
సభలో ప్రసంగిస్తున్న వైఎస్సార్‌సీపీ నేత తైనాల విజయకుమార్
మర్రిపాలెం: రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే ధ్యేయంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలని ఆ పార్టీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం మాధవధారలోని మౌళి క్యాజిల్‌లో పార్టీ 35వ వార్డు అధ్యక్షుడు కటుమూరి సతీష్ నేతృత్వంలో ఆ వార్డు కార్యకర్తలు, పోలీంగ్ బూత్ కమిటీలతో ఆత్మీయ పలకరింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తైనాల మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు కొండంత అండగా నిలబడే వైఎస్ జగన్ పాలనలో మళ్లీ రాజన్న రాజ్యం తప్పక వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత టీడీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
మంచి రోజులు ముందున్నాయి..
పార్టీ విశాఖ లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ పరిపాలన తనను ఎంతో ఆకర్షించిందన్నారు. వైఎస్సార్ మీద అభిమానంతో పార్టీలో చేరానని వ్యాఖ్యానించారు. ప్రజా బలం అంటే ఏమిటో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ చూపిస్తుందన్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు మాట్లాడుతూ ఉత్తర పరిధిలోని ఆయా వార్డుల నాయకులు, కార్యకర్తలతో మమేకవుతానని చెప్పారు. పార్టీ తన మీద ఉంచిన నమ్మకాన్ని తప్పక నిలబెట్టుకుంటానన్నారు. ముందుగా ఎం వీవీ, కె.కె.రాజులను సభలో పరిచయం చేశారు. మాజీ కార్పొరేటర్లు పామేటి బాబ్జి, సేనాపతి అప్పారావు, వార్డు అనుబంధ కమిటీల ప్రతినిధులు వై.సిద్ధార్థరాజు, బి.గోవిందరాజు, వి.రాము, అశోక్, పూలరాజు, సరోజిని, కృప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment