revenue minister
-
పేదలకు ప్రతి నెలా రూ.2,000.. కర్ణాటక మంత్రి కీలక ప్రకటన
బెంగళూరు: కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెలా రూ.2,000 సాయంగా అందించనున్నట్లు చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. వచ్చే నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రకటిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు సీఎం బసవరాజ్ బొమ్మై వివరిస్తారన్నారు. ఈ ఏడాది జులై నుంచే పథకం అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఇలాంటి పథకమే ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో కుటుంబపెద్దగా ఉండే మహిళకు ప్రతినెల రూ.2,000ల చొప్పున సంవత్సరానికి రూ.24,000 ఇస్తామని చెప్పారు. ఆ మరునాడే అధికార పార్టీ మంత్రి పేదలకు రూ.2,000 పథకం ప్రకటించడం గమనార్హం. 75 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిందన్నారు మంత్రి అశోక. కర్ణాటకలో మరోమారు తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. చదవండి: ఈ పెళ్లికూతురు చాలా స్మార్ట్.. కారు వదిలి మెట్రోలో పెళ్లి మండపానికి.. -
త్రిపుర రెవన్యూ శాఖ మంత్రి కన్నుమూత.. సీఎం సంతాపం
అగర్తలా: త్రిపుర రెవన్యూ శాఖ మంత్రి, ఇండీజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ) చీఫ్ నరేంద్ర చంద్ర దేవవర్మ(84) కన్నుమూశారు. రాష్ట్ర రాజధాని అగర్తలలోని గోవింద్ వల్లభ పంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో గత శుక్రవారం ఆసుపత్రిలో చేరారు దేవవర్మ. మెదడులోని నరాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల సర్జరీ చేశారు వైద్యులు. ఆ తర్వాత ఐసీయూకి మార్చి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ‘రాష్ట్ర కేబినెట్ సీనియర్ సభ్యులు ఎన్.సీ.దేవవర్మ మృతి చెందడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంటున్నా. ఓం శాంతి!’ అని ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మానిక్ సాహా. మరోవైపు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి సంతాపం ప్రకటించారు రాజ్యసభ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది దేవవర్మ పార్టీ ఐపీఎఫ్టీ. 2018లో ఐపీఎఫ్టీతో జతకట్టి అప్పటి లెఫ్ట్ ఫ్రంట్‌ను అధికారంలో నుంచి దించింది బీజేపీ. 1997లో ఐపీఎఫ్టీ ఏర్పడినప్పటికీ 2001లో విచ్ఛిన్నమైంది. ఆ తర్వాత 2009లో దేవవర్మ నేతృత్వంలో మళ్లీ పార్టీ పుంజుకుంది. త్రిపురతో పాటు ఢిల్లీలోనూ పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు దేవవర్మ. ఇదీ చదవండి: షాకింగ్: యువతిని కారుతో 4 కిమీ ఈడ్చుకెళ్లి.. నగ్నంగా వదిలేసి! -
30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం చరిత్ర : మంత్రి ధర్మాన
-
ఒక ఎకరం ఇవ్వని బాబుకు.. 30లక్షల ఇళ్లు కట్టిస్తున్న జగన్‌తో పోలికా?: మంత్రి ధర్మాన
సాక్షి, గుంటూరు: సంఘాల కంటే సమాజం గొప్పదన్నారు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. తమపై సమాజానికి ఇతరత్రా అనుమానాలు రాకుండా సంఘాలు ప్రవర్తించాలని సూచించారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో 26వ స్టేట్ రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడారు మంత్రి. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చేది రెవెన్యూ టీమ్‌గా పేర్కొన్నారు. మంచి భావాలు కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరూ ఆయనకు మద్దతు ఇవ్వాలని సూచించారు. బ్రిటిషనర్లు చేసిన సర్వేలతోనే ఇప్పటికీ కొనసాగుతున్నామని, ప్రభుత్వం చేపట్టిన సర్వేతో గ్రామాల్లో అశాంతి పోతుందని స్పష్టం చేశారు. ‘సర్వే క్లియరెన్స్ ఉంటే రాష్ట్ర జీడీపీ మరో రెండుశాతం పెరుగుతుంది. అసెంబ్లీలో తీర్మానించిన ఓ చట్టం వల్ల రెవెన్యూ మరింత శక్తిమంతం అవుతుంది. ఆ చట్టం ఆమోదించబడితే సివిల్ కోర్టుల్లోని కొన్ని హక్కులు రెవెన్యూ సిబ్బంది చేతుల్లోకి వస్తాయి. చంద్రబాబు ఐదేళ్లలో ఒక ఎకరం కూడా కొని పేదలకు ఇవ్వలేదు. పేదలకు ఒక్క ఎకరా ఇవ్వని చంద్రబాబుకు, 30లక్షలపైగా ఇళ్ళు కట్టిస్తున్న జగన్ పాలనకు పోలికా? కొంతమంది ఆ ఇళ్లను చూడటానికి బయల్దేరారు. ఈ మూడేళ్లలోనే అన్ని సమస్యలు వచ్చినట్టు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఆర్ అండ్ బీ రోడ్లు ఐదేళ్లు ఉంటాయి. మా ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అయింది. అంటే చంద్రబాబు హయాంలో రోడ్లు వేయలేదు. ఈ విషయంలో మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అది సరికాదు’అని స్పష్టం చేశారు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇదీ చదవండి: పిల్ల సైకోలను పోగేసుకొచ్చి.. వారు తిరగబడితే పరుగెడుతున్నారు: జోగి రమేష్ -
Dharmana Prasada Rao: వికేంద్రీకరణతోనే సమన్యాయం
స్వతంత్రం రాక ముందు మద్రాస్‌కు, స్వాతంత్య్రం వచ్చాక కర్నూలుకు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక హైదరాబాద్‌కు పరుగులు తీసిన సామాన్య మధ్యతరగతి ప్రజల దగ్గరకు వికేంద్రీకృత పరిపాలనను ఇప్పటికైనా తీసుకు వెళ్లకపోతే వారు తీవ్ర నిరాశా నిస్పృహలకు గురి అయ్యే ప్రమాదం ఉంది. ఏ ప్రాంత వాసులకూ ‘మనం నిర్లక్ష్యం చేయబడ్డాం’ అనే ఆలోచన, ఊహ రాకుండా జాగ్రత్త పడాల్సిన సమయం ఇది. పరిపాలనా వికేంద్రీకరణ ఈనాటి మాట కాదు. ఇది ప్రజల చిరకాల వాంఛ. శ్రీబాగ్ ఒప్పందంలోనే దీని బీజాలు పడ్డాయి. అలా ఆలోచిస్తే అమరావతి కన్నా విశాఖపట్నమే రాజధానిగా మేలైన నగరం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ఏకైక అతిపెద్ద నగరం విశాఖ. పాలనా రాజధానిగా త్వరగా, తక్కువ ఖర్చుతో విశాఖను అభివృద్ధి చేయవచ్చు. జూన్ 2, 2014. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తేదీ. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజిస్తూ భారతదేశ పార్లమెంట్ చేసిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం’ (రీ–ఆర్గనైజేషన్ యాక్ట్, 2014) అమలులోకి వచ్చిన రోజు. ఈ చట్టం చేసే ముందు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విధివిధానాల పరిశీలన కోసం కేంద్ర ప్రభు త్వం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. ఈ కమిటీ 2010 ఫిబ్రవరి నుంచి ఉమ్మడి రాష్ట్రం అంతటా విస్తృతంగా పర్యటించింది. పది నెలలు పర్యటించి చేసిన అధ్యయనంలో వివిధ అంశాలను ప్రస్తా విస్తూ నివేదికను సమర్పించింది. తొలుత రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేరడానికి అంగీకరించకపోవడం, ఆ తర్వాత 1937లో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు ఆర్థిక, సామాజిక పరిపాలనా అంశాల్లో కొన్ని భద్రతలు కల్పించడంతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఒకటి కావడం, ఆ తర్వాత తెలంగాణతో కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించడం వంటి పరిణామాలను కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 5లో హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు ఉండి, ఆ తర్వాత తెలంగాణకు మాత్రమే రాజధానిగా కొనసాగు తుందని, ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఏర్పాటవుతుందని పేర్కొ న్నారు. సెక్షన్ 6లో కేంద్ర ప్రభుత్వం నియమించే నిపుణుల కమిటీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అమలు నాటి నుండి ఆరు నెలల లోపు ఆంధ్రప్రదేశ్‌లో నూతన రాజధాని కోసం వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేసి తగిన సూచనలు, సిఫారసులు చేస్తుందని ఉంది. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని నియమించి, కమిటీ అధ్యక్షులుగా డాక్టర్ రతన్ రాయ్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సైన్స్ అండ్ పాలసీ డైరెక్టర్)ను, సభ్యులుగా ఆరోమార్ రెవి (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్), శ్రీ జగన్ షా (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ డైరెక్టర్), ప్రొఫెసర్ కె. రవీంద్రన్ (న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డీన్)లను నియమించింది. పట్టణాభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలో ఈ కమిటీకి అపార అనుభవం ఉంది. ఈ కమిటీ రాష్ట్రంలో 11 జిల్లాలు పర్యటించి ప్రజలను ప్రజా సంఘాలను కలిసింది. వారితో సంప్రదింపులు జరిపింది. వారి సూచనలు, సలహాలు తీసుకుంది. 4728 ప్రజా విజ్ఞప్తుల్ని పరిశీలించి వాటన్నింటినీ క్రోడీకరించింది. 187 పేజీలతో తన నివేదికను నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ‘‘హైదరాబాద్‌లో కమిషనరేట్లు, డైరెక్టరేట్లతో కూడిన శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు; మంత్రిత్వ శాఖల కేంద్రీకరణకు అనేక సంవత్సరాలు పట్టింది. అన్నేళ్లుగా రాజధాని పేరిట హైదరాబాద్‌లో జరిగిన ఈ కేంద్రీకృత అభివృద్ధే విభజన డిమాండ్‌కు కీలకాంశం. కాబట్టి ఒకే ఒక పెద్ద రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధ్యం కాదు’’ అని ఆ నివేదికలో కమిటీ అభిప్రాయపడింది. అలాగే గ్రీన్ ఫీల్డ్ (కొత్తగా నిర్మాణం మొదలు పెట్టడం) రాజధాని కూడా ఆమోదయోగ్యం కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే ఆనాటి ప్రభుత్వం ఈ సూచనను పట్టించుకోలేదు. పైగా అత్యంత విచారకరమైన విషయమేమిటంటే ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో భూలభ్యత గురించి అడిగినప్పుడు ప్రభుత్వం ఎంతమాత్రం సహకరించకపోవడం! అసలు కమిటీ నివేదిక ఇవ్వక ముందే ఒక అభిప్రాయానికొచ్చి విభజన చట్టానికి వ్యతిరేకంగా తానే ఒక కమిటీ నియమించుకుంది. అర్హతలూ, అనుభవం, నైపుణ్యం ఏ మాత్రం లేని ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను కమిటీ అధ్యక్షుడిగా నియమించారు చంద్రబాబు. అందులో సభ్యులుగా ఉన్న వారిని చూస్తే వారి ఆలోచన, సామర్థ్యం, రాష్ట్రం ఏమైపోయినా ఫరవాలేదనుకునే బాధ్యతా రాహిత్యం, ఇతర ప్రాంతాల అభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఉన్న నిర్లక్ష్యం ఇట్టే అర్థమవుతుంది. సుజనా చౌదరి, గల్లా జయదేవ్, బొమ్మిడాల శ్రీనివాస్, జీవీకే సంజయ్ వంటివారు ఆనాటి కమిటీ సభ్యులు. రాజ్యాంగబద్ధంగా, శాసన సమ్మతంగా ఏర్పాటైన శివరామ కృష్ణన్ నివేదికను తొక్కిపెట్టి, ఏ చట్టంలోనూ పేర్కొనని నారాయణ కమిటీని అడ్డం పెట్టుకొని అమరావతిని రాజధానిగా ప్రకటించారు! దాని కోసం సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) చట్టం చేశారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య. రాజ్యాంగ సభలో 1949 మే 27న ‘రాజధాని ఎక్కడ ఉండాలి?’ అనే విషయంపై చర్చ జరిగినా, రాజ్యాంగంలో ప్రస్తావన జరగలేదు. రాజధాని ఒకటే ఉండాలని గాని, ఒకే చోట ఉండాలి గాని ఎక్కడా నిర్దేశించలేదు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వర్గాలు ఒకేచోట ఉండాలని నిర్ణయించలేదు. ఆర్టికల్ 85 ప్రకారం రాష్ట్రపతి అనుకూల మని భావించిన చోట పార్లమెంటును సమావేశపరిచే అధికారం ఉంది. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కోర్టు విచారణలు ఎక్కడ జరపాలో నిర్ణయించే అధికారం ఉంది. వైఎస్సార్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రణాళికలు సూచించమని రిటైర్డ్ అధికారి నాగేశ్వరరావు అధ్యక్షతన కమిటీ వేసింది. ఈ కమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య అసమానత లను దృష్టిలో పెట్టుకొని పరిపాలన వికేంద్రీకరణ చేస్తూ రాష్ట్ర సమగ్రా భివృద్ధిని సూచిస్తూ తన నివేదికను 2019 డిసెంబర్ 20న ప్రభుత్వానికి సమర్పించింది. ఆ కమిటీ నిర్దిష్ట ప్రతిపాదనలు చేసింది. సెక్రటేరియట్, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, సమ్మర్ అసెంబ్లీ, హైకోర్ట్ బెంచ్ విశాఖపట్నంలో; రాష్ట్ర శాసన సభ, హైకోర్ట్ బెంచ్, మినిస్టర్స్ క్వార్టర్స్ అమరావతి, మంగళగిరిల్లో; హైకోర్ట్ ప్రిన్సిపల్ సీట్, సంబంధిత కోర్టులు కర్నూలులో పెట్టాలని సూచించింది. అసలు ఈ పరిపాలన వికేంద్రీకరణ ఈనాటి మాట కాదు. ఇది ప్రజల చిరకాలవాంఛ. శ్రీబాగ్ ఒప్పందంలోనే దీని బీజాలు పడ్డాయి. ఆ ఆకాంక్షలు, కోరికలు తీరే రోజులు సమీపిస్తున్నాయని పిస్తోంది. ఈ నేపథ్యంలో ఆలోచిస్తే అమరావతి కన్నా విశాఖపట్నమే రాజధానిగా మేలైన నగరం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏకైక అతిపెద్ద నగరం విశాఖ. పరిపాలన రాజధానిగా అతి త్వరగా తక్కువ ఖర్చుతో విశాఖను అభివృద్ధి చేయవచ్చు. రోడ్డు, రైలు, విమాన, సముద్ర మార్గాల్లో ఇతర రాష్ట్రాలు, దేశాలతో విశాఖపట్నం అనుసంధానం కలిగి ఉంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి వాతావరణం ఎంతో అనుకూలమైనది. అన్ని ప్రాంతాలకు చెందిన అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ రంగాలలోని చాలా కంపెనీలు విశాఖపట్నంలో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నాయి. విశాఖపట్నం మొదటి నుంచీ జీడీపీకి కీలక వాటాను అందిస్తున్నా తిరిగి తగినంత ప్రభుత్వ నిధుల కేటాయింపులు జరగడం లేదు. ఇప్పుడు మనం ఎక్కడున్నామని ప్రశ్నించుకుంటే... చుట్టూ తిరిగి, తెలుగుదేశం ఐదేళ్లు పాలన ఒక కల లాగే మిగిలిపోయి, ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 6 ముందు నిలబడ్డాం. మన ముందు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం శివరామకృష్ణన్ రిపోర్ట్ ఉంది. అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలంటే వికేంద్రీకరణ ఒకటే సూత్రమనే తారకమంత్రం వినిపిస్తోంది. సమాన అభివృద్ధి అనే విధానాన్ని పట్టిం చుకోకపోతే భవిష్యత్తు పట్ల యువత ఆశలు కునారిల్లిపోతాయి. ప్రజా స్వామ్య ప్రభుత్వంపట్ల విశ్వాసం సన్నగిల్లిపోతుంది. స్వతంత్రం రాక ముందు నుండి మద్రాస్‌కు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కర్నూ లుకు, ఏపీ ఏర్పడ్డాక హైదరాబాద్‌కు పరుగులు తీసిన సామాన్య మధ్యతరగతి ప్రజల దగ్గరకు వికేంద్రీకృత పరిపాలనను ఇప్పటికైనా తీసుకు వెళ్లకపోతే వారు తీవ్ర నిరాశా నిస్పృహలకు గురి అయ్యే ప్రమాదం ఉంది. ఏ ప్రాంత వాసులకూ ‘మనం నిర్లక్ష్యం చేయబడ్డాం’ అనే ఆలోచన, ఊహ రాకుండా జాగ్రత్త పడాల్సిన సమయం ఇది. -వ్యాసకర్త: ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి -
రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు
సాక్షి, అమరావతి: రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: చెప్పాడంటే.. చేస్తాడంతే.. గతంలో రెవెన్యూ మంత్రిగా పని చేసిన అనుభవం ఉందని.. తనకు వ్యక్తిగతంగా ఎలాంటి లక్ష్యాలు లేవన్నారు. సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చటమే తన లక్ష్యమన్నారు. సీనియర్ అధికారుల సమన్వయంతో పని చేస్తామని తెలిపారు. ‘‘రెవెన్యూ భూ యాజమాన్యానికి సంబంధించిన శాఖ. అందరితో కలిసి టీమ్ వర్క్ చేయటం నాకు అలవాటు. రాష్ట్రం, దేశంలో ఎక్కువగా భూ వివాదాలు ఉన్నాయి. దీనివల్ల ఎకనమికల్ గ్రోత్‌కు భూమి ఉపయోగపడటం లేదు. ఎక్కువ ల్యాండ్‌ను ఫ్రీ హోల్డ్ చేస్తే జీడీపీ పెరుగుతుంది. సీఎం జగన్ అందుకే భూ సర్వేకు ప్రాధాన్యత ఇచ్చారు. పీఓటీ యాక్ట్ నుండి తొలగించి నామినల్ ఫీజుల ద్వారా పేదలకు భూములు ఇచ్చారని’ మంత్రి ధర్మాన పేర్కొన్నారు. ధర్మాన ప్రసాదరావు రాజకీయ నేపథ్యం: 1983లో మబగం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ప్రజా జీవితంలోకి అడుగు పెట్టారు. 1987లో పోలాకి మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989లో నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1991–94 మధ్య రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1994లో ఓడిపోయిన ఆయన 1999, 2004, 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలోను, అనంతర మంత్రివర్గాల్లోను 2013 వరకు పనిచేశారు. 2013లో వైఎస్సార్ కాంగ్రెస్పారీ్టలో చేరారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు. 2019లో వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన వైఎస్సార్సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తగా, తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జిగా, అధికార ప్రతినిధిగా పనిచేశారు. -
ఉక్రెయిన్ యుద్ధంతో కష్టాలు పడుతుంటే.. వారికి మాత్రం బిరియానీలు, పాయసాలు!
మైసూరు: ప్రజలు కరోనాతో పాటు అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ నాయకులు మేకెదాటు పాదయాత్ర పేరుతో రోడ్ల పైన నృత్యాలు చేస్తూ బిరియానీలు తింటు, పాయసాలు తాగుతూ ఉత్సవాలు జరుపుకుంటున్నారని రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ విమర్శించారు. గురువారం మైసూరు కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా, ఉక్రెయిన్ యుద్ధం తదితరాలతో ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అవేమీ పట్టించుకోకుండా రోడ్లపై ఉత్సవాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. మేకెదాటు పాదయాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ మరింత నాశనం అవుతుందని అన్నారు. -
అసెంబ్లీలో నేతల బాహాబాహీ..
పాట్నా: బీహార్ అసెంబ్లీలో అధికార జేడీయూ, బీజేపీ సభ్యులు, విపక్ష ఆర్జేడీ సభ్యులు బాహాబాహీకి దిగారు. ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి రామ్ సూరత్ రాయ్ సోదరుడికి సంబంధించిన పాఠశాలలో ఇటీవల భారీగా అక్రమ మద్యం పట్టుబడిన నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా నేతలు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. మంత్రి సోదరుడి పాఠశాలలో మద్యం పట్టుబడినందుకు బాధ్యత వహిస్తూ మంత్రి రామ్‌సూరత్ రాయ్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ డిమాండ్ చేయడంతో ఇరు పక్షాల నేతల మధ్య గొడవ మొదలైంది. ఇది కాస్త చిలికిచిలికి గాలివానలా మారి రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపింది. అసెంబ్లీలో గొడవ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి రామ్‌సూరత్.. తేజస్వి డిమాండ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరుడి పాఠశాలలో మద్యం దొరికితే తానెలా బాధ్యున్ని అవుతానని, అసలు తానెందుకు రాజీనామా చేయాలని ఆయన ప్రశ్నించారు. తేజస్వి తండ్రి లాలూప్రసాద్ యాదవ్ నేరం చేసి జైలుశిక్ష అనుభవిస్తున్నాడు కాబట్టి తేజస్వి యాదవ్‌ను రాజీనామా చేయమంటే చేస్తారా..? తేజస్వి యాదవ్‌పై కేసులు ఉన్నందున ఆయన సోదరుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ రాజీనామా చేస్తాడా..? అని మంత్రి మండిపడ్డారు. ఘటనపై దర్యాప్తు జరుగుతుందని, దర్యాప్తులో తన సోదరుడు తప్పు చేసినట్లు రుజువైతే నిరభ్యంతరంగా జైలుకు పంపవచ్చని మంత్రి ప్రకటించారు. #WATCH | Ruckus ensued in Bihar Assembly after Leader of Opposition Tejashwi Yadav demanded resignation of State Minister Ram Surat Rai over alleged recovery of illicit liquor from a school run by Rai's brother. pic.twitter.com/hqNUo5bCkf — ANI (@ANI) March 13, 2021 -
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్
-
ఇకపై ఆ సర్టిఫికెట్ అవసరం లేదు: ధర్మాన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇకపై నాలుగేళ్ల పాటు చెల్లుబాటు అయ్యేవిధంగా దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నమ్మకం నిలబెట్టేలా పనిచేస్తానని తెలిపారు. బియ్యం కార్డు ఉన్న వారికి ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదని ఆయన ప్రకటించారు. అర్హులైన వారికి ఆగస్టు 15న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి దాదాపు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. (కలలో కూడా ఊహించలేదు) భూ సమస్యలు, తగాదాల సత్వర పరిష్కారానికి ఫ్రెండ్లీ రెవెన్యూ వ్యవస్థకు శ్రీకారం చుడతామని తెలిపారు. రాష్ట్రంలో మూడో అతిపెద్ద ఉద్యోగుల శాఖ అయిన రెవెన్యూలో అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా పనులు జరిగేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ‘‘బీసీలకు అగ్రతాంబూలం వేసిన దార్శనికుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఉప ముఖ్యమంత్రి పదవి దక్కడం ఉత్తరాంధ్ర బీసీలకు, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. రెవెన్యూ కార్యాలయాల ద్వారా అందే సేవలు గ్రామ, వార్డు సచివాలయల ద్వారా ప్రజలకు సత్వరమే అందేలా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రం మొత్తం భూమిని రీ సర్వే నిర్వహించి రికార్డులను నవీకరించనునట్లు’’ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. (కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు) -
ఉద్యోగుల రవాణా
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణా శాఖ ప్రత్యేకతలు చెప్పక్కర్లేదు. ఇక్కడి నుంచి ఆరు జిల్లాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉప రవాణా కమిషనర్‌పై ఉంది. అయితే, రవాణా శాఖ ఉన్నతాధికారుల తీరుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులకు నచ్చితే చాలు... ఆ ఉద్యోగి కోరుకున్న చోటకు అంతర్గత, అనధికారికంగా బదిలీ చేయడమే కాదు, దానినే శాశ్వత బదిలీల్లో చూపిస్తున్నారు. గతంలోనే కాకుండా ప్రస్తుతం కూడా ఇదే తంతు కొనసాగిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతా తాత్కాలికమే ఉమ్మడి వరంగల్ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన ఆరు జిల్లాల ఆర్టీఓ కార్యాలయాల్లో చిన్నస్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు అందరూ తాత్కాలిక విధులే నిర్వహిస్తున్నారు. పలువురు ఉన్నతాధికారులు హైదరాబాద్ స్థాయిలో నేతలను ప్రసన్నం చేసుకుని... రెండు, మూడు పోస్టుల్లో కూడా కొనసాగుతుండడం గమనార్హం. కొందరైతే ఉమ్మడి వరంగల్ కేంద్రంగా అనధికారికంగా చెక్‌పోస్టుకు విధులు కేటాయించుకుని ఇక్కడి నుంచే వేతనాలు తీసుకుంటున్నారు. ఇలా ఇష్టారీతిన ఎవరికి వారు వెళ్తుండడం..ఉన్నతాధికారులు కూడా బదిలీలు చేయడంతో కార్యాలయాల్లో సరిపడా సిబ్బంది లేక వివిధ పనులపై రవాణా శాఖ కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఖాళీల పేరిటే ఓడీ వ్యవహారం రవాణాశాఖలో 2013 సంవత్సరం తర్వాత పదోన్నతులు లేవు. కానిస్టేబుళ్లు, క్లర్క్‌లు, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ల నుంచి మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ల వరకు పదోన్నతులు నిలిచిపోయాయి. దీంతో కొందరు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు ‘ఖాళీల’ పేరిట వ్యవహారానికి తెర తీశారు. ఎంవీఐల నుంచి డీటీఓ/ఆర్టీఓల పదోన్నతుల్లో జాప్యం జరిగినా.. మూడు నెలల కిందట హఠాత్తుగా ఐదుగురు జిల్లా రవాణాశాఖ అధికారు(డీటీఓ)లకు ఉప కమిషనర్(డీటీసీ)లుగా పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్ ఇచ్చారు. అయితే క్లర్క్‌లు, కానిస్టేబుళ్ల నుంచి ఏఎంవీఐలుగా ప్రమోషన్లు పొందాల్సిన వారి ఫైలు మాత్రం ఆరేళ్లుగా ముందుకు కదలడం లేదు. రెండు, మూడు చోట్ల బాధ్యతలు రవాణాశాఖలో పదోన్నతులు, హోదాలతో పని లేకుండా పలువురు ఎంవీఐలు ఇన్చార్జ్ డీటీఓలు, డీటీసీలుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇవీ చాలదన్నట్లు పొరుగు జిల్లాల బాధ్యతల కోసం హైదరాబాద్ స్థాయిలో పైరవీలు కూడా సాగిస్తున్నారు. వరంగల్ రూరల్ రెగ్యులర్ ఎంవీవై రమేష్‌రాథోడ్ జనగామ ఇన్చార్జ్ ఎంవీఐ, డీటీఓగా మూడు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి ఎంవీఐగా రెగ్యులర్ పోస్టులో ఉన్న పి.రవీందర్ ఇన్చార్జ్ డీటీఓతో పాటు ఖమ్మం ఇన్చార్జ్ ఎంవీఐగా కూడా బాధ్యతల్లో ఉన్నారు. అలాగే మహబూబాబాద్ రెగ్యులర్ ఎంవీఐగా ఉన్న భద్రునాయక్ అక్కడే ఇన్చార్జ్ డీటీఓగా, ఖమ్మం ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తున్నారు. వరంగల్ డీటీఓ కార్యాలయంలో ఎంవీఐగా పని చేస్తున్న కె.వేణు నెల కిందటి వరకు ఇన్చార్జ్ డీటీవో, డీటీసీగా వ్యవహరించారు. ఇటీవలే పదోన్నతిపై పురుషోత్తం డీటీసీగా విధుల్లో చేరగా, వేణు ఎంవీఐ, ఇన్చార్జ్ డీటీఓగా కొనసాగుతున్నారు. అదే విధంగా క్లర్క్‌లు, సూపరింటెండెంట్ తదితర పోస్టుల్లోని ఉద్యోగులు కూడా పలువురు రెండు, మూడు చోట్ల ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఆన్ డిప్యూటేషన్ల పేరిట ఇష్టారాజ్యంగా పరిమితికి మించిన పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారంటూ ఆ శాఖలో కొందరు రవాణాశాఖ మంత్రి, ఉన్నతాధికారులకు తాజాగా నాలుగు రోజుల కిందట ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ ఫిర్యాదుతోనైనా మంత్రి, ఉన్నతాధికారులు స్పందిస్తారేమో వేచి చూడాలి. డీపీసీ వేయాలన్న ప్రభుత్వం శాఖలోని కొందరు ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నేతల విజ్ఞాపన మేరకు పదోన్నతుల రవాణాశాఖలో డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) వేయాలని 2014 అక్టోబర్‌లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ప్రక్రియ మొదలైనట్లే కనిపించినా అనేక కారణాలతో ఇప్పటి వరకు జరగలేదు. ఫలితంగా పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోగా రవాణాశాఖలో ఖాళీల పేరిట ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను బుట్టదాఖలు చేసిన పలువురు పెద్ద ఎత్తున ‘రేటు’ ఫిక్స్ చేసి మరీ ఆన్ డిప్యూటేషన్లను సాగిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు, మూడు పదవుల్లో కొనసాగుతున్న పలువురు ఉద్యోగులు వివాదాల నుంచి తప్పుకునేందుకు బదిలీల కోసం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తాజా సమాచారం. -
భూముల సర్వే నిర్వహిస్తాం : రెవెన్యూ మంత్రి
సాక్షి, తూర్పుగోదావరి : రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ జిల్లాలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రమంతా భూముల సర్వే నిర్వహిస్తామని అన్నారు. వచ్చే ఏడాది ఉగాది వరకు రాష్ట్రంలో ఇళ్లు కట్టడాలు చేపట్టి 25 లక్షల మందికి సొంత ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. జిల్లాలో వెనుకబడి వున్న డ్వాక్రా సంఘాలను పునరుద్దరించే దిశగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. రైతులకు ఇస్తున్న క్రాప్ లోన్స్ 20% పెంచేలా నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ముందుగా నిర్ణయించినట్లే నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ ఎస్టీ బిసీ లకు 50% స్థానం కల్పించే అంశంపై ప్రభుత్వం కట్టుబడి వుందని స్పష్టం చేశారు. -
రెవెన్యూశాఖ మంత్రిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ బాధ్యతలు
-
రెవెన్యూ మంత్రిని తప్పించాలి: తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: భూ కుంభకోణాల్లో సబ్ రిజిస్ట్రార్లపై చర్యలకే పరిమితం కాకుండా, రెవెన్యూ మంత్రి, ఆ శాఖ ఉన్న తాధికారులను బాధ్యతల నుంచి తప్పిం చాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరిపించా లని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. భూకబ్జాదారులపై ఉక్కుపాదం మోపి ప్రభుత్వ భూములను కాపాడాలన్నారు. ఒకవైపు మియాపూర్ భూకుంభకోణంలో స్వయంగా ఓఎస్డీ ప్రత్యక్షపాత్రే ఉందని ప్రభుత్వమే చెబుతూ మరోవైపు సంబంధిత మంత్రికి ఏ సంబంధం లేదనడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతుంటే సర్కార్ చోద్యం చూస్తోందన్నారు. -
డిప్యూటీ సీఎం కేఈకి అవమానం
-
డిప్యూటీ సీఎం కేఈ అధికారాలకు కత్తెర
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోనే అత్యంత సీనియర్లలో ఒకరైన రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తికి పదే పదే అవమానాలు ఎదురవుతున్నాయి. ఆయన వద్ద ఉన్న అధికారాలను ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాగేసుకుంటున్నారు. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లపై నేరుగా చంద్రబాబే పెత్తనం చలాయించనున్నారు. వాళ్ల నియామకాలు, బదిలీల అధికారాన్ని రెవెన్యూ మంత్రి నుంచి తప్పించి, సాధారణ పరిపాలన శాఖకు (జీఏడీ) అప్పగించారు. ఈ మేరకు జీవో నెం. 28ను జారీ చేశారు. గతంలో కూడా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలపై చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. కేఈ కృష్ణమూర్తి చేసిన బదిలీలను ఆయన నిలిపివేయించారు. ఇప్పుడు జీవో 28ను జారీచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ వర్గానికి చెందిన సీనియర్ మంత్రిని ఇంతలా అవమానిస్తారా అని ఆయన అనుయాయులు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కేఈ కృష్ణమూర్తికి అవమానాలే ఎదురవుతున్నాయి. రాజధాని వ్యవహారంలో ఆయనను పూర్తిగా పక్కన పెట్టి, మునిసిపల్ శాఖ మంత్రి నారాయణకు పెత్తనం ఇచ్చారు. అలాగే భూ కేటాయింపుల సంఘంలో కూడా కేఈ కృష్ణమూర్తికి చోటు దక్కలేదు. ఇప్పుడు ఏకంగా తన సొంత శాఖకు చెందిన నియామకాలు, బదిలీల విషయాన్ని కూడా ఆయన చూడలేకుండా చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఏపీ సీనియర్ మంత్రికి మళ్లీ మళ్లీ అవమానం
-
అక్కడ అక్రమ మైనింగ్ సాధారణమే: మంత్రి
హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల మధ్య సరిహద్దులు అంత స్పష్టంగా లేకపోవడంతో.. ఆ పరిస్థితిని ఉపయోగించుకుని అక్రమ మైనింగ్ ఇష్టారాజ్యంగా సాగుతోంది. చక్కి నది పొవునా ఇది కొనసాగుతోందని హిమాచల్ ప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి కౌల్ సింగ్ తెలిపారు. పంజాబ్‌కు చెందిన ఈ అక్రమ మైనింగ్ మాఫియా పెద్దలు హిమాచల్ ప్రదేశ్ వాసులను విపరీతంగా వేధిస్తున్నారని ఆయన అసెంబ్లీలో చెప్పారు. ఈ విషయాన్ని పంజాబ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పంజాబ్ సర్కారు నిర్ణయం కోసం ఇంకా తాము వేచిచూస్తున్నామన్నారు. నిజానికి 2005 నుంచి ఈ అక్రమ మైనింగ్ వ్యవహారం మీద చర్చలు నడుస్తున్నాయి. 2012 ఏప్రిల్ నెలలో దీనిపై అసెంబ్లీలో ఘాటు చర్చలు జరిగాయి. రాష్ట్రంలోని నూర్పూర్ ప్రాంతంలో మైనింగ్ మాఫియా కార్యకలాపాలు మరీ ఎక్కువైపోవడంతో స్వతంత్ర సభ్యుడు రాకేష్ పఠానియా తాను స్వయంగా తుపాకి పట్టుకుని అక్కడ పోరాడతానని అప్పట్లో అసెంబ్లీలో హెచ్చరించారు. అక్రమ మైనింగ్ వల్ల ప్రభుత్వానికి ఏడాదికి రూ. 200 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. -
'రాజధానిలో భూసేకరణకు వ్యతిరేకం'
-
నారాయణ రెవెన్యూ మంత్రి కూడానా?
మంగళగిరి: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలో పరిపాలన కరువైందని, దోపిడి మాత్రమే కొనసాగుతుందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే)ధ్వజమెత్తారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసిన సీఎం చంద్రబాబు.. మంత్రి నారాయణ ఒక్కరికే రాజధాని బాధ్యతలు అప్పగించారని, జిల్లాకు చెందిన మంత్రులను సైతం పక్కనపెట్టి తమ దోపిడికి సహకరించేవారినే దరికి చేర్చుకుంటున్నారని దుయ్యబట్టారు. మునిసిపల్ మంత్రిగా వున్న నారాయణ అది మరిచి రెవెన్యూ మంత్రిగా సర్వం ఆయనే అన్నట్లు వ్యవహరిస్తుండగా అసలు రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఇప్పటి వరకు రాజధాని ప్రాంతంలో ఒక్కసారి పర్యటించి రైతుల కష్టాలు తెలుసుకున్నాడా? అంటూ ఆగ్రహవ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో రైతుకూలీలు,రైతులు, కౌలురైతులును పట్టించుకోవడం లేదన్నారు. అసైన్డ్భూములు తేలకపోగా భూములిచ్చిన రైతులకు భూముల కేటాయించకపోగా ఆభూములలో ఉద్యోగులకు ఇళ్ళుకట్టిస్తామని చెప్పడం దారుణమని విమర్శించారు. టీడీపీ పాలన ఎలా వుందంటే పార్టీ సృష్టికర్త ఎన్టీఆర్‌ను మరచి సర్వం నారాయణార్పణంగా మారిందని వ్యాఖ్యానించారు. ఓటు నోటు కేసులో నిందితులుగా ఫోర్‌నిక్స్‌ల్యాబ్ నిర్ధారించినా ముఖ్యమంత్రిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడానికి కారణం తెలంగాణ ప్రభుత్వంతో చంద్రబాబు ఏ చీకటిఒప్పందాలు చేసుకున్నారని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి ఒక ప్రకటన చేస్తే పక్కనే వున్న చంద్రబాబు మరొకప్రకటన చేస్తూ రాష్ట్రప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని విమర్శించారు. మంత్రులను స్టార్‌హోటళ్ళలో వుండొద్దని చెప్పిన ముఖ్యమంత్రి తాను మాత్రం ప్రజాధనంతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ దుబారా చేయడంతో పాటు వాస్తు పిచ్చితో ప్రభుత్వభవనాలును మరమ్మత్తుల పేరుతో కోట్ల రూపాయలు వృధా చేయడాన్ని నిషేదిస్తే ప్రజలకు ఉపయోగకరంగా వుంటుందన్నారు. అంతేకాక విజయవాడలో క్యాంప్ కార్యాలయానికి కోట్ల రూపాయలతో రీమోడలింగ్ చేయటమేకాక,దానికి కూతవేటు దూరంలో వున్న ఉండవల్లి కరకట్టపై విహారవిడిది కొరకు అక్రమ నిర్మాణాలను,సక్రమనిర్మాణాలు చేసిన ఘనతతో పాటు విహారవిడిది భవనాలుకు కోట్లరూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు. -
పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండాల్సింది
హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల భూముల సమస్యల పరిష్కారానికి ఆగస్టు 10 వ తేదీ నుంచి 'మీ భూమి మీ ఇంటికి' కార్యక్రమం నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. అందులోభాగంగా 20 రోజులపాటు రెవెన్యూ సభలు నిర్వహిస్తామని వెల్లడించారు. కర్నూలు జిల్లాలోపరిశ్రమల ఏర్పాటు కోసం 33 వేల ఎకరాల భూములు కేటాయించామని కేఈ పేర్కొన్నారు. కృష్ణాజిల్లా తహసీల్దార్ వనజాక్షికి బెదిరింపు లేఖ వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే వనజాక్షి తనకు అందిన బెదిరింపు లేఖను విచారణాధికారికి అందజేయాలని సూచించారు. తహశీల్దార్ వనజాక్షికి రక్షణ కల్పించమని ఇప్పటికే జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు. కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై అక్రమ ఇసుక తవ్వకాల విషయంలో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేశారు. దాంతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఈ ఘటనపై ఐఏఎస్ అధికారి జేసీ శర్మతో ప్రభుత్వం ఓ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. -
షి'కారు' చేశాం.. బిల్లు కట్టండి!
రంగారెడ్డి : సొమ్మొకరిది... సోకొకరిది అంటే ఇదే కాబోలు. తాము వినియోగించుకున్న వాహనానికి అద్దె చెల్లించాలంటూ జిల్లా యంత్రాంగానికి రెవెన్యూ మంత్రి పేషీ హుకుం జారీ చేయడం చూస్తే ఈ సామెత అతికినట్టు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఈ నెల వరకు (మార్చి) వాహనం అద్దె బిల్లు కట్టాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి పేషీ నుంచి లేఖ అందింది. ప్రతినెలా రూ.54 వేల చొప్పున పది నెలలకుగాను రూ.5.40 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. కాగా.. కనీసం ఏ వాహనాన్ని అద్దెకు తీసుకున్నారనే విషయాన్ని ఈ లేఖలో ప్రస్తావించకపోవడం గమనార్హం. వాస్తవానికి అద్దె ప్రాతిపదికన తీసుకునే కారుకు ప్రతినెలా కిరాయి చెల్లిస్తారు. అలా వీలుకాని పక్షంలో మూడునెలల కోసారి బిల్లులు ఇస్తారు. ఈ వాహనానికి 10 నెలల బిల్లులు ఒకేసారి చెల్లించాలని లేఖ రాయడం పలు అనుమానాలకు తావిస్తోంది. జిల్లా యంత్రాంగం మాత్రం లేఖ వచ్చిందే తడవుగా బిల్లులు చెల్లించేందుకు ఫైలు సిద్ధం చేస్తోంది. గతంలో వివిధ మంత్రుల పేషీలు, ఉన్నతాధికారులు కార్లు వినియోగించుకున్నా.. ఒకట్రెండు వారాలు మాత్రమే. ఇలా నెలల తరబడి ఉపయోగించిన వాహనానికి మాత్రం ఒకేసారి ఇంత పెద్దమొత్తంలో బిల్లు చెల్లించాలనడం ఇదే తొలిసారి అని ఓ రెవెన్యూ అధికారి చెప్పారు. కాగా.. జిల్లా యంత్రాంగం అద్దె వాహనాలను అడ్డగోలుగా వినియోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నన్నేం తప్పించలేదు.. నేనే తప్పుకున్నా!
-
రెవెన్యూ శాఖలో అవినీతి వాస్తవమే: డిప్యూటీ సీఎం
రెవిన్యూ శాఖలో అవినీతి ఎక్కువగా ఉన్నమాట వాస్తవమేనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అంగీకరించారు. తన వద్దకు వచ్చే ఫైళ్లన్నీ సస్పెన్షన్లు, డిస్మిస్లే ఉంటున్నాయని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణంలో రెవిన్యూ శాఖదే కీలకపాత్ర అని, రాజధాని భూసేకరణ మంత్రివర్గ ఉపసంఘంలో తనను ఉండమని ముఖ్యమంత్రి చంద్రబాబు అడిగినా.. తానే వద్దనుకున్నానని ఆయన చెప్పారు. ఎందుకు వద్దన్నానో అందరికీ తెలుసని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. రాజధాని భూసేకరణ, భూ సమీకరణ ఎలా ఉండాలన్న విషయమై అందరి అభిప్రాయాలు తీసుకుంటామని, దీనికి ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చామని కేఈ కృష్ణమూర్తి తెలిపారు. దీనికోసం తాము అంతర్గతంగా ఓ కమిటీ నియమించామని, కమిటీ నివేదిక వచ్చాకే భూసేకరణపై స్పష్టత వస్తుందని అన్నారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో మార్కెట్ ధరలు పెంచాలనుకుంటున్నామని, కానీ ప్రభుత్వం ప్రస్తుతానికి దానికి అంగీకరించలేదని తెలిపారు. 32 వేల ఎకరాల భూములను పరిశ్రమలు, విద్యాసంస్థలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఇక దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ పాస్‌బుక్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు. అక్టోబర్ 2 నుంచి ఆన్లైన్లో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని వివరించారు. -
మంత్రిపై సిరా దాడి
సాక్షి ముంబై: అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కోసం అహ్మదనగర్ జిల్లా సంగమ్‌నేర్‌కు వెళ్లిన రెవెన్యూశాఖ మంత్రి బాలాసాహెబ్ థోరట్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయనపై కొందరు వ్యక్తులు సిరా (ఇంక్)చల్లారు. వీరిలో ఒకడైన శివసేన కార్యకర్త భావుసాహెబ్ హసేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సిరా చల్లినవారందరూ శివసేన కార్యకర్తలేనని తెలిసింది. అయితే వీళ్లు మంత్రిపై ఎందుకు సిరా చల్లారనే విషయం స్పష్టంకాలేదు. సంగమ్నేర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాజాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు థోరట్ శనివారం అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో ధన్‌గార్ వర్గానికి చెందిన శివసేన కార్యకర్త భావుసాహెబ్ హసే థోరట్‌పై సిరా చల్లారు. దీంతో వెంటనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ధన్‌గార్ కులస్తులకు రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్‌పై ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. ఆందోళనకు దిగిన థోరట్ మద్దతుదారులు.. బాలాసాహెబ్ థోరట్‌పై సిరా చల్లారని తెలుసుకున్న ఆయన మద్దతుదారులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. సంగమ్నేర్ తాలుకాలో అనేక రోడ్లపై రాస్తారోకో నిర్వహించి తమ నిరసన తెలిపారు. మరోవైపు స్థానిక శివసేన కార్యాలయాలపై దాడులు జరిపారు. కార్యాలయాల్లోని అనేక వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో సంగమ్నేర్ తాలూకాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతంగా ఉండండి: థోరట్ సిరా చల్లిన ఘటనపై మంత్రి స్పందిస్తూ ఆందోళనకు దిగిన కార్యకర్తలంతా శాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇది చాలా ఘటన అని, ఇంత పెద్ద ఎత్తున స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు.