ధర్మాన ప్రసాదరావు
సాక్షి, హైదరాబాద్: మొదటి నుంచీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఏపీకి తీరని అన్యా యం చేసిన సీఎం చంద్రబాబు నైజం ప్రజలకు పూర్తిగా అర్థమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసా దరావు చెప్పారు. టీడీపీ పుట్టి మునగకుండా కాపాడుకోవడం కోసమే ఇప్పుడు అఖిలపక్ష సమావేశమంటూ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ధర్మాన మంగళవారం హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బాబు సాగిస్తున్న అఖిలపక్ష చర్చల డ్రామాలతో సాధించేదేమీ ఉండదన్నారు.
హోదాపై కేంద్రం స్పందించక పోతే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని, మళ్లీ ప్రజా తీర్పు కోరుతామన్నారు. ఇప్పుడు కావాల్సింది అఖిలపక్షం భేటీ కాదు, టీడీపీ ఎంపీల రాజీనామా ’’ అని ధర్మాన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment