
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు రషీద్ ఖాన్(55) కన్నుమూశారు. గతనెల కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రొస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో జన్మించిన రషీద్ ఖాన్ జబ్ వి మెట్ అనే బాలీవుడ్ చిత్రంలోని ఆవోగే జబ్ తుమ్ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా.. కళారంగంలో ఆయన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం, 2006లో సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది. 2022లో పద్మభూషణ్ అవార్డ్ ప్రదానం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment