అగర్తల: సార్వత్రిక ఎన్నికల హోరు జోరుగా సాగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం మళ్ళీ అధిక సంఖ్యలో సీట్లు గెలవడానికి ప్రయతిస్తోంది. ఈ తరుణంలో త్రిపుర ముఖ్యమంత్రి 'మాణిక్ సాహా' తృణమూల్ కాంగ్రెస్ పార్టీపైన కీలక వ్యాఖ్యలు చేశారు.
దక్షిణ త్రిపుర జిల్లా పరిధిలోని బెలోనియాలో జరిగిన బహిరంగ సభలో సాహా మాట్లాడుతూ.. బెంగాల్‌ను వరుసగా 34 ఏళ్లు పాలించిన సీపీఐఎంకు తృణమూల్ కాంగ్రెస్ కార్బన్ కాపీ అని వ్యాఖ్యానించారు. 'కమ్యూనిస్టు పార్టీ ఎక్కడ పాలించినా వారి అవశేషాలు దొరుకుతాయని పేర్కొన్నారు.
బెంగాల్ ప్రజలు తృణమూల్‌ను నమ్మి ఓట్లు వేయడం దురదృష్టమని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లు గెలుచుకుంది. ఈ సారి మరింత మెరుగైన ఫలితాలు రానున్నట్లు మాణిక్ సాహా పేర్కొన్నారు. ఇప్పటికే వామపక్షాలకు చెందిన నా మిత్రులు బీజేపీకి ఫిర్యాదు చేశారు. మా పార్టీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వారు ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలను గురించి వివరిస్తూ.. అప్పట్లోనే బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని బాక్సానగర్, ధన్‌పూర్ వంటి ప్రాంతాల్లో మెజారిటీ స్థాయిలో ఓట్లను నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment