
కాంగ్రెస్‌కో నమస్కారం
- సమైక్యం కోసం పోరాడుతున్నది జగన్ ఒక్కరే
- కాంగ్రెస్‌కు పట్టని ప్రజావాణి
- వైఎస్సార్‌సీపీలో చేరుతున్నా: తైనాల
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ విజయం కోసం తన వంతు కృషి చేస్తానని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ అన్నారు. రాష్ట్ర విభజనపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా కాంగ్రెస్ పట్టించుకోని వైనం తనను బాధిం చిందన్నారు. అందుకే ఆ పార్టీని వీడి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. శనివారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమాశంలో ఆయన మాట్లాడారు. తాను పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పాటు పడుతున్న జగన్‌మోహన్‌రెడ్డి పార్టీలో తనకు ఏ హోదా అప్పగించినా పనిచేస్తానన్నా రు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతవరకూ అధిష్టానం పిలుపు మేరకు తాను శాయశక్తులా పనిచేశానని అయినా పుండుమీద కారం చల్లినట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. ‘ కాంగ్రెస్‌పార్టీకి ఓ నమస్కారం.. ఇన్నాళ్లూ అన్ని విధాల సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని ఆయన అన్నారు.
జగన్ ఒక్కరే సమైక్యం కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నారని చెబుతూ మరో నాయకుడు సమన్యాయం అంటూ ప్రజల్ని తికమక పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ కోసం ఎంతో శ్రమించానని తైనాల గుర్తుచేశారు. బూత్ లెవెల్ కార్యకర్త నుంచి అనేక కమిటీల్లో పనిచేసిన అనుభవంముం దన్నారు. నగరాభివృద్ధి కోసమే రాజకీయాల్లో కొనసాగాలనుకున్నానన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి గొర్రెల మందకు తోడేళ్లు ఏకమైనట్టుగా ఉందన్నా రు. ప్రజల్ని ఇబ్బంది పె ట్టేందుకు మొసలి కన్నీరు కారుస్తోందని, ఓ వైపు విభజనను వేగవంతం చే స్తూనే మరోవైపు ఉద్యమాలకు ఉసిగొల్పుతోందని విమర్శించారు.
శ్రీకాకుళం తరలివెళ్తున్న అనుచరగణం : తైనాల విజయకుమార్ వైఎస్సార్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆయన వెంట 200 మంది ముఖ్య అనుచరులు శ్రీకాకుళం ఆదివారం ఉదయం తరలివెళ్లనున్నారు. విశాఖ వైఎస్సార్ పార్కు, అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కార్‌లతో ర్యాలీ బయలుదేరి శ్రీకాకుళం వెళ్లనున్నారు. శ్రీకాకుళంలో జరిగే సభలో జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో విజయకుమార్ పార్టీలో చేరతారు