sin
-
గంగే మాం పాహి
విష్ణుమూర్తి స్పర్శచేత పరమపావనియైన గంగలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయన్నది సనాతన ధర్మ విశ్వాసం. అంటే... పాపాలు చేసి గంగలో మునిగి వాటిని పోగొట్టుకోవచ్చని అర్థం చేసుకోకూడదు. తెలిసో తెలియకో ఇప్పటివరకు చేసిన పాపాలు గంగాస్నానంతో పోగొట్టుకుని, ఇక మీదట ఎటువంటి పాపపు పనులు చేయకుండా నన్ను నేను నియంత్రించుకునే శక్తినీయవలసిందిగా భగవంతుని వేడుకోవాలి. అదే ధర్మాచరణం. వద్దన్న పని వదిలిపెట్టడమే ధర్మాచరణ. అది విష్ణువుకు ప్రీతిపాత్రం. ముత్తుస్వామి దీక్షితార్ వారు గంగపై కీర్తన చేస్తూ... ‘‘గంగే మాం పాహి గిరీశ శిర స్థితే/గంభీర కాయే గీత వాద్య ప్రియే/అంగజ తాత ముదే అసి వరుణా మధ్యే/అక్రూర పూజితే అఖిల జనానందే...’’ అన్నారు. గంగమ్మ గొప్పదనాన్ని చెబుతూ... అక్రూరపూజితే అని కూడా అన్నారు. గంగను కీర్తిస్తూ అక్రూరుడి ప్రస్తావన ఎందుకు తెచ్చినట్టు ..? మిగిలిన పురాణాలన్నింటినీ వ్యాస భగవానుడు రాస్తే... విష్ణు పురాణాన్ని పరాశర మహర్షి ఇచ్చాడు. శమంతకోపాఖ్యానం దీనిలోనిదే. అయితే ఇక్కడ గమ్మత్తయిన ఒక విషయం చెప్పుకోవాలి. వినాయక చవితినాడు వ్రత మహాత్మ్యంలో మనం ఒక కథ చదువుకుంటూంటాం. ఒక పసిపిల్ల ఉయ్యాల్లో ఉందనీ, ఆ పిల్లను కృష్ణుడు పెళ్ళి చేసుకున్నాడనీ, ఆమే జాంబవతి అనీ... ఇలా సాగుతుంది.. కానీ నిజానికి విష్ణు పురాణంలో చెప్పింది వేరు. ఉయ్యాల్లో ఉన్నది పసిపిల్లవాడు. దానిని ఊపుతున్న యవ్వని జాంబవతిని కృష్ణపరమాత్మ పెళ్లి చేసుకున్నాడు. వినాయక చవితి రోజున మిగిలిన కథను పూర్తిగా చదివినా చదవకపోయినా...‘‘...తవ హియేషా శమంతకః’’ అంటూ ముగిస్తారు. నిజానిక శ్రీకృష్ణుడు శమంతక మణివల్ల ఎన్ని కష్టాలుపడాలో అన్ని కష్టాలు పడ్డాడు. అటు సత్యభామకు దూరమయిపోయాడు, ఇటు జాంబవతికీ దూరమయ్యాడు. శమంతక మణిని కృష్ణుడే కాజేసాడని వారిద్దరే కాదు, బలరాముడు, ఇతర బంధువులు, ద్వారకానగరవాసులూ అందరూ అనుమానించారు. ఇంతకూ అసలు శమంతకమణి ఎక్కడుంది? అక్రూరుడి దగ్గర. అక్రూరుడు ఎక్కడున్నాడు? అంటే... ఆ మణికి ఒక నియమం ఉంది. బాహ్యాభ్యంతర శౌచం ఎవరికుంటుందో వారిదగ్గర అది బంగారం పెడుతుంది, దాన్ని దాచుకోకుండా లోకసంక్షేమం కోసం వెచ్చించే పరమ భాగవతోత్తముడి దగ్గర ఉంటుంది. లేకపోతే చంపేస్తుంది. ప్రసేనుడు, సత్రాజిత్తు అలాగే చచ్చిపోయారు. కాబట్టి అది ఉన్నచోట నిత్యాన్నదానాలతో నవ వసంతశోభ ఉంటుంది. అలా కాశీ వెలిగిపోతున్నది కాబట్టి అక్కడ అక్రూరుడు ఉంటాడని భావించి ‘అక్కడికి వెళ్ళి అక్రూరుడిని పిలుచుకురండి’ అని కృష్ణుడు ఆదేశించాడు. గంగను పూజిస్తూ గంగలో స్నానం చేస్తున్న అక్రూరుడికి కృష్ణుడి సందేశం వినిపించగానే.. అక్రూరుడు వెళ్ళి ఆ శమంతకమణిని ఇవ్వబోతే...‘‘అంతః శౌచం, బాహ్య శౌచం’ నీలో ఉన్నాయి కనుక అది నీవద్దే ఉంచుకో’ అని కృష్ణుడు చె΄్పాడు. అక్రూరుడు ద్వారకానగరం వదిలిపెట్టాల్సి వచ్చినప్పుడు కాశీ వెళ్ళి అక్కడే ఉండిపోయాడు గంగకోసం. పరమ భక్తితో రోజూ పూజిస్తూ నిత్యం గంగలో స్నానం చేసేవాడు. శాస్త్రాలు చదవకపోయినా గంగానది ఒడ్డున గురువుగారి శుశ్రూషలో ఇన్ని విషయాలు తెలుసుకున్న దీక్షితార్ వారి కీర్తనల్లో అనేక శాస్త్ర రహస్యాలను ప్రస్తావిస్తారు. వాటిలో గంగను స్తుతిస్తూ చేసిన ఈ కీర్తన ఒకటి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది
‘‘చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది’’ ఇది జనుల వాడకంలో ఉండి, అందరి నోళ్లలోనూ నానుతూ ఉన్న మాట. పాపం అంటే ఇతరులకు అపకారం చేసినందువల్ల వచ్చే ఫలితం. దీనిని మామూలు మాటల్లో చెప్పాలంటే తప్పు. అందరూ అంగీకరించనిది. మానవమాత్రులు తప్పు చేయకుండా ఉండటం అసంభవం. తెలిసి కాకపోయినా, తెలియకుండా అయినా ఏదో ఒక తప్పు చేసే ఉంటారు. తప్పు అంటే ఏదైనా ఇతరులకి బాధ కలిగించే పని కాని, ధర్మానికి విరుద్ధమైన పని కాని చేయటం. ఎదుటివారికి మంచి అనుకుని చేసినది వారికి హాని కలిగించవచ్చు. అనుకోకుండా చేసినట్టయితే దానిని ‘‘తప్పు అయి పోయింది’’ అని ఒప్పుకొని ఎవరికి హాని కలిగిందో వారిని క్షమించమని అడిగితే సరి చేసుకునే అవకాశం ఉంటుంది. పరిహారం సమర్పించో, మరొక విధంగానో సద్దుబాటు చేసుకునే వీలు ఉంటుంది. ధర్మానికి అపచారం జరిగితే? .. .. దానిని కూడా ఒప్పుకొని పరిహారానికి ప్రయత్నం చేయాలి. ఇవి చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అయితే పరిణామం వేరొక విధంగా ఉంటుంది. చేసిన పాపం చెప్పుకుంటే పోతుంది అంటే తాను చెప్పుకోవటమే కాదు. ఈ పాపం గురించి పదిమంది చెప్పుకుంటే అని. ఏదైనా విషయం గురించి ఎంత మంది మాట్లాడుకుంటే దాని ఫలితాన్ని అంతమంది పంచుకుంటారు కదా! ఆ విధంగా తాను చేసిన పనికి సంబంధించిన ఫలితాన్ని ఎంతోమంది పంచుకోవటం కారణంగా కర్తకి ఆ పనివల్ల కలగవలసిన తీవ్ర నష్టం సద్దుబాటు చేయబడుతుంది. ‘‘కర్తా కారాయితా చైవ ప్రేరకశ్చానుమోదకః / సుకృతే దుష్కృతే చైవ చత్వారినః సమ భాగినః’’. కారయితలు (చేయించినవారు), ప్రేరకులు కాకపోయినా దాని గురించి మాట్లాడుకున్నవారికి కొంత ఫలితం చెందుతుంది. కనుక కర్తకి స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. కొన్ని పనుల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాని, అది చేయకూడని పని అయితే చేయగలిగినది ఏమీ ఉండదు. తాను చేసిన తప్పుని చెప్పటానికి ఎంతో ధైర్యం కావాలి. అటువంటి ధైర్యం ధర్మమార్గంలో నడిచే వారికి మాత్రమే ఉంటుంది. ‘‘సత్యే ధర్మం ప్రతిష్ఠితా’’, ధర్మం సత్యంలోనే నిలిచి ఉంటుంది. కనుక ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు మాత్రమే ధర్మమార్గంలో ఉన్నట్టు. తన గొప్ప, ఘనతలు మాత్రమే కాక అపజయాలు, లోపాలు కూడా ఉన్నవి ఉన్నట్టుగా సందర్భం వచ్చినప్పుడు చెప్పగలగాలి. అప్పుడు అది ఎంతోమందికి మార్గదర్శక మౌతుంది. పొరపాట్లు ఎట్లా దొర్లుతాయి? వాటిని ఏ విధంగా అధిగమించ వచ్చు? అని అవగాహన చేసుకోవటానికి గుణపాఠం అవుతుంది. తాను చేసిన పాపం అందరికీ తెలిస్తే గౌరవం తగ్గిపోతుందనే భయం ఉంటుంది సాధారణంగా. వాస్తవానికి తాత్కాలికంగా అదే జరిగినా, రాను రాను గౌరవం పెరుగుతుంది. నిజాయితీపరులు, మంచి చెడు తెలిసిన వారు అని. ఒకరి ద్వారా తెలియటం కాక తామే చెప్పటం వల్ల ఒక ఉపయోగం ఉంది. ఇతరులకి తెలిసి, వారు గోరంత విషయాన్ని కొండంత చేసి, ప్రచారం చేసే అవకాశం ఉండదు. ఈ పారదర్శకత నాయకుడుగా ఉండేవారికి తప్పని సరి. చేసిన పాపం ఇతరులకి తెలిస్తే చులకన అయిపోతామేమో అనే ఆలోచనతో బయటికి చెప్పరు చాలమంది. చెప్పుకుంటే పరిహారం ఎట్లా చేయవచ్చో సూచనలు అందే అవకాశం ఉంటుంది. ఈ మాట అన్నంత మాత్రాన ప్రకటనలు చేయమని కాదు. శ్రేయోభిలాషుల వద్ద మనసులో ఉన్న బరువు దింపుకుంటే తేలిక అవుతుంది. లోలోపల కుమిలి పోవటం, బయట పడుతుందేమోననే భయం, ఆందోళన ఉండవు. అప్పుడు తరువాతి కర్తవ్యం గోచరిస్తుంది. ఇదంతా తప్పు చేశాననే భావన ఉన్న వారి విషయంలో. తప్పు అని ఒప్పుకోటానికే ఇష్టం లేనివారి గురించి చెప్పటానికి ఏమీ లేదు. – ఎన్.అనంతలక్ష్మి -
పాపం పోయినట్లు సర్టిఫికేట్ ఇచ్చే ఆలయం! ఎక్కడుందంటే..?
ఎన్నో రకాల ఆలయాలు వాటి విశేషాల గురించి విని ఉన్నాం. కానీ ఇలాంటి ఆలయం గురించి వినే ఉండే అవకాశమే లేదు. ఇలాంటివి కూడా ఉన్నాయా?.. అని షాకింగ్ అనిపిస్తుంటుంది కూడా. పాపం పోగొట్టుకోవాలని దేవాలయాలకు వెళ్తాం. అలాగే సిద్ధాంతులు చెప్పే పరిహారాలను కోసం తెగ డబ్బు వెచ్చిస్తాం కూడా. కొన్ని రకాల దానాలతో కూడా పాపాలు పోగొట్టుకునే యత్నం కూడా చేస్తాం. కానీ అవేమీ అక్కర్లేకుండా నేరుగా ఈ ఆలయానికి వెళ్లి పాపం పోగొట్టుకోవడమే కాకుండా పోయినట్లు ఓ ధ్రువీకరణ పత్రం కూడా తెచ్చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ ఖర్చుతోనే. ఆ ఆలయం ఎక్కడుందంటే.. అలాంటి ఆలయం రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఉంది. శతాబ్దాలుగా తీర్థయాత్రలకు ప్రసిద్ధిగాంచిన ఆలయం. దీనిని గిరిజనుల హరిద్వార్ అని కూడా పిలుస్తారు. ఆ ఆలయంలో ఎన్నో ఏళ్లుగా పాపం పోయినట్లు ధ్రువీకరణ పత్రాలను ఇచ్చే ఆచారం ఉంది. దీన్ని గౌతమేశ్వర్ మహాదేవ్ పాపమోచన తీర్థంగా పిలుస్తారు. ఇక్కడ మందాకిని పాప మోచిని గంగా కుండ్ అనే రిజర్వాయర్ ఉంది. దీనిలో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ గుడిలో కేవలం రూ. 12/-లు చెల్లించి వాటర్ ట్యాంక్‌లో స్నానం చేస్తే పాపవిమోచన పత్రం ఇస్తారు. ఈ మేరకు ఆలయ పూజారి మాట్లాడుతూ..చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వస్తుంటారు. వారందరికీ పాప విమోచర ధృవీకరణ పత్రం కూడా ఇస్తామని తెలిపారు. హృదయంలో పాపం చేశామన్నా భావమే ఆయా భక్తులను ఇక్కడకు రప్పిస్తుంటుందని అక్కడి గ్రామస్తులు చెబుతున్నారు. వ్యవసాయం చేస్తున్నప్పుడూ తెలిసో తెలియక మనవల్ల కొన్ని రకాల సరీసృపాలు, కీటకాలు చనిపోతాయి. దీని వల్ల కూడా ఒక జీవిని బాధించిన పాపం మనలని వెంటాడుతుంది. అందుకే చాలామంది రైతులు ఇక్కడకు వచ్చి స్వామిని దర్శించుకుని ఈ గంగా కుండ్‌లో స్నానాలు ఆచరించి సర్టిఫికేట్‌ని తీసుకుంటారని చెబుతున్నారు ప్రజలు. ప్రతి ఏడాది ఈ గౌతమేశ్వరాలయంలో దాదాపు 250 నుంచి 300 దాక పాప విమోచన ధృవీకరణ పత్రాలు ఇవ్వడం జరగుతుందని ఆలయ పూజారి తెలిపారు. ఈ ఆచారం దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్నట్లు అక్కడి దేవాలయ అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏడాది వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారని, కేవలం పాపం పోగొట్టుకోవడం కోసమే గాక పూజలు కూడా నిర్వహిస్తుంటారని అన్నారు. (చదవండి: ఆరేళ్లక్రితం తప్పిపోయిన బాలుడిని 'ఆ ఫేస్బుక్ సందేశం'.. కుటుంబం చెంతకు చేర్చింది!) -
సరదాగా చేసిన ర్యాంప్ వాక్..హీరోయిన్ని చేసింది
ఒక్క సంఘటన చాలు జీవితాన్ని మార్చేయడానికి! అలా సరదాగా చేసిన ర్యాంప్ వాక్ మోడలింగ్‌లో ఆమెకు అద్భుతమైన కెరీర్‌ను ఇవ్వడమేగాక సినిమా నటినీ చేసింది. ఆమే దీప్తి సతి. తాజాగా ఆమె నటించిన ‘సిన్’ సిరీస్‌తో హిట్‌తో టాక్ ఆఫ్ ది స్క్రీన్ అయింది. ► చదువుల్లోనే కాదు, ఆటపాటల్లోనూ చురుగ్గా ఉండే దీప్తి.. మూడేళ్ల వయసులోనే కథక్, భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ప్రదర్శనలూ ఇచ్చింది. ► కాలేజీ రోజుల్లో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన ‘ఫ్రెష్ ఫేస్ హంట్’ దీప్తిని మోడల్‌గా మార్చింది. అప్పుడు సరదగా ర్యాంప్ వాక్ చేసిన దీప్తి.. తర్వాత 2012లో ‘మిస్ కేరళ’గా అందాల కిరీటాన్ని సాధించింది. ఇంకెన్నో పోటీల్లో పాల్గొని ప్రపంచానికి తన ప్రతిభను చాటింది. ► మోడల్‌గా మొదలైన ఆమె ప్రయాణం, ‘నీనా’ అనే మలయాళ చిత్రంతో నటిని చేసింది. తర్వాత తెలుగులో ‘జాగ్వార్’, తమిళంలో ‘సోలో’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మలయాళంతోపాటు తమిళ, కన్నడ, తెలుగు భాషా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ► తండ్రి మరాఠీ, తల్లి మలయాళీ. కుటుంబం మొత్తం ముంబైలో స్థిరపడటంతో దీప్తికి మరాఠీ, మలయాళంతో పాటు హిందీ, ఇంగ్లిష్ కూడా వచ్చు. కన్నడ, తమిళ భాషలూ నేర్చుకుని పలు రియాలిటీ షోలకు జడ్జీగా వ్యవహరించింది. ► ఈ మధ్యనే ‘సిన్’ అనే వెబ్‌సిరీస్‌లో నటించి వీక్షకుల ప్రశంసలు అందుకుంది. యూట్యూబ్‌లో దీప్తి చేసిన ‘లాక్డౌన్ టాక్స్’, ఎమ్ఎక్స్ ప్లేయర్‌లోని ‘ఓన్లీ ఫర్ సింగిల్స్’ సిరీస్‌లకూ మంచి ఆదరణే లభించింది. ప్రతి అమ్మాయికి సొంతం నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. అప్పుడే వారు విజయం సాధించగలరు – దీప్తి సతి -
'బీజేపీ గంగానది లెక్క.. మా పార్టీలో చేరితే పాపాలన్నీ తొలగిపోతాయ్..'
అగర్తల: బీజేపీ గంగా నది లాంటిదని వ్యాఖ్యానించారు త్రిపుర సీఎం మాణిక్ సాహా. తమ పార్టీలో చేరితే పుణ్యస్నానం చేసినట్లేనని, పాపాలన్నీ తొలగిపోతాయని అన్నారు. దక్షిణ త్రిపుర కక్రాబన్‌లో ఆదివారం నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఇంకా స్టాలిన్, లెనిన్ సిద్ధాంతాలను నమ్ముతున్న వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.. మీరంతా బీజేపీలో చేరండి. మా పార్టీ గంగానది లెక్క. ఇందులో చేరితే గంగానదిలో పవిత్ర స్నానం చేసినట్లే. పాపాలు తొలగిపోతాయ్' అని అన్నారు. అలాగే ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము కచ్చితంగా మరోమారు అధికారంలోకి వస్తామని మాణిక్ సాహా ధీమా వ్యక్తం చేశారు. త్రిపురలో కమ్యూనిస్టుల పాలనలో ప్రజల హక్కులను అణచివేశారని ఆరోపించారు. చదవండి: 'మీ టీ నేను తాగను.. విషం కలిపి ఇస్తే? అఖిలేశ్ యాదవ్ వీడియో వైరల్ -
పాపం పండుతోంది
నెల్లూరు సిటీ : పేదోళ్ల సొంతింటి కల తీర్చే ఉద్దేశంతో చేపట్టిన వైఎస్సార్‌నగర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతి వరదలు ప్రారంభించిన వారి పాపం పండబోతోంది. సంబంధిత కాంట్రాక్టర్లు జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది. అయితే రూ.కోట్లు కొల్లగట్టిన సబ్‌కాంట్రాక్టర్లు నిశ్చింతగా ఉండగా అసలు కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు శివారులోని కొత్తూరు సమీపంలోని వైఎస్సార్ నగర్ పేరుతో 2007లో భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. మొత్తం 6,468 ఇళ్లను పేదల కోసం నిర్మించాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిధులు మంజూరు చేశారు. ప్యాకేజీల వారీగా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. అయితే అసలు లక్ష్యం పక్కదారి పట్టింది. అప్పటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకా అనుచరులు సబ్కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారు. ఆర్జనే లక్ష్యంగా ఇళ్లను నాసిరకంగా నిర్మించారు. అధికారుల నిర్లక్ష్యం కూడా తోడవడంతో తాకితే కూలిపోయేలా ఇళ్ల నిర్మాణం జరిగింది. సబ్‌కాంట్రాక్టర్లు ఇచ్చే పర్సంటేజీలకు కక్కుర్తి పడిన ప్రధాన కాంట్రాక్టర్లు వారు చెప్పిన చోటల్లా సంతకాలు చేసి బిల్లుల మంజూరులో సహకరించారు. ఇళ్ల నిర్మాణం నాసిరకంగా జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తడంతో కలెక్టర్ శ్రీకాంత్ స్పందించారు. ఆర్అండ్బీ డీఈ స్థాయి అధికారులతో తనిఖీలు జరిపించి, నివేదికలు తెప్పించుకున్నారు. వాటి ఆధారంగా 3,273 ఇళ్లకు శ్లాబు పూర్తయినట్లు, 248 ఇళ్లు శ్లాబు స్థాయిలో ఆగినట్లు, 1,806 లెంటిల్ లెవల్ , 738 పునాదుల స్థాయిలో ఉన్నట్లు, 403 ఇళ్ల నిర్మాణం అసలు ప్రారంభం కానట్లు గుర్తించారు. వివిధ దశల్లో ఉన్న 1,700 ఇళ్ల నిర్మాణం నాసిరకంగా జరిగిందని, అవి నివాసయోగ్యం కాదని, వాటిని కూల్చి కొత్త ఇళ్లు నిర్మించాలని తేల్చారు. వీటిపై తీవ్రంగా స్పం దించిన కలెక్టర్ సంబంధిత కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు బనాయించాలని, రికవరీ చర్యలు చేపట్టాలని హౌసింగ్ పీడీ వెంకటేశ్వరరెడ్డిని ఆదేశించారు. అయితే పీడీ వెంకటేశ్వరరెడ్డి నేడో, రేపో బదిలీపై వెళ్లడం ఖాయమవడంతో ఆయన ఆ బాధ్యతలను ఈఈ నాగేశ్వరరావుకు అప్పగించారు. వివిధ బ్లాకులలో అక్రమాలకు కారకులైన 24 మంది కాంట్రాక్టర్ల జాబితాను సిద్ధం చేసిపోలీసులకు ఫిర్యాదు చేశారు. అయి తే అధికారికంగా ప్రధాన కాంట్రాక్టర్లే పను లు చేసి బిల్లులు పొందినట్లు రికార్డుల్లో ఉండడం తో వారిపై చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో వారి గుండెళ్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. కోట్లు ఆర్జించిన సబ్‌కాంట్రాక్టర్లు మాత్రం నిశ్చింతగా ఉండడం గమనార్హం. పోలీసుల మల్లగుల్లాలు హౌసింగ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 24 మంది కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేసేం దుకు పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. అసలు ఈ కేసు తమ పరిధిలోకి వస్తుందా, వస్తే ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలనే అంశాలపై న్యాయనిపుణులతో సంప్రది స్తున్నట్లు తెలిసింది.