని, కానీ రాజకీయాల్లో వాస్తవ పరిస్థితులు వేరేగా ఉంటాయని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గార మండలం లింగాలవలసలో సోమ వారం గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ ఆయన మాట్లాడుతూ హీరో పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు చేశారు.

నిజ జీవితం వేరు, సినిమా వేరు అనే విషయాన్ని పవన్‌ గ్రహించాలన్నారు. తాను 45 ఏళ్లుగా రాజకీయ జీవితంలో ఉన్నానని, తనకు ఇప్పుడు 64 ఏళ్లని, తనతో మూడు కిలోమీటర్లయినా పవర్‌ నడవగలరా అని ప్రశ్నించారు. సినిమాల్లో హీరో చేయి ఊపితే ముగ్గురు పడిపోతారని, నిజ జీవితంలో సాధ్యమవుతుందా అని అడిగారు. వాస్తవం తెలుసుకోవాలన్నారు.

చదవండి: (ఫలించిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కృషి.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు)   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement