నగరంపాలెం (గుంటూరు వెస్ట్): రాష్ట్రంలో ఓ వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారం ప్రజలకు చేటు చేస్తుందని ఏపీ సంస్కృత అకాడమి చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజలకు ఎంతగా మేలు చేస్తున్నా, ఎల్లో మీడియా ప్రభుత్వంపై అసత్య కథనాలతో పాఠకులను పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం గుంటూరులోని పెన్షనర్స్ భవన్‌లో ‘తెలుగు మీడియా గమనం–గమ్యం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు.
అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ 1994లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, ఆయన అల్లుడు చంద్రబాబుకు అధికారాన్ని కట్టబెట్టడంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, మరికొన్ని పత్రికలు ప్రధాన పాత్ర పోషించాయని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, సంస్కరణలు, వినూత్న విధానాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నా, ఈ పత్రికలు విషం కక్కుతున్నాయని తెలిపారు.
గత చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయకపోయినా అద్భుతంగా చేశారని హడావుడి చేశాయన్నారు. కేవలం ఒక వ్యక్తిని, పార్టీని నిలబెట్టే తాపత్రయంతో దాదాపు 10 మీడియా సంస్థలు తీవ్రంగా పనిచేస్తున్నాయన్నారు. ఈ మీడియా కుయుక్తులను తిప్పికొట్టాలని ఇతర పత్రికలకు ఆమె పిలుపునిచ్చారు.
ఆ మీడియా తీరు దారుణం : వీవీఆర్ కృష్ణంరాజు
ఏపీ ఎడిటర్స్ అసోసియేష¯న్ అధ్యక్షుడు వి.వి.ఆర్.కృష్ణంరాజు మాట్లాడుతూ తెలుగు మీడియాలోని ఒక వర్గం తీరు అత్యంత దారుణంగా, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉందన్నారు. ఈ మీడియా సమాచార కాలుష్యాన్ని ఏపీ అంతటా వెదజల్లి, ప్రజల ఆలోచనలను కలుíÙతం చేస్తోందని చెప్పారు. ఏపీ అభివృద్ధి వైపు దూసుకెళ్తుండగా, చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకంజలో ఉందని అసత్య ప్రచారం చేస్తోందని వాపోయారు.
ఆ మీడియాకు చెదలు పట్టింది:న్యాయవాది సుందరరామశర్మ
సీనియర్ న్యాయవాది చుండూరు సుందరరామశర్మ మాట్లాడుతూ ఒక వర్గం మీడియాకు చెదలు పట్టాయని అన్నారు. పత్రికలు ప్రభుత్వాలకు వారధిలా ఉండాలని అన్నారు. కానీ కొందరికి కావాల్సిన విధంగా పత్రికలు నడుస్తున్నాయని చెప్పారు. గతంలో తప్పు చేస్తే ఎత్తిచూపడం, మంచి చేస్తే పట్టం కట్టేవారని చెప్పారు. ఈనాడు వచి్చన దగ్గర నుంచి జర్నలిజంలో విలువలు తగ్గాయని ఆరోపించారు. సాక్షి పేపర్ రాకపోతే నాణానికి రెండో వైపు కనిపించేదికాదని అన్నారు. తెలుగు మీడియాలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ–5 దుష్టచతుష్టయమని అన్నారు. ఈ మీడియా వైరస్‌కు ప్రజలు దూరంగా ఉండాలని చెప్పారు.
ప్రజలు చైతన్యం కావాలి :ఆచార్య డీఏఆర్ సుబ్రమణ్యం
నవ్యాంధ్ర ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆచార్య డీఏఆర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ వాస్తవానికి తెలుగు మీడియా, దేశీయా మీడియా ఒకేలా ఉన్నాయని, ఒకరికే కొమ్ముకాస్తున్నాయని అన్నారు. ప్రజల్లోకి ఏం సమాచారం తీసుకెళ్లాలనేది వారే నిర్ణయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు చైతన్యవంతులై అబద్దాలు, తప్పులు ఎక్కడున్నా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లేకపోతే అసత్య కథనాల ఒరవడి ఆగదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment