అగర్తల: బీజేపీ గంగా నది లాంటిదని వ్యాఖ్యానించారు త్రిపుర సీఎం మాణిక్ సాహా. తమ పార్టీలో చేరితే పుణ్యస్నానం చేసినట్లేనని, పాపాలన్నీ తొలగిపోతాయని అన్నారు. దక్షిణ త్రిపుర కక్రాబన్‌లో ఆదివారం నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
'ఇంకా స్టాలిన్, లెనిన్ సిద్ధాంతాలను నమ్ముతున్న వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.. మీరంతా బీజేపీలో చేరండి. మా పార్టీ గంగానది లెక్క. ఇందులో చేరితే గంగానదిలో పవిత్ర స్నానం చేసినట్లే. పాపాలు తొలగిపోతాయ్' అని అన్నారు.
అలాగే ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము కచ్చితంగా మరోమారు అధికారంలోకి వస్తామని మాణిక్ సాహా ధీమా వ్యక్తం చేశారు. త్రిపురలో కమ్యూనిస్టుల పాలనలో ప్రజల హక్కులను అణచివేశారని ఆరోపించారు.
చదవండి: 'మీ టీ నేను తాగను.. విషం కలిపి ఇస్తే? అఖిలేశ్ యాదవ్ వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment