Tainala Vijay Kumar
-
వైఎస్ జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం
మర్రిపాలెం: రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే ధ్యేయంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలని ఆ పార్టీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం మాధవధారలోని మౌళి క్యాజిల్‌లో పార్టీ 35వ వార్డు అధ్యక్షుడు కటుమూరి సతీష్ నేతృత్వంలో ఆ వార్డు కార్యకర్తలు, పోలీంగ్ బూత్ కమిటీలతో ఆత్మీయ పలకరింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తైనాల మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు కొండంత అండగా నిలబడే వైఎస్ జగన్ పాలనలో మళ్లీ రాజన్న రాజ్యం తప్పక వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత టీడీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మంచి రోజులు ముందున్నాయి.. పార్టీ విశాఖ లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ పరిపాలన తనను ఎంతో ఆకర్షించిందన్నారు. వైఎస్సార్ మీద అభిమానంతో పార్టీలో చేరానని వ్యాఖ్యానించారు. ప్రజా బలం అంటే ఏమిటో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చూపిస్తుందన్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు మాట్లాడుతూ ఉత్తర పరిధిలోని ఆయా వార్డుల నాయకులు, కార్యకర్తలతో మమేకవుతానని చెప్పారు. పార్టీ తన మీద ఉంచిన నమ్మకాన్ని తప్పక నిలబెట్టుకుంటానన్నారు. ముందుగా ఎం వీవీ, కె.కె.రాజులను సభలో పరిచయం చేశారు. మాజీ కార్పొరేటర్లు పామేటి బాబ్జి, సేనాపతి అప్పారావు, వార్డు అనుబంధ కమిటీల ప్రతినిధులు వై.సిద్ధార్థరాజు, బి.గోవిందరాజు, వి.రాము, అశోక్, పూలరాజు, సరోజిని, కృప పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సిపిలో చేరిన ధర్మాన ప్రసాదరావు, లక్ష్మీపార్వతి మరియు నేతలు
-
ముగ్గురు ఎమ్మెల్యేలు, లక్ష్మీపార్వతి వైఎస్ఆర్ సిపిలో చేరిక
శ్రీకాకుళం: ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు పలువురు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ఎంపి వైఎస్ జగన్మోహన రెడ్డి సమక్షంలో ఈ సాయంత్రం మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, పలాస ఎమ్మెల్యే జగన్నాయకులు, పలువురు నేతలు పార్టీలో చేరారు. వారితోపాటు ఇదే వేదికపైన ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి కూడా పార్టీలో చేరారు. జగన్మోహన రెడ్డి వారిపై పార్టీ కండువా కప్పి స్వాగతించారు. సమైక్య శంఖారావంలో భాగంగా శ్రీకాకుళం వచ్చిన జగన్మోహన రెడ్డికి ఘనస్వాగతం లభించింది. జగన్ వస్తున్న సందర్భంగా జనం భారీగా తరలి వచ్చారు. సభా ప్రాంగణం అంతా జనంతో కిక్కిరిసిపోయింది. -
కాంగ్రెస్‌కో నమస్కారం
సమైక్యం కోసం పోరాడుతున్నది జగన్ ఒక్కరే కాంగ్రెస్‌కు పట్టని ప్రజావాణి వైఎస్సార్సీపీలో చేరుతున్నా: తైనాల సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విజయం కోసం తన వంతు కృషి చేస్తానని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ అన్నారు. రాష్ట్ర విభజనపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా కాంగ్రెస్ పట్టించుకోని వైనం తనను బాధిం చిందన్నారు. అందుకే ఆ పార్టీని వీడి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. శనివారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమాశంలో ఆయన మాట్లాడారు. తాను పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పాటు పడుతున్న జగన్మోహన్రెడ్డి పార్టీలో తనకు ఏ హోదా అప్పగించినా పనిచేస్తానన్నా రు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతవరకూ అధిష్టానం పిలుపు మేరకు తాను శాయశక్తులా పనిచేశానని అయినా పుండుమీద కారం చల్లినట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. ‘ కాంగ్రెస్‌పార్టీకి ఓ నమస్కారం.. ఇన్నాళ్లూ అన్ని విధాల సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. జగన్ ఒక్కరే సమైక్యం కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నారని చెబుతూ మరో నాయకుడు సమన్యాయం అంటూ ప్రజల్ని తికమక పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ కోసం ఎంతో శ్రమించానని తైనాల గుర్తుచేశారు. బూత్ లెవెల్ కార్యకర్త నుంచి అనేక కమిటీల్లో పనిచేసిన అనుభవంముం దన్నారు. నగరాభివృద్ధి కోసమే రాజకీయాల్లో కొనసాగాలనుకున్నానన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి గొర్రెల మందకు తోడేళ్లు ఏకమైనట్టుగా ఉందన్నా రు. ప్రజల్ని ఇబ్బంది పె ట్టేందుకు మొసలి కన్నీరు కారుస్తోందని, ఓ వైపు విభజనను వేగవంతం చే స్తూనే మరోవైపు ఉద్యమాలకు ఉసిగొల్పుతోందని విమర్శించారు. శ్రీకాకుళం తరలివెళ్తున్న అనుచరగణం : తైనాల విజయకుమార్ వైఎస్సార్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆయన వెంట 200 మంది ముఖ్య అనుచరులు శ్రీకాకుళం ఆదివారం ఉదయం తరలివెళ్లనున్నారు. విశాఖ వైఎస్సార్ పార్కు, అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కార్లతో ర్యాలీ బయలుదేరి శ్రీకాకుళం వెళ్లనున్నారు. శ్రీకాకుళంలో జరిగే సభలో జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో విజయకుమార్ పార్టీలో చేరతారు