ముగ్గురు ఎమ్మెల్యేలు, లక్ష్మీపార్వతి వైఎస్ఆర్ సిపిలో చేరిక | 3 MLAs and Lakshmi Parvati joined in YSRCP | Sakshi
Sakshi News home page

ముగ్గురు ఎమ్మెల్యేలు, లక్ష్మీపార్వతి వైఎస్ఆర్ సిపిలో చేరిక

Published Sun, Feb 9 2014 6:06 PM | Last Updated on Tue, May 29 2018 4:09 PM

ముగ్గురు ఎమ్మెల్యేలు, లక్ష్మీపార్వతి వైఎస్ఆర్ సిపిలో చేరిక - Sakshi

ముగ్గురు ఎమ్మెల్యేలు, లక్ష్మీపార్వతి వైఎస్ఆర్ సిపిలో చేరిక

శ్రీకాకుళం: ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు పలువురు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ఎంపి వైఎస్ జగన్మోహన రెడ్డి సమక్షంలో ఈ సాయంత్రం  మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విశాఖపట్నం  ఉత్తర ఎమ్మెల్యే  తైనాల విజయకుమార్, పలాస ఎమ్మెల్యే జగన్నాయకులు, పలువురు నేతలు పార్టీలో చేరారు. వారితోపాటు ఇదే వేదికపైన ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి కూడా పార్టీలో చేరారు. జగన్మోహన రెడ్డి వారిపై పార్టీ కండువా కప్పి స్వాగతించారు.

సమైక్య శంఖారావంలో భాగంగా శ్రీకాకుళం వచ్చిన జగన్మోహన రెడ్డికి ఘనస్వాగతం లభించింది. జగన్ వస్తున్న సందర్భంగా జనం భారీగా తరలి వచ్చారు. సభా ప్రాంగణం అంతా జనంతో కిక్కిరిసిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement