మిస్ ఇండియా త్రిపుర 2017 రింకీ చక్మా కన్నుమూసింది. కేన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఆమె 28 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయింది. ఫిబ్రవరి 22న ఆసుపత్రి చేరిన రింకీ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస తీసుకుంది. రింకీ చక్మా మరణాన్ని సోషల్‌మీడియా ద్వారా ప్రకటించిన మిస్‌ఇండియా ఆర్గనైజేషన్ సంతాపాన్ని తెలిపింది.
2022 నుండి రింకీ రొమ్ము కేన్సర్‌తో బాధపడుతోంది. చికిత్స తీసుకుంటున్న క్రమంలో తగ్గినట్టే తగ్గి, మహమ్మారి మళ్లీ విజృంభించింది. ఊపిరితిత్తులు, తలకు బాగా వ్యాపించింది. ఫలితంగా బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. సంబంధిత ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న క్రమంలో ఆరోగ్యం క్షీణించి, సెలవంటూ వెళ్లిపోయింది.
గత నెలలో, రింకీ తన ఇన్‌స్టాలో ఒక పెద్ద పోస్ట్ పెట్టింది. “నాకు మాలిగ్నెంట్ ఫైలోడ్స్ ట్యూమర్ (2022లో బ్రెస్ట్ క్యాన్సర్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆపరేషన్ అది నా ఊపిరితిత్తులలోకి , ఇప్పుడు నా తలలో (మెదడు కణితి) చేరింది. ఇపుడు బ్రైన్ సర్జరీ ఇంకా పెండింగ్‌లో ఉంది, ఇప్పటికే ఇది బాడీలో చాలావరకు వ్యాపించింది. 30శాతం ఆశలే ఉన్నాయి’’ ప్రస్తుతం కీమోథెరపీ చికిత్స నడుస్తోందంటూ తన బాధను ఫ్యాన్స్‌తో పంచుకుంది. అంతేకాదు రెండేళ్లుగా ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నాం.. దాచుకున్న సొమ్మంతా కరిగిపోయింది. డొనేషన్స్ తీసుకుంటున్నాఅంటూ ఆర్థిక సహాయాన్ని అర్థించారు. కానీ అంతలోనే వి ఆమె కన్నుమూయడం విషాదం. త్రిపురకు చెందిన రింకీ 2017లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment