నలభై ఏళ్ల రాజకీయం అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చూస్తే భయం పట్టుకుందని ఆ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ఒకేసారి మొత్తం అసెంబ్లీ సానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్ని ప్రకటించడం నిజంగా గొప్ప విషయమని అన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేతుల మీదుగా 175 మంది వైఎస్సాసీపీ ఎమ్మెల్యే అభ్యుర్థుల జాబితా చదివి వినిపించిన అనంతరం ధర్మాన మాట్లాడారు. ఇప్పటికే టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసల వరద కొనసాగుతోందని, జాబితా విడుదల చేస్తే మరింత మంది తమ పార్టీలో చేరతారనే భయంతో చంద్రబాబు జాబితా విడుదల చేయడం లేదని ఎద్దేవా చేశారు.