ఒక్క సంఘటన చాలు జీవితాన్ని మార్చేయడానికి! అలా సరదాగా చేసిన ర్యాంప్ వాక్ మోడలింగ్‌లో ఆమెకు అద్భుతమైన కెరీర్‌ను ఇవ్వడమేగాక సినిమా నటినీ చేసింది. ఆమే దీప్తి సతి. తాజాగా ఆమె నటించిన ‘సిన్’ సిరీస్‌తో హిట్‌తో టాక్ ఆఫ్ ది స్క్రీన్ అయింది.
► చదువుల్లోనే కాదు, ఆటపాటల్లోనూ చురుగ్గా ఉండే దీప్తి.. మూడేళ్ల వయసులోనే కథక్, భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ప్రదర్శనలూ ఇచ్చింది.
► కాలేజీ రోజుల్లో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన ‘ఫ్రెష్ ఫేస్ హంట్’ దీప్తిని మోడల్‌గా మార్చింది. అప్పుడు సరదగా ర్యాంప్ వాక్ చేసిన దీప్తి.. తర్వాత 2012లో ‘మిస్ కేరళ’గా అందాల కిరీటాన్ని సాధించింది. ఇంకెన్నో పోటీల్లో పాల్గొని ప్రపంచానికి తన ప్రతిభను చాటింది.
► మోడల్‌గా మొదలైన ఆమె ప్రయాణం, ‘నీనా’ అనే మలయాళ చిత్రంతో నటిని చేసింది. తర్వాత తెలుగులో ‘జాగ్వార్’, తమిళంలో ‘సోలో’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం మలయాళంతోపాటు తమిళ, కన్నడ, తెలుగు భాషా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
► తండ్రి మరాఠీ, తల్లి మలయాళీ. కుటుంబం మొత్తం ముంబైలో స్థిరపడటంతో దీప్తికి మరాఠీ, మలయాళంతో పాటు హిందీ, ఇంగ్లిష్ కూడా వచ్చు. కన్నడ, తమిళ భాషలూ నేర్చుకుని పలు రియాలిటీ షోలకు జడ్జీగా వ్యవహరించింది.
► ఈ మధ్యనే ‘సిన్’ అనే వెబ్‌సిరీస్‌లో నటించి వీక్షకుల ప్రశంసలు అందుకుంది. యూట్యూబ్‌లో దీప్తి చేసిన ‘లాక్‌డౌన్ టాక్స్’, ఎమ్‌ఎక్స్ ప్లేయర్‌లోని ‘ఓన్లీ ఫర్ సింగిల్స్’ సిరీస్‌లకూ మంచి ఆదరణే లభించింది.
ప్రతి అమ్మాయికి సొంతం నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉండాలి. అప్పుడే వారు విజయం సాధించగలరు – దీప్తి సతి
Comments
Please login to add a commentAdd a comment