రానున్న లోక్‌సభ ఎన్నికలకు పార్టీల ప్రచార హడావుడి మొదలైపోయింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో కీలక నేతలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అయితే ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
గోలఘటి నియోజకవర్గంలోని కంచమాల గ్రామ పంచాయతీలో సీఎం మాణిక్ సాహా ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న విభిన్న పథకాల గురించి త్రిపుర సీఎం ఆ ప్రాంత వాసులతో మాట్లాడుతూ కనిపించారు .
2023 త్రిపుర అసెంబ్లీ ఎన్నికలలో తిప్రా మోతా పార్టీకి చెందిన మనబ్ దెబ్బర్మ గోలఘటి నియోజకవర్గం నుండి గెలుపొందారు. తాజా రాజకీయ పరిణామాల్లో భాగంగా సీపీఎం, కాంగ్రెస్ , గణ మంచ్, ఆల్ త్రిపుర పీపుల్స్ పార్టీ, సీపీఐ, సీపీఐఎంఎల్ సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ‘ఇండియా’ కూటమి కింద పొత్తు పెట్టుకోవడానికి చేతులు కలిపాయి.
ఏప్రిల్ 19న నిర్వహించే మొదటి దశ లోక్‌సభ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. త్రిపురతోపాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్-నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్‌లకు మార్చి 27ను నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా ప్రకటిచింది. నామినేషన్ల పరిశీలన మార్చి 28న జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment