న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రజాదారణ(పాపులారిటీ) కలిగిన ముఖ్యమంత్రిగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచినట్లు ఓ మీడియా సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వే నివేదికలో పేర్కొంది. సుమారు రెండు దశాబ్దాలకు పైగా సీఎంగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్.. దేశంలోనే అత్యంత ప్రజాధారణ కలిగిన ముఖ్యమంత్రిగా నిలవటం విశేషం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచారు. అనూహ్యంగా త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ప్రజాదరణలో ఐదో స్థానంలో నిలిచారు.
నవీన్ పట్నాయక్: 2000 సంవత్సరం నుంచి అధికారంలో ఉన్న 77 ఏళ్ల నవీన్ పట్నాయన్ సర్వే నివేదికలో మొదటి స్థానంలో నిలిచారు. సర్వే ప్రకారం 52.7 శాతం ప్రజాదరణతో టాప్‌లో ఉన్నారు. బిజూ జనతా దళ్ పార్టీ చీఫ్ అయిన నవీన్ పట్నాయక్.. దేశంలో ఎక్కువ కాలం సీఎం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో ఒకరు.
యోగి అదిత్యనాథ్: 2017 నుంచి అధికారంలో ఉన్న ఉత్తప్రదేశ్ 21వ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్వేలో అత్యంత ప్రజాదారణ పొందిన సీఎంలలో రెండో స్థానంతో నిలిచారు. యోగి 51.3 శాతం పాపులారిటిని కలిగి ఉన్నారు. సుమారు ఆయన ఏడేళ్లగా సీఎం సేవలు అందిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఎక్కవ కాలం సీఎంగా ఉన్న పేరు యోగికి ఉండటం విశేషం.
హిమంత బిశ్వ శర్వ :
అస్సాం(అసోం) సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రజాదరణ పొందిన మూడో సీఎంగా నిలిచారు. 48. 6 శాతం ప్రజాదారణ కలిగి ఉన్నారు. గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్న హిమంత.. 2015తో బీజేపీలో చేరారు. 2021 నుంచి ఆయన అస్సాంకు 15వ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
భూపేంద్ర పటేల్:
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రజాదారణలో నాలుగో స్థానంలో నిలిచారు. 42. 6 శాతం పజాదారణను భూపేంద్ర పటేల్ కలిగి ఉండటం గమనార్హం. సెప్టెంబర్, 2021 నుంచి భూపేంద్ర పటేల్ సీఎం కొనసాగుతున్నారు. గుజరాత్ 17 వ సీఎం భూపేంద్ర పటేల్.
మాణిక్ సాహా:
ఈశాన్య రాష్ట్రమైన మాణిక్ సాహా అత్యంత ప్రజాదాన విషయంలో టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. 41.4 శాతం ప్రజాదారణను మాణిక్ షా కలిగి ఉన్నారు. గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్న మాణిక్ షా... 2016లో బీజేపీలో చేరారు. మే, 2022లో మాణిక్ షా.. రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment