
అగర్తల: త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా డాక్టర్ మాణిక్ సాహా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. అగర్తలాలోని రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ ఎస్.ఎన్. ఆర్య ఆయనతో ప్రమాణం చేయించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టేంతవరకూ సాహా.. త్రిపుర రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా ఉన్నారు. త్రిపుర క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించారు.
2016లో బీజేపీలో చేరిన మానిక్ సాహా అంచెలంచెలుగా ఎదిగారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన త్రిపుర మెడికల్ కాలేజీలో డెంటల్ ఫ్యాకల్టీగా పనిచేశారు. మరో ఆరునెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. బిప్లవ్ దేవ్‌తో రాజీనామా చేయించిన బీజేపీ అధిష్ఠానం మానిక్ సాహాకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment