door to door campaign
-
యూపీలో ఇంటింటికీ బీజేపీ–ఆర్ఎస్ఎస్!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్ భారీ ఎదురుదెబ్బ నుంచి బీజేపీ పాఠం నేర్చుకుంది. 9 అసెంబ్లీ స్థానాలకు అక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల్లో మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌తో సమన్వయంతో పనిచేస్తోంది. ఇండియా కూటమి కులాధారిత సామాజిక న్యాయ రాజకీయాన్ని హిందూత్వ కార్డుతో ఢీ కొట్టనుంది. ‘ఏక్ హై తో సేఫ్ హై ’ (ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం) నినాదాన్ని వచ్చే ఐదు రోజులు విస్తృతంగా ఇంటింటికీ తీసుకెళ్లాలని ప్రయాగ్‌రాజ్‌లో బీజేపీ–ఆర్ఎస్ఎస్ కీలక భేటీలో నిర్ణయించారు. సమాజ్‌వాదీ పార్టీ తెరపైకి తెచ్చిన పీడీఏ (పీడిత్, దళిత్, ఆదివాసీ) ఫార్ములాను ఎదుర్కొనే వ్యూహాలపై భేటీ చర్చించింది. హిందూత్వ అజెండాకు పదును పెట్టాలని సంఘ్ నొక్కి చెప్పింది. ‘బటేంగేతో కటేంగే’ (విడిపోతే చెల్లాచెదురవుతాం) అన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. పార్టీ, సంఘ్ మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాల్సిందిగా పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దళిత, ఓబీసీ ఓటర్ల మధ్య విభజనకు యత్నాలకు చెక్ పెట్టాలని బీజేపీకి ఆర్ఎస్ఎస్ సూచించింది. -
Tripura: ఇంటింటికీ తిరుగుతున్న సీఎం
రానున్న లోక్‌సభ ఎన్నికలకు పార్టీల ప్రచార హడావుడి మొదలైపోయింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో కీలక నేతలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా అయితే ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గోలఘటి నియోజకవర్గంలోని కంచమాల గ్రామ పంచాయతీలో సీఎం మాణిక్ సాహా ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న విభిన్న పథకాల గురించి త్రిపుర సీఎం ఆ ప్రాంత వాసులతో మాట్లాడుతూ కనిపించారు . 2023 త్రిపుర అసెంబ్లీ ఎన్నికలలో తిప్రా మోతా పార్టీకి చెందిన మనబ్ దెబ్బర్మ గోలఘటి నియోజకవర్గం నుండి గెలుపొందారు. తాజా రాజకీయ పరిణామాల్లో భాగంగా సీపీఎం, కాంగ్రెస్ , గణ మంచ్, ఆల్ త్రిపుర పీపుల్స్ పార్టీ, సీపీఐ, సీపీఐఎంఎల్ సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ‘ఇండియా’ కూటమి కింద పొత్తు పెట్టుకోవడానికి చేతులు కలిపాయి. ఏప్రిల్ 19న నిర్వహించే మొదటి దశ లోక్‌సభ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. త్రిపురతోపాటు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్-నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్‌లకు మార్చి 27ను నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా ప్రకటిచింది. నామినేషన్ల పరిశీలన మార్చి 28న జరగనుంది. -
మీరేసే ప్రతి ఓటు నా బలాన్ని పెంచుతుంది
సిమ్లా: బీజేపీని మరోసారి గెలిపించి, చరిత్ర తిరగరాయాలని ప్రధాని మోదీ హిమాచల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కమలం గుర్తుకు వేసే ప్రతి ఓటు తన ధైర్యాన్ని ఇనుమడింపజేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ మేరకు ప్రధాని ఫొటో, సంతకంతో కూడిన లేఖను బీజేపీ శ్రేణులు ప్రతి ఇంటికీ వెళ్లి అందిస్తున్నాయి. ‘గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా మీరు బీజేపీనే ఆశీర్వదిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. కమలం గుర్తుపై మీరు వేసే ప్రతి ఓటుతో నా బలం పెరుగుతుంది’ అని హిందీలో రాసిన ఆ లేఖలో ఉంది. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన సరిహద్దు ప్రాంతాలు సహా రాష్ట్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేశాయని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి గమనం ముందుకు సాగించాలని ఓటర్లను ప్రధాని కోరారు. ఈ సందేశాన్ని వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలోని 15 లక్షల కుటుంబాలకు అందేలా చేస్తామని బీజేపీ నేత సంజయ్ టాండన్ చెప్పారు. -
డెంగీపై సర్కారు యుద్ధం.. డోర్ టు డోర్ ఫీవర్ సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని, దీనిపై సర్కారు యుద్ధం ప్రకటించిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రతీ ఐదేళ్లకోసారి కేసులు పెరుగుతుంటాయని, ఇది ఐదో సంవత్సరం అయినందున పెరుగుతున్న తీరు గమనిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య, పురపాలక, పంచాయతీ శాఖలు కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. మంత్రి కేటీఆర్‌తో కలిసి సోమవారం ఆయన జూమ్ ద్వారా వైద్య, జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ పరిధిలో జూలైలో 542 డెంగీ కేసులుంటే, ఆగస్టులో 1,827 కేసులు నమోదయ్యాయన్నారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల సందర్భంగా పది వేల బ్లడ్ యూనిట్లు సేకరించామని, ఎంత రక్తం అవసరమైనా ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈనెల 17న హైదరాబాద్, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు పెట్టి ఉచితంగా ప్రజలకు బ్లడ్ ఇచ్చేలా వైద్య ఆరోగ్య శాఖ తరపున ఏర్పాట్లు చేస్తామన్నారు. డెంగీ కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో వైద్య సిబ్బంది డోర్ టు డోర్ జ్వర సర్వే నిర్వహించాలని ఆదేశించారు. జ్వర సర్వేతోపాటు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ను ప్రతీ ఒక్కరికి జీహెచ్ఎంసీ పరిధిలో వేసేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలని చెప్పారు. ప్రతి ఆదివారం పది నిమిషాలు: కేటీఆర్ ఏయే వార్డుల్లో డెంగీ కేసులు ఎక్కువ ఉన్నాయో జీహెచ్ఎంసీ కమిషనర్లు, జోనల్, డిప్యూటీ కమిషనర్లు పరిశీలించాలని, నివారణకు ప్రత్యేక ప్రణాళిక తయారుచేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ ఈ ప్రణాళిక రూపొందించాలన్నారు. ‘గత మూడేళ్లలో ప్రతీ ఆదివారం పది గంటలకు పది నిమిషాలు ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని బాగా చేశాం. ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలు, మహిళలనూ భాగస్వాములను చేయాలి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు కూడా తమ గృహాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలి. కలెక్టర్లు జిల్లాల్లో ఈ కార్యక్రమం చేసేలా ఉంటే ప్రజల్లో చైతన్యం వస్తుంది. విద్యార్థులు, టీచర్లు, ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొని పని చేసేలా కార్యక్రమాలు రూపొందించాలి. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఇళ్లకు స్టిక్కర్లు అతికించాలి. డిజిటల్ మాధ్యమంలో బాగా ప్రచారం నిర్వహించాలి’ అని కేటీఆర్ చెప్పారు. డెంగీ దోమలు మురికి నీళ్లలో కాకుండా మంచినీటిలో ఉంటాయని అందువల్ల నీరు నిలువ లేకుండా చూడాలని చెప్పారు. పోలీసులు కార్డన్ సెర్చ్ చేసినట్లు జీహెచ్ఎంసీ పరిధిలోని కాలనీలన్నింటిలో జ్వర సర్వే నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్ సహా జిల్లాల్లో, డెంగీ కేసులున్న పట్టణ ప్రాంతాల్లోనూ జ్వర సర్వే ఉద్యమంలా నిర్వహించాలన్నారు. ఇదీ చదవండి: ఏడాదిగా రోజూ రూ.లక్షల్లో డిపాజిట్ -
ఇంటింటికీ ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కోసం విరాళాలు సేకరించడం కోసం, రానున్న ఎన్నికలలో పార్టీ కోసం ప్రచారం చేయడం కోసం ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ ప్రాంతంలో ఇంటింటికీ తిరిగారు. తమ ప్రభుత్వం చేసిన పనితో ప్రజలు సంతోషంగా ఉన్నారని, వారు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లు వేస్తారని, విరాళాలు ఇస్తారని కేజ్రీవాల్ ఈ సందర్భంగా చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు ఆప్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు కూడా నగరంలోని వివిధ ప్రాంతాలలో తిరిగి పార్టీ కోసం ప్రచారం జరపడంతో పాటు విరాళాలను ఇవ్వవలసిందిగా ప్రజలను కోరారు. తన నియోజకవర్గమైన న్యూఢిల్లీలో పలువురితో మాట్లాడుతూ బీజేపీ ఎంపీలు ఆప్ పనికి ఆటంకాలు సృష్టించడం మినహా మరే పని చేయటం లేదని ఆరోపించారు. ఆప్ విరాళ సేకరణ కార్యక్రమం–ఆప్ కా దాన్, రాష్ట్ర్ కా నిర్మాణ్‌ను కేజ్రీవాల్ గత సోమవారం మొదలుపెట్టారు. ఈ ప్రచార కార్యక్రమం నాలుగు నెలల పాటు కొనసాగుతుంది. విద్య, ఆరోగ్యం, నీటి సరఫరా, విద్యుత్తు బిల్లుల విషయంలో ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు చెప్పి విరాళాలు కోరవలసిందిగా కార్యకర్తలను ఆప్ కోరింది. సీలింగ్ సమస్యను పరిష్కరించడంలో బీజేపీ ఎంపీల వైఫల్యాన్ని కూడా ప్రచారంలో ఎత్తిచూపుతారు. ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాలలో 3,000 మంది ఆప్ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి పార్టీ కోసం విరాళాలు సేకరిస్తారు. రానున్న ఎన్నికల కోసం పార్టీకి రూ.100 లేదా రూ.1,000, లేదా రూ.10,000 ఎవరిశక్తి కొద్ది, ఎవరికి తోచినంత వారు నెలనెలా విరాళంగా ఇవ్వాలని ఆప్ విజ్ఞప్తి చేస్తోంది. గత మూడు సంత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కానీ పార్టీ కోసం సొమ్ము వెనకేసుకోలేదని, అందువల్ల పార్టీ ఖజానా ఖాళీగానే ఉందని కేజ్రీవాల్ చెప్పారు. -
‘రావాలి జగన్.. కావాలి జగన్’ కు విశేష స్పందన
సాక్షి, అమరావతి: ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అనే నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిన కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన వస్తుంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను పార్టీ నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రకటించిన నవరత్నాలను ప్రజలకు వివరించడంతో పాటు, టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రతీ గడపకు వెళ్లి ప్రజలను జాగృతం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 27వ డివిజన్ హరిజనవాడలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ పార్లమెంటరీ అధ్యక్షుడు ఇక్బాల్ ఆధ్వర్యంలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల ద్వారా జరిగే లబ్ధి ప్రజలకు వివరించడంతోపాటు, చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపకు తీసుకెళ్ళారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆంజనేయరెడ్డితోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లా చిట్వేలు మండలం నాగవరం వడ్డేపల్లిలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో గడపగడపకు ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మండల కన్వీనర్ శ్రీనివాస్‌రెడ్డితోపాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిథున్‌రెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి 60 కుటుంబాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. కృష్ణా జిల్లా ఏ కొండూరు మండలంలోని పాత కొండూరులో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత నాలుగేళ్లుగా టీడీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె అడిగి తెలుసుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల కరపత్రాన్ని ప్రజలకు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు నరెడ్ల వీరారెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వీనర్ల అధ్యక్షులు వెంకటేశ్వరారెడ్డి, జడ్పీటీసీ ఆంజనేయులు, భూక్యా ఘనీయ, ఎంపీటీసీ చంద్రమోహన్, జూపల్లి రాజేష్, వెంకటరెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి మండలం చింతంపల్లిలో జరిగిన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమంలో చింతపూడి కన్వీనర్ ఎలిజా, జానకి రెడ్డి, తాండ్ర రామకృష్ణ, రావు హరిబాబు, చందా శేఖర్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం రేగులపాడులో టెక్కలి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో జరిగిన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం కొమదవోలు, పాలగూడెం గ్రామాల్లో జరిగిన రావాలి ‘జగన్.. కావాలి జగన్’ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కోటగిరి శ్రీధర్‌లతోపాటు, సిటీ కన్వీనర్ బొద్దాని శ్రీనివాస్, ఉభయ గోదావరి జిల్లాల మహిళా కన్వీనర్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మీ, మంచెం మైబాబు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేనేత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా ఓజిలి మండలం ఆచార్లపార్లపల్లి, కొండవల్లిపాడు, మానమాల గ్రామాల్లో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గుంటమడుగు రవీంద్రరాజు, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డి, దేసిరెడ్డి మధుసూదన్ రెడ్డి, ఉచ్చురు హరినాథ్ రెడ్డి, పాదర్తి హరనాథ్ రెడ్డితో ఇతర నాయకులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కనేకల్ మండలంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మొద్దులపల్లిలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఇంటింటికి తిరుగుతూ నవరత్నాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి శాంతినగర్ ఇందిరమ్మ కాలనీ నుంచి నియోజకవర్గ సమన్వయకర్త వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో గ్రామ పార్టీ కన్వీనర్ అడపా వెంకయ్యనాయుడు, మండల మహిళ అధ్యక్షురాలు రాణి, చలపతి, నాగిరెడ్డితోపాటు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తిరుపతి ఇందిరా నగర్లో భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో ఇంటింటికి తిరుగుతూ.. ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమాన్ని చేపట్టారు. చిత్తూరు జిల్లా కేవీబీ పురం మండలం అదవరంలో వైఎస్సార్ సీపీ నేత గవర్ల కృష్ణయ్య ఆధ్వర్యంలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో పార్టీ సమన్వయకర్త కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 24వ డివిజన్ కృష్ణలంకలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త యలమంచిలి రవి ఆధ్వర్యంలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకులు వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల ద్వారా జరిగే లబ్ధి ప్రజలకు వివరించడంతోపాటు, చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను గడపగడపకు తీసుకెళ్ళారు. విశాఖ వి మాడుగుల మండలం తాటిపత్రిలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ముత్యాలనాయుడు ఇంటింటా తిరుగుతూ.. నవరత్నాల ద్వారా జరిగే లబ్ధిని గ్రామస్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల కేంద్రంలో పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ‘రావాలి జగన్.. కావాలి జగన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన ప్రజలకు నవరత్నాల గురించి వివరించారు. -
ఎనిమిదో రోజు గడప గడపకూ వైఎస్సార్ సీపీ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : జిల్లాలో ఎనిమిదో రోజు గడప గడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమం జోరుగా సాగింది. జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్ సీపీ శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. నేతలకు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. చీరాల నియోజకవర్గంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ, బాపట్ల పార్లమెంట్ ఇన్చార్జి వరికూటి అమృతపాణి వేటపాలెం మండలం దేశాయిపేటలో గడప గడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్ పీసీపల్లి మండలం పెదఇర్లపాడులో గడప గడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్చూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ ఇంకొల్లు మండలం హనుమోజిపాలెంలో, కొండపి నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు జరుగుమల్లి మండలం వర్ధినేనిపాలెంలో, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐ.వి.రెడ్డి అర్థవీడు మండలం చీమలేటిపల్లిలో గడప గడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
వైఎస్ భారతి ఇంటిట ప్రచారం
-
ఇంటింటా ఆప్ ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ: తమ పార్టీ, అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్‌పై వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడానికి అన్ని ప్రయత్నాలూ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) భావిస్తోంది. ఈ మేరకు కొన్ని రోజుల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. రాజధానిలో కనీసం 35 లక్షల ఇళ్లు తిరిగి ప్రచారం చేయాలని పార్టీ నిశ్చయించింది. 30 వేల మంది ఆప్ వాలంటీర్లకు ఈ బాధ్యతను అప్పగించారు. ఆప్ గురించి జరుగుతోన్న వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడంతోపాటు లోక్‌సభ ఎన్నికల పార్టీ అభ్యర్థులను ఓటర్లకు పరిచయం చేస్తారు. ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయడానికి ఆప్ నాలుగు పేజీల కరపత్రాలను తయారు చేసింది. కార్యకర్తల బృందం ఈ కరపత్రాలను ఢిల్లీవాసుల ఇళ్లలో పంచుతుంది. దీని మొదటిపేజీలో లోక్ సభ అభ్యర్థుల గురించిన పరిచయం, వివరాలు ఉంటాయి. సదరు అభ్యర్థి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ రెండోపేజీలో ఉంటుంది. మూడోపేజీలో 49 రోజులపాలనలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో సాధించిన విజయాలను వివరిస్తారు. ఆప్ గురించి తరచుగా వ్యక్తమయ్యే సందేహాలు, ఆరోపణలపై వివరణలు ఉంటాయి. ఆప్ ఎందుకు కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. జన్‌లోక్‌పాల్ బిల్లు గురించి కేజ్రీవాల్ ఎందుకు రాజీనామా చే శారు. తదితర ప్రశ్నలకు జవాబులు ఉంటాయని ఆప్ ఢిల్లీ రాష్ట్ర కమిటీ కో-కన్వీనర్ దుర్గేశ్ పాఠక్ చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం రాజీనామాకు దారి తీసిన పరిస్థితులు, ఆప్ నిర్ణయాల గురించి పదేపదే వివాదాలు తలెత్తుతున్నందువల్ల ఈ విషయాలపై పార్టీ వైఖరిని ప్రజలకు సుస్పష్టంగా వివరించాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ నిర్వహించిన ఇంటింటికీ ప్రచార కార్యక్రమం సత్పలితాలను ఇవ్వడంతో మరోసారి ఇదే వ్యూహాన్ని అనుసరించాలని ఆప్ కోరుకుంటోంది. అప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆప్ కార్యకర్తలు 30-40 లక్షల ఇళ్లను సందర్శించడంతోపాటు పార్టీలో సభ్యులుగా చేరాలని ఢిల్లీవాసులను ప్రోత్సహించారు. ఆప్ కోసం విరాళాలనూ సేకరించారు. దీనికి మంచి స్పందన రావడంతో కాంగ్రెస్, బీజేపీ కూడా ఇదే పద్ధతిని అనుకరించాయి. ఇంటింటా తిరిగి ప్రచారం చేయడానికి ఆప్ మూడు వేల మందికి శిక్షణ ఇచ్చింది. వారు తిరిగి 30 మంది వేల కార్యకర్తలకు అదే శిక్షణ ఇచ్చారు. వీరంతా అందరి ఇళ్లకూ వెళ్లి ప్రచారం చేశారు. ఈ బలగంలో విద్యార్థులతోపాటు యువ వృత్తి నిపుణులు, వ్యాపారులు ఉన్నారు. ఈ వాలంటీర్లు 15 రోజులు సెలవు తీసుకుని వచ్చి ఆప్ తరపున ప్రచారం చేస్తారు.