Lakshmi Parvati
-
సనాతనానికి చీడ పురుగులు
‘‘గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు/ మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు / జనులంతా ఒక కుటుంబం – జగమంతా ఒక నిలయం’’– జాషువాఈ మాటలు ఎంత సందర్భోచితంగా ఉన్నాయో, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ రంగాన్ని చూస్తే అర్థమవుతుంది. నిజమైన మతవాదులైతే వారితో ఇబ్బంది లేదు. అది వారి ప్రగాఢ నమ్మకంగా భావించవచ్చు. కానీ కుహనా మతవాదులు వేషాలు వేసుకుని, అవకాశవాద రాజకీయాల కోసం మతాన్ని, కులాన్ని వాడుకోవటం వల్లనే అసలు ఇబ్బంది వస్తున్నది.వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సనాతన మతవాదుల అవతారం ఎత్తారు. హిందూ మతానికి వీళ్లే అసలైన వారసులన్నట్లుగా ఉపన్యాసాలిస్తున్నారు. ఇక పచ్చ మీడియా రచ్చ సరేసరి.‘అసలే అనలుడు. అతనికి సైదోడు అనిలుడు’ అని ఒక మహాకవి చెప్పినట్లు, చంద్రబాబు అబద్ధా లకు తింగరి పవన్ కల్యాణ్ దొరికాడు. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా చెప్పిన డైలాగ్‌నే చెబుతూ, మెట్లను కడుగుతూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.అసలు ఇప్పుడు అర్జంట్‌గా హిందూమతాన్ని ఈ గురుశిష్యులు అంతగా తలకెత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని సామాన్యుడి ప్రశ్న.అందులో ఒకరికి దేవుడన్నా, మతమన్నా ఏ సెంటి మెంట్లూ లేవు. బూట్లతో పూజలు చేస్తాడు, దేవాలయాలు పడగొడతాడు, ఆలయాల్లో క్షుద్ర పూజలు భార్య చేస్తే ఊరుకుంటాడు. ఇక రెండవ వారు చెప్పులు ధరించే స్వామి దీక్షలు నిర్వహి స్తాడు. తలక్రిందులుగా తపస్సు చేసినా వీళ్ళను నమ్మే జనాలున్నారా?అసలెందుకు హఠాత్తుగా ఈ రచ్చ లేవ దీశారు? ఢిల్లీ పెద్దలేమయినా హరియాణా, మహా రాష్ట్ర ఎన్నికల కోసం వీళ్ళిద్దరినీ సెంటిమెంట్ రోల్స్ చెయ్యమన్నారా? లేక ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, విజయవాడ వరద బాధితులకు సమాధానం చెప్పలేక, ప్రజల వద్దకు 100 రోజుల మంచి పాలన అంటూ పోవాలనుకున్నా జనా లెక్కడ తిరగబడి ‘సూపర్ సిక్స్’లు అడుగుతారో అనే భయం చేతనా? ప్రజలు ఆలోచించే లోపలే పచ్చ మీడియా మూకుమ్మడిగా జనాలకు అర్థంకాని భాషలో వ్యాఖ్యానాలు చేయిస్తూ చివరకు హిందూ ధర్మం జగన్ గారి వల్లనే నాశనమైందని తేలుస్తుంది.సెంటిమెంట్ బాగా పండాలంటే కలియుగ దైవం, ఆయన ప్రసాదం వీరికి అక్కరకొచ్చాయి. జగన్ గారి పాలనలో లడ్డూ ప్రసాదంలో జంతు వుల కొవ్వులు కలిశా యని చెప్పాలనుకున్నారు. కానీ వాటికి ఆధారాలు దొరక్క చివరకు వీళ్ళ ప్రభుత్వం మెడకు చుట్టు కోవటంతో దానిని ఎలా మలపాలో అర్థం కాక ‘యూటర్న్’ బాబు... 20 సార్లు తిరుమలకు వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రిగారి డిక్లరేషన్ పేరుతో దానిని డైవర్ట్ చేయటానికి ప్రయత్నించారు. ‘నాతిని చెయ్యబోతే కోతిగా తయారయ్యిందన్న’ సామె తగా చివరకు సనాతన ధర్మానికే కళంకాన్ని తెచ్చే విధంగా ఈ దుర్మార్గపు ప్రభుత్వం స్వామివారి ప్రసాదాన్నే కళంకితంగా మార్చింది. ఈ చర్యలు క్షమార్హం కాదు. జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తారని ప్రకటించటంతో ఖంగుతిన్న చంద్రబాబు... పార్టీల మాటున గూండాలను తిరుపతికి తరలించారు. వారిలో కొంతమంది బహిరంగంగానే ‘జగన్ మోహన్‌రెడ్డి తిరుపతి వస్తే చంపేస్తాం’ అంటూ చెప్పారు. అంటే ఆయనను చంపాలనేదే కదా వీళ్ళ కుట్ర! వాళ్ళే నిందలేస్తారు. వాళ్ళే నిందిస్తారు.ఎంత నిస్సిగ్గుగా ఆయన మతాన్ని తెర మీదకు తెచ్చి డిక్లరేషన్ బోర్డు పెట్టారు! అందుకు జగన్మోహన్ రెడ్డిగారు ప్రెస్ మీట్లో చాలా చక్కటి సంస్కారవంతమైన సమా ధానం చెప్పారు. అసలైన హిందూ ధర్మతత్వం ఆయన మాటల్లో వినిపించింది. హిందూ ధర్మాన్ని సుప్రతిష్ఠం చేసిన ఉపనిషత్తులు ఏం చెప్పాయో మత ఛాందసులు కూడా తెలుసుకోవాలి.‘‘యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్వి జానతః / తత్ర కో మోహః కశ్శోకః ఏకత్వ మను పశ్యతః’’(ఈశావాస్యోపనిషత్తు)ఎవరయితే సమస్త జీవుల ఆత్మలను తన ఆత్మగా భావించి గౌరవిస్తాడో అతడు శోకమోహ ములను దాటి ఒకే ఆనంద స్థితిని అనుభవిస్తాడు. ఇది సనాతన ధర్మం చెప్పేమాట. అలాగే హిందు వులందరూ పరమ ప్రామాణికంగా భావించే భగ వద్గీతలో కూడా ఆ కృష్ణ పరమాత్మ –యే యథా మాం ప్రపద్యన్తే తాం స్తథైవ భజా మ్యహం! / మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః‘‘ఏ రూపంలో ఆరాధిస్తారో ఆ రూపంలో నేనే ఉంటాను అన్నాడు. అంటే అన్ని మతాలను, దేవుళ్ళను గౌరవించాలనే కదా మన హిందూ ధర్మం చెబుతున్నది. మరి ఈ మతానికి ఈ చాదస్తపు రంగులు పూసి ఎందుకిలా ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు? ఇప్పటికయినా ఢిల్లీ బీజేపీ పెద్దలు తమ కూటమి ఆంధ్రలో చేస్తున్న కోతి చేష్టలను ఆపించ కపోతే అది తమకే నష్టం అని గమనించాలి. ప్రజల్ని అంత తక్కువగా అంచనా వెయ్యొద్దు.‘‘నీకు మతం కావాలా లేక అన్నం కావాలా?’ అని అడిగితే ముందు అన్నమే ఇవ్వమంటాను. ఆకలితో బాధపడేవాళ్ళ కడుపు నింపి తర్వాత బోధలు చెయ్యి’’ అంటారు స్వామి వివేకానంద.ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పాలకులకు జగన్ మోహన్ రెడ్డి చెప్పేది అదే. ముందు పేదవాళ్ళను ఆదుకోండి, మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోండి. మీ నీచ రాజకీయానికి పవిత్ర ప్రసాదాన్ని బలి చేయకండి.నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త వైసీపీ నాయకురాలు -
రాజ్యాంగేతర శక్తుల కరాళ నృత్యం
భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించటానికీ, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం వంటి ఉదాత్త అంశాలను అందుబాటులోకి తేవడానికీ మన ‘రాజ్యాంగ పరిషత్’ రాజ్యాంగాన్ని రూపొందించింది. ప్రజాస్వామ్య సాధారణ లక్ష్యాల గురించి రాజ్యాంగ ప్రవేశికలో స్పష్టంగా ఉంది. ప్రధానంగా నిష్పక్షపాత ఎన్నికలు, ప్రజాస్వామ్య పాలన, సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం; స్వేచ్ఛ, సమానత్వం, ప్రాథమిక హక్కుల గురించిన ప్రస్తావన అందులో ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రమాణ స్వీకారం చేసే ముందు రాజ్యాంగం మీద పూర్తి విశ్వాసం ఉంచుతామని ప్రమాణం చేస్తారు. కానీ ఇటీవలి (2024) సార్వత్రిక ఎన్నికల్లో చోటు చేసుకున్న రాజ్యాంగ విరుద్ధమైన సంఘటనల గురించి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుతున్నారంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత రాజ్యాంగ విరుద్ధంగా మారిందో చెప్పక తప్పదు. ఆధునిక విజ్ఞాన చక్రవర్తి ‘ఎలెన్ మస్క్’ లాంటి వాళ్ళు ఈవీఎమ్‌ల పనితీరును ఆక్షేపించారంటేనే ఎంత ఘోరంగా ఎన్నికలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. అమెరికా కూడా ఈసారి మన ఎన్నికలను తప్పు పట్టింది. 20 లక్షల ఈవీఎమ్‌లు ఎటుపోయాయో ఎవరూ సమాధానం చెప్పరు. న్యాయబద్ధంగా గెలవాల్సిన ఆంధ్ర, ఒరిస్సా ముఖ్యమంత్రులకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా మాయాజాలం జరిగింది. ‘మాకు మంచి చేసిన జగన్ ప్రభుత్వానికి వేసిన మా ఓటు ఏమయ్యింద’ని సామాన్య ఓటరు అడుగుతున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడి చేతిలో 1995 లోనూ ప్రజాస్వామ్యం కుప్ప కూలటం చూశాం. కానీ ఏకంగా ఎన్నికల కమిషన్ సాయం అందించి కూటమి గెలుపు కోసం శ్రమించడం ఇప్పుడే చూస్తున్నాం. ‘దారులన్నీ పెట్టుబడిదారి యంత్రాల కోరల్లోకే అని అర్థమయ్యాక నా వాదనే నాకు బలహీనంగా అనిపిస్తున్నది’ అంటారు కార్ల్ మార్క్స్. ఆధునిక భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అధికారం, డబ్బుల మయం అయిన వైనాన్ని కళ్ళారా చూస్తున్నాం. ‘గెలవటానికి ఏ అడ్డదారైనా ఫర్వాలేదు, గెలవటమే ప్రధానం. ఎన్ని అవినీతి మార్గాలున్నాయో వాటన్నిటి ద్వారా డబ్బు సంపాదించు, వ్యవస్థల్ని అదుపులో పెట్టుకో’ అనే ఎత్తుగడతో చంద్రబాబులాంటి వారు వ్యవహరించారు. వీరి నిఘంటువులో న్యాయం, ధర్మం, మానవత్వం అనేవి లేవు. అబద్ధాలు, అక్రమాలు వీరి ప్రాథమిక సూత్రాలు. గెలుస్తుందన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అడ్డ దారిలో ఓడించారు. గత ఐదేళ్లుగా జగన్ ఏ మంచి చేసినా దానిని ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా గోబెల్స్ ప్రచారాలు సాగిస్తూ, అరాచకాలూ వాళ్ళే చేస్తూ వాటిని జగన్ ప్రభుత్వం మీద రుద్దుతూ వచ్చారు. కూటమి గెలుపు తర్వాత ఇప్పుడు దానిదైన నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అందులో రెడ్‌బుక్ పాలసీ కూడా ఒకటి. దానిలో భాగంగానే వీళ్ళు చేయబోయే ఆకృత్యాలను ప్రజలకు చేరకుండా ఉండటానికి ముందుగా పచ్చమీడియా తప్ప మిగిలిన అన్ని ఛానెల్స్‌ను బ్యాన్ చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందే వీళ్ళు ప్రేరేపించిన రౌడీమూకలు రాష్ట్ర్రంలో చెలరేగిపోయారు. వైఎస్సార్సీపీకి ఓట్లేసిన... ఓటర్ల దగ్గర నుండి నాయకుల వరకు ఎవ్వరినీ విడిచిపెట్టటం లేదు. ఏకంగా ఈ మూక ఇళ్ళ మీదకు ఎగబడుతూ తమ వ్యతిరేకుల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. కత్తిపోట్లతో ప్రాణాలు తీయటానికి ప్రయత్నిస్తున్నారు. గర్భిణీ స్త్రీలను కొడుతున్నారు. నాయకులను చంపటానికి ప్రయత్నిస్తున్నారు. ఒకప్పటి బిహార్‌లో ఉన్న అరాచకం నేడు ఆంధ్రాలో వర్ధిల్లుతోంది. చివరకు చంద్రబాబు నిరంకుశత్వం ఎంత పరాకాష్టకు చేరిందంటే... వైఎస్సార్సీపీ ఆఫీసును కోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా ఉత్తర ప్రదేశ్‌లో లాగా పొక్లెయిన్ లతో తెల్లవారేసరికి కూల్చేశారు. కానీ ఏ వార్తా పచ్చ మీడియా రాయదు. చూపించదు. ఈ దుర్ఘటనలు దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళ నమ్మకాన్నీ పోగొడుతున్నాయి. ఇక్కడ గ్రీకు తత్త్వవేత్త ‘ఎపిక్యురస్’ అన్న మాటలు... ‘పదే పదే దుర్మార్గాలు చేస్తున్న వారిని చూస్తుంటే దేవుడు చెడును ఆపాలనుకుంటున్నా ఆపలేకపోతున్నాడా? అలా అయితే ఈ సృష్టి స్థితిలయలు అతని అదుపులో లేవన్నమాట. సమర్థుడే అనుకుంటే చెడును ఎందుకు నివారించటం లేదు. ఈ పగ, ద్వేషాలను, చెడును ఆపే సామర్థ్యం లేకపోతే ఇక ఎందుకండీ దేవుడు. రక్షకుడనే బిరుదులు?’ గుర్తుకొస్తున్నాయి. ఎప్పుడో క్రీస్తుకు పూర్వం అన్న ఈ మాటలు నిజంగా ఆలోచించతగినవే కదా. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ఒక్కసారి జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి పద్యాల్లో చూద్దాం. పోలిక ఎంత బాగా సరిపోతుందో– కర్కశ కరాళ కారుమేఘాల నీడలెగురుతున్నవి/ప్రజల నెమ్ముగములందు/క్రౌర్య కౌటిల్య గాఢాంధకార పటలి /క్రమ్ముకున్నది దిగ్దిగంతమ్ములెల్ల నిజంగానే ‘ఏ నిరర్థ్ధక నిర్భాగ్య నీరస గళాలు ఎలుగెత్తి వాపోతున్నయ్యో– వెలయవో ప్రాభాతశోభావళుల్ అన్నట్లు నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కోసం సుపరిపాలన అందించిన జగన్ మోహన్ రెడ్డి పునరాగమనం కోసం ఆశతో ఎదురుచూద్దాం.డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సతీమణి -
చేటు చేసే మీడియా అది
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): రాష్ట్రంలో ఓ వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారం ప్రజలకు చేటు చేస్తుందని ఏపీ సంస్కృత అకాడమి చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజలకు ఎంతగా మేలు చేస్తున్నా, ఎల్లో మీడియా ప్రభుత్వంపై అసత్య కథనాలతో పాఠకులను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం గుంటూరులోని పెన్షనర్స్ భవన్లో ‘తెలుగు మీడియా గమనం–గమ్యం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ 1994లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, ఆయన అల్లుడు చంద్రబాబుకు అధికారాన్ని కట్టబెట్టడంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, మరికొన్ని పత్రికలు ప్రధాన పాత్ర పోషించాయని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, సంస్కరణలు, వినూత్న విధానాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నా, ఈ పత్రికలు విషం కక్కుతున్నాయని తెలిపారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయకపోయినా అద్భుతంగా చేశారని హడావుడి చేశాయన్నారు. కేవలం ఒక వ్యక్తిని, పార్టీని నిలబెట్టే తాపత్రయంతో దాదాపు 10 మీడియా సంస్థలు తీవ్రంగా పనిచేస్తున్నాయన్నారు. ఈ మీడియా కుయుక్తులను తిప్పికొట్టాలని ఇతర పత్రికలకు ఆమె పిలుపునిచ్చారు. ఆ మీడియా తీరు దారుణం : వీవీఆర్ కృష్ణంరాజు ఏపీ ఎడిటర్స్ అసోసియేష¯న్ అధ్యక్షుడు వి.వి.ఆర్.కృష్ణంరాజు మాట్లాడుతూ తెలుగు మీడియాలోని ఒక వర్గం తీరు అత్యంత దారుణంగా, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందన్నారు. ఈ మీడియా సమాచార కాలుష్యాన్ని ఏపీ అంతటా వెదజల్లి, ప్రజల ఆలోచనలను కలుíÙతం చేస్తోందని చెప్పారు. ఏపీ అభివృద్ధి వైపు దూసుకెళ్తుండగా, చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకంజలో ఉందని అసత్య ప్రచారం చేస్తోందని వాపోయారు. ఆ మీడియాకు చెదలు పట్టింది:న్యాయవాది సుందరరామశర్మ సీనియర్ న్యాయవాది చుండూరు సుందరరామశర్మ మాట్లాడుతూ ఒక వర్గం మీడియాకు చెదలు పట్టాయని అన్నారు. పత్రికలు ప్రభుత్వాలకు వారధిలా ఉండాలని అన్నారు. కానీ కొందరికి కావాల్సిన విధంగా పత్రికలు నడుస్తున్నాయని చెప్పారు. గతంలో తప్పు చేస్తే ఎత్తిచూపడం, మంచి చేస్తే పట్టం కట్టేవారని చెప్పారు. ఈనాడు వచి్చన దగ్గర నుంచి జర్నలిజంలో విలువలు తగ్గాయని ఆరోపించారు. సాక్షి పేపర్ రాకపోతే నాణానికి రెండో వైపు కనిపించేదికాదని అన్నారు. తెలుగు మీడియాలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ–5 దుష్టచతుష్టయమని అన్నారు. ఈ మీడియా వైరస్‌కు ప్రజలు దూరంగా ఉండాలని చెప్పారు. ప్రజలు చైతన్యం కావాలి :ఆచార్య డీఏఆర్ సుబ్రమణ్యం నవ్యాంధ్ర ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆచార్య డీఏఆర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ వాస్తవానికి తెలుగు మీడియా, దేశీయా మీడియా ఒకేలా ఉన్నాయని, ఒకరికే కొమ్ముకాస్తున్నాయని అన్నారు. ప్రజల్లోకి ఏం సమాచారం తీసుకెళ్లాలనేది వారే నిర్ణయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు చైతన్యవంతులై అబద్దాలు, తప్పులు ఎక్కడున్నా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లేకపోతే అసత్య కథనాల ఒరవడి ఆగదని అన్నారు. -
టీడీపీకి పెద్ద దిక్కు? బాలకృష్ణకు ఘోర అవమానం
-
చంద్రబాబూ ఆత్మవిమర్శ చేసుకో
ఖైరతాబాద్(హైదరాబాద్): ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇకనైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి అన్నారు. సోమవారం ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులు అర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. 74 ఏళ్ల వయస్సులో ఎన్టీఆర్‌ను అవమానాలకు గురిచేసి, చివరకు ఆయన చనిపోయేలా చేశావో, అదే 74వ ఏట మీరు చేసిన పాపాలు పండి అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన ఈ ఉద్వేగభరిత క్షణాల్ని నా భర్త సమాధితో పంచుకోవాలని ఇక్కడకు వచ్చి నివాళులు అర్పించినట్టు చెప్పారు. చంద్రబాబు ఎప్పటికీ తప్పించుకోలేడని ఎన్టీఆర్ ఆనాడు చెప్పిన మాటల్ని లక్ష్మీపార్వతి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నా భర్తకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చెప్పాలనే ఇంతకాలం బతికున్నానని, నా ఆశయం నా భర్త నిర్దేశించారని తెలిపారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేశాడు. ప్రజల సొమ్ము దోచుకొని, అవినీతి కేసుల్లో వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ, అధికారం అడ్డుపెట్టుకొని వ్యవస్థలను కొనుక్కోవడం చేస్తూ వచ్చాడని, చివరికి అదే వ్యవస్థలో చిక్కుకుపోయి జైలు పాలయ్యాడని, ఇప్పుడు నా కోపం అంతా తీరిపోయిందన్నారు. ఎన్టీఆర్ కుటుంబం ఇప్పటికైనా ఆలోచించాలని, చంద్రబాబు అక్రమాలను మీరు సహిస్తారా... ప్రజాధనం లూటీ చేస్తూ దొరికిపోయాడు, ఆలోచించండన్నారు. నిప్పులాగా బతికిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఎక్కడ, అధికారం కోసం తడిగుడ్డతో గొంతులు కోసే మనస్తత్వం ఉన్న చంద్రబాబు గురించి తెలుసుకోవాలన్నారు. -
నాడు ఎన్టీఆర్‌ను తిట్టారు.. నేడు దండలు వేస్తున్నారు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ‘నేను ఒక సీరియస్ జోక్ చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. ఆ జోక్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కూడా నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కానీ జోక్ అది. ఆయన మరణానికి కారణమైన వాళ్లే.. ఇప్పుడు ఎన్టీఆర్ కంటే గొప్ప వ్యక్తి లేరు అంటూ కీరి్తస్తున్నారు’ అని టీడీపీ మహానాడును ఉద్దేశించి సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. నాడు లక్ష్మీపార్వతితో ఉన్న ఎన్టీఆర్‌ను తిట్టిన వాళ్లే.. నేడు ఆయనకు ఎందుకు దండలు వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్టు, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో విజయవాడలో ఆదివారం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అతిథులు ఎన్టీఆర్ లలిత కళా అవార్డును పోసాని కృష్ణమురళికి ప్రదానం చేశారు. అనంతరం రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ.. చంద్రబాబు ఎలాంటి వ్యక్తి అనేది స్వయంగా ఎన్టీఆరే చెప్పారన్నారు. రజనీకాంత్ లాంటి వ్యక్తి రాష్ట్రానికి వచ్చి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వాళ్లతో కూర్చున్నారంటే.. ఒకరకంగా ఆయన కూడా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడుస్తున్నట్లేనన్నారు. నందమూరి కుటుంబంలో ఉన్న ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. తాతకు వెన్నుపోటు పొడిచిన వారితో వేదిక పంచుకోవడం ఇష్టం లేకే.. ఆయన వీళ్లందరికీ దూరంగా ఉంటున్నారన్న విషయం స్పష్టమవుతోందన్నారు. తాను ‘వ్యూహం’ సినిమా తీస్తున్నానని, అందులో చంద్రబాబు క్యారెక్టర్‌ను అరటిపండులా వలిచి చూపిస్తానని ప్రకటించారు. లక్ష్మీపార్వతిపై బాబు పుకార్లు.. ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. ఏ కులం, ఏ మతం వారితో అయినా స్నేహం చేయవచ్చు కానీ.. గుణం లేని వారితో మాత్రం చేయకూడదన్నారు. గుణం లేని వాడు చంద్రబాబు అని.. అతనికి దూరంగా ఉండటం చాలా మంచిదని సూచించారు. తన మంచిచెడులు చూసుకునేందుకు లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ ఆహ్వా నించారని, కానీ ఆమెపైనా చంద్రబాబు అనేక పుకార్లు పుట్టించారని చెప్పారు. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్‌కు మూడుసార్లు గుండెపోటు వచ్చినా.. లక్ష్మీపార్వతి ఒక్కరే అండగా నిలిచారని చెప్పారు. రాష్ట్రంలో మళ్లీ మళ్లీ వైఎస్సార్సీపీని గెలిపిస్తేనే ఎన్టీఆర్ ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. బాబు కుట్రలకు ఎన్టీఆర్ కుమిలిపోయారు తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. అడ్డదారుల్లో అధికారాన్ని లాక్కునేందుకు చంద్రబాబు చేసిన కుట్రలపై ఎన్టీఆర్ ఎంతగానో కుమిలిపోయారని చెప్పారు. ఎన్టీఆర్‌ను అడుగడుగునా వేధింపులకు గురిచేశారని వివరించారు. ఎన్టీఆర్ కష్టకాలంలో దేవినేని నెహ్రూ అన్నీ తానై నిలిచారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ పేరుతో జిల్లా ఏర్పాటు చేసినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన గౌరవాన్ని నిలబెట్టిన జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రారంభించిన పథకాలు ఎప్పటికీ చిరస్మరణీయమేనని అన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ లాంటి గొప్ప మనిషి కూడా చంద్రబాబు కుట్రకు బలయ్యారన్నారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్టు కన్వీనర్, వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి అవినాశ్ మాట్లాడుతూ ఎన్టీఆర్, వైఎస్సార్ ఒక కులానికో, పార్టీకో పరిమితం కాదన్నారు. ఈ సభలో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు, నవరత్నాలు అమలు కమిటీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. -
మహిళా సాధికారత కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారు: లక్షీ పార్వతి
-
ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడాను: లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు
-
టీడీపీ అండ్ కో పిచ్చి మాటలు మానుకోవాలి
-
చంద్రబాబు,లోకేష్ తెలుగు భాష కోసం ఏమీ చేయలేదు : లక్ష్మీపార్వతి
-
సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు
‘‘కనుమరుగైపోతున్న చేతివృత్తుల కళాకారుల్ని ప్రోత్సహించాలనే ఆశయంతో వారి ఇబ్బందుల నేపథ్యంలో ‘రాధాకృష్ణ’ సినిమా తీయడం అభినందించాల్సిన విషయం. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అనురాగ్, ముస్కాన్ సేథీ జంటగా, ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రాధాకృష్ణ’. దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో టి.డి. ప్రసాద్ వర్మ దర్శకత్వం వహించారు. పుప్పాల సాగరిక, కృష్ణ కుమార్ నిర్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం ఈ చిత్రం ట్రైలర్‌ని రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘తెలుగు పరిశ్రమకు ఎలాంటి పథకాలు కావాలన్నా మా ముఖ్యమంత్రి జగన్‌గారు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందినట్లుగానే ఏపీలోనూ అభివృద్ధి చేయడానికి సీయం చర్యలు చేపడుతున్నారు’’ అన్నారు. ‘‘నేను యాక్ట్ చేయడం ఏంటి? అని నాకు అనిపిస్తుంది. శ్రీనివాస్ రెడ్డి పట్టుబట్టి నన్ను నటింపజేశారు. ప్రాచీన కళలను కోల్పోతే మన మనుగడ కోల్పోయినట్టే’’ అన్నారు లక్షీ పార్వతి. ‘‘వైవీ సుబ్బారెడ్డిలాంటి మంచి మనిషి మా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అప్పుడే ఈ సినిమా విజయం కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సినిమాని సెన్సార్ వాళ్లు ప్రశంసించారు’’ అన్నారు శ్రీనివాస్‌రెడ్డి. ‘‘త్వరలోనే థియేటర్స్‌లో విడుదల చేస్తాం’’ అన్నారు సాగరిక కష్ణకుమార్. అలీ, దర్శకుడు టీడీ ప్రసాద్ వర్మ, ముస్కాన్ సేథీ తదితరులు పాల్గొన్నారు. – టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి -
‘చంద్రబాబు రాజకీయానికి వారిద్దరూ బలయ్యారు’
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనవిజయం సాధించి శనివారం నాటికి ఏడాది పూర్తవుతుందని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి గుర్తు చేశారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఏడాదిలోనే సీఎం జగన్ ఇచ్చిన హామీలలో 90 శాతం అమలు చేశారని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు సీఎం జగన్ తండ్రిలా సేవ చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మంచి నాయకుడు దొరికాడని, జగన్‌పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని కితాబిచ్చారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జగన్ పాలన చూసి పొగుడుతున్నారన్నారు. పార్టీలకు అతీతంగా జగన్ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. ('సొంత పార్టీకి చెందినవాడే దొంగదీక్ష అన్నాడు') ఇంకా ఆమె మాట్లాడుతూ... రాష్ట్రానికి చంద్రబాబు సేవలు అవసరం లేదని, చంద్రబాబును ప్రజలు ఎప్పుడో మర్చిపోయారన్నారు. చంద్రబాబు, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 25ఏళ్లు గడిచాయన్నారు. చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని, ఆయనకు వయసు పెరిగిన బుద్ది పెరగలేదన్నారు. చంద్రబాబు తన పాలనలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని, ఆయన జూమ్ నాయుడుగా మారిపోయాడన్నారు. చంద్రబాబు రాజకీయానికి రంగనాయకమ్మ, డాక్టర్ సుధాకర్ బలయ్యారన్నారు. డాక్టర్ సుధాకర్ టీడీపీ సానుభూతి పరుడని, టీడీపీ ఎమ్మెల్యే సీటు కోసమే ఉద్యోగానికి రాజీనామా చేశారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. రంగనాయకమ్మ టీడీపీ సానభూతి పరురాలని, టీడీపీకి అనుకూలంగా సోషల్‌మీడియాలో ఆమె ప్రచారం చేస్తున్నారన్నారు. టీడీపీ సానుభూతి పరురాలని పట్టుకొని ఎల్లోమీడియా సామాజిక కార్యకర్తని చేసిందని దుయ్యబట్టారు. 66 యేళ్ల మహిళపై కేసు పెట్టారంటూ గగ్గోలు పెట్టారని, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే కేసులు పెట్టరా? అని ప్రశ్నించారు. 60 యేళ్ల మహిళ అయిన తనపై టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని, ఎన్టీఆర్ భార్యగా తనని ఘోరంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కోటి అనే వ్యక్తికి 25 లక్షలు ఇచ్చి తనపై టీవీ5 ఛానెల్లో డిబేట్ పెట్టినప్పుడు మహిళ సంఘాల నేతలు ఏమయ్యాని ప్రశ్నించారు. అప్పుడు ఎవరు నోరు మెదపలేదని, ఇప్పుడు మాత్రం టీడీపీ నేతలు కుక్కల్లాగా మొరుగుతున్నారన్నారు. 70 యేళ్ల వయసులో చంద్రబాబు రాజకీయాలు మానుకొని రామా-కృష్ణా అంటూ రామాయణం, భారతం చదువుకోవాలని హితవు పలికారు. (మీ బిడ్డలకోసమైనా.. తీరు మార్చుకోండి) -
రోజుకో బాగోతం వెలుగు చూస్తోంది
-
అమ్మ భాషకు పునరుజ్జీవం
సాక్షి, అమరావతి/ఒంగోలు మెట్రో: తెలుగు భాషకు మంచిరోజులొస్తున్నాయి. మాతృభాష అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది. అధికార భాషా సంఘం, తెలుగు అకాడమీలను ఏర్పాటు చేసింది. పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి భాషగా చేసింది. భాష, సంస్కృతుల వికాసానికి ప్రణాళి కాబద్ధంగా చర్యలు చేపట్టడంపై భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో తెలుగు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ విషయాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు. దీనిపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, తెలుగు భాషాభిమానులు ఆందోళనలు చేసినా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక అధికార భాషా సంఘాన్ని నియమించలేదు. తెలుగు అకాడమీ ఏర్పా టును అసలు పట్టించుకోలేదు. తెలుగు భాషాభివృద్ధికి భాషావేత్తల సూచనలు, డిమాండ్లను చంద్రబాబు బేఖాతరు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలని ఎన్నో వినతులిచ్చినా పెడచెవిన పెట్టారు. ‘తెలుగుదేశం పార్టీ పేరులో తెలుగు ఉంది తప్ప.. చంద్రబాబు మనసులో తెలుగుకు స్థానం లేదు’ అని భాషాభిమానులు తీవ్రంగా విమర్శించారు. తెలుగుకు మళ్లీ వెలుగులు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత తెలుగు భాషా వికాసానికి గట్టి చర్యలు చేపట్టారు. పరిపాలనలో తెలుగు వినియోగం, భాషాభివృద్ధికి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అధికార భాషా సంఘాన్ని నియమించారు. దానికి తెలుగు, హిందీ భాషల్లో పండితుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ను అధ్యక్షుడిగా నియమించారు. ప్రముఖ సాహితీవేత్తలు మోదుగుల పాపిరెడ్డి, షేక్ మస్తాన్, ఆచార్య చందు సుబ్బారావు, ఆచార్య శరత్ జ్యోత్సా్నరాణిలను అధికార భాషా సంఘం సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. తెలుగు అకాడమిని పునరుద్ధరించారు. ప్రముఖ రచయిత్రి, ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీ పార్వతిని ఆ అకాడమి అధ్యక్షురాలిగా నియమించారు. తద్వారా తెలుగు భాష, సాహిత్యాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకువెళ్తున్నారు. అదే విధంగా 1 నుంచి పదో తరగతి వరకు ఓ సబ్జెక్టుగా తెలుగు గానీ ఉర్దూగానీ తప్పనిసరి చేసి అమ్మభాష తప్పనిసరిగా నేర్చుకునేట్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఉర్దూ అకాడమీని కూడా పునరుద్ధరించనుంది. భాషాభివృద్ధికి ప్రభు త్వం చేపడుతున్న చర్యల పట్ల సాహిత్యాభిమానులు, విద్యా వేత్తలు, సాహితీవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భాష పురోగతికి బాటలు ‘ఆధునిక మహిళ చరిత్రని పునర్లిఖిస్తుంది’ అని గురజాడ చెప్పినట్టు ప్రభుత్వం ఒక మహిళ అయిన నందమూరి లక్ష్మీపార్వతికి తెలుగు అకాడమీ బాధ్యతలు అప్పగించింది. తద్వారా తెలుగు భాష పురోగతికి బాటలు వేసింది. – సింహాద్రి జ్యోతిర్మయి, ఉపాధ్యక్షురాలు, నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం సంతోషం కలిగిస్తోంది సీఎం వైఎస్ జగన్.. మదర్సాల ఉన్నతికి చర్యలు చేపట్టడమే కాకుండా ఉర్దూ అకాడమీని పునరుద్ధరించాలని చేస్తున్న ప్రయత్నం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. వీటిని గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా వదిలేస్తే అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే వైఎస్ జగన్ చర్యలు తీసుకోవడం ముదావహం. – డాక్టర్ షాకీర్, విద్యావేత్త తెలుగు అభివృద్ధికి నిర్మాణాత్మక చర్యలు తెలుగు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది. భాషావేత్తలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న విధంగా పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేసింది. దాంతో భావితరాలకు కూడా తెలుగును మరింత చేరువ చేసింది. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకొనేందుకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అదే సమయంలో తెలుగు భాషను ఏమాత్రం విస్మరించ లేదు. – యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడింది తెలుగు భాషాభివృద్ధికి, వికాసానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే అధికార భాషా సంఘాన్ని నియమించింది. తెలుగు అకాడమీని పునరుద్ధరించింది. పోటీ ప్రపంచంలో మన విద్యార్థులు వెనుకబడిపోకూడదనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నారు. అంతమాత్రాన తెలుగును తీసేయడం లేదు. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేశారు. – నందమూరి లక్ష్మీపార్వతి, తెలుగు అకాడమి అధ్యక్షురాలు -
ఎన్టీఆర్ పురస్కారానికి ‘నగెన్’ ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ అస్సామీ కథకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, అస్సామీ పత్రికల సంపాదకుడు ‘నగెన్ సైకియా’ను 2019 ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి వెల్లడించారు. ట్రస్ట్ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారితో కలిసి ఆమె గురువారం లక్డీకాపూల్‌లోని సెంట్రల్ కోర్టు హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2006లో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్‌ను స్థాపించామని తెలిపారు. 2007 నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 26 భాషల్లోని ప్రముఖులకు ఏటా పురస్కారాలు అందిస్తున్నామన్నారు. గతంలో ఎస్ఎల్ ఖైరప్ప (కన్నడం), సచ్చిదానందన్ (మలయాళం), అశోక్ మిత్రన్ (తమిళం), మహా శ్వేతాదేవి (బెంగాలీ), మనోజ్ దాస్ (ఒరియా), నేమాడి బాలచందర్ (మరాఠీ), జిలానీ బానో (ఉర్దూ), డాక్టర్ రఘువీర్ చౌదరి (గుజరాతీ) తదితరులను ఎంపిక చేశామని పేర్కొన్నారు. తెలుగుకు సంబంధించి ఆవత్స సోమసుందరం, రవ్వా శ్రీహరి, డాక్టర్ సి.నారాయణరెడ్డి, కాళీపట్నం రామారావు తదితర భాషా సాహితీవేత్తలకు పురస్కారాలు అందజేశామన్నారు. కేవీ రమణాచారి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జయంతి రోజైన ఈ నెల 28న నగెన్ సైకియాకు పురస్కారాన్ని ప్రదానం చేస్తామని తెలిపారు. పురస్కారం కింద రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రంతో పాటు, జ్ఞాపికను బహూకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతల సంఘం అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, న్యాయ నిర్ణేతల సంఘం సభ్యులు డాక్టర్ సూర్య ధనుంజయ్, డాక్టర్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. -
తప్పుడు ఆరోపణలపై లక్ష్మీ పార్వతి డీజీపీకి ఫిర్యాదు
-
‘కోటిని నా బిడ్డలాగా భావించాను’
సాక్షి, హైదరాబాద్ : తనపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నేత లక్ష్మీపార్వతి సోమవారం డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘కోటి అనే వ్యక్తిని నా బిడ్డలాగా భావించాను. కానీ అతను నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నాడు. గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న నన్ను కించపరుస్తూ విమర్శలు చేస్తున్నాడు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక.. ‘ఈ నెల 4న కోటి టీవీ చానెల్స్, సోషల్ మీడియాలో నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిత్వాన్ని కించపరిచాడు. ఇందుకు గాను కోటీతో పాటు ఆరోపణలను ప్రచారం చేసిన మీడియా చానెల్, సదరు యాంకర్‌పై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశాను. దీని వెనక ఉన్న కుట్రను ఛేదించి నా పరువు మర్యాదలు కాపాడాలి’ అని డీజీపీని కోరినట్లు ఆమె తెలిపారు. -
ఎన్టీఆర్స్ లక్ష్మి
‘మది తలపుల పువ్వులు పూస్తే మకరందం నువ్వుసువాసన అనే జ్ఞాపకం పరిమళం చిరుగాలై మనసును తాకితేనీ పిలుపేమో అలికిడి... పులకింత నీ తాకిడి’ (లక్ష్మీపార్వతి రాసిన కవితల్లో ఎన్టీఆర్‌కి ఇష్టమైన కవిత) ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో రామ్‌గోపాల్ వర్మ ఏం చూపించబోతున్నారో విడుదలైతే కానీ తెలీదు. లక్ష్మీపార్వతిని ఇంటర్వ్యూ చేసినప్పుడు మాత్రం ఆమెలో ‘ఎన్టీఆర్స్ లక్ష్మి’ కనిపించారు. హైదరాబాద్, ఫిల్మ్‌నగర్‌లోని లక్ష్మీపార్వతి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా శ్రీకృష్ణుడి గెటప్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నవ్వుతూ పలకరించింది. ఆ పక్కనే ఒక కుర్చీలో యువకుడిగా ఉన్నప్పటి ఎన్టీఆర్ ఫొటో. గోడలకు మిడిల్ ఏజ్‌లో ఉన్న ఎన్టీఆర్ పెయింటింగ్, మరో వైపు ఎన్టీఆర్ – లక్ష్మీపార్వతి పెళ్లి ఫొటో ఉన్నాయి. ఆ ఇంట్లో ఎటు చూసినా ఎన్టీఆరే. గుంటూరు జిల్లా పొన్నూరుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది పచ్చల తాడిపఱు. అది లక్ష్మీపార్వతి సొంతూరు. కృష్ణాజిల్లా, గుడివాడకు పాతిక కిలోమీటర్ల దూరాన ఉంది నిమ్మకూరు. అది ఎన్టీఆర్ సొంతూరు. ఈ రెండు ఊర్లకు మధ్య ఓ మధురమైన బంధం దేశ రాజధాని న్యూఢిల్లీలో మొగ్గ తొడిగింది. ఆ ఆత్మసఖునితో తనకు ఏర్పడిన బాంధవ్యాన్ని, అనంతర కాల జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు లక్ష్మీపార్వతి. తొలి తలపు సందర్భం ‘‘నా జీవితంలో ముఖ్యమైనవి నాలుగు సంఘటనలు. ఐదేళ్ల వయసులో ‘గులేబ కావళి కథ’ సినిమా చూసేటప్పుడు ఎన్టీఆర్‌ను దగ్గరగా చూడాలని ఏడ్చి మొండికేస్తే మా నాన్న తెర దగ్గరగా కూర్చోపెట్టారట. ఆ సంఘటన లీలగా గుర్తుంది. రెండోది.. స్కూల్లో ఉన్నప్పుడోసారి ఎన్టీఆర్ వస్తున్నారని పిల్లలందరం రోడ్డు మీదకొచ్చాం. మమ్మల్ని చూసి ఆయన దిగి వచ్చి చేతులూపారు. ఆయన వెళ్లిపోయిన తర్వాత కూడా నేను రోడ్డు మీద నుంచి కదల్లేదు. మా టీచర్ వచ్చి చెవి మెలేసి తీసుకెళ్లే వరకు ఆ భ్రాంతిలోనే ఉండిపోయాను. నేను పెద్దయిన తర్వాత మరోసారి ఆ మహానుభావుణ్ని చూసే అవకాశం వచ్చింది. తెనాలిలో మీటింగ్. ఎన్టీఆర్‌గారికి రచయితగా పరిచయం కావాలనే తపన నాది. సభలో చదివి వినిపించడానికి పాట రాసుకుని వెళ్లాను. చాలామంది వచ్చారు. ఉదయం నుంచి ఒక గదిలో కూర్చోబెట్టారు. చెమటకు ముద్దయిపోయాం అందరం. నా చేతిలోని పాట కాగితం కూడా. ఏడాది పిల్లవాడిని ఇంట్లో అమ్మ దగ్గర పెట్టి వచ్చాను. ఎన్టీఆర్ సాయంత్రం నాలుగ్గంటలకు వచ్చారు, కానీ జనం గుమిగూడిపోవడంతో కంటి నిండా చూడలేకపోయాను. ఆ సమూహంలో కిందకు వంగి చేయి చాచి ఆయన పాదాలు తాకి కళ్లకద్దుకుని వెనక్కి వచ్చేశాను. అది మూడో సంఘటన. ఇక నాలుగోది.. ఢిల్లీలో సంభవించింది. ఎన్టీఆర్‌తో మాట్లాడాలని ఉందని ఉపేంద్ర గారిని అడిగి ఉన్నాను (అప్పటికే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాను). ఆ అవకాశం 1985, నవంబర్ ఒకటిన వచ్చింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కవులు, కళాకారులకు సన్మానం. ఆయన ఎదురుగా సభలో మాట్లాడటంతోపాటు సన్మానం కూడా అని తెలిసినప్పటి నుంచి తిండి తినబుద్ధి కాలేదు, నిద్రపట్టలేదు. తీరా ఆ రోజు ఆయన కనిపించగానే సూర్యభగవానుడే దిగివచ్చినట్లు కళ్లు విభ్రమ చెందాయి. ఆయన కాళ్ల మీద పడిపోయాను. ఆయన నన్ను గుర్తు పెట్టుకున్న తొలి సందర్భం కూడా అదే. మలుపులో మహద్భాగ్యం అది 1986, మే నెల.. మహానాడుకు వెళ్లడానికి మహిళల కోసం విడిగా బస్సు వేశారు. అప్పుడు నేను గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి మహిళా విభాగం జనరల్ సెక్రటరీని. మహిళలందరం బస్సులో వెళ్లాం. వేదికకు దగ్గరగా మా సీట్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ని దగ్గరగా చూశాను. సమావేశం పూర్తయింది. బస్సులు కదులుతున్నాయి బస్ ఎక్కమని అనౌన్స్మెంట్ వస్తోంది. ఎన్టీఆర్ వేదిక దిగడం, నేను లేచి బస్ కోసం నడవడం అనుకోకుండా ఒకేసారి జరిగాయి. ఉపేంద్రగారు పలకరించడంతో ఆగాను. బారికేడ్‌కు ఆవల ఎన్టీఆర్, ఇవతల నేను. ఆ టర్నింగ్ దగ్గర ఆయన వెళ్లాల్సిన దారి, మా దారి వేరవుతాయి. ఒక్క క్షణం ముందుగా ఆయన తన దారిలో వెళ్లిపోయినా, నేను ఒక్క క్షణం ఆలస్యంగా సీట్లోంచి లేచినా ఒకరికొకరం ఎదురుపడేవాళ్లమే కాదు. కాకతాళీయంగా జరిగిపోయింది. ఆ టర్నింగ్ నా జీవితాన్నే మలుపు తిప్పింది. అది కూడా ఆయన పుట్టిన రోజు నాడు. ఆయన ఎదురుగా కనిపిస్తే నాకు ఇక ఏమీ తెలిసేది కాదు, వెంటనే కాళ్ల మీద పడిపోయాను. ఆయనే పైకి లేపి... నా ముఖంలోకి చూస్తూ, చూపుడు వేలు చూపిస్తూ ‘లక్ష్మీపార్వతి గారు’ అన్నారు. అంతే మేఘాల్లో తేలిపోయినట్లయింది నాకు. రచనగా ‘రామ’ చరితం నేను ఎంఫిల్ చేస్తున్న రోజుల్లో మా కాంటెంపరరీ స్టడీస్ విభాగం ఆంధ్ర సారస్వత పరిషత్ భవనంలో ఉండేది. రోజూ మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌లో ఎన్టీఆర్ ఇంటికి పరుగు తీసేదాన్ని. ఒక్కోరోజు ఆయన కనిపించేవారు. ‘మీ థీసీస్ ఎంత వరకు వచ్చింది’ అని అడిగేవారు. ఎంఫిల్ పూర్తయిన తర్వాత ఆ సంగతి చెప్పడానికి వెళ్లి, ధైర్యం చేసి ‘మీ బయోగ్రఫీ రాస్తాను’ అని అడిగాను. పెద్దగా నవ్వేశారాయన. ‘మై లైఫ్ ఈజ్ యాన్ ఓషన్’ అన్నారు. జీవితం అంటే పైకి కనిపించే పార్శ్వం మాత్రమే కాదు, దాని వెనుక కష్టాల కోణాలుంటాయనేది ఆయన ఉద్దేశం. ‘నాకు కష్టాలు తెలుసు, కష్టాల్లోనే పెరిగాను, కష్టాల్లోనే బతుకుతున్నాను. కష్టం విలువ తెలుసు’ అన్నాను. ఆ మాట ఆయనకు నచ్చింది. ఆయన జీవిత చరిత్ర రాయడం కోసం 1985–86 సంవత్సరాల్లో నిమ్మకూరుకు వెళ్లి బంధువులతో మాట్లాడిన సంగతి కూడా చెప్పాను. ఆయనకంటే ముప్పై ఆరేళ్ల చిన్నదాన్ని. నా మాటలు చిన్నపిల్ల చేష్టలా అనిపించినట్లున్నాయి. నా తల మీద చిన్నగా కొట్టి నవ్వారు. కానీ నేను పట్టుదలతో ఉన్నాననే నమ్మకం కలిగిందాయనకు. ఎంఫిల్ అవార్డు అందుకోవడానికి వచ్చినప్పుడు మరోసారి కలిసి బయోగ్రఫీ గురించి గుర్తు చేశాను, అప్పుడు ఒప్పుకున్నారాయన. నర్సరావుపేటలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తూ వారాంతంలో హైదరాబాద్‌కి వచ్చి బయోగ్రఫీ కోసం నోట్స్ రాసుకున్నాను. ఊహించని వరం నేను దేవుడిలా ఆరాధించే రూపం ఎన్టీఆర్. ఆయన కూడా నన్ను అంతలా ఆరాధిస్తున్నారని తెలిసినప్పుడు సంతోషం వేయకుండా ఎలా ఉంటుంది? నాతో మాట్లాడాలనిపించినప్పుడు కాలేజ్‌కి ఫోన్ చేసేవారాయన. కాలేజ్‌కి ఫోన్ చేయడం నాకు ఇబ్బందిగా ఉంటోందని తెలిసి ఇంటికి ఫోన్ పెట్టిం చారు. రోజూ గంటలకు గంటలు మాట్లాడే వారు. ఓసారి హైదరాబాద్‌కి వెళ్లినప్పుడు ఫోన్ బిల్లు చూపించి ‘ఇది మన ప్రేమ ఫలితం’ అని నవ్వారు. బిల్లు చూసి గుండె ఆగినంత పనైంది. రెండు లక్షలకు పైనే. అంతలా ఆరాధిస్తున్న మనిషి∙‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని అడిగినప్పుడు నా నోటి నుంచి మరో మాట ఎలా వస్తుంది? ఆయన మనసులో స్థానం పొందడం నా అదృష్టం అని నేననుకుంటూ ఉంటే.. ఓ రోజు ఆయనే ‘లక్ష్మీ! నీ మనసులో నాకు స్థానం లభించడం నా అదృష్టం’ అన్నారు. ‘నువ్వంటే నాకు ప్రేమ కాదు లక్ష్మీ, ఆరాధన’ అనేవారు. వేటూరి గారి సన్మాన సభలో నా ప్రసంగానికి ప్రశంసలు వచ్చాయి. అప్పుడు ఎన్టీఆర్ సభలో మిగిలిన వారితో ‘అందుకే ఆమె అంటే నాకంతటి ఆరాధన. విద్వత్తుకు మరేదీ సాటి రాదు’ అన్నారు. భార్యలో మంచి లక్షణాన్ని అంగీకరించడం గొప్ప వ్యక్తిత్వం ఉన్న వాళ్లకే సాధ్యం. నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల ఆయన ముఖ్యమంత్రి పదవి సంక్షోభంలో పడినప్పుడు కూడా ఆయన నాకు అండగా నిలిచారు. కుటుంబం అంతా ప్లాన్ చేయడంతో కంచి పీఠాధిపతి నుంచి ఫోన్ వచ్చింది. నేను పుట్టింటికి కానీ కంచి ఆశ్రమానికి కానీ వెళ్లిపోతే ఆయనకు ముఖ్యమంత్రి పదవి మళ్లీ ఇచ్చేస్తామన్నారు. అప్పుడు కూడా నా గౌరవాన్ని తగ్గనివ్వలేదాయన. నాకే కాదు, పెద్దావిడను కూడా గొప్పగా గౌరవించేవారు. ఆమెను తలుచుకుంటూ ఆయనకు తెలియకుండా ఉమ్మడి కుటుంబంలో ఆమెకు జరిగిన అన్యాయాలు, ఆయన దృష్టికి వచ్చిన తర్వాత పరిష్కరించిన సంఘటనలను నాతో పంచుకునే వారు. సినిమా షూటింగులతో ఆమెకు తగినంత సమయం ఇవ్వలేకపోయానని, కొన్ని సినిమాలను తగ్గించుకుని ఉండాల్సింది అని బాధపడేవారు. జ్ఞాపకాలే సర్వస్వం పదో ఏట నుంచి కష్టాలనే చూశాను. అన్ని కష్టాల్లో నాకు సాంత్వననిచ్చింది ఆధ్యాత్మిక మార్గమే. తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో కూడా నా ఉపన్యాసం ఉండేది. ఎన్టీఆర్ ముగ్ధులైపోయింది కూడా ఆ శ్లోకాల పఠనానికే. ఆయనకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. కానీ సంస్కృతం రాదు. సంస్కృతం వచ్చిన నన్ను భాగస్వామిని చేసుకుని ఆయన ఆ లోటును పరిపూర్ణం చేసుకున్నారు. నా చేత ఆ శ్లోకాలను మళ్లీ మళ్లీ చదివించుకుని, భాష్యం చెప్పించుకుని ఆనందించేవారు. ఇప్పటికీ నన్ను నడిపిస్తున్న శక్తి తరంగాలు ఆయన జ్ఞాపకాలే. నా కొడుకు కోటేశ్వర ప్రసాద్, కోడలు దేవ స్మిత ఇద్దరూ డాక్టర్లు. వాళ్లను చూసుకుంటూ, నా స్వామి స్మరణంలో కాలం గడుపుతున్నాను’’. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి పిల్లలకు చెప్పారు నన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించు కున్న తర్వాత ఆ సంగతి కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు... అందరినీ పిలిచి ‘ఈ వయసులో నా ఆరోగ్యాన్ని పట్టించుకునే సహచరి కావాలి. ఆమె అభిరుచులు నా ఇష్టాలు సరిపోతు న్నాయి. నాకు ఆమె పట్ల గౌరవం ఉంది’ అని చెప్పారు. అంతా విని రామకృష్ణ ‘పెళ్లి తర్వాత మేము ఇంటికి రావచ్చా’ అని అడిగారు. అప్పుడు ఎన్టీఆర్ ‘తప్పకుండా రావచ్చు, రావాలి కూడా’ అన్నారు. మా వివాహానికి కుటుంబ అంగీకారమే కాదు, సమాజ ఆమోదం కూడా ఉంది. ఆయనకు బ్రెయిన్లో క్లాట్ ఏర్పడి, పెరాలసిస్ వచ్చిందని ఇంట్లో అందరికీ తెలుసు. ఆయన ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టలేదెవ్వరూ. ఆయన కడుపున పుట్టడం వాళ్ల అదృష్టం. ఆయన్ని కాపాడుకోవాలనే ఆలోచనే లేదెవ్వరికీ. క్షోభకు గురి చేయకుండా బతకనిచ్చి ఉంటే ఆయన్ని మరో పదేళ్లు కాపాడుకునేదాన్ని. ‘నీ చేతి వంట కోసమే బతకాలి’ నేను టీ తాగను, టీ పెట్టడమూ రాదు. ఆయనే టీ పెట్టడం నేర్పించారు. ఆయనకు నచ్చినట్లు వంట చేయాలని వంటల పుస్తకాలు తెప్పించుకున్నాను. సూర్యకాంతమ్మగారి వంటల పుస్తకం చూస్తూ వారంలో వంట నేర్చుకున్నాను. తర్వాత నా వంట తింటూ ‘నీ చేతి వంట కోసమే నూరేళ్లు బతకాలనుంది లక్ష్మీ’ అనేవారు. సి.ఎం అయిన తర్వాత ఆరుగురు వంటవాళ్లున్నా సరే... ‘లక్ష్మీ నువ్వేం వండావు’ అని అడిగి, అదే తినేవారు. నేషనల్ ఫ్రంట్ లీడర్లు హైదరాబాద్‌కి వచ్చినప్పుడు కూడా ‘నువ్వేదయినా చేసిపెట్టు’ అన్నారు. నేను చేసిన గారెలు, బజ్జీలను ‘మా తెలుగు వంటకాల రుచి ఎలా ఉంది’ అంటూ వాళ్లకు కొసరి కొసరి పెట్టించారు. అది చాలా చిన్న తిట్టు లక్ష్మీస్ ఎన్టీఆర్ టీజర్లో నన్ను తిడుతూ కొట్టిన పై సన్నివేశం కరెక్టే. అది చాలా చిన్న తిట్టు. మాటల్లో చెప్పలేని అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. రామ్‌గోపాల్ వర్మతో ఎన్టీఆర్ జీవితం మొత్తం చెప్పడానికి కుదరలేదు. నేను రాసిన బయోగ్రఫీ రెండు భాగాలు (ఎదురు లేని మనిషి, తెలుగుతేజం) ఇచ్చాను. వర్మగారు ఎన్టీఆర్‌తో పని చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను సంప్రదించి సమాచారం సేకరించారు. సొంతంగా అధ్యయనం చేసి మరీ తీశారు. నేను నీలిరంగు చీరలో ఉన్న ఫొటో అసలుదే. అది నా దగ్గర లేదు. ఆయనెలా సంపాదించారో తెలియదు. ఇరవై మూడేళ్ల నా అంతర్మధనం దృశ్యరూపం సంతరించుకుంటోంది. చరిత్రను, వాస్తవాన్ని ఎంత లోతున పాతి పెట్టాలని చూసినా ఏదో ఒక రోజు అవి ఉవ్వెత్తున ఎగిసి పడతాయి. ‘ఎంత బాగున్నావో!’ ఓ రోజు... రవీంద్రభారతికి వెళ్లడానికి బస్సు దిగి రోడ్డు దాటుతున్నాను. ఓ కారు నా దగ్గరగా వచ్చి ఆగింది. ఆ కారులో ఎన్టీఆర్! అబిడ్స్ నుంచి వస్తున్నారు. ఓ క్షణం ఆగి చూసి వెళ్లిపోయారు. అప్పుడు నేను గాలికి రేగిపోయి ముఖాన పడుతున్న జుత్తును చేత్తో వెనక్కి తోసుకుంటూ కొంగు భుజాన కప్పుకుని తల పక్కకు తిప్పి చూశానట. ‘ఆ దృశ్యం ఇప్పటికీ ఫొటోలాగ నా మదిలో ముద్రించుకుపోయింది లక్ష్మీ. అప్పుడే నిన్ను కారులో ఎక్కించుకుని నాతో తీసుకెళ్లి పోవాలనిపించింది. ఆ రోజు పసుపురంగు చీరలో చాలా బాగున్నావు’ అని చాలా రోజులకు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత చెప్పారాయన. -
ఓటమిని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు
-
సంగీతం, సాహిత్యం పూర్వజన్మ సుకృతం
- హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు - ప్రముఖ గుజరాతీ రచయిత రఘువీర్ చౌదరికి ఎన్టీఆర్ సాహితీ పురస్కారం హైదరాబాద్: సాహిత్యం లేనిదే సంగీతం లేదని, ఈ రెండూ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు చెప్పారు. పూర్వజన్మ సుకృతంవల్లే సాహిత్యం, సంగీతం అబ్బుతాయన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో ప్రఖ్యాత గుజరాతీ రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ రఘువీర్‌చౌదరికి ఎన్టీఆర్ జాతీయ సాహితీ అవార్డును ప్రదానం చేశారు. ఎన్టీరామారావు జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ట్రస్టు నిర్వహించిన ఈ ప్రదానోత్సవంలో జస్టిస్ శివశంకరరావు మాట్లాడుతూ... దేశ సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యాన్ని మనం గుర్తించలేకపోతున్నామని, వాటిని విదేశీయులు దోచుకొంటున్నారని అన్నారు. పౌరాణిక, జానపద చిత్రాలతో ఎన్టీఆర్, ఎస్వీఆర్ వంటి మహానటులు మన సంస్కృతికి పెద్దపీట వేశారన్నారు. బిహార్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి మాట్లాడుతూ... తెలుగు జాతి పట్ల భక్తిభావం, గౌరవం పెరగాలంటే ఎన్టీఆర్ చిత్రాలు చూడాలన్నారు. నేడు సమాజంలో విలువలు ఉన్నాయంటే ఎన్టీఆర్ చిత్రాలే కారణమన్నారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి మాట్లాడుతూ... తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ‘సాక్షి’ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ... నిస్వార్థం, చిత్తశుద్ధితో సామాన్యుల బాగోగులు తెలుసుకున్న రాజకీయ నాయకులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనన్నారు. 21 ఏళ్లుగా సాహితీ కార్యక్రమాల్ని సంకల్పం, ఆత్మవిశ్వాసంతో నిర్వహిస్తూ, ప్రతిభావంతులకు అవార్డులు ఇవ్వడం ఆనందంగా ఉందని ఎన్టీఆర్ ట్రస్టు చైర్పర్సన్ లక్ష్మీపార్వతి చెప్పారు. నటి గీతాంజలి, అవార్డు కమిటీ సభ్యులు ఓల్గా, సి.మృణాళిని, మాణిక్యాంబ పాల్గొన్నారు. ఈ అవార్డు ప్రత్యేకం: రఘువీర్‌చౌదరి ఎన్ని అవార్డులు వచ్చినా... ఎన్టీఆర్ సాహితీ పురస్కారాన్ని అందుకోవడం ప్రత్యేకమని, ఆనం దంగా ఉందని అవార్డు గ్రహీత రఘువీర్‌చౌదరి చెప్పారు. సినిమాలు, రాజకీయాల్లో సామాన్య ప్రజలకు దగ్గరగా ఉన్నది ఎన్టీఆర్ ఒక్కరేనన్నారు. -
'చంద్రబాబు అవినీతి బయటపడితే అండమాన్ జైలుకే'
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని మించిన 420 ఎవరూ లేరని దివంగత ఎన్టీఆర్ సతీమణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు అవినీతి బయటపడితే అండమాన్ జైలుకు పంపించాల్సి వస్తుందన్నారు. బాబు బ్లాక్‌మనీకి బావమరిది హిందూపురం టిడిపి అభ్యర్థి, సినీహీరో బాలకృష్ణ బినామీ అని చెప్పారు. బాలకృష్ణకు వందల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. బాలకృష్ణ ఆస్తులపై విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. తండ్రికి ద్రోహం చేసిన చంద్రబాబు వెంట బాలకృష్ణ ఏ విధంగా నడుస్తారు? అని ఆమె ప్రశ్నించారు. బాలకృష్ణ అవగాహన లేకుండా వైఎస్ జగన్మోహన రెడ్డిని విమర్శిస్తున్నారన్నారు. తన పెద్ద బావమరిది నందమూరి హరికృష్ణను కావాలనే చంద్రబాబు పక్కనపెట్టారని లక్ష్మీపార్వతి అన్నారు. -
వైఎస్ఆర్ సిపిలో చేరిన ధర్మాన ప్రసాదరావు, లక్ష్మీపార్వతి మరియు నేతలు
-
ముగ్గురు ఎమ్మెల్యేలు, లక్ష్మీపార్వతి వైఎస్ఆర్ సిపిలో చేరిక
శ్రీకాకుళం: ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు పలువురు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ఎంపి వైఎస్ జగన్మోహన రెడ్డి సమక్షంలో ఈ సాయంత్రం మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, పలాస ఎమ్మెల్యే జగన్నాయకులు, పలువురు నేతలు పార్టీలో చేరారు. వారితోపాటు ఇదే వేదికపైన ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి కూడా పార్టీలో చేరారు. జగన్మోహన రెడ్డి వారిపై పార్టీ కండువా కప్పి స్వాగతించారు. సమైక్య శంఖారావంలో భాగంగా శ్రీకాకుళం వచ్చిన జగన్మోహన రెడ్డికి ఘనస్వాగతం లభించింది. జగన్ వస్తున్న సందర్భంగా జనం భారీగా తరలి వచ్చారు. సభా ప్రాంగణం అంతా జనంతో కిక్కిరిసిపోయింది. -
జగన్ ప్రభంజనంలో బాబు కొట్టుకుపోతారు: లక్ష్మీపార్వతి
హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ప్రభంజనంలో రెండు కళ్లు, మూడు కాళ్ల సిద్ధాంతంతో ఉన్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొట్టుకోపోతారని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిపార్వతి హెచ్చరించారు. ఎల్బి స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సమైక్య పోరు చేస్తోన్న జగన్‌కు తెలుగు ప్రజలంతా అండగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి అభివృద్ధి పరిచిన సమర్ధనేతలు ఎన్టీఆర్, వైఎస్ఆర్ అని చెప్పారు. వారి ఆశయాలను అమలు చేయగల ఏకైక నేత జగన్ అని లక్ష్మిపార్వతి అన్నారు.