అగర్తలా: త్రిపుర రెవన్యూ శాఖ మంత్రి, ఇండీజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్‌టీ) చీఫ్ నరేంద్ర చంద్ర దేవవర్మ(84) కన్నుమూశారు. రాష్ట్ర రాజధాని అగర్తలలోని గోవింద్ వల్లభ పంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో గత శుక్రవారం ఆసుపత్రిలో చేరారు దేవవర్మ. మెదడులోని నరాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల సర్జరీ చేశారు వైద్యులు. ఆ తర్వాత ఐసీయూకి మార్చి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.
‘రాష్ట్ర కేబినెట్ సీనియర్ సభ్యులు ఎన్.సీ.దేవవర్మ మృతి చెందడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంటున్నా. ఓం శాంతి!’ అని ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మానిక్ సాహా. మరోవైపు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి సంతాపం ప్రకటించారు రాజ్యసభ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్.
ప్రస‍్తుతం బీజేపీ నేతృత్వంలోని అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది దేవవర్మ పార్టీ ఐపీఎఫ్‌టీ. 2018లో ఐపీఎఫ్‌టీతో జతకట్టి అప్పటి లెఫ్ట్ ఫ్రంట్‌ను అధికారంలో నుంచి దించింది బీజేపీ. 1997లో ఐపీఎఫ్‌టీ ఏర్పడినప్పటికీ 2001లో విచ్ఛిన్నమైంది. ఆ తర్వాత 2009లో దేవవర్మ నేతృత్వంలో మళ్లీ పార్టీ పుంజుకుంది. త్రిపురతో పాటు ఢిల్లీలోనూ పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు దేవవర్మ.
ఇదీ చదవండి: షాకింగ్: యువతిని కారుతో 4 కిమీ ఈడ్చుకెళ్లి.. నగ్నంగా వదిలేసి!
Comments
Please login to add a commentAdd a comment