సాక్షి, గుంటూరు: సంఘాల కంటే సమాజం గొప్పదన్నారు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. తమపై సమాజానికి ఇతరత్రా అనుమానాలు రాకుండా సంఘాలు ప్రవర్తించాలని సూచించారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో 26వ స్టేట్ రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడారు మంత్రి. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేది రెవెన్యూ టీమ్‌గా పేర్కొన్నారు. మంచి భావాలు కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరూ ఆయనకు మద్దతు ఇవ్వాలని సూచించారు. బ్రిటిషనర్లు చేసిన సర్వేలతోనే ఇప్పటికీ కొనసాగుతున్నామని, ప్రభుత్వం చేపట్టిన సర్వేతో గ్రామాల్లో అశాంతి పోతుందని స్పష్టం చేశారు.
‘సర్వే క్లియరెన్స్ ఉంటే రాష్ట్ర జీడీపీ మరో రెండుశాతం పెరుగుతుంది. అసెంబ్లీలో తీర్మానించిన ఓ చట్టం వల్ల రెవెన్యూ మరింత శక్తిమంతం అవుతుంది. ఆ చట్టం ఆమోదించబడితే సివిల్ కోర్టుల్లోని కొన్ని హక్కులు రెవెన్యూ సిబ్బంది చేతుల్లోకి వస్తాయి. చంద్రబాబు ఐదేళ్లలో ఒక ఎకరం కూడా కొని పేదలకు ఇవ్వలేదు. పేదలకు ఒక్క ఎకరా ఇవ్వని చంద్రబాబుకు, 30లక్షలపైగా ఇళ్ళు కట్టిస్తున్న జగన్ పాలనకు పోలికా? కొంతమంది ఆ ఇళ్లను చూడటానికి బయల్దేరారు. ఈ మూడేళ్లలోనే అన్ని సమస్యలు వచ్చినట్టు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఆర్ అండ్ బీ రోడ్లు ఐదేళ్లు ఉంటాయి. మా ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అయింది. అంటే చంద్రబాబు హయాంలో రోడ్లు వేయలేదు. ఈ విషయంలో మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అది సరికాదు’అని స్పష్టం చేశారు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు.
ఇదీ చదవండి: పిల్ల సైకోలను పోగేసుకొచ్చి.. వారు తిరగబడితే పరుగెడుతున్నారు: జోగి రమేష్
Comments
Please login to add a commentAdd a comment