Manik Saha
-
తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీకి కాపీ.. త్రిపుర సీఎం
అగర్తల: సార్వత్రిక ఎన్నికల హోరు జోరుగా సాగుతోంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం మళ్ళీ అధిక సంఖ్యలో సీట్లు గెలవడానికి ప్రయతిస్తోంది. ఈ తరుణంలో త్రిపుర ముఖ్యమంత్రి 'మాణిక్ సాహా' తృణమూల్ కాంగ్రెస్ పార్టీపైన కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ త్రిపుర జిల్లా పరిధిలోని బెలోనియాలో జరిగిన బహిరంగ సభలో సాహా మాట్లాడుతూ.. బెంగాల్‌ను వరుసగా 34 ఏళ్లు పాలించిన సీపీఐఎంకు తృణమూల్ కాంగ్రెస్ కార్బన్ కాపీ అని వ్యాఖ్యానించారు. 'కమ్యూనిస్టు పార్టీ ఎక్కడ పాలించినా వారి అవశేషాలు దొరుకుతాయని పేర్కొన్నారు. బెంగాల్ ప్రజలు తృణమూల్‌ను నమ్మి ఓట్లు వేయడం దురదృష్టమని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లు గెలుచుకుంది. ఈ సారి మరింత మెరుగైన ఫలితాలు రానున్నట్లు మాణిక్ సాహా పేర్కొన్నారు. ఇప్పటికే వామపక్షాలకు చెందిన నా మిత్రులు బీజేపీకి ఫిర్యాదు చేశారు. మా పార్టీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వారు ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలను గురించి వివరిస్తూ.. అప్పట్లోనే బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని బాక్సానగర్, ధన్పూర్ వంటి ప్రాంతాల్లో మెజారిటీ స్థాయిలో ఓట్లను నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు. -
Tripura: ఇంటింటికీ తిరుగుతున్న సీఎం
రానున్న లోక్‌సభ ఎన్నికలకు పార్టీల ప్రచార హడావుడి మొదలైపోయింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో కీలక నేతలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అయితే ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గోలఘటి నియోజకవర్గంలోని కంచమాల గ్రామ పంచాయతీలో సీఎం మాణిక్ సాహా ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న విభిన్న పథకాల గురించి త్రిపుర సీఎం ఆ ప్రాంత వాసులతో మాట్లాడుతూ కనిపించారు . 2023 త్రిపుర అసెంబ్లీ ఎన్నికలలో తిప్రా మోతా పార్టీకి చెందిన మనబ్ దెబ్బర్మ గోలఘటి నియోజకవర్గం నుండి గెలుపొందారు. తాజా రాజకీయ పరిణామాల్లో భాగంగా సీపీఎం, కాంగ్రెస్ , గణ మంచ్, ఆల్ త్రిపుర పీపుల్స్ పార్టీ, సీపీఐ, సీపీఐఎంఎల్ సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ‘ఇండియా’ కూటమి కింద పొత్తు పెట్టుకోవడానికి చేతులు కలిపాయి. ఏప్రిల్ 19న నిర్వహించే మొదటి దశ లోక్‌సభ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. త్రిపురతోపాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్-నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్‌లకు మార్చి 27ను నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా ప్రకటిచింది. నామినేషన్ల పరిశీలన మార్చి 28న జరగనుంది. -
అత్యంత ప్రజాదారణ కలిగిన సీఎం ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రజాదారణ(పాపులారిటీ) కలిగిన ముఖ్యమంత్రిగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచినట్లు ఓ మీడియా సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వే నివేదికలో పేర్కొంది. సుమారు రెండు దశాబ్దాలకు పైగా సీఎంగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్.. దేశంలోనే అత్యంత ప్రజాధారణ కలిగిన ముఖ్యమంత్రిగా నిలవటం విశేషం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచారు. అనూహ్యంగా త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ప్రజాదరణలో ఐదో స్థానంలో నిలిచారు. నవీన్ పట్నాయక్: 2000 సంవత్సరం నుంచి అధికారంలో ఉన్న 77 ఏళ్ల నవీన్ పట్నాయన్ సర్వే నివేదికలో మొదటి స్థానంలో నిలిచారు. సర్వే ప్రకారం 52.7 శాతం ప్రజాదరణతో టాప్‌లో ఉన్నారు. బిజూ జనతా దళ్ పార్టీ చీఫ్ అయిన నవీన్ పట్నాయక్.. దేశంలో ఎక్కువ కాలం సీఎం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో ఒకరు. యోగి అదిత్యనాథ్: 2017 నుంచి అధికారంలో ఉన్న ఉత్తప్రదేశ్ 21వ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్వేలో అత్యంత ప్రజాదారణ పొందిన సీఎంలలో రెండో స్థానంతో నిలిచారు. యోగి 51.3 శాతం పాపులారిటిని కలిగి ఉన్నారు. సుమారు ఆయన ఏడేళ్లగా సీఎం సేవలు అందిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఎక్కవ కాలం సీఎంగా ఉన్న పేరు యోగికి ఉండటం విశేషం. హిమంత బిశ్వ శర్వ : అస్సాం(అసోం) సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రజాదరణ పొందిన మూడో సీఎంగా నిలిచారు. 48. 6 శాతం ప్రజాదారణ కలిగి ఉన్నారు. గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్న హిమంత.. 2015తో బీజేపీలో చేరారు. 2021 నుంచి ఆయన అస్సాంకు 15వ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. భూపేంద్ర పటేల్: గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రజాదారణలో నాలుగో స్థానంలో నిలిచారు. 42. 6 శాతం పజాదారణను భూపేంద్ర పటేల్ కలిగి ఉండటం గమనార్హం. సెప్టెంబర్, 2021 నుంచి భూపేంద్ర పటేల్ సీఎం కొనసాగుతున్నారు. గుజరాత్ 17 వ సీఎం భూపేంద్ర పటేల్. మాణిక్ సాహా: ఈశాన్య రాష్ట్రమైన మాణిక్ సాహా అత్యంత ప్రజాదాన విషయంలో టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. 41.4 శాతం ప్రజాదారణను మాణిక్ షా కలిగి ఉన్నారు. గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్న మాణిక్ షా... 2016లో బీజేపీలో చేరారు. మే, 2022లో మాణిక్ షా.. రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. -
రెండోసారి త్రిపుర సీఎంగా మాణిక్ సాహా
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారీ బీజేపీ నేత మాణిక్ సాహా ప్రమాణస్వీకారం చేశారు. అగర్తలాలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో సాహా చేత రాష్ట్ర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ప్రమాణం చేయించారు. సాహా తోపాటు మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. 60 సీట్లున్న త్రిపుర అసెంబ్లీలో బీజేపీ 32 స్థానాల్లో గెలిచి మెజారిటీ మార్కును సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాహాను ప్రధాని అభినందించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ముగ్గురు గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు, బీజేపీ కూటమి పార్టీ ఇండీజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ) పార్టీ నేత కూడా ఉన్నారు. సీఎం రేసులో ఉన్నట్లు వార్తలొచ్చిన కేంద్ర సహాయ మంత్రి, ఎమ్మెల్యే ప్రతిమా బౌమిక్ కేబినెట్లో చేరలేదు. ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలకు నిరసనగా విపక్ష వామపక్ష, కాంగ్రెస్ పార్టీలు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించాయి. తిప్రా మోతా చీఫ్‌తో షా భేటీ ‘గ్రేటర్ తిప్రాల్యాండ్’ సాధన కోసం ఉద్యమసంస్థగా మొదలై తర్వాత రాజకీయ పార్టీగా మారిన తిప్రా మోతా తరఫున ఆరుగురు సభ్యుల ప్రతినిధుల బృందం బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ అయింది. అగర్తలాలో మొదలైన భేటీలో తిప్రా మోతా చీఫ్ ప్రద్యోత్ కిశోర్ దేవ్ బర్మన్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, నూతన సీఎం మాణిక్ సాహా సైతం పాల్గొన్నారు. చిన్న రాష్ట్రాన్ని ముక్కలు చేయబోమని, త్రిపుర ట్రైబల్ అటానమస్ కౌన్సిల్‌కు శాసన, ఆర్థిక, కార్యనిర్వాహక అధికారాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని బీజేపీ మొదట్నుంచీ చెబుతున్న విషయం తెల్సిందే. -
త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణం
అగర్తలా: త్రిపుర ముఖ్యమంత్రిగా డాక్టర్ మాణిక్ సాహా ప్రమాణం చేశారు. అగర్తలాలోని వివేకానంద మైదాన్‌లో బుధవారం ఉదయం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు. ప్రధాని మోదీ, అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల సమక్షంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. కాగా, మాణిక్ సాహా సీఎంగా బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా రెండోసారి. కిందటి ఏడాది.. విప్లవ్ కుమార్ దేవ్ రాజీనామాతో అనూహ్యంగా మాణిక్ సాహాను తెర మీదకు తెచ్చింది బీజేపీ. మే 15వ తేదీన మాణిక్ సాహా త్రిపుర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బోర్దోవాలీ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకు ముందు ఆయన రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. త్రిపుర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా 2020 నుంచి 2022 మధ్య ఆయన పని చేశారు. అయితే.. ఆయన రాజకీయ ప్రస్థానం మాత్రం మొదలైంది కాంగ్రెస్ పార్టీతోనే. 2016లో ఆయన కాంగ్రెస్‌ను వీడి.. బీజేపీలో చేరారు. గతంలో.. త్రిపుర క్రికెట్ అసోషియేషన్‌కు ఆయన అధ్యక్షుడిగా పని చేశారు. Prime Minister Narendra Modi arrives at Swami Vivekananda Maidan in Agartala for the swearing-in ceremony of Tripura CM-designate Manik Saha. (Source: DD) pic.twitter.com/5QrhWbl0fp — ANI (@ANI) March 8, 2023 సాహా డెంటల్ డాక్టర్. రాజకీయాల్లోకి రాకమునుపు.. హపానియాలోని త్రిపుర మెడికల్ కాలేజీలో పాఠాలు చెప్పారు కూడా. ఆయనకు భార్య స్వప్న, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రధాన నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో 'ఉన్నత త్రిపుర', 'శ్రేష్ట త్రిపుర' నిర్మించేందుకు అన్ని సంక్షేమ వర్గాల ప్రజలతో కలిసి పని చేస్తాం అని మాణిక్ సాహా పేర్కొన్నారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లతో అధికారం దక్కించుకుంది. తర్వాతి స్థానంలో తిప్ర మోత పార్టీ 13 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్) 11 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకుంది. ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ) కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. (చదవండి: బైక్ ట్యాక్సీ నడుపుతున్న విదేశీయుడు.. ఆటో డ్రైవర్ సీరియస్ వార్నింగ్) -
త్రిపురలో సీఎం రేసులో ప్రతిమా బౌమిక్!
అగర్తలా: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ మార్కు దాటి ఎక్కువ స్థానాలను గెలుచుకున్న బీజేపీ కూటమిలో కొత్త సమస్య ఎదురయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏడాదికాలంగా ముఖ్యమంత్రిగా ఉన్న మాణిక్ సాహాకు పోటీగా కేంద్ర సహాయ మహిళా మంత్రి ప్రతిమా బౌమిక్‌ను సీఎం రేసులో నిలపాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ భావిస్తుండటమే ఇందుకు కారణం. సీఎం అభ్యర్థిగా ఒక్కరినే ఎన్నుకునేలా, ఏకగ్రీవం కోసం ఒప్పించేందుకు ఈశాన్యభారతంలో బీజేపీ సమస్యల పరిష్కర్త, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. బిప్లవ్ వర్గాన్ని శాంతింపజేసేందుకు ప్రతిమా బౌమిక్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు శేఖర్ దత్తా అభిప్రాయపడ్డారు. 60 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 32 చోట్ల, దాని కూటమి పార్టీ ఐపీఎప్టీ ఒక చోట విజయం సాధించిన విషయం తెల్సిందే. మరోవైపు మార్చి ఎనిమిదో తేదీన కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుపై బీజేపీ అగ్రనేత అమిత్ షాతో అస్సాం సీఎం హిమంత భేటీ అయ్యారు. భేటీలో నాగాలాండ్ సీఎంనేపియూ రియో సైతం పాల్గొన్నారు. -
త్రిపురలో ముగిసిన పోలింగ్.. 70 శాతం నమోదు
Live Updates: ► త్రిపురలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల్లో 69.96 శాతం పోలింగ్ నమోదు. Time: 02.15PM త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 51.4 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. Time: 1.00PM ►బీజేపీ నాయకులు పలు చోట్ల ఓటర్లను ఇబ్బందులకు గురిచేస్తూ నిర్భయంగా ఓటు వేయకుండా ఆపుతున్నారు. సీపీఎం నేత, మాజీ సీఎం మాణిక్ సర్కార్ ఆరోపించారు. అయితే బీజేపీ బెదిరింపులుకు గురిచేసిన జనం ఓట్లు వేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అన్నారు. Time: 11.00 ►త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 31.23% పోలింగ్ నమోదైంది. ► మాజీ సీఎం, బీజేపీ రాజ్యసభ సభ్యుడు బిప్లబ్ కుమార్ దేబ్ ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏ ఎన్నికలను పెద్దవి, చిన్నవిగా చూడమని అన్నారు. ప్రజలే తమకు అత్యున్నతమని.. వారిని గౌరవించడం తమ కర్తవ్యమని పేర్కొన్నారు. ‘2018లో ప్రజలు అధికారం అందించారు. కోవిడ్ ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపించాం.. ఇది ప్రజలకు తెలుసు’ అని అన్నారు. Gomati | BJP MP CM Biplab Deb cast his vote for #TripuraElection2023 today. He says, "We don't see any election as big or small. Public is supreme & it's our duty to respect them. They gave us power in 2018 & despite COVID, we worked in all sectors of state. People know this." pic.twitter.com/PtGMl2LcPG — ANI (@ANI) February 16, 2023 Time: 10.00 ► త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఉదయం 9 గంటల వరకు 13.23% ఓటింగ్ నమోదైంది. ►త్రిపుర సీఎం మాణిక్ సాహా ఓటుహక్కు వినియోగించుకున్నారు. బోర్దోవాలీ అసెంబ్లీ నియోజకవర్గంలోని మహారాణి తులసుబాతి బాలికల ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఓటు వేయడం ఆనందంగా ఉందని.. ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ‘ శాంతియుత ఓటింగ్ జరగాలని ఆశిస్తున్నా. నా ముందున్న సవాలు ఏంటని ప్రజలు అడుగుతున్నారు. ప్రత్యర్థులైన కాంగ్రెస్- వామపక్షాలు కలిసి పోటీలోకి రావడమే సవాల్.’ అని తెలిపారు. #WATCH | Tripura CM Dr Manik Saha casts vote in Assembly elections, in Agartala pic.twitter.com/fHpvoCpe4r — ANI (@ANI) February 16, 2023 Time: 9.00 ►త్రిపురలో రికార్డు స్థాయిలో ఓటు వేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రికార్డు సంఖ్యలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని త్రిపుర ప్రజలను కోరుతున్నాను. యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా పిలుపునిస్తున్నాను’ మోదీ ట్వీట్ చేశారు. కాగా త్రిపుర అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారం చేసిన చేసిన విషయం తెలిసిందే. Urging the people of Tripura to vote in record numbers and strengthen the festival of democracy. I specially call upon the youth to exercise their franchise. — Narendra Modi (@narendramodi) February 16, 2023 అగర్తలా: రాజకీయ పార్టీల హోరాహోరీ ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల హామీలు, పరస్పర విమర్శనాస్త్రాల పర్వం ముగిశాక పోలింగ్ క్రతువుకు త్రిపుర రాష్ట్రం సిద్ధమైంది. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం నాలుగు గంటల వరకు 3,337 పోలింగ్ కేంద్రాల్లో 60 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. స్వేచ్ఛగా, పారదర్శకంగా, ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా అనిఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) గిట్టే కిరణ్‌కుమార్ దినకరో చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో 1,100 కేంద్రాలు సున్నితమైన ప్రాంతాల్లో ఉండగా 28 సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కోసం ఉద్యమం చేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తిప్రా మోతా రాకతో ఈసారి త్రిముఖ పోరు కనిపిస్తోంది. బీజేపీ–ఐపీఎఫ్టీ కూటమి, సీపీఐ(ఎం)–కాంగ్రెస్ కూటమి, తిప్రా మోతాల మధ్యే అసలు పోరు ఆవిష్కృతంకానుంది. 13.53 లక్షల మహిళాఓటర్లుసహా మొత్తం 28.13 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మార్చి రెండో తేదీన ఓట్లు లెక్కిస్తారు. ‘ అన్ని పోలింగ్ కేంద్రాల్లో కలిపి మొత్తంగా 31వేల పోలింగ్ సిబ్బంది, 25వేల కేంద్ర భద్రతా బలగాలు, 31వేల రాష్ట్ర పోలీసు బలగాలు విధుల్లో కొనసాగనున్నాయి’ అని సీఈఓ చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా 17వ తేదీ ఉదయందాకా నిషేధాజ్ఞలు అమల్లోకి తెచ్చాం. అంతరాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులను మూసేశాం’ అని సీనియర్ పోలీస్ ఉన్నతాధికారి చెప్పారు. 55 చోట్ల బీజేపీ, 42 చోట్ల తిప్రామోతా ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి మాణిక్ సాహా ఈసారి బర్దోవాలీ నుంచి బరిలో నిలిచారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి సాబ్రూమ్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. తిప్రా మోతా చైర్మన్ ప్రద్యోత్ దేబ్ బర్మన్ ఈసారి పోటీచేయడంలేదు. బీజేపీ 55 చోట్ల తన అభ్యర్థులను బరిలో నిలిపింది. బీజేపీ కూటమి పార్టీ ఐపీఎఫ్టీ ఆరు స్థానాల్లో పోటీచేస్తోంది. ఈ రెండు పార్టీలూ ఒక స్థానంలో స్నేహపూర్వక పోటీకి సిద్దమయ్యాయి. సీపీఎం 47 చోట్ల, కాంగ్రెస్ 13 చోట్ల, తిప్రా మోతా 42 చోట్ల అభ్యర్థులను నిలబెట్టాయి. గత ఐదేళ్లపాలనలో తాము చేసిన అభివృద్ధినే ఎన్నికల అజెండాగా బీజేపీ ప్రచారంచేయగా, దుష్ప్రరిపాలన అంటూ లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్‌లు విమర్శిస్తూ ప్రచారంచేయడం తెల్సిందే. గ్రేటర్ తిప్రాల్యాండ్ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పనిచేస్తూ తిప్రా మోతా ఎన్నికల పర్వంలో మునిగిపోవడం విదితమే. -
త్రిపురలో 54 మందితో బీజేపీ జాబితా
న్యూఢిల్లీ: ఫిబ్రవరి 16న జరగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ 54 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ పేరు కూడా ఉన్నారు. ఆమె ధన్పూర్ నుంచి, సీఎం మాణిక్ సాహా బోర్డోవాలి నుంచి బరిలో దిగుతున్నారు. ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ)తో సీట్ల సర్దుబాటు ఖరారైందని సాహా చెప్పారు. బీజేపీ 55 చోట్ల, ఐపీఎఫ్టీ 5 స్థానాల్లో పోటీ చేస్తాయన్నారు. అసెంబ్లీలోని 60 సీట్లకు 2018 ఎన్నికల్లో బీజేపీ, ఐపీఎఫ్టీ 43 స్థానాలను గెలుచుకున్నాయి. మరోవైపు విపక్ష సీపీఎం, కాంగ్రెస్ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. -
'బీజేపీ గంగానది లెక్క.. మా పార్టీలో చేరితే పాపాలన్నీ తొలగిపోతాయ్..'
అగర్తల: బీజేపీ గంగా నది లాంటిదని వ్యాఖ్యానించారు త్రిపుర సీఎం మాణిక్ సాహా. తమ పార్టీలో చేరితే పుణ్యస్నానం చేసినట్లేనని, పాపాలన్నీ తొలగిపోతాయని అన్నారు. దక్షిణ త్రిపుర కక్రాబన్‌లో ఆదివారం నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఇంకా స్టాలిన్, లెనిన్ సిద్ధాంతాలను నమ్ముతున్న వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.. మీరంతా బీజేపీలో చేరండి. మా పార్టీ గంగానది లెక్క. ఇందులో చేరితే గంగానదిలో పవిత్ర స్నానం చేసినట్లే. పాపాలు తొలగిపోతాయ్' అని అన్నారు. అలాగే ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము కచ్చితంగా మరోమారు అధికారంలోకి వస్తామని మాణిక్ సాహా ధీమా వ్యక్తం చేశారు. త్రిపురలో కమ్యూనిస్టుల పాలనలో ప్రజల హక్కులను అణచివేశారని ఆరోపించారు. చదవండి: 'మీ టీ నేను తాగను.. విషం కలిపి ఇస్తే? అఖిలేశ్ యాదవ్ వీడియో వైరల్ -
త్రిపుర రెవన్యూ శాఖ మంత్రి కన్నుమూత.. సీఎం సంతాపం
అగర్తలా: త్రిపుర రెవన్యూ శాఖ మంత్రి, ఇండీజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ) చీఫ్ నరేంద్ర చంద్ర దేవవర్మ(84) కన్నుమూశారు. రాష్ట్ర రాజధాని అగర్తలలోని గోవింద్ వల్లభ పంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో గత శుక్రవారం ఆసుపత్రిలో చేరారు దేవవర్మ. మెదడులోని నరాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల సర్జరీ చేశారు వైద్యులు. ఆ తర్వాత ఐసీయూకి మార్చి వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ‘రాష్ట్ర కేబినెట్ సీనియర్ సభ్యులు ఎన్.సీ.దేవవర్మ మృతి చెందడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంటున్నా. ఓం శాంతి!’ అని ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మానిక్ సాహా. మరోవైపు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి సంతాపం ప్రకటించారు రాజ్యసభ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది దేవవర్మ పార్టీ ఐపీఎఫ్టీ. 2018లో ఐపీఎఫ్టీతో జతకట్టి అప్పటి లెఫ్ట్ ఫ్రంట్‌ను అధికారంలో నుంచి దించింది బీజేపీ. 1997లో ఐపీఎఫ్టీ ఏర్పడినప్పటికీ 2001లో విచ్ఛిన్నమైంది. ఆ తర్వాత 2009లో దేవవర్మ నేతృత్వంలో మళ్లీ పార్టీ పుంజుకుంది. త్రిపురతో పాటు ఢిల్లీలోనూ పలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు దేవవర్మ. ఇదీ చదవండి: షాకింగ్: యువతిని కారుతో 4 కిమీ ఈడ్చుకెళ్లి.. నగ్నంగా వదిలేసి! -
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ మాణిక్ సాహా
అగర్తల: త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా డాక్టర్ మాణిక్ సాహా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. అగర్తలాలోని రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ ఎస్.ఎన్. ఆర్య ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టేంతవరకూ సాహా.. త్రిపుర రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా ఉన్నారు. త్రిపుర క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2016లో బీజేపీలో చేరిన మానిక్ సాహా అంచెలంచెలుగా ఎదిగారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన త్రిపుర మెడికల్ కాలేజీలో డెంటల్ ఫ్యాకల్టీగా పనిచేశారు. మరో ఆరునెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. బిప్లవ్ దేవ్‌తో రాజీనామా చేయించిన బీజేపీ అధిష్ఠానం మానిక్ సాహాకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది.