రెవెన్యూ మంత్రిని తప్పించాలి: తమ్మినేని | Tammineni Veerabhadram comments on Revenue Minister | Sakshi
Sakshi News home page

రెవెన్యూ మంత్రిని తప్పించాలి: తమ్మినేని

Published Thu, Jun 1 2017 3:18 AM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM

రెవెన్యూ మంత్రిని తప్పించాలి: తమ్మినేని - Sakshi

రెవెన్యూ మంత్రిని తప్పించాలి: తమ్మినేని

సాక్షి, హైదరాబాద్‌: భూ కుంభకోణాల్లో సబ్‌ రిజిస్ట్రార్లపై చర్యలకే పరిమితం కాకుండా, రెవెన్యూ మంత్రి, ఆ శాఖ ఉన్న తాధికారులను బాధ్యతల నుంచి తప్పిం చాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. ఈ వ్యవహారంపై హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరిపించా లని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. భూకబ్జాదారులపై ఉక్కుపాదం మోపి ప్రభుత్వ భూములను కాపాడాలన్నారు.

ఒకవైపు మియాపూర్‌ భూకుంభకోణంలో స్వయంగా ఓఎస్‌డీ ప్రత్యక్షపాత్రే ఉందని ప్రభుత్వమే చెబుతూ మరోవైపు సంబంధిత మంత్రికి ఏ సంబంధం లేదనడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతుంటే సర్కార్‌ చోద్యం చూస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement